.
ఎలన్ మస్క్ తెలివైన వ్యాపారి… గడుసు వ్యాపారి కూడా… తను ఏనాటి నుంచో చెబుతున్నాడు కదా… తన కలల కారు టెస్లా రోడ్‌స్టర్ తీసుకొస్తానని… ఈరోజు లాంచ్ చేశాడు… దాదాపు పదేళ్లు లేటయింది కదా రకరకాల సాంకేతిక ప్రయోగాల అడ్డంకులతో… ఇప్పుడిక 2028 నుంచి కమర్షియల్ ఉత్పత్తి ఉంటుందనీ ప్రకటించాడు…
మన రూపాయల్లో చెప్పాలంటే దీని ధర 70- 75 లక్షల పైమాటే… లుక్ చూడబోతే టెస్లా సైబర్ ట్రక్లాగే ఉంది… కానీ తను లాంచ్ చేసిన తీరు మాత్రం అదిరిపోయింది… ఒక్కసారిగా దానిపై మార్కెట్లో హైప్ క్రియేట్ చేసేశాడు… కొత్త మోడల్ రాగానే కొనేసేవాళ్లకు అమెరికాలో కొదువేముంది..? దిగువన ఓ ఇన్‌స్టా పోస్టు ఉంది, చూడండి, లాంచింగ్ తీరు…
Ads

నిలువుగా ఓ ర్యాంప్… ఓ రన్‌వే (?)… ఈ రోడ్‌స్టర్ దానిపై నుంచి గాల్లోకి ఎగిరింది… కిందకు దూకి, జాగ్రత్తగా ఓ ఆర్మీ హెలికాప్టర్ ల్యాండయినట్టుగా రోడ్డు మీదకు దిగింది… అంతా రాకెట్ సైన్స్… ఈ రోడ్‌స్టర్ పేజీ అయితే దీన్ని బియాండ్ ఫిజిక్స్ అని వర్ణించుకుంది…
నిజమే, మస్క్ తన స్పేస్ ఎక్స్ సాంకేతికతను కూడా ఈ కారు రూపకల్పనలో వాడాడు… అది గాల్లోకి ఎగరడం, తల్లకిందులుగా తిరిగి, రోడ్ మీదకు సేఫ్లా పొగలు గక్కుతూ దిగడం వరకూ అంతా ఓ రాకెట్ ప్రయోగించినట్టే…
నిజానికి దీని ప్రత్యేకతలు… ఒకే ఒక సెకనులో ఏకంగా 90 కిలోమీటర్ల దాకా వేగం పుంజుకోవడం… ఫుల్లీ ఆటోమేటిక్… ఆటోపైలట్… గరిష్ట వేగం 370 కిలోమీటర్లు అంటున్నాడు మస్క్… బ్యాటరీ రేంజ్ ఏకంగా 1000 కిలోమీటర్లు… అది కార్లు రోడ్డు మీదకు వచ్చాక గానీ నిర్ధారణ కాదు…
Performance వెర్షన్‌కు $50,000; Thrust వెర్షన్‌కు $250,00 బుకింగ్ డిపాజిట్… బుకింగ్స్ ఓపెన్ చేశారు కూడా… ఐతే ఈరోజు చూపించింది ఓ అద్భుత ప్రదర్శన, అంతే… గాలిలో ఎగరడం, తల్లకిందులుగా పల్టీతోనే సేఫ్‌గా ల్యాండ్ అవడం… ఆ కారులోని నిజ ఫీచర్లు కావు, కొనేవాడికీ అక్కరలేదు… అదేమీ అనుభవించే ఫీచర్లు కావు… ఉత్పత్తి కారులో ఈ ఫీచర్లన్నీ ఉంటాయనే హామీ కాదు… జస్ట్, ఓ ప్రమోషన్ టాక్టిక్… ఇదుగో మా కారు ఇంత హైఎండ్ టెక్నాలజీతో తయారైంది అని చెప్పుకోవడం… తన మేకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించడం…

ఇంకా ఉత్పత్తి తేదీ, తుది ధర, రేంజ్, భద్రతా అనుమతులు ఇంకా ముఖ్యమైన అంశాలే… రెండు వేరియంట్లు అంటున్నాడు కదా, బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశాడు కదా… ఏ వేరియంట్లో ఏమేం ఫీచర్లుంటాయో మాత్రం చెప్పడం లేదు… చెరువులో బర్రెను దింపి, కొమ్ములు చూపించి, అమ్ముకునే రకం…! కానీ ఏమాటకామాట… టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం, ప్రమోషన్లు, అమ్మకాల్లో మాత్రం దిట్ట…
అసలు లేన్ డిసిప్లిన్, రోడ్ సెన్స్, డ్రైవింగ్ ఎటికెట్ కనిపించే అమెరికాలోనే దీని చాలా ఫీచర్లు వాడబడవు… ఇక మన ఇండియన్లకు ఆసక్తి ఏముంటుందీ అంటారా..? వాహనాలకు టెక్నాలజీ అడాప్షన్ ఎంత వేగంగా మారుతుందో తెలుసుకోవడానికి మాత్రమే ప్రస్తుతం..!!
Share this Article