Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!

October 13, 2026 by M S R

.

పాత జేమ్స్ బాండ్ సినిమాల్లో అప్పుడెప్పుడో చూశాం కదా… బాండ్ ఈల వేయగానే కారు తన వద్దకు అదే వచ్చి ఆగుతుంది… అదే డ్రైవ్ చేస్తుంది… బ్రేకులు వేస్తుంది, స్పీడ్ పెంచుతుంది, టర్న్ తీసుకుంటుంది… అంతా ఆటో పైలట్… అవును… అది అప్పట్లో ఆశ్చర్యపరిచిన ఫాంటసీ… కానీ దాన్ని ఎలన్ మస్క్ నిజం చేస్తున్నాడు…

జియో తనను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ… బీజేపీ, అంబానీలను కలిపి తిట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్న తన వ్యాఖ్యల్ని ఖండించేవాళ్లు సైతం టెక్నాలజీ వాడకంలో తన ప్రయోగాల్ని, సాహసాల్ని, ఇన్నొవేషన్స్‌ను మెచ్చుకుంటారు… అమెరికాలో ఏ ఇద్దరి నడుమ సంభాషణ వచ్చినా మస్క్ తాజా వివాదాస్పద వ్యవహార వ్యాపార ధోరణితో పాటు FSD కార్ల ప్రస్తావన వస్తోంది… Roadster అని రాబోయే మస్క్ కలల కారు కూడా చర్చకు వస్తోంది…

Ads

జియో గుత్తాధిపత్యానికి, అంతరిక్షం నుంచి సవాల్ విసరాలని మస్క్ ఆలోచన- కాదు, వ్యాపార స్పర్థ… కానీ అడుగే పెట్టనివ్వడం లేదు మోదీ ప్రభుత్వం… ఇరువైపులా ఎన్ని జస్టిఫికేషన్లు ఉన్నా సరే… ఇదొక రచ్చ ప్రస్తుతానికి… అదేసమయంలో కార్ల రంగంలో మస్క్ ప్రయోగాలు..?

tesla

టెస్లా కారు కనిపిస్తే చాలు, అమెరికాలో చాలాచోట్ల దాన్ని తెలుగు వాళ్ల కారు, అదీ T లోగో అని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానిస్తుంటారు… నిజంగానే ఇండియన్స్, ప్రత్యేకించి సౌత్ ఇండియన్స్ టెస్లా కార్లే కొంటారు ఇక్కడ… చాలామంది ఎప్పుడు FSD కొంటున్నారు… అంటే, ఇది ఆటో పైలట్ ఆప్షన్ సమకూర్చే ఓ ఎఐ బ్రెయిన్… సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్… ప్రత్యేకంగా వేరే కారు వేరియంట్ కాదు…

డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉన్నా.. కారు నడిపే బాధ్యత ఏఐకి! Full Self-Driving అనేది దాని పూర్తి పేరు… పేరు చూస్తే కారు డ్రైవర్ అవసరం లేకుండానే ఎక్కడికైనా వెళ్లిపోతుందని అనిపించవచ్చు… కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. టెస్లా ప్రస్తుతం అందిస్తున్న FSD (Supervised) పూర్తిగా స్వయంప్రతిపత్తితో నడిచే వ్యవస్థ కాదు… డ్రైవర్ నిరంతరం రోడ్డుపై దృష్టి పెట్టాలి… అవసరమైతే వెంటనే వాహనాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలి… కానీ..?

నో గేర్స్… స్టీరింగ్ తిప్పాల్సిన పనిలేదు… ట్రాఫిక్ సిగ్నళ్లు, టర్నింగులు, లేన్లు, యాక్సిలరేషన్, స్పీడ్, బ్రేకులు, పార్కింగ్… అన్నీ అదే చూసుకుంటుంది… ఒక్కసారి సర్వీస్ సిగ్నల్ నొక్కితే, కారులోని ప్రతి పార్ట్ ప్రస్తుత పరిస్థితిని స్కాన్ చేసి చెప్పేస్తుంది… ఈ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు, న్యూరల్ నెట్‌వర్క్‌లు కీలక పాత్ర పోషిస్తాయి… ఇదే ఆటో పైలట్…

మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు, ఏదో పొరపాటు చేస్తే ప్రమాదం… కానీ ఇక్కడ ఆ ప్రమాదం చాలావరకు లేదు… ఈ ప్రోగ్రాం నెలవారీ 100 డాలర్ల సబ్‌స్క్రిప్షన్‌తో కూడా తీసుకోవచ్చు… ఇక కారు తన కెమెరా కళ్లతో, తన ఎఐ బ్రెయిన్‌తో అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది… ఇదంతా కేవలం ఒక కెమెరా, ఒక చిప్ పని కాదు. ప్రత్యేక కంప్యూటింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, భారీ స్థాయిలో శిక్షణ పొందిన న్యూరల్ నెట్‌వర్క్‌లు, వాస్తవ రోడ్లపై సేకరించిన డ్రైవింగ్ డేటా.. వీటన్నింటి సమన్వయం…

EV plus FSD … ఆటోనమస్ డ్రైవింగ్ రంగంలో టెస్లా ఒక్కటే లేదు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన వేమో (Waymo) పూర్తిగా డ్రైవర్ లేకుండా పనిచేసే రోబోట్యాక్సీ సేవలను కొన్ని అమెరికా నగరాల్లో నిర్వహిస్తోంది… మెర్సిడెస్ బెంజ్, ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా వివిధ స్థాయుల్లో ఆటోమేటెడ్ డ్రైవింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి…

ఇండియాలో కూడా నో గేర్ కార్లు ఎప్పుడో వచ్చాయి… క్రూయిజ్ మోడ్, ఈవీలు వచ్చాయి… ఎఐ మెల్లిమెల్లిగా అన్ని వేరియంట్లలోనూ కొద్దికొద్దిగా ప్రవేశిస్తోంది… అనేక అంశాల్లో అది మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది…  కానీ FSD..? మన భారతీయ రోడ్ల మీద ఈ టెక్నాలజీ పనిచేస్తుందా? అమెరికాలోని ఒక క్రమబద్ధమైన రోడ్డుపై కారు నడపడం ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని రద్దీ రోడ్లపై నడపడం మరో ఎత్తు! మనకు లేన్ డ్రైవింగ్ లేదు… ఉన్నా ఇతర వాహనాలు పాటిస్తున్నాయా అనేది ముఖ్యం..?

అకస్మాత్తుగా రాంగ్ రూట్‌లో వచ్చే బైక్, రోడ్డు మధ్యలోకి దూసుకొచ్చే పాదచారి, అడ్డంగా తిరిగే ఆటో, రోడ్డుపైకి వచ్చే పశువు… ఇలా ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి… మనకు రోడ్ కల్చర్ చాలా చాలా తక్కువ… ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులను గుర్తించి ఎదుర్కొనేలా ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడమే పరిశోధనలో ఒక ప్రధాన లక్ష్యం… మహేంద్ర దీనిపై కాన్సంట్రేట్ చేస్తున్నట్టున్నాడు…

.

రోడ్‌స్టర్.. మరో వాగ్దానం, మరో సాంకేతిక ప్రయోగం! మస్క్ గురించి చర్చ వచ్చినప్పుడు రాబోయే టెస్లా రోడ్‌స్టర్ (Roadster) ప్రస్తావన కూడా వస్తుంటుంది… FSD ఒక డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ అయితే, రోడ్‌స్టర్ ఒక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ మోడల్. రోడ్‌స్టర్‌ను అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుగా మస్క్ ప్రచారం చేశాడు…  గంటకు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం, అసాధారణమైన యాక్సిలరేషన్, అధిక రేంజ్ వంటి లక్షణాలతో దాన్ని పరిచయం చేశాడు… ఎందుకో గానీ అదింకా వాస్తవంలోకి రాలేదు…

cyber truck

ఇది టెస్లాలో హైరేంజ్ ప్రైస్… సైబర్ ట్రక్… ట్రక్ బాడీని పెయింట్ లేని అల్ట్రా-హార్డ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానెల్స్‌తో తయారు చేస్తారు… సౌండ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్… పవర్ ఫ్రంక్ (ముందు భాగంలో లగేజ్ స్పేస్)… బెడ్… అవసరమైనప్పుడు 17 ఇంచుల గ్రౌండ్ క్లియరెన్స్… టచ్ స్క్రీన్లు… దీని రేంజే సపరేటు…

రాబోయే రోజుల్లో కారు అంటే… జేమ్స్ బాండ్ కార్లే… స్మార్ట్ ఫోన్‌లో ఆర్డర్… సరిగ్గా మన ముందుకు వస్తుంది కారు పార్కింగ్ నుంచి… ఎక్కగానే ‘ఎక్కడికి సర్’ అనడుగుతుంది… మనం చెప్పాలి… అదే తీసుకుపోయి ఆఫీసు గేటు దగ్గర ఆపి, తరువాతే అదే వెళ్లి పార్కింగ్ పాయింటులో… తదుపరి ఆదేశం కోసం వేచి చూస్తూ ఉంటుంది…!! అఫ్‌కోర్స్, కారు లోపల కూడా పెద్ద స్క్రీన్, లగ్జరీ ఇంటీరియర్ గట్రా సరేసరి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • FSD … మస్కా కాదు, మస్క్ మార్క్ ఆటో పైలట్ Tesla కారు..!!
  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions