ఆంధ్రజ్యోతి పత్రికలో ఫస్ట్ పేజీలో ఓ న్యూస్ బిట్ కనిపించింది… ఆశ్చర్యపరిచింది… సాక్షి ప్రతి అంశాన్నీ చంద్రబాబుకు ముడిపెట్టిన ధోరణిలోనే… ఆంధ్రజ్యోతి తన గొప్పతనానికి కూడా జగన్‌ను తిట్టేసింది… జగన్ ఎంత తొక్కాలని ప్రయత్నించినా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నామని చెప్పుకుంది… ఎందుకొచ్చిన ఈ పిచ్చి ప్రచారవార్తలు డియర్ రాధాకృష్ణ సర్…?
ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త సారాంశం ఏమిటయ్యా అంటే… ఏబీఎన్ ప్రసారాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నాడు… ఐనాసరే జనం ఆదరిస్తున్నారు… జగన్ ధోరణిని చీదరించుకుంటున్నారు… ప్రస్తుతం ఏబీఎన్ రేంజ్ ఏమిటో తెలుసా..? జాతీయ స్థాయిలో న్యూస్ చానెళ్లలో నంబర్ 4… అసలు ఆంధ్రజ్యోతిది ఎంత గొప్పతనమంటే… ఈ సోకాల్డ్ తెలుగు చానెళ్లు ఏవీ కనీసం టాప్ టెన్‌లో కూడా లేవు..,. ఇదీ డప్పు వార్త చెప్పింది…
ఎస్, ఇతర పార్టీ చానెళ్లు సాక్షి, నమస్తే వంటి చానెళ్లతో పోలిస్తే,,, ఎవడూ దేకని ఈటీవీ న్యూస్ చానెళ్లతో పోలిస్తే… ఏబీఎన్ డెఫినిట్‌గా బెటర్… కాస్త కష్టపడితే అది వీ6 చానెల్‌ను కొట్టేయడానికి అడుగు దూరంలో ఉంది… అంటే నాలుగో ప్లేసుకు వస్తుంది… తెలుగు చానెళ్లలో… కానీ ఏబీఎన్ తాము జాతీయ న్యూస్ చానెళ్లలో నాలుగో ప్లేసు అని చెప్పుకుంటోంది… అసలు తెలుగులోనే నాలుగో ప్లేసులో లేదు, బార్క్ రేటింగుల్లో… మరి ఈ నాలుగో ప్లేసు ఎక్కడి నుంచి వచ్చింది… తెలుగు చానెళ్ల రేటింగ్స్ స్థితి ఇదీ… Last 3 wks GRPs Wk 22
Ads
జాతీయ చానెళ్ల ర్యాంకింగ్స్ ఈ లింకు పట్టికలో చూడొచ్చు … All India News Channels…… దీని ప్రకారం బార్క్ రేటింగులను బట్టి… జాతీయ స్థాయిలో ఎన్టీవీ ఏడో స్థానం, టీవీ9 ఎనిమిదో స్థానం… ఏబీఎన్ 26వ స్థానం… అంటే మిగతా చానెళ్లతో పోలిస్తే ఏబీఎన్‌కు ప్రజాదరణ ఎంత ఉందో దీంతో అర్థం చేసుకోవచ్చు…
నో, నో, బార్క్ రేటింగ్స్ కోణంలో కాదు… జగన్ మా చానెల్‌ను అడ్డుకుంటుంటే జనం యూట్యూబులో మా చానెల్‌ను వీక్షిస్తున్నారు… దేశం మొత్తమ్మీద ఇలా యూట్యూబులో ఎక్కువ మంది న్యూస్ చూసే చానెళ్లలో మాది నాలుగో ప్లేసు అని ఆంధ్రజ్యోతి డబ్బు వార్త ఓ వివరణ ఇస్తోంది…
వోకే, అది నిజమే అనుకుందాం… కానీ యూట్యూబ్ న్యూస్ చానెళ్ల వీక్షకుల సంఖ్యను ఎలా తేల్చారు..? వేరే చానెళ్లతో పోల్చిన సర్వే లేదా లెక్క ఎక్కడుంది..? అలా లెక్కలు తేలుస్తున్నారా అసలు..? ఆ ప్రాతిపదిక ఏమిటో, వేరే చానెళ్లతో పోల్చిన ఆ లెక్కాపత్రం ఏమిటో పబ్లిష్ చేయాలి కదా… అది చేయలేనప్పుడు ఈ వార్తకు, ఈ ఘనత ప్రచారానికి విశ్వసనీయత ఏముంటుంది..? ఎలా నమ్మేది..?
తెలుగులో జ్యోతి మూడో ప్లేసు అనేది కరెక్టే… మొదట ఈనాడు, రెండో ప్లేసులో సాక్షి, మూడో ప్లేసులో ఆంధ్రజ్యోతి ఉంటాయని ఏబీసీ వాడే చెబుతున్నాడు… మరే తెలుగు పత్రికకూ ఏబీసీ లేదు, చెప్పుకోవడం అనవసరం… టీవీ బార్క్ రేటింగ్స్ సరే, ఏబీసీ లెక్కలు సరే, యూట్యూబ్ లెక్కలూ సరే అనుకుందాం…
ఆంధ్రజ్యోతి పత్రికది తెలుగులో ఏ స్థానమో చెప్పడానికి మరో లెక్క చెబుతాను… గతంలో అలెక్సా ర్యాంకింగ్ ఉండేది… ఇప్పుడది లేదు… సిమిలర్ వెబ్ ఆధారంగా చూస్తే… ఆంధ్రజ్యోతి కంట్రీ ర్యాంక్ 629… ఈనాడు 116, సాక్షి 483… (నమస్తే తెలంగాణ 1582)… ఇవి ఆయా పత్రికల వెబ్‌సైట్ల ర్యాకింగ్స్…
సో, డిజిటల్, ఏబీసీ, బార్క్… ఏ ప్రాతిపదిక చూసినా ఆంధ్రజ్యోతిది తెలుగు మీడియాలో మూడో ప్లేసు ప్లస్ దానికి దిగువన…. మరి యూట్యూబ్ వీక్షణల ఆధారంగా చెప్పిన జాతీయ స్థాయి నాలుగో ప్లేసుకు ఆధారం ఏమిటి ఆంధ్రజ్యోతీ… దమ్మున్న పత్రిక కదా… ఆ లెక్క ఏమిటో చెప్పాలి మరి… దమ్ముంటే…!!
Share this Article