Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!

October 16, 2026 by M S R

.

అయ్యా, నరేష్… వృత్తిలో భాగంగా, దొరికిన పాత్రకు న్యాయం చేయడానికి… భిన్న యాసల్ని పలికించేందుకు ప్రయాసపడటం సబబే… అవసరమే… వృత్తి నిబద్ధతే… కానీ అది అసంపూర్ణంగా ఉండకూడదు… ఉదాహరణకు తమరు ఈరోజు విడుదలైన క్రేజీ కళ్యాణం సినిమాలో పలికిన కృత్రిమ తెలంగాణ యాస… ఆడ్‌గా ఉంది…

నిజానికి తమరు చాలా బాగా నటించారు ఇందులో… మెచ్చుకోవాలి… కానీ పలుగురాళ్లలా పంటికింద కలుక్కుమనేది మీ యాస… అయ్యా, దర్శకుల వారూ, మరీ నరేష్‌కు డబ్బింగ్ చెప్పించండి అనలేం గానీ, ఇంకాస్త ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఉండాల్సింది…

Ads

(తెలంగాణ యాసకు ఓ విరుపు, ఓ మెరుపు, ఓ సొగసు ప్రత్యేకం… దాన్ని పట్టుకున్నవాళ్లలో కోట, తనికెళ్ల తదితరులు ముఖ్యులు)…

పెళ్లి ఐనా గాకున్నా సరే, పిల్లల్ని కనండి అని వేదికల మీద ఇచ్చే పిలుపులు, ఆ వివాదాలు, తిరిగి తమరి సమర్థనలు… నాకు పెళ్లికి ముందే పిల్లల్ని కనాలని ఉంది అని హీరోయిన్ అనుపమ చేసిన వ్యాఖ్యలు… ఇవి కాసేపు పక్కన పెడదాం… కానీ…

నిజం చెప్పాలంటే… అనుపమ చాలా బెటర్… ఆమె తన పాత్రకు న్యాయం చేయడమే కాదు, యాసను పలికించడంలో చాలా మెరుగు… ట్రెండ్ కాబట్టి ఇప్పుడు అందరికీ తెలంగాణ పాటలు కావాలి, కథలు కావాలి, నేపథ్యం కావాలి… కానీ దాన్ని సహజంగా ప్రజెంట్ చేయలేరు, అది కదా అసలు విషాదం…

crazy kalyanam

ఇక సినిమాకు వస్తే… నిజానికి దర్శకుడు భద్రప్ప ఎంచుకున్న కథాంశం మంచిదే… ఇటు అనుపమ, అటు నరేష్ బాగా చేశారు కూడా… కానీ ప్రజెంటేషన్‌లో దర్శకుడు చాలాచోట్ల తడబడ్డాడు… కథ ఏమిటంటే..? పర్వతాలు… తనకు ఇద్దరు బిడ్డలు… పెద్ద కూతురి మొగుడు తాగుబోతు… కుటుంబం పరువు తీస్తుంటాడు… కనీసం చిన్న బిడ్డకైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని పర్వతాలు తాపత్రయం…

కానీ ఆమెకు ఓ యువకుడి మీద అభిమానం… బాగా చదివి సర్కారీ కొలువు సాధించాలని ప్రయత్నం… కానీ పర్వతాలు ఆమెకు ఓ ఫారిన్ సంబంధం తెస్తాడు… తన అన్న బిడ్డకు వచ్చిన సంబంధాన్ని తన బిడ్డ వైపు మళ్లించాలని చూస్తాడు… చివరకు ఏం జరిగిందనేది కథ…

మంచి సంబంధం అంటే ఏమిటి..? ఈ పాయింట్ మీద కథ రాసుకున్నాడు గానీ… అంతే చక్కగా కుదరలేదు వంట… 1) లవ్ స్టోరీలో పసలేదు, రొటీన్, బోర్… 2) తండ్రి ప్రయత్నాల్ని కాదనే క్రమంలో బిడ్డ ప్రయత్నాలు పెద్దగా ఆసక్తిని రేకెత్తించవు… 3) అనుపమ లవర్ పాత్ర చాలా వీక్… 4) చివరలో నరేష్ విజృంభించి నటించిన కాసేపు తప్ప ఎక్కడా కథనం పెద్దగా ఇంట్రస్టింగుగా సాగదు…

కాకపోతే తరుణ్ భాస్కర్ పలుచోట్ల నవ్వించగలిగాడు… (దర్శకత్వం వదిలేసి ఇక నటుడిగా ప్రస్థానమేనా?)…  సురేశ్ బొబ్బిలి సంగీతం ఫర్వాలేదు… ‘అలచంద్ర వంక’ పాట మినహా మిగతావి పెద్దగా గుర్తుండవు… శ్యామ్ కెమెరా పనితనం పల్లెటూరి వాతావరణాన్ని, పెళ్లి సందడిని అందంగా చూపించింది… నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…
  • నీట్, వోట్… అన్నీ సాకులు ! ప్రభుత్వం కూల్చడమే అసలు టార్గెట్ !!
  • ప్రేమ్ వత్స ! హైదరాబాద్ రూట్స్ – ఐడీబీఐ కొనే ఫెయిర్‌ఫాక్స్ తనదే !!
  • కేసీయార్ పొలాలకు కాళేశ్వరం నీళ్లు- ప్రత్యేకంగా చెరువు, కాలువ !!
  • … వారిని సరిదిద్దలేకపోయిన గత పొరపాటుకు మేం క్షంతవ్యులం !!
  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions