Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!

November 26, 2026 by M S R

.

నిన్న సినిమాలకు సంబంధించిన సోషల్ మీడియా, మీడియా, యూట్యూబ్ చానెళ్లు ఓ విషయాన్ని ప్రధాన వార్తగా ప్రసారం చేసి పండుగ చేసుకున్నాయి, మురిసిపోయాయి… వైరల్ చేసుకున్నాయి… మనవాళ్లు ఇంకా ఇంకా వ్యక్తిపూజలో ఎలా ఆరితేరారో ఇదంతా స్పష్టం చేస్తోంది… ఆ వార్తలు, ఆ ఫోటోలు, ఆ కథనాల సారాంశం ఏమిటో తెలుసా…

శీర్షిక: అప్పుడే బడిబాట పట్టిన ‘మెగా’ వారసురాలు.. వైరల్ అవుతున్న చరణ్-ఉపాసన వీడియో! కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా! మొన్ననే మెగా ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని సంబరాలు చేసుకున్నట్లుంది, అప్పుడే ఆ చిన్నారి స్కూల్ గేటు దాటే వయసుకు వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లిన్ కారా తాజాగా స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుంది.

Ads

రెండేళ్ల పాటు కెమెరా కళ్లకు చిక్కకుండా దాచిపెట్టి, ఈ జూన్‌లోనే పాపను పరిచయం చేసిన ఈ జంట.. ఇప్పుడు ఏకంగా బడిలో చేర్పించే పనిలో పడ్డారు. గత దసరాకే అక్షరాభ్యాసం కానిచ్చేయగా, తాజాగా కార్తీక పౌర్ణమి మంచి రోజు అని చూసి స్కూల్‌లో జాయిన్ చేయించారు. అయితే క్లాసులు మాత్రం వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే షురూ కానున్నాయి.

క్లీన్ కారా

స్కూల్ ఆవరణలో చరణ్ తన కూతురిని ఎత్తుకుని నడుస్తుంటే, పాప చిరునవ్వులతో ఉపాసన వైపు అడుగులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కవలలు కూడా తోడవడంతో మెగా ఫ్యామిలీలో సందడి మామూలుగా లేదు. వీడియో చూసిన అభిమానులు మాత్రం “అప్పుడే క్లిన్ కారా స్కూల్‌కు వెళ్లిపోతుందా?” అని ఆశ్చర్యపోతున్నారు…



ఓ పోస్టు కింద ఓ నెటిజన్ పరుషంగా ఇలా రాశాడు… ‘‘పాప కారు దిగింది, పాప టాయిలెట్ పోసింది, పాపకి వేరే డైపర్ వేశారు, ఈ వార్తలు ఎవడికి ఉపయోగంరా బేవార్స్… ఇది అందరు తల్లిదండ్రులు చేసేదే కదా… ఇదొక వార్తా..? ప్రపంచంలో ఎవరికీ పిల్లలు పుట్టలేదా..? ఎవరూ స్కూళ్లలో జాయిన్ చేయలేదా…?’’



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాప స్కూల్లో చేరితే బ్రేకింగ్ న్యూసా..? సెలబ్రిటీ ఆరాధనలో ‘అతి’…!
  • ఆకాశంలో ఒక తార… ఇది మన పాలకొల్లు జాహ్నవి కథేనా..?
  • ‘‘గాంధీ ఇంటిపేరు సుగంధీ నుంచి… రాజీవ్ కూలిపని చేసేవాడు’’
  • ఈ ఇద్దరు నటడాక్టర్లు కలిసి ఎంత షో చేసినా… చివరకు బొమ్మ ఫ్లాపే..!!
  • తెలంగాణ కర్రసాముకు జాతీయ గుర్తింపు! ఖేలో ఇండియాలో చేర్పు!!
  • జోసెఫ్ విజయ్ తెలివైన డ్రామా- ఏకంగా సుప్రీంకోర్టుకే బురిడీ…
  • రాహుల్ చెప్పబోయే పేర్లు ఎవరివి..? గుర్తొస్తున్న చంద్రస్వామి పాత కథ !!
  • ఏకంగా అమెరికా భద్రత వ్యవస్థల్లోకే జొరబాటు..! ఏదో పెద్ద మిస్టరీ !!
  • విజయ్- త్రిష బంధం ఓకే… మరి మధ్యలోకి ఉదయనిధి ఎందుకొచ్చాడు?!
  • చిరంజీవికి ఎవరూ చెప్పినట్టు లేదు- ఆ ‘వర్స్’ అనే పదమే అశుభసంకేతం!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions