Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!

November 4, 2026 by M S R

.

Srini Journalist … ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం- ఈ సామెతలో “ఆలు” అంటే భార్య, “చూలు” అంటే గర్భం. అంటే… అసలు పెళ్లయ్యి భార్యే లేదు, ఆమె గర్భం దాల్చడమూ జరగలేదు, కానీ అప్పుడే పుట్టబోయే కొడుకుకి “సోమలింగం” అని పేరు కూడా పెట్టేసుకుని మురిసిపోతున్నారట!

సరిగ్గా ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో ఒక సాధారణ తీర్మానాన్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ మీడియా రగిలిస్తున్న రచ్చ కూడా ఇలాగే ఉంది. అసలు ఆ తీర్మానానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, పవర్ లేదు, ఇండియా రక్షణను ఆపే సత్తా అంతకంటే లేదు—

Ads

అంటే ఇక్కడ అంతా ఆలూ లేదు చూలూ లేదు! కానీ పాకిస్తాన్ మాత్రం అప్పుడే తమ మీడియాలో, పేపర్లలో “మేము ఇండియాను ప్రపంచంలో ఒంటరిని చేసేశాం, ఇజ్రాయిల్‌తో కలిపి బుక్ చేసేశాం” అంటూ సంబరాలు చేసుకుంటోంది.

ఇటీవల పాకిస్తాన్- బెలారస్ సంయుక్తంగా ‘ప్రాంతీయ ఆయుధాల నియంత్రణ’ పేరుతో తెచ్చిన ఈ డ్రామాకు ఏకంగా 180 దేశాలు మద్దతు ఇవ్వగా, కేవలం భారత్, ఇజ్రాయిల్ మాత్రమే వ్యతిరేకంగా ‘నో’ ఓటు వేయడంతో దీనిపై ఒక తప్పుడు నరేటివ్ సృష్టించే మైండ్ గేమ్ నడుస్తోంది.

uno

ప్రపంచమంతా ఒకవైపే ఉన్నా, భారత్- ఇజ్రాయిల్ ఎందుకు కలిసి కట్టుగా నిలిచాయనే దానికి ఇద్దరి వెనుకా బలమైన సొంత జాతీయ భద్రతా కారణాలు ఉన్నాయి.
పాకిస్తాన్ ఈ తీర్మానంలో ‘సబ్-రీజినల్’ (ఉప-ప్రాంతీయ) అనే పదాన్ని చాలా తెలివిగా చేర్చి, కేవలం దక్షిణాసియా సరిహద్దులకే రక్షణ బడ్జెట్‌ను, ఆయుధాలను పరిమితం చేయాలని చూసింది.

దీనివల్ల భారత్ తన ఆయుధ సామర్థ్యాన్ని పాకిస్తాన్ స్థాయికి తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ భారత్‌కు ఉన్న అసలైన ముప్పు కేవలం పాకిస్తాన్ కాదు, అంతకంటే పెద్దదైన చైనా!
ఆ చైనాయే ఈ నియమాల పరిధిలోకి రాకుండా ‘ఈస్ట్ ఆసియా’ పరిధిలో హాయిగా ఆయుధాలు పెంచేసుకుంటుంది, అందుకే భారత్ ఈ కపట నాటకాన్ని తిప్పికొట్టింది.

మరోవైపు ఇజ్రాయిల్‌కు కూడా మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, హెజ్బొల్లా వంటి బహుముఖ శత్రువుల ముప్పు ఉంది కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న భౌగోళిక సరిహద్దుల గిరి గీసి ఆయుధాలు తగ్గించుకోమంటే దాని మనుగడకే ప్రమాదం.

మొత్తానికి ఎవరి సొంత రక్షణ ప్రయోజనాల కోసం వారు నిలబడితే, పాకిస్తాన్ మాత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్‌పై ఉన్న వ్యతిరేకతను వాడుకుని, ‘చూశారా ఇండియా కూడా ఇజ్రాయిల్‌తో చేతులు కలిపి శాంతికి విఘాతం కలిగిస్తోంది’ అంటూ ముస్లిం దేశాల ముందు ఒక పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ చేస్తోంది.

కానీ ఐక్యరాజ్యసమితిలో వచ్చే ఇలాంటి ఓటింగ్ తీర్మానాలకు ఎలాంటి చట్టపరమైన చెల్లుబాటు ఉండదు కాబట్టి, పాక్ పత్రికల్లో రాసుకునే రాతలకు ఇండియా రక్షణ రంగానికి పైసా నష్టం లేదు— మన సరిహద్దులు ఎవరికీ లొంగవని ఢిల్లీ తేల్చి చెప్పేసింది! Who cares UNO …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ
  • అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది…!
  • టీసీఎస్ మారథాన్ … విశ్వవ్యాప్తంగా 14 ఈవెంట్లు… లక్షలాది రన్నర్లు…
  • విశ్వ కుబేరుడి బిడ్డ షేరింగ్ అద్దె ఇంట్లో… మోడల్‌గా సొంత జీవితం..!!
  • లేడీ డాన్లు- ఆధిపత్య పోరాటాలు … యథేచ్ఛగా బూతులు- హింస
  • పాపం విశ్వక్‌సేన్ ! కల్ట్ కాదు… ఇది ఓ పే-ద్ద కన్‌ఫ్యూజన్ !!
  • హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions