Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు సినిమా కథ చెప్పడమే ప్రయాస… ఓ స్టోరీ రైటర్ ట్రబుల్స్ స్టోరీ..!

January 30, 2025 by M S R

.

Priyadarshini Krishna …….. గాంధీ తాత వర్థంతి సందర్భంగా పోస్టు కాదు, నా ఘోష…. నా గోస…

అప్పట్లో… అంటే ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన కొత్తలో ‘ఎవడైతే నాకెంటి… వాఢొట్టి శుంఠ….’ లాంటి అభిప్రాయాలు ఇతరుల మీద వుండేవి.

Ads

తర్వాత తర్వాత కొంత జ్ఞానం వచ్చి- (అనగా తత్వం బోధపడి) ఎవడైనా సరే ‘సార్’ అనేసి, వాడి ఇగోని దువ్వేదాన్ని… పనిమాత్రం మనకి నచ్చిందే చేసేవాళ్ళం …అది వేరేవిషయం

ఇంకొంత కాలానికి మనం సొంతంగా కథలు రాసే టైంకి ఎవడంటే వాడికి నరేషన్ ఎందుకివ్వాలి, అసలు వాడికున్న కోడి బుర్రకి నా సబ్జెక్టు ఎక్కుతుందా అని గీరగా బెట్టుగా వుండేదాన్ని….

తర్వాత కొంతకాలానికి నా కథలు సబ్జెక్టులు కాన్సెప్టులు కొట్టేయడం స్టార్టయ్యాక ఇంక చాలు సీరియస్ గా పని మొదలెట్టాలి అనుకున్నాక అర్థమయింది…. కథ అన్నాక ప్రతి గొట్టం గానికి ప్రతి కోడిబుర్రగానికి ప్రతి సన్నాసికి నరేట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది…..

ఆ క్రమంలో వింత వింత జంతువులు animals ఎదురవుతున్నారు. లాస్టియరు ఒక ఎన్నారై గాడు zoomలో కథ వింటా అన్నాడు. సరే అని లక్షణంగా తయారై కాల్ చేసా… అవతల అరచొక్కాలో (కింద ఏం వేసుకున్నాడో తెలీదు) మాసిన గడ్డంతో ఒళ్ళో ప్లేట్లో బ్రెడ్లు లాంటివి వేసుకుని ఒక చేత్తో ఫోను పట్టుకుని ఒక చేత్తో బ్రెడ్డు నవులుతూ జిడ్డుమొహం వేసుకుని కనపడ్డాడు.

సగం మూడాఫ్ అక్కడే ఐపోయింది… ఇంత ‘ప్రొఫెష్నలిజం’ ఏంట్రా దేభ్యం మొహమా అనుకుని కట్టెకొట్టేతెచ్చేలాగా చెప్పా కథని… ఆ ప్రొడ్యూసర్ పాయే !

మొన్నామధ్య ఇంకోడు కథ చెప్తురు రాండ్రి అంటే పోయా… వాడి ఫ్రెండు గాడు కూడా వచ్చాడు, కాఫీ ఆర్డరిచ్చాక నరేషన్ స్టార్ట్ చేద్దామంటే పక్కనోడు మీకు నానీ తెలుసా, విజయ్ తెలుసా, సమంత ఆముంతా తెలుసా అన్నాడు…. మూడాఫ్ ఐపోయింది… కాఫీ బిల్లు ఫోన్ పే చేసి థూనీ అనుకున్నా…!

శ్రేయోభిలాషి అని టాగ్ వున్న ఒకాయన ఫలానా దగ్గరకి వెళ్ళి కథ నరేట్ చేస్తారా అండీ అన్నాడు… సర్లే పోదాం.. అని పోతినా అక్కడ ముచ్చటగా ముగ్గురు మూడు ఏజ్ గ్రూపులవారున్నారు. మధ్య ఏజ్ గ్రూపువాడు నేను కార్పొరేట్ జాబ్ కి వచ్చాననే ఫీలింగు తెప్పించి నా కులగోత్రాలు తప్ప అన్నీ అడిగాడు.

ఈ డిటేల్స్ అన్నీ అవసరమా బే అని లోపల నుండి ‘నల్లచీర ప్రియదర్శిని’ అరుస్తున్నా కూడా ‘ఇగో అగో’ అన్నీ మూటకట్టి నేనెవరో వివరంగా చెప్పి సర్‌ సర్లే అని ముభావంగా నరేషన్‌ మొదలెట్టా… మధ్యమధ్యలో ఒకడి తర్వాత ఒకడు యక్షుడి అవతారమెత్తి ప్రశ్నలెయ్యసాగారు. ఛీఛీ ఈ కోడి బుర్రలా నా సబ్జెక్ట్ ని జడ్జ్ చేసేది అని మనసు మొరాయించింది. అది కూడా పాయె…!

మొన్నటికి మొన్న… ఒక ఫ్రెండు టాగున్న ఇంకో గొట్టం ఫోన్‌ చేసి తెలిసిన ఒకరు ప్రాజెక్ట్ అనుకుంటున్నారు మీరు సబ్జెక్ట్ చెప్తారా అన్నాడు. గంటలో వాళ్ళ ఆఫీసులో వున్నా…. ఆ సదరు వ్యక్తి ‘గుప్పెడు మనసు’ సినిమాని అటుతిప్పి ఇటుతిప్పి నాకే చెప్పి ఇది సీరీస్ గా చేద్దాం అనుకుంటున్నా, మీరు స్క్రీన్‌ప్లే డైలాగులు రాసి డైరెక్ట్ చెయ్యాలి అన్నాడు.

ఈ కథ మా అమ్మ కాలేజీ రోజులప్పటిది అని చెప్పి ఆ సినిమా చరిత్ర చెప్పి వచ్చేసా… అది కూడా పాయే …!

వారం క్రితం ఒక ఆడ లేడీ ఫ్రెండు అనబడే పరిచయస్థురాలు కాల్ చేసి ఫలానావాడికి కథ నరేట్‌ చెయ్యొచ్చు కదా అంది. సరేలే చేస్తా… నంబరుంటే ఇవ్వు అన్నాను. ఇస్తా అంది… రెండ్రోజులయింది .. నంబర్ ఇవ్వలేదు…

మెసేజ్ చేసా నంబర్ కోసం, పంపించింది. రెండు నంబర్లు తప్పుగా…! అతని అసలు నంబరు నా దగ్గర వుంది. అసలు ఇస్తుందా లేదా అని టెస్టు పెట్టా… ఇచ్చింది భలేగా…! అట్లుంటరు జనాలు…. చావుతెలివి మనపైనే ప్రదర్శిస్తారు….!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
  • పెను విధ్వంసం సృష్టించగల ఓ భారీ విపత్తు వేగంగా సమీపిస్తోంది..!!
  • ఆ కేన్సర్ స్పెషలిస్టు… రిటైరయ్యాక సిద్ధవైద్యంలోకి..! ఎందుకు, ఎవరు..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions