Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తమన్ ఏమిటిది..? శివమణి ఏదో అంటున్నాడు..? ఏం జరుగుతోంది..?

November 6, 2026 by M S R

.

నిజానికి సినిమా విమర్శకుల కళ్లల్లో పడనట్టుంది బహుశా… ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ వేదికలపై సినిమా సెలబ్రిటీల ఖాతాలను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ, ఏదైనా వార్త కనిపిస్తే వెంటనే పట్టేసుకునే యూట్యూబర్లు కూడా దీన్ని చూడనట్టుంది… విషయం ఏమిటంటే..?

ఆనందన్ శివమణి తెలుసు కదా… డ్రమ్స్ శివమణి… ఎన్నో ఏళ్లుగా సినిమాలకు వర్క్ చేస్తున్నాడు… రెహమాన్, ఇళయరాజా, డీఎస్పీ తదితరులతోనూ వర్క్ చేశాడు… జకీర్ హుస్సేన్, జాన్ మెక్‌లాఫ్లిన్ వంటి దిగ్గజ కళాకారులతో కలిసి దేశ విదేశాల్లో కూడా అనేక సంగీత కచేరీలు (Live Concerts) నిర్వహించి గుర్తింపు పొందాడు ఈ పద్మశ్రీ…

Ads

తిరుమలకు వచ్చాడు… శ్రీవారికి మొరపెట్టుకున్నాడు… తనే చెప్పాడు కెమెరా ముందు… ‘‘హైదరాబాద్ మ్యూజిషియన్ ఒకరు మూడేళ్లుగా అసలే పేమెంట్ ఇవ్వడం లేదు, ఆ బాకీ చెల్లించేలా చూడు స్వామీ అని మొక్కుకోవడానికి, ఫిర్యాదు చేయడానికి వచ్చాను..’’

శివమణి

ఎవరు థమన్..? శివమణి నీ గురువు అంటావు, సన్నిహితుడు అంటావు, మార్గదర్శకుడు అంటావ్… టాలీవుడ్ టాప్-2 కంపోజర్ నువ్వు… వాటీజ్ దిస్..? అసలు ఏం జరుగుతోంది టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో..? మూడేళ్ల నుంచీ పేమెంట్స్ లేకపోవడం ఏమిటి..?


ఇదీ ఆ ఇన్‌స్టా లింక్…



శివమణి వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… చిన్న మ్యూజిషియన్ అంటాడేమిటి..? పెద్ద సంగీత దర్శకుడు ఈ చెల్లింపుల బాకీలతో చాలా చిన్నవాడైపోయాడనే ఎత్తిపొడుపా? సెటైరా? ఒక్కొక్క సినిమాకు కోట్లు, కచేరీకి కోట్లు… మరేమైపోతున్నయ్ కోట్లు…?

శివమణి వంటి సీనియర్ మోస్ట్ డ్రమ్మరే ఇలా బాధపడుతూ… తిరుమల శ్రీవారికి ఫిర్యాదు చేస్తున్నానని కోపం, బాధ కలగలిపి విమర్శ చేస్తున్నాడంటే… టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఓసారి సీరియస్‌గా ఆత్మవిమర్శ చేసుకోవాలి… పేరుకు వందల కోట్ల ఖర్చు చూపిస్తున్నారు నిర్మాతలు… ఎటుపోతోంది అంత డబ్బు..?

శివమణి

ఏం..? పనిచేయించుకునీ సరిగ్గా పేమెంట్స్ చేయడం లేదా..? శివమణికే కాదు, ఫ్లూట్ నవీన్‌దీ అదే బాధ అట… అట్టహాసంగా హయత్ హోటల్ బుకింగ్స్ దేనికి..? అక్కడా అప్పుడప్పుడూ పేమెంట్స్ చికాకులు ఏమిటి..? చెన్నై మ్యూజిక్ ఆర్టిస్టుల అసోసియేషన్లతోనూ ఈ కంప్లయింట్లు ఏమిటి..? అసలు ఏం జరుగుతోంది..? అసలు టాప్ మ్యూజిషియన్లకూ ఈ ఆర్థిక కష్టాలు ఏమిటి..?

చిన్న చిన్న అప్‌కమింగ్ గాయకులతో వందల ట్రాక్స్ పాడించుకుని పైసా ఇవ్వకపోవడం ఏమిటో అర్థం కాదు… రోజువారీ పేమెంట్లతో బతుకులు గడిపే ఆర్టిస్టుల మాటేమిటి..? గట్టిగా అడగలేరు, అడిగితే మళ్లీ పిలవరు… రిహార్సల్స్, పర్‌ఫామెన్స్ కలిపి కచేరీకి ఇంత అని మాట్లాడుకుని, అదీ సరిగ్గా ఇవ్వరు… ఎందరు అలా తిరుమల వెళ్లి స్వామి వారికి ఫిర్యాదు చేయగలరు పాపం..?

రాయల్టీ కుప్పలుగా వచ్చిపడుతూ గీత రచయితలు బాగానే ఉన్నారు, ఆనందంగా… ఇళయరాజా అయితే చిన్నాచితకా దర్శకులు పాపం తన పాటల్ని హమ్ చేస్తున్నట్టు కనిపించినా సరే, ముక్కుపిండి, కోర్టుకు ఈడ్చి రాయల్టీ వసూలు చేస్తున్నాడు కదా బాగానే… మరేమిటి ఈ కళాదోపిడీ తెలుగు సినిమా సంగీత పరిశ్రమలో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తమన్ ఏమిటిది..? శివమణి ఏదో అంటున్నాడు..? ఏం జరుగుతోంది..?
  • రామాయణం నాకు ఎక్కడ నచ్చింది..? ఎక్కడెక్కడ నచ్చలేదు..?
  • సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!
  • రామాయణం… ఓ గ్రాండియర్..! మహారాజసం… పాన్-వరల్డ్ వైభవం !!
  • ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!
  • ఓ వైరల్ పోస్టు- అంబానీల ఫోటోలు- సంధించిన ఓ విలువైన ప్రశ్న!!
  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions