Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామాయణం నాకు ఎక్కడ నచ్చింది..? ఎక్కడెక్కడ నచ్చలేదు..?

November 6, 2026 by M S R

.

(  By డాక్టర్ మనోహర్ కోటకొండ  )…….. ఆనిమలుడు కాదు- అయోధ్యరాముడే… ఉదయాన్నే నాలుగు ఐదు రివ్యూలు చూశా… పూర్తిగా నెగటివ్ రివ్యూలు.. ఈ సినిమా ఇంకేం చూస్తాం.. ఓటీటీలో చూస్తే చూడాలి.. లేకపోతే ఆది పురుష్ లాగా మరిచిపోవాలి అనుకున్నాను. యాక్సిడెంటల్ గా ఫ్రెండ్ టికెట్ బుక్ చేసి, తను పోలేక నాకు ఇచ్చాడు.. మొహమాటంతో వెళ్లాల్సి వచ్చింది.. అసలే నెగిటివ్ మూడ్.. సీతగా సాయి పల్లవి సరిపోలేదు.. రణబీర్ కపూర్ రాముడిగా చెక్క మొహంతో ఉన్నాడు. రెహమాన్ సంగీతం గురించి అందరూ చెప్పిన ఒక నెగటివ్ ఇంప్రెషన్.. ఇలా డల్ మూడ్ లో వెళ్లాను.

సినిమా హాల్లోకి వెళ్లిన అరగంటకే అర్థమయిపోయింది అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ విజువల్ గ్రాండియర్ చూస్తున్నానని. పాత్రలు ఎంత మేరకు ఉండాలో అంత మేరకే.. స్వభావం ఎలా ఉండాలో అలాగే ప్రవర్తిస్తూ.. మనం చూసిన దశరధుడు మనం చూసిన వశిష్ట విశ్వామిత్రులు.. కైకేయి మంధరలు లేరు.. మనం చూసిన దిగ్గజ నటుల ప్రవర్తన కూడా లేదు.. ముఖ్యంగా రాముడి గురించి.. అతను విష్ణు అవతారమని మనల్ని మొదటే ట్యూన్ చేసే మేఘాలలో పాటలు పాడుకుంటూ తిరిగే నారదుడు.. ప్రతి ఒక్క పాత్ర రాముడు విష్ణువే అని తెలిసి ప్రవర్తించే పద్ధతి.. ఇవేవీ లేవు.. అతను మానవుడిగా అవతరించాడు . మానవుడిగానే ప్రవర్తిస్తున్నాడు.

Ads

రాముడిగా రణబీర్ కపూర్ ఎంత చక్కగా ఉన్నాడో. కిరీటంతో ఉన్న యువరాజు కంటే… వనవాసిగా ఆయన ఆహార్యం బాగుంది. అప్పటి నుంచే మనకు కపూర్ గారు నచ్చుతారు. అవతారానికి ఉన్న విశేష లక్షణాలు, తండ్రి ఆజ్ఞ పరిపాలించడం ఇచ్చిన మాట జవదాటకపోవడం, సీతారాముల ఆత్మీయ సన్నివేశాలను చాలా సూక్ష్మంగా సున్నితంగా ఆవిష్కరించారు కపూర్ గారు.

మిథిల యువరాణిగా బాల్యం నుంచే కత్తి సాము తెలిసిన జానకిగా మనకు ఎప్పుడూ పరిచయం కానీ సీతను ఆవిష్కరించారు.

మొదట అడవిలో రాక్షసులు వచ్చేసరికి తప్పించుకునేందుకు రామలక్ష్మణులతో పాటు సీతమ్మ వారు కూడా పరిగెత్తడం తెలుగు రామ కథల సినిమాలతో ట్యూన్ అయిన మన బ్రెయిన్ కు అస్సలు నచ్చదు.. కానీ ఆమె మానవ వనిత.. ఆపద వచ్చినప్పుడు భర్తతో కలిసి పరిగెత్తడం సహజమే కదా.. అనిపించాక అరే, సరిగ్గానే ఉంది అనిపించింది..
మిథిల యువరాణి అయోధ్య మహారాణి కత్తి సాముతో రాక్షసులను రామలక్ష్మణులతో పాటు ధీటుగా చీల్చి చెండాడేస్తుంది.

సాయి పల్లవి సీతగా బాగున్నారు. ఆమె డాన్స్ స్పీడ్ అంతా కత్తి ఫైటింగ్ లో ప్రదర్శించింది.
లక్ష్మణుడి చెణుకులు కొన్ని ఉన్నాయి. అవి బాగున్నాయి. పాత్రధారి చాలా బాగా చేశారు.

బాల కాండలో అహల్య ఎపిసోడ్ లేదు.. గుహుడు కూడా పడవ ఎక్కించి పంపించేస్తారు. అంతే… ఆయన రామావతారం అని మనకు మరీ మరీ చెప్పించే సన్నివేశాలు ఇవి. రాముడి పాత్రను హై లైట్ చేసే సన్నివేశాలు కూడా ఇవే. ఆయనే కథానాయకుడు అని మనకు తెలిసేది కూడా అప్పుడే.

ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే రావణాసురుడి ఎపిసోడ్ పూర్తిగా కేజిఎఫ్ బాహుబలి అడుగుజాడలలో మొదటి నుంచి నడుస్తుంది . దానితో మనకు రావణాసురుడు హీరోలాగా కనబడతాడు. రావణాసురుడి పాత్ర హీరోయిక్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రాముడిని పరిచయం చేస్తారు. అప్పుడు హీరో ఎవరు అనిపిస్తుంది. అందుకే అహల్య గుహడు ఎపిసోడ్లు పూర్తిగా ఉంటే బాగుండేది. ఇలా హీరో, విలన్ పాత్రలను రచించకుండా ఉంటే బాగుండేది.

ఇక.. ఎవరికీ తెలియదు ఒక్క రావణాసురుడికి మాత్రమే విష్ణువు మానవుడిగా అవతరించాడని తెలుస్తుంది. ఇది బాగుంది. రాముడు ఏ హైప్ లేకుండా కథ వెంబడి నడిచిపోతూ ఉంటాడు. అది బాగుంది.

ramayana

జటాయువు మొదటి నుంచి చాలా సన్నివేశాల్లో రాముడితో సన్నిహితంగా కనబడుతూనే ఉంటాడు. ఇది మరీ మరీ బాగుంది. ఎందుకంటే మొదటి భాగం ముగింపులో జటాయువు ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. ఆ సంభాషణలు గొప్పగా హృద్యంగా ఉన్నాయి. దశరధుడికి ఏమని చెప్పమంటావు? అన్న జటాయువుకు రాముడి సమాధానం హైలైట్.
ఏఐతో లిప్ సింక్ చేసి పూర్తిగా వారు అచ్చమైన తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. చివరికి జటాయువు కూడా రాముడితో మానవుడు మాట్లాడినట్లే పెదవులు కదలిక ఉంటుంది. అది బాగుంది.

నటన విషయానికొస్తే యష్ పాత్ర హీరోయిక్ పరిచయం అవుతుంది కాబట్టి ఆయన ఇరగదీశాడు.
మ్యూజిక్ మనకు ఏమీ గుర్తు ఉండదు . కానీ సన్నివేశాలతో ప్రయాణం చేస్తుంది . ఇది నచ్చింది. సన్నివేశాలలో ప్రత్యేకమైన బిజిఎంలు చూసిచూసి అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు అందుకే సంగీతం నచ్చలేదనుకుంటా. కానీ ఇలా ఉండడమే బాగుంది.

రాక్షసుల హింసా ప్రవృత్తి ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి రావణాసురుడి పాత్ర పరిచయ సన్నివేశాలలో మనకు వారిపట్ల సింపతి కలుగుతుంది. రావణాసురుని తల్లిగా శోభన గారు బిడ్డను ఉత్తేజపరిచే మార్గదర్శకత్వం నెరిపే అధ్యాపకురాలిగా సన్నివేశాలను వ్రాయడం చాలా బాగుంది. ఆమె చాలా బాగా చేశారు. నాట్య శాస్త్రం తెలిసిన వారు కదా, హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.

రాక్షసులు మాయా రూపులు. అందుకే తొలిసారి అడవిలో రామలక్ష్మణులతో యుద్ధం చేసే మారీచ సుబాహులు చెట్ల రంగులో కలిసిపోయి వినూత్న అనుభూతిని కలిగించారు. ఎక్కడా మనం గ్రాఫిక్స్ చూస్తున్నాము అనిపించలేదు. ముఖ్యంగా అడవిలో రాక్షసులతో యుద్ధాన్ని.. సుడిగాలిలో చిక్కుకున్న రామ లక్ష్మణ సీతలు సుడిగాలిని తట్టుకునే సన్నివేశం.. రావణ జటాయువు యుద్ధం అద్భుతంగా ఉన్నాయి. ఆ టీమ్ కు అభినందనలు.

మొత్తానికి ఈ రామాయణం బాగుంది. ఏ నెగటివ్ మూడ్ లేకుండా వెళ్లండి.. రామాయణాన్ని చూడాలి.. అనుభవించాలి అనుకున్నా వాళ్లకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందిస్తుంది ఈ సినిమా.

రెండే రెండు అసంతృప్తి కలిగించే అంశాలు నాకున్నాయి. ఆరవ అవతారం అయిన పరుశరాములు ఏడవ అవతారమైన రాముల వారికి నమస్కరించడం ఏమాత్రం నచ్చలేదు. డ్యూటీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనం వారికి బాధ్యతల అప్పచెప్పుతాము అంతే.. ఇలా మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి నమస్కరించము. ఏమో మరి . కానీ రీసెర్చ్ వర్క్ చేసిన బోధిసత్వ గారి కృషిని శంకించలేము.

ఇక రావణాసురుని హీరోయిక్‌గా చూపించి .. ఆయనే విలన్ అంటే మనకు నచ్చదు. చెల్లెలిని ఇన్సల్ట్ చేసిన వారిని దండించే వాడిగానే కనపడతాడు. మహావిష్ణువు మానవ రూపంలో రాముడిగా వచ్చాడు. సహనమా సమరమా అన్న సన్నివేశం.. పది తలల రావణుడిని పది భావాల రావణుడిగా చెప్పడం అద్భుతమైన దర్శక ప్రతిభ. ఈ సన్నివేశాలలో యష్ నటన పతాక స్థాయిలో ఉంది.

అందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా చూడండి. మారుతున్న కాలంలో .. అత్యంత ప్రమాదకరమైన హింసా ప్రవృత్తి యువతలో పేట్రేగిపోతున్న ఈ సమయంలో .. విలువలను చెప్పే రామాయణం రావడం ఆహ్వానించ దగ్గ విషయం. ఎందుకంటే విలువలే నిజమైన హీరోఇజం అన్న విషయం యువతకు అర్థం అవుతుంది….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రామాయణం నాకు ఎక్కడ నచ్చింది..? ఎక్కడెక్కడ నచ్చలేదు..?
  • సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!
  • రామాయణం… ఓ గ్రాండియర్..! మహారాజసం… పాన్-వరల్డ్ వైభవం !!
  • ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!
  • ఓ వైరల్ పోస్టు- అంబానీల ఫోటోలు- సంధించిన ఓ విలువైన ప్రశ్న!!
  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions