.
మళ్లీ నంబర్ గేమ్ మొదలైంది… మోదీ కాదు గానీ, అమిత్ షా మరోసారి తన రాజకీయ బేరసారాల సామర్థ్యానికి పెద్ద పరీక్ష పెట్టుకుంటున్నాడు… ఇంతకుముందు మ్యాచులో ఓడిపోయాడు కదా, ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ సాధించి తీరాలని, పార్లమెంటు సమావేశాల్ని ప్రొరోగ్ చేయకుండా, ఇప్పుడు మళ్లీ బిల్లు పెట్టబోతున్నాడు…
చాలా కీలకమైన బిల్లు కాబట్టి మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటే మ్యాచ్ గెలవడు… కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్టు ఖండితంగా చెప్పేసింది… ఇప్పుడు ప్రశ్న… కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ప్రదర్శించబోయే వైఖరి… ఈ నెంబర్ గేమ్‌పై, వర్తమాన రాజకీయాలపై నేషనల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది…
Ads
ప్రస్తుతానికి ఊహాగానాలే కావచ్చు… టైమ్స్ నౌ కథనం ఒకటి ఇంట్రస్టింగు… మరీ వాస్తవదూరంగా ఏమీ లేదు, అఫ్‌కోర్స్, అలా జరగాలనీ లేదు… రాజకీయాలు అంటేనే డైనమిక్ కదా… సరే, మనమూ ఓసారి ఆ కథన సారాంశం చదువుదాం…

.
పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా… ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఆర్జేడీ (RJD) గైర్హాజరు కావచ్చని లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండవచ్చునని ఓ అంచనా… తద్వారా ప్రభుత్వానికి కావలసిన సంఖ్య తగ్గుతుంది…
ఇండి కూటమిలోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ రాజకీయ ధోరణికి భిన్నంగా తమ తమ రాజకీయ సమీకరణాల మేరకు స్వతంత్రంగా, అంటే, కూటమి కట్టుబాటు అనేది లేకుండా వ్యవహరించే అవకాశాలున్నాయి… కాంగ్రెస్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే సీన్ కనిపించడం లేదు…
వాటిల్లో ప్రధానమైనవి పార్లమెంటులో కాసిన్ని సీట్లు ఉన్నవి… ఆప్, ఆర్జేడి, ఎస్పీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, శరద్ పవార్ పార్టీ, ఉద్దవ్ ఠాక్రే పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్… వీళ్లంతా ఏ వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరం… ఎందుకు అనే విశ్లేషణలు, చర్చలు సాగుతున్నాయి..,
ఒకవేళ అవి కాంగ్రెస్ కూటమి ధోరణికి భిన్నంగా ఉంటే… లెక్కలు ఇలా ఉంటాయి…
అంతకు ముందు బిల్లుకు మద్దతు ఇచ్చిన NDA బలం : 298
TMC తిరుగుబాటు ఎంపీలు: +20
శివసేన తిరుగుబాటు ఎంపీలు: +6
SAD: +1
DMK: +22
NCP (SP): +8
YSRCP: +4
మొత్తం ఓట్లు : 359
ఆప్, RJD గనుక ఓటింగ్‌కు దూరంగా ఉంటే… బిల్లు ఆమోదానికి అవసరమైన ఓట్లు: 356
అంటే ఈ అంచనా లెక్కల ప్రకారం, అవసరమైన మెజారిటీ కంటే 3 ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది!
ఒకవేళ SP, JMM కూడా ఓటింగ్‌కు దూరంగా ఉంటే బిల్లు ఆమోదానికి కావల్సిన సంఖ్య ఇంకా తగ్గుతుంది. Sp, JMM రెండూ కలిపి 40 సీట్లున్నాయి…
సో, అదే జరిగితే … ఓటింగ్‌లో మిగిలే సభ్యులు 493… కావలసిన 2/3 మెజారిటీ 329… సమకూరే ఓట్లు 359… అంటే కావలసిన దాని కంటే 30 ఓట్లు ఎక్కువ వస్తాయి… అన్నీ ఇలాగే జరగాలని ఏమీలేదు… ప్రధానంగా సౌత్ పాలిటిక్స్ చూడాలిప్పుడు…
డీలిమిటేషన్ వల్ల సౌత్ నష్టపోతుందనే వాదన చాన్నాళ్లుగా ఉన్నదే, దానికి సహేతుక కారణాలూ ఉన్నాయి… ప్రొరేటా ప్రకారం అందరికీ 50 శాతం పెంచుతామనే ప్రభుత్వ పార్టీ వాదనకు ఏయే పార్టీలు సరేనంటాయో చూడాలి… టీడీపీ, జనసేన ఎలాగూ ఎన్డీయే… వైసీపీ వ్యతిరేకించకపోవచ్చు… దాని కారణాలు దానికున్నయ్…
బీఆర్ఎస్ పెద్ద లెక్కలోకి రాదు, దాన్ని తెలంగాణ జనమే కాదు, ఇతర పార్ఠీల నేతలు కూడా వదిలేశారు… డీఎంకే ధోరణిపైనే అందరికీ ఇప్పుడు ఆసక్తి… మంచి సంఖ్యాబలం ఉంది, కానీ అది తమిళ స్థానిక రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌కు దూరమైంది… సో, కాంగ్రెస్ కూటమి ధోరణికి అది కట్టుబడి ఉండాల్సిన అవసరమే లేదు… స్టాలిన్ వైఖరితో నంబర్ గేమ్‌ను ఇంకాస్త రక్తి కట్టించొచ్చు..!!
వర్తమాన జాతీయ రాజకీయాల్లో చాణుక్యుడిగా పిలవబడుతున్న అమిత్ షా అది నిజమేనని నిరూపించుకుంటాడా..?
Share this Article