Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!

November 5, 2026 by M S R

.

అట్లాంటిక్ సిటీ వెళ్లే దారిలో… నా వెంట ఉన్న మిత్రుడు పెట్రోల్ కొట్టించి టిప్ ఇచ్చాడు… అతను I appreciate it అని బదులిచ్చాడు… నేను Thanks అనే పదం వస్తుందని ఊహించాను… నిజానికి మన ఇంగ్లిషులో, మన వ్యక్తీకరణలో I appreciate అంటే, నేను అభినందిస్తున్నాను… ఇదేమిటి..? టిప్ ఇచ్చినందుకు, మంచి పనిచేశావోయీ అని అభినందిస్తున్నాడా..? అని అపార్థం చేసుకున్నాను…

సేమ్, సితార్ అనే ఇండియన్ రెస్టారెంటులో బిల్లు చెల్లించాక, టిప్ ఇస్తే, అక్కడ వెయిట్రెస్‌గా పనిచేసే స్వాతి జోహార్ (పంజాబీ) కూడా అదే మాట చెప్పింది… కేసినోలో డీలర్ లేదా క్రూపియర్ కూడా అంతే… క్రూయిజ్ నడిపే మాస్టర్… ఇలా పలుచోట్ల సేమ్ సేమ్…

Ads

కానీ ఇండియాలో ఇంగ్లిష్ వేరు- అమెరికాలో ఇంగ్లిష్ వేరు… అంటే సందర్భాన్ని బట్టి, వ్యక్తీకరించే అర్థాలు వేరు అని..! I appreciate అంటే Thanks అనే అర్థమట… పదాలు అవే అయినా పలికే తీరు, వ్యక్తం చేసే భావం వేరు… నిజానికి అమెరికాలో కొలువులు చేసే, స్థిరపడే వాళ్లకు ఇదేమంత కొత్త కాదు, వాళ్లూ అలవాటైపోయారు… కానీ మనకు కొత్త…

ఇంగ్లిష్ మనకు కొత్త భాష కాదు… స్కూల్లో చదువుకున్నాం… ఉద్యోగాల్లో ఉపయోగించాం… విదేశాలకు వెళ్లినా ఇంగ్లిష్‌లోనే మాట్లాడతాం… (అమెరికన్ యాస త్వరగా అర్థం గాకపోయినా సరే, మనం మనకు తెలిసిన కాస్త ఇంగ్లిష్‌లోనైనా ఏదోలా కమ్యూనికేట్ చేయగలం…)  కానీ అమెరికాలో కొంతకాలం గడిపితే ఒక విషయం అర్థమవుతుంది… మనకు తెలిసిన ఇంగ్లిషే అయినా అక్కడి వాళ్లు మాట్లాడే తీరు, పదప్రయోగాలు, సందర్భాన్ని బట్టి భావాన్ని వ్యక్తం చేసే పద్ధతులు కొంత భిన్నంగా ఉంటాయి… కొన్ని మాటలు వింటే మొదట్లో ఆశ్చర్యం కూడా కలుగుతుంది…

ఒకరు మనకు సహాయం చేసినప్పుడు, రెస్టారెంట్‌లో టిప్ ఇచ్చినప్పుడు, మన కోసం కొంత సమయం కేటాయించినప్పుడు ‘I appreciate it’ అంటారు… అంటే మీరు చేసిన పనిని నేను విలువైనదిగా భావిస్తున్నాను అని అర్థం… ‘I appreciate you’ అంటే మీకు నా కృతజ్ఞతలు అని మరింత వ్యక్తిగతంగా చెబుతున్నట్టు… ఇది కేవలం థాంక్యూ అనే మాటకు ప్రత్యామ్నాయం కాదు… ఎదుటివారి సహాయాన్ని గుర్తిస్తున్నామనే భావన కూడా ఇందులో ఉంటుంది…

సారీ చెప్పడంలోనూ తేడా ఉంది… మన దగ్గర ఎవరినైనా పొరపాటున ఢీకొన్నా, దారి అడిగినా, చిన్న తప్పు చేసినా వెంటనే ‘సారీ’ అంటాం… అమెరికాలో కూడా ‘Sorry’ అంటారు… అయితే సందర్భాన్ని బట్టి వేరే ప్రయోగాలుంటాయి… చిన్న పొరపాటు జరిగితే ‘My bad’ అంటారు… అంటే నాదే తప్పు అని అంగీకరించడం… ఏదైనా అసౌకర్యం కలిగించినప్పుడు ‘Sorry about that’ అంటారు… మరింత అధికారికంగా క్షమాపణ చెప్పాల్సి వస్తే ‘I apologize’ ఉపయోగిస్తారు…

ఒకరు మనకు థాంక్స్ చెబితే మనం ‘Welcome’ అంటాం… అమెరికాలో ‘You’re welcome’ అనడంతోపాటు ‘No problem’, ‘No worries’, ‘My pleasure’ వంటి మాటలు కూడా తరచుగా వినిపిస్తాయి… ‘No worries’ అంటే ఫర్వాలేదు, దానికేం ఇబ్బంది లేదు అని అర్థం… ‘My pleasure’ అంటే మీకు సహాయం చేయడం నాకు సంతోషమే అని చెప్పడం… ఇవి వినడానికి చిన్న మాటలే అయినా సంభాషణలో ఆప్యాయతను వ్యక్తం చేస్తాయి…

tcs nyc marathon

రెస్టారెంట్లలో మాటలే వేరు! అమెరికాలో రెస్టారెంట్‌కు వెళితే మనకు ఎదురయ్యే మొదటి అనుభవం అక్కడి సర్వర్ల పలకరింపు. ‘Hi, how are you doing today?’ అని అడుగుతారు… మనం నిజంగానే మన ఆరోగ్యం, క్షేమం గురించి అడుగుతున్నారని అనుకోవచ్చు… కానీ చాలాసార్లు ఇది మర్యాదపూర్వక పలకరింపు మాత్రమే… ‘Good, how are you?’ అని సమాధానం చెప్పి ముందుకు వెళ్లిపోవచ్చు…

‘What can I get for you?’ అంటే మీకు ఏం కావాలి అని అర్థం… ‘Are you all set?’ అంటే మీకు కావాల్సినవన్నీ వచ్చాయా, ఇంకేమైనా కావాలా అని అడుగుతున్నట్టు… ‘Would you like anything else?’ అంటే ఇంకేమైనా కావాలా అని మర్యాదగా ప్రశ్నించడం…

బిల్లు చెల్లించిన తర్వాత ‘You’re all set’ అని చెబితే మీ చెల్లింపు పూర్తయింది, ఇక అంతా సిద్ధం అని అర్థం… ఇది రెస్టారెంట్‌కే పరిమితం కాదు… సూపర్ మార్కెట్, హోటల్, బ్యాంకు, ఇతర సేవల దగ్గర కూడా వినిపిస్తుంది…

షాపింగ్‌కు వెళితే మరో ప్రపంచం! మన దగ్గర షాపింగ్‌కు వెళ్లి ఏదైనా వస్తువు అడిగితే ‘How much is this?’ అని అడుగుతాం… అమెరికాలోనూ ఇదే మాట వాడతారు… కానీ దుకాణాల్లో ‘Can I help you find anything?’ అని అడగడం సాధారణం… ఏదైనా వెతుకుతున్నారా, మీకు సహాయం చేయనా అని దాని అర్థం… ఏదైనా కొనుగోలు చేసి బిల్లు చెల్లించిన తర్వాత ‘Have a good one’ అని చెబుతారు… అంటే మంచి రోజు గడపండి అని అర్థం. ఇది వీడ్కోలు చెప్పడానికి ఉపయోగించే సాధారణ ప్రయోగం… (ఎక్కువగా ఫోన్‌లో సేవ్ చేసిన మన బ్యాంకు కార్డును అక్కడ రిసీవింగ్ డివైజ్ ఎదుట డిస్‌ప్లే చేయడమే చెల్లింపు అంటే…)

మన దగ్గర ‘Okay, bye’ అని చెప్పి వెళ్లిపోతాం. అమెరికాలో ‘Have a good day’, ‘Take care’, ‘See you later’ వంటి మాటలు ఎక్కువగా వినిపిస్తాయి… పరిచయం ఉన్నా లేకపోయినా ఈ పలకరింపులు వినిపిస్తుంటాయి…

.

పలకరింపుల్లోనూ ఒక ప్రత్యేకత!… మన దగ్గర ఒకరిని కలిస్తే ‘ఎలా ఉన్నారు?’ అని అడుగుతాం… అమెరికాలో ‘How are you?’, ‘How’s it going?’, ‘What’s up?’ వంటి మాటలు వినిపిస్తాయి… ఇవన్నీ ఒకే అర్థం కావు…

‘How are you?’ అనేది సాధారణ మర్యాదపూర్వక పలకరింపు… ‘How’s it going?’ అంటే ఎలా సాగుతోంది అని అడిగినట్టు… ‘What’s up?’ అంటే ఏమిటి విశేషాలు అని స్నేహితుల మధ్య పలికే మాట… ‘How are you?’ అని అడిగిన ప్రతిసారీ మన జీవిత విశేషాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు… జస్ట్, అది బాగున్నారా అనే పలకరింపు మాత్రమే… ‘Good, thanks. How about you?’ అంటే సరిపోతుంది…

ఫోన్‌లో మాట్లాడేటప్పుడు… మన దగ్గర ఫోన్ ఎత్తగానే ‘హలో’ అంటాం… అమెరికాలోనూ ‘Hello’ సాధారణమే… అయితే ఫోన్‌లో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘Is this a good time to talk?’ అని అడగడం మర్యాదగా భావిస్తారు… అంటే ఇప్పుడు మాట్లాడటానికి వీలుగా ఉందా అని అర్థం…

మన దగ్గర ఎవరి మధ్యలోకైనా వెళ్లాల్సి వస్తే ‘కొంచెం పక్కకు జరగండి’ అంటాం… అమెరికాలో ‘Excuse me’ అని చెబుతారు… చాలు… ఏదైనా వస్తువు తీసుకోవాలన్నా, అనుమతి అడగాలన్నా ‘May I?’ లేదా ‘Can I?’ అంటారు…

‘Would you mind?’ అనే ప్రయోగం కూడా తరచుగా వినిపిస్తుంది… ‘Would you mind opening the door?’ అంటే తలుపు తెరుస్తారా అని మర్యాదగా అడగడం… పదాల అర్థం మాత్రమే చూస్తే కొంత గందరగోళంగా అనిపించినా, ఇది అభ్యర్థన చేసే ఒక మర్యాదపూర్వక పద్ధతి…

cogestion price

ఉచ్చారణ కూడా ప్రత్యేకమే!  పదాలు ఒకటే అయినా పలికే విధానంలో తేడాలు ఉంటాయి. మనం ‘వాటర్’ అని పలికితే అమెరికన్లు చాలాసార్లు ‘వాడర్’కు దగ్గరగా పలుకుతారు… ‘Better’ను ‘బెటర్’ కంటే ‘బెడర్’కు దగ్గరగా వినిపించేలా ఉచ్చరిస్తారు… అమెరికన్ ఇంగ్లిష్‌లో మధ్యలో వచ్చే ‘t’ ధ్వని చాలాసార్లు ‘d’కి దగ్గరగా వినిపించేలా మారుతుంది… దీన్ని ఫ్లాప్-టి (Flap T) అంటారుట…

‘Schedule’ అనే పదాన్ని మనం సాధారణంగా ‘షెడ్యూల్’ అని పలుకుతాం… అమెరికాలో చాలామంది ‘స్కెడ్యూల్’ అంటారు… ‘Advertisement’ వంటి పదాల ఉచ్చారణలోనూ ప్రాంతాన్ని బట్టి తేడాలు కనిపిస్తాయి…

ఇక కొన్ని పదాలే వేరుగా ఉంటాయి… మనం బ్రిటిష్ ఇంగ్లిష్ ప్రభావంతో ‘Lift’ అంటాం… అమెరికాలో ‘Elevator’ అంటారు… ‘Petrol’కు బదులు ‘Gas’ లేదా ‘Gasoline’, ‘Flat’కు బదులు ‘Apartment’, ‘Holiday’కు బదులు ‘Vacation’, ‘Mobile phone’కు బదులు ‘Cell phone’ అంటారు… మనం ‘Queue’లో నిలబడితే అక్కడ చాలామంది ‘Line’లో నిలబడతారు… మనం ‘Biscuits’ అనేది అక్కడ చాలాసార్లు ‘Cookies’ అవుతుంది… మనం ‘Chips’ అంటే అమెరికాలో ‘French fries’ అని అర్థం కావచ్చు…

usa

మాటల వెనుక సంస్కృతి కూడా ఉంటుంది! మన దగ్గర పరిచయం పెరిగిన తర్వాతే కొంతమంది ఆప్యాయంగా మాట్లాడతారు… అమెరికాలో మాత్రం అపరిచితులు కూడా నవ్వుతూ పలకరించడం, చిన్నపాటి సంభాషణ చేయడం సాధారణం… సూపర్ మార్కెట్‌లో క్యాషియర్, లిఫ్ట్‌లో పక్కన నిలబడిన వ్యక్తి, కాఫీ షాప్‌లో సర్వర్… ఎవరైనా చిన్న మాటతో సంభాషణ మొదలుపెట్టవచ్చు… అయితే ఆ పలకరింపులన్నీ వ్యక్తిగత స్నేహానికి సంకేతాలు కావు… చాలాసార్లు అవి అక్కడి సామాజిక మర్యాదలో భాగం మాత్రమే…

అలాగే అమెరికాలో అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో ఒకే విధమైన మాటతీరు ఉండదు… న్యూయార్క్‌లో వినిపించే ఇంగ్లిష్, టెక్సాస్‌లో వినిపించే ఇంగ్లిష్, దక్షిణాది రాష్ట్రాల్లో వినిపించే ఇంగ్లిష్ మధ్య ఉచ్చారణ, యాస, కొన్ని పదప్రయోగాల్లో తేడాలు ఉంటాయి… వయసు, వృత్తి, పరిచయం, సందర్భం కూడా మాటతీరును ప్రభావితం చేస్తాయి… భాష ఒకటే, యాసలు వేర్వేరు…!!

usa

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!
  • ఓ వైరల్ పోస్టు- అంబానీల ఫోటోలు- సంధించిన ఓ విలువైన ప్రశ్న!!
  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions