Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియాత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!

October 15, 2026 by M S R

.

Rochish Mon …. తెలుగులో గజల్ వికారానికి విదూషకత్వానికి వేడుకలు! గజల్… ప్రపంచ కవితా ప్రక్రియలో ఫార్సీ నుంచి ఉద్భవించిన ప్రక్రియ గజల్.
గజల్ ద్వారా ప్రపంచంలోకి గొప్ప కవిత్వం, సాంద్రమైన కవిత్వం వచ్చింది. గ్యూఠా (Goatha) అనే జర్మన్ పరిశీలకుడు కవి “హఫీజ్ రాసిన గజళ్ల నుండి ప్రపంచంలోకి గొప్ప కవిత్వం వచ్చింది” అని విశ్వవ్యాప్తంగా తెలియజేశాడు. తొలిదశలో కవితా రూపంగానే ఉన్న గజల్ తరువాత తరువాత గానం రూపంలోనూ ప్రత్యేకతను సంతరించుకుంది.

గజల్ అన్నది రచన, గానంపరంగా ఉదాత్తమైంది. గజల్ అంటేనే సాంద్రత, బిగి, పొంకంతో ఒక విశేషమైన ప్రక్రియ. ముఖ్యంగా గజల్ గానం ఉన్నత స్థాయి సంగీతజ్ఞతతో రాజిల్లుతోంది. గజల్ అంటూ తెలుగులో తొలి రచన చేసినవారు దాశరథి. ఈ సత్యాన్ని ఆధారాలతో చెప్పింది నేనే. నాకు ముందు ఈ విషయాన్ని ఏ తెలుగు గజల్ పరిశీలకుడు, మేధావి ఒళ్లు వంచి తెలుసుకోలేకపోయాడు.

Ads

తెలుగులో గజల్ రాసిన రెండవ వ్యక్తి పీ.బీ. శ్రీనివాస్. పీ.బీ. శ్రీనివాస్ తొలి గజల్ గాయకుడు, తొలి గజల్ వాగ్గేయకారుడు. ‘గజలియత్’ అంటే గజల్ తనంపై సరైన తెలివిడితో గజల్ రచన, గానం చేసిన తొలి తెలుగు కళాకారుడు పీ.బీ. శ్రీనివాస్. సినారెకు ఈ గజలియత్ అంటే ఏమిటో కూడా తెలియదు.

సీ.నారాయణరెడ్డి తెలుగులో గజల్ అంటూ రాసినవి గజళ్లు కానేకావు. ఈ విషయాన్ని నేను శాస్త్రీయంగా నిరూపించాను. నాకు ముందే బూదరాజు రాధాకృష్ణ 1987లోనే గజళ్లు అంటూ రాసిన సినారెను తూర్పారపట్టారు. గజల్ ప్రక్రియను తెలుగులో అత్యంత నాసిరకం రచన చేసేశారు సినారె. ఆ సినారె గజళ్లు అంటూ పాడారు కూడా. గజల్ గానానికి అధమ స్థితి తెలుగులో సినారెతోనే మొదలయింది. గజల్ అంటూ సినారే తన చాతకానితనంతో తెలుగును మోసం చేశారు.

సినారె వల్ల తెలుగులో గజల్ భంగం, భగ్నం అయిపోయింది. తదాదిగా గజల్ శ్రీనివాస్ చేసిన లొల్లాయి గానంతో వికారం, విదూషకత్వం కూడా అయిపోయింది. ఇవాళ గజల్ వల్ల తెలుగు భాష కూడా వికృత దోషాలతో వికారం అయింది. గజల్ తెలుగుకు గాయం, శాపం అయిపోయింది.

గజల్ గానం అన్నది తెలుగులో మాత్రమే ఒక లొల్లాయి డబ్బాగానం అయిపోయింది. తెలుగు జాతికే కళంకం గజల్ అన్నది. గజల్ రచన పరంగా నాసిరకం అవడం సినారె వల్ల అయితే గానం వల్ల లొల్లాయి పాట అయిపోయింది గజల్ శ్రీనివాస్ వల్ల.

ఆ గజల్ శ్రీనివాస్ తాను 40 వసంతాల గజల్ గాన వేడుకలు అని జరుపుకున్నారు! హతవిధీ ఇది వికారం, ఇది విదూషకత్వం. గజల్ గానం ఛాయలు కూడా లేని ఆ గజల్ శ్రీనివాస్ తన 40యేళ్ల గజల్ గాన వేడుకలు అనడం గర్హనీయం. తెలుగు భాషకే అవమానం; కళంకం.

gazal srinivas

గజల్ శ్రీనివాస్ తన డబ్బులతో తన ’40 వసంతాల గజల్ గాన వేడుకలు’ అని చేసుకోవడం ఎంత వికారం? ఎంతో వికారం. ఇవి గజల్ గాన వేడుకలు కావు ఇవి తెలుగులో గజల్ వికారానికి విదూషకత్వానికి వేడుకలు!

ప్రతి తెలుగు భాషాభిమాని ఇలాంటి వికృతాన్ని గర్హించాలి. ఈ గజల్ వికార విదూషకత్వానికి వేడుకలు గుంటూరులో 14 అక్టోబరున జరిగాయి. గుంటూరు దౌర్భాగ్యం మాత్రమే కాదు తెలుగు జాతి దౌర్భాగ్యం ఈ వేడుకలు…….. రోచిష్మాన్      9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియాత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!
  • 40 ఏళ్ల కిందటే ఉమ్మడి పౌరస్మృతి, విదేశీ నిధులు, మతమార్పిడిపై చర్చ!
  • ఇది సొంత గడీ కాదు సార్… బాత్రూం రిపేర్లకు కోటి రూపాయలా..?!
  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?
  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions