.
Pardha Saradhi Upadrasta … దీపం వెలిగించకూడదన్న నిర్ణయంలో అర్చకుల ప్రమేయం ఉందని కలెక్టర్ చెప్పింది నిజమేనా? అర్చకుల లేఖతో అసలు విషయం బట్టబయలు!
తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో మరో కీలక పరిణామం!
తమ పేర్లను దుర్వినియోగం చేసి, దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అర్చకులు ముందుకు రాలేదని కలెక్టర్ పేర్కొనడాన్ని స్థానిక అర్చకులు తీవ్రంగా ఖండించారు.
Ads

అర్చకులు సంతకాలతో విడుదల చేసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్న అంశాలు:
ఈ ఏడాది కార్తీక దీపం విషయంలో తాము ఎలాంటి లేఖను ఆలయ అధికారులకు ఇవ్వలేదు. దీపస్తంభం వద్ద దీపం వెలిగించే అంశంపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. తమను సంప్రదించకుండానే, తమ పేర్లను చేర్చి ఆలయ బోర్డు ప్రకటన విడుదల చేయడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపారు.
మరి కలెక్టర్ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరణలో అర్చకుల పేర్లను ప్రస్తావించడానికి ఆధారం ఏమిటి?
చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించవచ్చని ప్రభుత్వం భావించిందా? న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా, అర్చకుల అభిప్రాయాలను సాకుగా చూపించే ప్రయత్నం చేసిందా?

ఇప్పుడు అర్చకుల సంతకాలతో కూడిన లేఖ ఈ వాదనల విశ్వసనీయతపైనే తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సుప్రీంకోర్టు ముందు సమర్పించిన వివరణలో అర్చకుల పేర్లను ఎలా ఉపయోగించారు? అసలు వాస్తవాలు ఏమిటి? దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ధర్మాన్ని, సంప్రదాయాలను, న్యాయస్థాన ఆదేశాలను మించిన అధికారం ఎవరికీ లేదు!
మురుగన్ కొండపై ధర్మమే గెలవాలి!
వేల్! వేల్! మురుగన్!
— ఉపద్రష్ట పార్ధసారధి
Share this Article