Jagannadh Goud…….. నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగంలో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”.
2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ లో నోకియా 50% నుంచి 5% వరకు పడిపోయింది. 2011 లో మార్కెట్ విలువ కూడా 90% పడిపోయింది. నిజానికి స్మార్ట్ ఫోన్ మొదట తెచ్చింది నోకియానే. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టంతో టచ్ స్క్రీన్ తెచ్చింది నోకియానే. కానీ సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం టచ్ స్క్రీన్ కాని వాటిల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది,
2008 లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వైపు వెళ్ళాలని చెప్పినా సరే, నాకంటే ఎక్కువ తెలుసా..? అని పై స్థాయి మేనేజ్ మెంట్ & CEO పట్టించుకోలేదు. 2010 లో ఒల్లి పెక్కాని CEO గా తీసేసి, స్టెఫన్ ఎలాఫ్ ని CEO గా చేసారు. అతను 2011 లో నోకియాలో ఆపరేటింగ్ సిస్టంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ని నోకియా ల్యుమియా ఫోన్స్ లో వాడారు. ఆ తర్వాత మొత్తం క్షీణ దశకి చేరుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ 2013 లో నోకియాని అక్వైర్ చేసింది, ఇది ఇంకో పెద్ద మిస్టేక్.
Ads
– జగన్
(వ్యక్తిగత అభిప్రాయం)
Share this Article