Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?

November 4, 2026 by M S R

.

అమెరికా మిడ్ టరమ్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వచ్చింది కదా… డెమొక్రాట్లు స్పష్టమైన ఆధిక్యత చూపించారు… రిపబ్లికన్లు చేతులెత్తేశారు… మీడియా ఊహించిన దానికన్నా పేలవంగా… ఇక ఎవరికెన్ని అనే అంకెలు తేలాల్సిందే తప్ప అమెరికన్ వోటర్లు చాలా స్పష్టంగా ట్రంపు పాలన నచ్చలేదు, బాగాలేదు అని తీర్పు చెప్పేశారు…

సెనేట్, హౌజ్, గవర్నర్లు… రిపబ్లికన్లు తోకముడిచారు అనే స్వీపింగ్ కామెంట్ అక్కర్లేదు… అమెరికాలో వాళ్లూ వీళ్లూ వస్తుంటారు, పోతుంటారు… ఓసారి వాళ్లు, ఓసారి వీళ్లు… కానీ ఇది మాత్రం ట్రంపు మీద వ్యతిరేకతే… ధరలు, ద్రవ్యోల్బణం దగ్గర నుంచి ఇరాన్ యుద్దం దాకా ట్రంపు ధోరణి అమెరికా జనానికి నచ్చలేదు… క్లియర్…

Ads

సరే, తనను డెమోక్రాట్లు అభిశంసిస్తారా..? ఈ అంకెలతో అది సాధ్యమేనా..? అవినీతిపై విచారణలు మొదలు పెడతారా..? ట్రంపు నిర్ణయాలను మోకాలడ్డుతారా..? కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలకు ట్రంపు తన వీటో పవర్‌తో అడ్డుతగులుతాడా..? ఆ వీటోను కూడా పక్కకుతోసేంత మూడింట రెండొంతుల మెజారిటీ డెమోక్రాట్లకు వస్తుందా..? ఇదంతా వేరే చర్చ…

indo us

ఇండియాపై ప్రభావం ఏమిటి..? అమెరికా- ఇండియా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..? ముందు ట్రంపు సంగతి…

1. రిపబ్లికన్లకు ఫండింగ్ ఎలన్ మస్క్… తను రీసెంటుగా మోదీ ప్రభుత్వాన్ని, ఆదానీని, రిలయన్స్- బీజేపీ బంధాన్ని విమర్శించాడు… కటువు వ్యాఖ్యలు చేశాడు… మరోవైపు ట్రంపు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో కలిసి వ్యాపారం, మోదీ మంచి మిత్రుడే అంటూనే ఇండియాకు నష్టకారక నిర్ణయాల్ని తీసుకున్నాడు… మాట ఒకటి, చేత మరొకటి… ఏమాత్రం నమ్మదగని కేరక్టర్… అమెరికాకు అనుకూలమైన ట్రేడ్ డీల్ కోసం మోదీ చేయి మెలితిప్పడానికి నానా తిప్పలూ పడ్డాడు…

ఇండియాతో వ్యూహాత్మక దోస్తీ అనే విషయాన్ని, అవసరాన్ని కూడా విడిచిపెట్టేశాడు… పరోక్షంగా బ్రిక్స్ బలపడటానికి తనే బాటలు వేశాడు… సో, ట్రంపు ఓటమి మనకు సంతోషమా..? లేదు… కాదు… ఎందుకంటే..?

2. డెమోక్రాట్లకు ప్రధాన ఫండింగ్ జార్జ్ సోరోస్… తను ఏకాలం నుంచో ఇండియా ద్వేషి… బీజేపీ- మోదీ అంటే మంట… 2023లో నేరుగానే విమర్శలు చేశాడు… తనేమో మోదీ- ఆదానీ బంధాన్ని ఎత్తిచూపించాడు… భారత వ్యతిరేక శక్తులకు ఇతోధిక సాయం చేస్తూనే ఉంటాడు… ఇప్పుడు తన పార్టీ డెమోక్రాట్లు బలపడ్డారు… ఈ ప్రభావం అమెరికా- ఇండియా సంబంధాలను మరింత ప్రతికూలంగా మార్చబోతోందా..?

క్వాడ్, బ్రిక్స్, ట్రేడ్, జియో పాలిటిక్స్… ఏ అంశం తీసుకున్నా సరే, ఇండియాతో అమెరికాకు సత్సంబంధాలు అవసరం… కానీ ట్రంపు అన్నీ పక్కకు తోసేశాడు… ప్రత్యేకించి మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్) అంటూ ప్రవాస భారతీయులపై విషాన్ని చిమ్మాడు, సగటు అమెరికన్లలో ఇండియన్ల పట్ల ద్వేషాన్ని పెంచాడు… మరి ఇకపై..?

రిపబ్లికన్లు, డెమోక్రాట్లు… గద్దె మీద ఎవరున్నా… మస్క్, సోరోస్‌ వంటి ధనిక దాతలే తెర వెనుక కథలు నడిపిస్తారు… ఆ ఇద్దరికీ ఇండియాతో, ప్రత్యేకించి మోదీ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత… కారణాలు అనేకం కావచ్చు… సో, ఈ మిడ్ టరమ్‌తో ఇండియాకు కొత్తగా ఒరిగే ఫాయిదా ఏమీ లేదు… ప్రస్తుత విదేశీ విధానంతోనే, మన అవసరాల మేరకు జాగ్రత్తగా వ్యవహరించడమే ఇక ముందూ శరణ్యం… ఆల్రెడీ ట్రంపుకు బహిరంగ మద్దతు ప్రకటించి భంగపడిన మోదీ చేదు అనుభవమే ఓ గొప్ప గుణపాఠం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions