.
వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిల బెంగుళూరు యలహంక ఇంటి పంచాయితీ గురించి… ఆ భవనాల వైభోగం గురించి… షర్మిల బిడ్డ పెళ్లివేదిక గొడవ గురించి… చాలామంది చాలా రాశారు… కానీ చట్టపరంగా ఆ ఇళ్లు ఎవరివి..? జగన్ భార్య భారతీరెడ్డి యాజమాన్యం ఎలా సమకూరింది..? షర్మిల వాదన, విజయమ్మ శోకం ఎలా వీగిపోయాయి..? ఎవరూ వివరంగా రాసినట్టు అనిపించలేదు ఈరోజు దాకా…
ప్రత్యేకించి ఆ ఇళ్ల నిర్మాణం, ప్రస్తుత పంచాయితీ దాకా క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం మోడస్ ఆపరెండిని సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఎవరూ రాయనట్టు అనిపించింది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊరుకోడు కదా… జగన్ మీద ఏమాత్రం అవకాశమొచ్చినా సరే టన్నుల కొద్దీ రాయడానికి ఇష్టపడే తను ఈరోజు ఆ మోడస్ ఆపరెండిని రాసుకొచ్చాడు…
Ads
అఫ్కోర్స్, అసలు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈ భవనాలను ఎందుకు చేర్చలేదు..? ఇకనైనా దర్యాప్తు చేయాలనీ తనదైన శైలిలో కామెంట్లు కూడా విసిరాడు… అది వేరే సంగతి… తను అలా రాయకపోతేనే ఆశ్చర్యం… చెల్లె బిడ్డ పెళ్లికి భవనం ఇవ్వకపోవడం మీద జనానికి జగన్ మీద ఏహ్యభావం ఏర్పడిందట…
పైగా చివరలో ఓ నవ్వొచ్చే కామెంటూ జతచేశాడు… ‘‘అప్పనంగా వచ్చిపడిన ఆస్తి కోసం జగన్‌రెడ్డి ఇంతలా ఎందుకు పట్టుపడుతున్నారో తెలియదు’’ అని రాశాడు… హహహ, చివరకు చంద్రబాబు, కేసీయార్ కూడా అలా ఏదీ వదులుకోడు కదా మాస్టారూ..? అక్రమాస్తులైతేనేం, కాపాడుకునే ఆరాటం సహజమే కదా… ఎవరికైనా..!!

‘‘ఈ భవనాలు ఆ కుటుంబానికి ఎలా సమకూరాయన్నదే ఇక్కడ కీలకం… చట్టపరమైన హక్కు జగన్‌కే ఉన్నప్పటికీ నైతికత అనేది కూడా ఒకటి ఉంటుంది కదా?’’ అంటాడు తను… అంటే, ఆ ప్యాలెస్ జగన్‌దే అని రాధాకృష్ణ కూడా లీగల్లీ వేలిడ్ సర్టిఫికెట్ ఇచ్చేశాడన్నమాట…
సరే, ఆ భవనాల కథ చూద్దాం… (రాధాకృష్ణ ప్రకారం…) ‘‘‘కేరళకు చెందిన నాయర్ కుటుంబం నుంచి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యలహంక వద్ద ఇరవై ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కర్ణాటకలో 2007లో అమలులో ఉన్న నిబంధనలను అధిగమించేందుకు జగన్‌రెడ్డి అత్తగారైన సుగుణ పేరిట ఈ భూమిని కొనుగోలు చేశారు.
కర్ణాటకలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలంటే వారికి దేశంలో మరెక్కడైనా వ్యవసాయ భూమి ఉండాలి. అదే సమయంలో వారు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు. అంటే వ్యవసాయ ఆదాయం తప్ప పన్ను చెల్లించే మరే ఆదాయం వారికి ఉండకూడదు. రాజశేఖరరెడ్డి కుటుంబంలో అందరూ ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారే అయినందున సుగుణ పేరిట కొన్నారు.
అప్పట్లో ఎకరం దాదాపు కోటి రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. ఇందులో అధిక భాగం బ్లాక్ మనీనే. తమాషా ఏమిటంటే ఈ భూమి కొనుగోలుకు అవసరమైన వైట్ మనీని సుగుణకు సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పట్లో ఇచ్చింది.
ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన భీమిశెట్టి రమేశ్‌బాబుతో పాటు జగన్ భార్య భారతిరెడ్డి కూడా ఈ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బును అప్పుగా ఇచ్చిన సిలికాన్ సంస్థకు సుగుణ ఆ భూమిని వెంటనే లీజుకు ఇచ్చారు. అంటే, కర్ణాటక నిబంధనలను అధిగమించడానికి మాత్రమే సుగుణ పేరును వాడుకున్నారన్న మాట. దీన్నిబట్టి ఆ భూమిని వాస్తవానికి కొనుగోలు చేసింది మాత్రం రాజశేఖరరెడ్డి కుటుంబమే.
బిల్డర్ల ద్వారా అప్పు ఇప్పించినట్టు రికార్డుల్లో చూపించి ఈ భూమి కొనుగోలు చేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి ద్వారా సమకూర్చుకున్న ఆస్తులలో యలహంక భవంతులు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి! ఆ భవంతులు జగన్‌రెడ్డి కష్టార్జితం కావు. సుగుణ కష్టార్జితం అంతకన్నా కావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము అది.
తన కుమారుడు జగన్‌రెడ్డి, కుమార్తె షర్మిల కోసం రాజశేఖరరెడ్డి యలహంకలో రెండు భవంతులు నిర్మించి ఇచ్చారు. దాదాపు ఇరవై కోట్లు చెల్లించి ఆ భూమి కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత భారతిరెడ్డి తండ్రి గంగిరెడ్డికి అప్పట్లో లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు సుగుణతో ఆ భవంతులను జగన్‌రెడ్డి కుమార్తెలకు గిఫ్టుగా ఇప్పించారు…’’
…… ఇదీ ఆయన వ్యాససారాంశం… అసలు ఓనర్ (లీగల్లీ) సుగుణ తన మనమరాళ్ల పేరిట గిఫ్ట్ డీడ్ చేశాక ఇక ఆ భవనాలపై సర్వహక్కులూ జగన్ కూతుళ్లవే… ఒక్కొక్కరికి ఒక భవనం… ఆస్తి తగాదాలపైనే కదా షర్మిల అన్నను వ్యతిరేకించి, రాజకీయాల్లోకి వచ్చి, కుటుంబాన్ని బజారుకు లాగుతోంది… ఇంకా చెల్లె, మేనకోడలు వంటి ‘ఎమోషన్స్’ ఎందుకు ఉండాలి జగన్‌కు..? అదీ రాధాకృష్ణ విస్మరించిన కోణం…
పైగా చివరలో అంటాడూ… మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని అంటారు! చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి! అని… అంటే ఏం కోరుకుంటున్నట్టు రాధాకష్ణా..?! ఏ కుటుంబంలో గొడవల్లేవు… నీ అల్లుడిని అడిగినా నీ కుటుంబంలో లొల్లి గురించి చెబుతాడు కదా..?!
Share this Article