.
Murali Buddha …. ఆ మధ్య ఓ వీడియో విన్నాను . బాగా నచ్చింది . నాదీ అదే పాలసీ … కారులో వెళుతున్న వ్యక్తిని ఒక లారీ అతను ఓవర్ టేక్ చేశాడు. తప్పు లారీ అతనిదే కానీ లారీ అతనే హిందీలో ఉల్టా కారతన్ని చుతియా అని తిట్టాడు.
కారతనికి కోపం వచ్చి కారు స్పీడ్ గా నడిపి లారీ ముందుకు వెళ్లాడు… లారీ ఆపేట్టు చేశాడు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు మొత్తం విషయం తెలుసుకొని కారతన్ని పక్కకు తీసుకు వెళ్లి చాలా మర్యాదగా హిత బోధ చేశారు…
Ads
లారీ వాడు చెప్పినట్టు నువ్వు చుతియావే అన్నారు పోలీసులు. దానికి కారణం చెప్పారు. నువ్వు కారుతో స్పీడ్ గా వెళ్లి లారీని ఆపావు. వాడు ఆపాడు కాబట్టి సరిపోయింది. నీ కారును లారీతో గుద్దేస్తే నీ పరిస్థితి ఏమిటి ? తర్వాత వాడిని అరెస్ట్ చేస్తారు. కానీ నీ సంగతి?
ఒక రైలులో గాలి బలంగా వస్తుంది, కిటికీ ముయ్యి అన్న అంశంలో ఘర్షణ జరిగి ఒకరిని హత్య చేశారు. మహానగరాల్లో మనుషులు తీవ్రమైన సమస్యలు , ఆందోళన టెన్షన్ , మానసిక జబ్బులతో ఉన్నారు . ఎవడితోనూ ఘర్షణ వద్దు . ఎవడైనా ఏమన్నా అన్నా సరే మౌనంగా వెళ్లిపోవడం మంచిది .
నగరాల్లో మనుషుల జీవితం దుర్భరంగా మారింది . మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నారు . ఘర్షణ కాదు మంచి మాట కూడా చెప్పొద్దు అని పోలీసులు సలహా ఇచ్చారు. ఆ కారతను నిజమే అని ఒప్పుకోవడమే కాకుండా, తన అనుభవాన్ని ఓ వీడియోలో చెప్పాడు .

ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఘర్షణ ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. ఓ మాజీ ఐఏఎస్ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఒక వ్యక్తి ప్రాణం పోయింది . ఒక వ్యక్తి అంటే ఆ కుటుంబం ప్రాణం పోయినట్టు . ఐఏఎస్ కుమారుడి జీవితం కొంత కాలం అయినా సమస్యల మాయం . సీటు వదిలేసి పది నిముషాలు నిలబడితే సరిపోయేది… తాజా వార్త ఇది…
మా పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు ఓ విషయం చెప్పాను. మనం బస్సులో వెళ్లేప్పుడు నిలబడితే, మన పక్క సీటు ఖాళీ అయినా దూరం నుంచి ఒకరు పరుగెత్తుకొచ్చి కూర్చుంటారు. మనం సీటు వాడికే వదిలేయాలి .
ఎందుకంటే వాడి జీవితంలో వాడు సాధించే గొప్ప విజయాలు బస్సులో సీటు, సినిమా టాకీస్ లో మొదటి రోజు మొదటి ఆటకు టికెట్. వాడికి ఆ మాత్రం విజయం కూడా లేకుండా చేయవద్దు . మన లక్ష్యం పెద్దగా ఉండాలి అని చెప్పేవాడిని …
Share this Article