.
‘ఎవరి పాలైందిరో తెలంగాణ’..? రేవంత్ రెడ్డి వరుసగా కేసీయార్ దొరతనాన్ని, అక్రమాల్ని, భారీ అవినీతిని బయటపెట్టేకొద్దీ… కేసీయార్ కుటుంబ అక్రమాల్ని, భూకబ్జాలను, ఎనలేని సంపాదనను వెల్లడించేకొద్దీ… పదే పదే గట్టిగా వినిపిస్తున్న వాక్యం… ‘ఎవరి పాలైందిరో తెలంగాణ?’…
తాజాగా రేవంత్ రెడ్డి చెప్పిన నిజం మరోసారి తెలంగాణ సమాజాన్ని విస్తుపోయేలా చేసింది… లక్ష కోట్ల కాళేశ్వరం ఎలా పనికిరాకుండా పోయిందో చాలాసార్లు చెప్పుకున్నాం కదా… ఆ కాళేశ్వరం నుంచి ఏకంగా తన ఫామ్‌హౌజు దాకా గోదావరిని రప్పించుకున్నాడు కేసీయార్… అధికార దుర్వినియోగానికి పరాకాష్ట, బహుశా దేశంలో ఏ నేతకూ ఈ ఖ్యాతి దక్కలేదేమో…
Ads
కాళేశ్వరం నెట్‌వర్క్‌లో కొండపోచమ్మ సాగర్… ఓ రిజర్వాయర్… అక్కడి నుంచి పంచపాండవుల చెరువుకు ఓ కాలువ తవ్వారు… ఆ చెరువు నుంచి నేరుగా కేసీయార్ 400 ఎకరాల పంటపొలాలకు ప్రత్యేకంగా నీటిని అందిస్తున్నారు… ‘కేసీయార్‌కు ఈ ప్రత్యేక సౌకర్యం దేనికి..? నిజనిర్ధారణ కమిటీ వేద్దామా..? పంపుల కనెక్షన్ కట్ చేయడానికి కేసీయార్ వస్తాడా..?’ అని రేవంత్ రెడ్డి మరో అస్త్రం సంధించాడు…
ఎప్పటిలాగే కేసీయార్ మొహం చాటేస్తాడు కదా జనానికి… ప్రశ్నలకు…! నిజానికి ఆ ఫామ్ హౌజ్ పొలాల కోసమే ఆ పాండవుల చెరువు తవ్వారు… దానికి కొందరు రైతుల భూములు సేకరించారు… వాళ్లకూ పరిహారాల్లేవనే ఆరోపణలు… మొన్న కేసీయార్ ఆక్రమిత భూముల సర్వేకు ఆ ఫామ్‌హౌజ్ పొలాల దగ్గరకు వెళ్లినప్పుడు అధికారుల టీమ్‌కు రైతులు ఇదే విషయాన్ని చెప్పినట్టు వార్తలు కనిపించాయి…
(కేసీయార్ నియోజకవర్గం గజ్వెల్లో కూడా ఓ పాండవుల చెరువు ఉంది, కోట్ల ఖర్చుతో మినీ టాంక్ బండ్ డెవలప్ చేశారు… ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎర్రవల్లిలోనే, తన పొలాల కోసం తవ్వించిన చెరువు)…

ఎల్‌నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కేబినెట్ సహచరులతో కలిసి సమీక్షించిన అనంతరం విలేకరులకు ఇంకా చాలా విషయాలు చెప్పాడు రేవంత్ రెడ్డి… ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు అనే బీఆర్ఎస్ విమర్శల్ని ప్రస్తావిస్తూ…
‘‘100 దేశాల్లో ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది, మరి అన్నిచోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయా..? కరువు రావాలని క్షుద్ర పూజలు చేయించేవారు ఇలాంటి క్షుద్ర విమర్శలే చేస్తారు…
2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 515 టీఎంసీలు చాలంటూ చంద్రబాబు ఎదుట మోకరిల్లి సంతకాలు పెట్టింది ఎవరు..? జగన్‌కు తాకట్టు పెట్టింది ఎవరు..? పాలమూరు- రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి, సీతారామసాగర్ను ఎందుకు పూర్తి చేయలేదు..? నీటి ప్రాజెక్టులపై 1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి, 40 వేల కోట్ల బకాయిలు పెట్టారు… ఎవరు..?

- 1,040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేసీఆర్ హడావుడి చేశాడు… యాదాద్రి సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు అంచనా వ్యయం, ఒప్పంద వ్యయం రూ.17,950 కోట్లు… అది కాస్తా 37,781 కోట్లకు పెరిగింది… 8 వేల కోట్లు ఎవరు తిన్నారు..?
50 శాతం ఇంపోర్టెడ్ బొగ్గు అన్నారు, సింగరేణిలో జీ9 బొగ్గు అన్నారు, ఒప్పందాలు చేసుకున్నారు… ఇవన్నీ చర్చిస్తామంటే అసెంబ్లీకి రారు, తమ అక్రమాలన్నీ జనానికి తెలిసిపోతాయని భయం… ఇదే యాదాద్రి మణుగూరులో కట్టి ఉంటే 4.62 రూపాయలకే యూనిట్ కరెంటు వచ్చేది… కట్టలేదు…
కొత్తగూడెంలో 3.94, సింగరేణి 1, 2 యూనిట్లలో 4.05 మాత్రమే ఉత్పత్తి వ్యయం… పిట్ హెడ్ గాకుండా ఇంకెక్కడో యాదాద్రి కట్టాడు కేసీయార్, తద్వారా 25 ఏళ్లలో లక్ష కోట్లు బూడిద… కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఒక ముసుగు వీరుడిని తయారు చేశారు… అదో పెద్ద కథ…’’
Share this Article