Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!

November 4, 2026 by M S R

.

రీసెంటుగా పలుసార్లు న్యూయార్క్‌‌లో చక్కర్లు కొట్టాను… సెంట్రల్ పార్క్, బ్రూక్లిన్ బ్రిడ్జి, టైమ్స్ స్క్కేర్ (మాన్‌హాటన్ ఏరియా), వరల్డ్ ట్రేడ్ సెంటర్, జీరో గ్రౌండ్, ఐరాస భవనం, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎట్సెట్రా… ఇరుకు రోడ్లు, వాహనాల రద్దీ… బంపర్ టు బంపర్ నడుస్తుంటాయి వాహనాలు… జనం రద్దీ కూడా…

మన కారులోనే వెళ్తే… రద్దీని బట్టి, రద్దీ వేళను బట్టి ఓ ప్రత్యేక టాక్స్ పడుతుంది… రద్దీ పన్ను… నిజమే, మీరు చదివింది… ‘కంజెషన్ రిలీఫ్ జోన్’ (Congestion Pricing) విధానం ఇది… ఇంతేకాదు, అక్కడ పార్కింగ్ దుర్లభం… హోటళ్లు, థియేటర్లు, బార్లు, షాపులకు దీటుగా బోలెడన్ని ప్రైవేటు పార్కింగ్ స్పాట్స్ ఉంటాయి… వాచిపోతుంది…

Ads

అందుకే చాలామంది పాథ్‌లో న్యూయార్క్‌కు వచ్చి, సబ్‌వేలలో అవసరమైనచోటికి వెళ్తారు… రెండూ వేర్వేరు సిస్టమ్స్… అండర్ గ్రౌండ్ సబ్‌వేస్ (మెట్రో) ఏదో పురాతన జమానా బాపతు… (పర్యాటకులకు సైకిల్ టాక్సీలు, బైక్‌లు అద్దెకు లభిస్తాయి… ఆ ఏరియాల్లో తిప్పిచూపించే పవర్ రిక్షాలు కూడా… ఒకసారి టికెట్ తీసుకుని, ఎక్కడంటే అక్కడ ఆగి, దిగి, తిరిగే బస్సు సౌకర్యం కూడా… ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా న్యూయార్క్ చూపించే సౌలభ్యమూ వచ్చిందట…)

cogestion price

సరే, కంజెషన్ టాక్స్ విషయానికి వద్దాం… హైదరాబాద్ ఉదాహరణ తీసుకుందాం… కొనేటప్పుడు జీఎస్టీ, రోడ్ టాక్స్ (లైఫ్ టైమ్), రిజిస్ట్రేషన్ చార్జీలు, ఏటేటా బీమా, పెట్రోల్/డీజిల్ పై భారీ స్థానిక పన్నులు, ఎక్సైజ్ సుంకాలు, ప్రైవేట్ లేదా హైవే రోడ్లపై టోల్ ప్లాజాల వసూళ్లు… ఇన్ని రకాల పన్నులు చెల్లించిన తర్వాత కూడా, ఒక వాహనదారుడు రోడ్డుపైకి వస్తే ఎదురయ్యే అతిపెద్ద నరకం—ట్రాఫిక్ జామ్!

మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌ (గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) ప్రాంతాల్లో కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కొన్నిసార్లు గంటన్నర పైగా సమయం పడుతోంది… (చినుకులు పడితే ఇక చెప్పనక్కర్లేదు… నగరం స్థంభించిపోతోంది)… వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నా సమయం, ఇంధనం, ఓపిక అన్నీ ట్రాఫిక్‌లోనే ఆవిరైపోతున్నాయి…

ఇలాంటి సమయంలో ప్రపంచంలోని కొన్ని మహానగరాల్లో అమలు చేస్తున్న ‘కంజెషన్ టాక్స్’ (రద్దీ పన్ను)ను హైదరాబాద్ రద్దీ ఏరియాల్లో వేస్తే ఎలా ఉంటుంది..? (వసూలు ఎలా అనేది తరువాత…) రద్దీ ఎక్కువగా ఉండే పీక్ అవర్స్ (ఉదయం, సాయంత్రం) లో సొంత వాహనాల్లో ఆయా ప్రాంతాల్లోకి ప్రవేశిస్తే నిర్ణీత రుసుం చార్జ్ చేస్తే..?

hyderabad

మొదట్లో కొంత వ్యతిరేకత రావచ్చునేమో గానీ… ఈ కఠిన నిబంధనలు, అధిక చార్జీల వల్ల ప్రజలు సొంత కార్లను వదిలేసి, ప్రజారవాణాను ఆశ్రయించే వీలుంది కదా… లండన్, సింగపూర్, స్టాక్‌హోమ్ వంటి నగరాల్లోనూ ఈ ‘రద్దీ పన్ను’ వల్ల ట్రాఫిక్ గణనీయంగా తగ్గడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణం మెరుగైంది…

ఆఫీస్ వేళల్లో ఒక్కరే కారులో వెళ్లే సంస్కృతి మారి, కార్ పూలింగ్ (Car Pooling) పెరుగుతుంది… రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడం వల్ల కాలుష్యం తగ్గి నగర పర్యావరణానికి మేలు జరుగుతుంది… కానీ ప్రజల నుంచి వెంటనే వచ్చే ప్రశ్న… ముందుగా అవసరమైన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌‌లు, రోడ్డు విస్తరణతోపాటు గోతుల్లేకుండా చూడండి, వర్షం పడితే ట్రాఫిక్ ఆగని సీవరేజ్, వరదనీటి వ్యవస్థను డెవలప్ చేయండి అని…

ఐటీ కారిడార్ల ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏసీ బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచడం… చివరి మైలు అనుసంధానం (Last-Mile Connectivity), మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసుల వరకు షటిల్ సర్వీసులు, ఫస్ట్/లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందుబాటులోకి తెస్తే… ప్రజలు స్వచ్ఛందంగానే సొంత వాహనాలు ఇంట్లో పెట్టి ప్రజారవాణాను ఆశ్రయిస్తారు… ఈ రోజులూ రానున్నాయేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ
  • అంతవరకు ప్రతి క్లాస్‌రూమ్‌లో ఒక రంపం తిరుగుతూనే ఉంటుంది…!
  • టీసీఎస్ మారథాన్ … విశ్వవ్యాప్తంగా 14 ఈవెంట్లు… లక్షలాది రన్నర్లు…
  • విశ్వ కుబేరుడి బిడ్డ షేరింగ్ అద్దె ఇంట్లో… మోడల్‌గా సొంత జీవితం..!!
  • లేడీ డాన్లు- ఆధిపత్య పోరాటాలు … యథేచ్ఛగా బూతులు- హింస

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions