.
Aluru Bala Venkateswara Rao…పేరు ఇలా రాస్తే ఎవరూ గుర్తుపట్టరు… ఏబీ వెంకటేశ్వరరావు అనే రాయాలి… లేదా ఏబీవీ… ఈ మాజీ పోలీసు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు కదా… తన వాల్ మీద కనిపించిన ఓ పోస్టు ఆసక్తికరంగా ఉంది… చదవండి…
సోనియా గాంధీ రాసుకున్న ఆత్మకథ – Belonging, A Journey of Love చదివాను. 502 పేజీలు. ఒక రోజంతా పట్టింది. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలలో వాస్తవమెంతో తెలిసింది. చాలా అనుమానాలు కూడా తీరిపోయాయి.
Ads
అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవాలివి: ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పార్సీ. ముస్లిం కాదు. ఫిరోజ్ గాంధీకి, మహాత్మా గాంధీకి ఏమీ సంబంధం లేదు. మహాత్మా గాంధీది పోర్ బందర్. ఫిరోజ్ గాంధీ పూర్వీకులది సూరత్.
రెండూ రేవు పట్టణాలే కానీ వాటి మధ్య 600 km దూరం. ఫిరోజ్ గాంధీ తండ్రి జహంగీర్ గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆర్మీ ఇంజనీరు. యుద్ధ సమయంలో కుటుంబాన్ని అలహాబాదు పంపాడు. అక్కడే ఇందిరా గాంధీ పరిచయం.
పూర్వీకులు అత్తరు వ్యాపారంలో ఉండడంతో Sugandh- సుగంధ్ నుంచి సుగంధీ, గాంధీ అయింది తప్ప మహాత్మా గాంధీ దత్తత తీసుకుని గాంధీ పేరు అరువు ఇవ్వలేదు. రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ లో ట్రినిటీ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సోనియా ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇటలీ నుంచి వెళ్ళింది.
అక్కడ పరిచయం ప్రేమగా మారింది. ఆమె తండ్రి ఒప్పుకోలేదు. మరో చరిత్ర సినిమాలో లాగా సంవత్సరం విడదీసి ఉంచాక ఆమెకు 21 సంవత్సరాలు నిండాక పెళ్లి చేసుకున్నారు. ఆమె బార్ డాన్సర్ కాదు. హోటల్ లో waitress అంతకన్నా కాదు. రాజీవ్ తర్వాత లండన్ ఇంపీరియల్ కాలేజ్ లో చేరాడు.
ప్రధాని కొడుకు అయి ఉండి కూడా పాకెట్ మనీ కోసం construction కూలీగా కూడా అప్పుడప్పుడూ పని చేశాడు. ఆ రోజులు వేరు
సోనియా మొదటి బిడ్డ (కొడుకు) 7 వ నెలలోనే జన్మించి పురిట్లోనే పోయాడు. అప్పట్లోని ఒక బత్తాయి పత్రిక “Indira failed to become grandmother of a bastard child” అని రాసింది. అంటే బత్తాయితనం కొత్తగా వచ్చింది కాదు, దానికి చాల ‘ఘన’ చరిత్ర వుంది.
మనేకా గాంధీ కొడుకు పేరు ఫిరోజ్ వరుణ్. (మూడు సార్లు బీజేపీ MP గా చేసాడు, ఇప్పుడు కనుమరుగయ్యాడు). ఇందిరా గాంధీ తన శవాన్ని హిమాలయ శిఖరాల మీద మంచులో జారవిడవాలని కోరింది. ఆమె కోరికను మన్నించలేదు.
రాజీవ్ తన విల్లులో తన, తన భార్య సోనియా శవాలను ఢిల్లీలో దహనం చెయ్యాలని, తన కొడుకు రాహుల్ చితికి నిప్పంటించాలని రాసాడు. బోఫోర్స్ కేసును రాజీవ్ మీద ఏ మాత్రం సాక్షాలు లేవని ఢిల్లీ హై కోర్టు 2004 ఫిబ్రవరి (బీజేపీ హయాంలోనే) quash చేసింది.
రాజీవ్ తెచ్చిన పంచాయతీ రాజ్ బిల్లు రాజ్య సభలో 3 ఓట్ల తేడాతో వీగి పోయింది. తర్వాత 1992 లో PV గారి టైం లో పాస్ అయింది. సోనియా 1980 లలో భారతీయ పౌరసత్వం తీసుకుంది. 1997 లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంది.
అప్పటికే పార్టీ మూడు ముక్కలై, పతనావస్థకు చేరింది. అక్కణ్ణుంచి 2004 విజయానికి చేర్చింది సోనియానే. సోనియా ప్రధాన మంత్రి కాకపోవడానికి కారణం అబ్దుల్ కలాం అభ్యంతరమో, చట్ట, రాజ్యాంగ పరిమితులో కాదు. అది కేవలం ఆమె నిర్ణయం. వద్దనుకుంది, పిల్లలిద్దరూ కూడా ససేమిరా వద్దు అన్నారు. అంతే.
UPA హయాం లో ఫైళ్లు తెప్పించుకునేది అనేది పూర్తి అబద్ధం. UPA chairperson గా Rotterdam లో pancreas లో కంతికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కేవలం పిల్లలు, చెల్లెళ్ళే చూసుకున్నారు. ప్రియాంక తల్లి బెడ్ పక్కన నేల మీద పడుకునేది. (అక్కడ అటెండర్ లకు బెడ్లు వుండవు) ఆమె ‘కాంగ్రెస్ కీ విధవా’ కాదు, దేశం కోసం విధవరాలైంది
(పుస్తకం లో ఎక్కడా YSR, జగన్ రెడ్డి, చంద్రబాబు, తెలంగాణా, కెసిఆర్ ప్రస్తావన లేదు)

Share this Article