Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంబానీ ఎన్నేళ్లు కూర్చుని తినొచ్చు..? మీడియాలో ఓ పిచ్చి లెక్క..!

July 18, 2024 by M S R

ఇలానే ఖర్చు చేస్తే 932 సంవత్సరాల్లో అంబానీ సంపద కరిగిపోతుంది అని ఒక మీడియా సంస్థ లెక్క తేల్చింది . ( వాళ్ళ మీడియా సంస్థ ఈ నెల జీతం ఇస్తుందా ? లేదా ? ఇలానే సాగితే ఎన్ని నెలల్లో మీడియా మూతపడుతుంది అనే లెక్క కూడా వాళ్లే వేస్తే, తేలిస్తే బాగుండు )

బాబూ అప్పారావు, అలా ఖర్చు చేసినా ఏమీ కాదు … ఇంకా పెరుగుతుంది … ఎందుకంటే నీలా వారిది ఆదాయానికి మించిన ఖర్చు కాదు … ఖర్చు కన్నా వేల రేట్లు ఎక్కువ ఆదాయం ఉంటుంది …

చాలా ఏళ్ళ క్రితం ఓ కుర్రాడు వాడి అజ్ఞానాన్ని నాతో పంచుకున్నాడు . అంబానీల ఆస్తి ఎంతో పత్రికల్లో చూసి ఏనాటికైనా అంత సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు … కొంత కాలం అయ్యాక తెలిసిందట … నేను అంబానీ అంత సంపాదించే అంత వరకు అంబానీ అలానే ఉండడు కదా ? అతని సంపాదన ఇంకా పెరుగుతుంది కదా ? అని నవ్వుకున్నాడట …

Ads

ambani

కాబట్టి 932 సంవత్సరాల తరువాత అంబానీ సంపద కరిగిపోతుంది అనే బాధ వదిలేసి ఈ నెల జీతం వస్తుందా ? రాదా ? అనే దానిపై దృష్టి పెట్టడం జర్నలిస్టులకు మంచిది …

సినిమాల్లో హీరోల్లా రిక్షా తొక్కి , మూటలు మోసి సంపాదించరు .. ఒక దశ దాటిన తరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది … అంబానీ చేపట్టిన వ్యాపారాలు అన్నీ దూసుకు వెళ్తున్నాయి … వాళ్ల కంపెనీలు గాడి తప్పకుండా కాపాడుకుంటే చాలు… అంబానీ డబ్బులు పెట్టిన రంగాలు ఎవర్ గ్రీన్ రెవిన్యూ ఓరియంటెడ్… ఏళ్లు గడిచేకొద్దీ వాళ్ల ఆస్తుల విలువ పెరుగుతుంది, అదీ ఆదాయమే… సో, 932 ఏళ్లు అనేది ఓ పిచ్చి లెక్క… శుష్క వాదన…

ambani

మన సామాజిక వర్గమా ? కాదా ? అని చూడరు .. ఏ పనికి ఎవరు సరైన వారు అని చూస్తారు వాళ్లు .. ఎంత జీతమైనా ఇస్తారు … సరైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు … సరైన బృందాన్ని ఎంపిక చేసుకోవడమే అసలైన విజయం .. అనిల్ అంబానీ ఫెయిల్ అయింది అక్కడే . ముఖేష్ అంబానీ ముందు చూపు పనికి వచ్చింది అక్కడే … చూస్తున్నంత వరకు అంబానీల కుటుంబ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి .. ఆ బంధాలు విజయ తీరాలను చేరుస్తాయి .

ముంబైలో ఉన్న మైసూర్ కేఫ్ లోన తను చదువుకునే రోజుల నుంచీ తినడం అలవాటు అని ముఖేష్ అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు .. పెళ్ళికి ఆ మైసూర్ కేఫ్ యజమానిని పిలిచారు … పిలవడమే కాదు, కొత్త దంపతులు ఆ పెద్దాయనకు పాదాభివందనం చేశారు .. ఫేస్ బుక్ లో ఎవరేమన్నా, ఏం విశ్లేషణలు చేసినా … అది చూశాక అంబానీ కుటుంబ బంధం చాలా బలంగా ఉంది, ఉంటుంది, వాళ్లు కొన్ని ఎమోషన్స్ వదిలేసుకోలేకపోవడమే వారి ఉన్నతికి కారణం అనిపించింది …… ( By బుద్ధా మురళి )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…
  • రామ‘దాసుడి నుంచి ఓ పంచముఖ మహాబలిగా పరివర్తన… ఓ పాఠం…
  • అంతటి జయప్రదకు ఆ గంభీర బాధిత పాత్ర… పైగా చంపేశారు…
  • సో వాట్..? దివ్వెల మాధురి ఐతేనేం… టీటీడీకి అంత భయమా..? జడుపా..?
  • గెలిచాం సరే… కానీ ఈ సెమీస్ గెలుపుకీ ఓ పోస్ట్ మార్టం అవసరం…
  • అవును, మేమిద్దరమూ ఒకటే… విజయ్- త్రిష బంధం ఇక బహిరంగమే…
  • ఊగిపోయిన ముంబై… తలెగరేసి మరీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో ఇండియా…
  • టీ20 వరల్డ్ కప్..! కెప్టెన్ అనాలోచిత వైఖరే ఇండియాకు పెద్ద బలహీనత..!!
  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!
  • మానవతా సంస్కారం..! పల్లెలో ఇంకా ‘మంచి మనసులు’ బతికే ఉన్నయ్…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions