Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!

October 21, 2026 by M S R

.

రహస్యవాణి అని ఓ చానెల్… యూట్యూబ్ చానెలే లెండి… అందులో వచ్చే వీడియోల జ్ఞానవ్యాప్తిపై చర్చిస్తే ఒడవదు, తెగదు… ఓ తాజా వీడియోలో (ఫేస్‌బుక్‌లో దాని లింక్‌తో ఓ యాడ్ కాబట్టి నాకు కనిపించింది, అన్యథా భావించకండి…) ఒకాయన మాంసాహారంకన్నా పుట్టగొడుగులు చాలా డేంజర్ అని ఏదో చెబుతున్నాడు…

ఎందుకు డేంజర్, ఆయనేం చెబుతున్నాడనేది వదిలేద్దాం… ఎవరి నమ్మకాలు ఏమిటో వాళ్లకే వదిలేద్దాం… అసలు పుట్టగొడుగుల కథేమిటో తెలుసుకుందాం ఓసారి…

Ads


ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..!

వాస్తవానికి అది మాంసాహారం కూడా కాదు, జంతు జాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం మీద కనిపించే గజ్జి… అదుగో ఆ జాతి… శిలీంధ్రజాలం… ఫంగస్… దాని పేరు పుట్టగొడుగులు..! నో, నో, అది శాకాహారమే అంటారు కొందరు… కానేకాదు, మాంసాహారమే అంటారు ఇంకొందరు…

అసలు అక్కడిదాకా ఎందుకు..? కోడి గుడ్డు ముందా..? కోడి ముందా..? గుడ్డు మాంసాహారమా..? శాకాహారమా..? ఈ ప్రశ్నలకు లోకం ఉన్నంతవరకు జవాబు దొరకదు… సేమ్, పుట్టగొడుగుల మీద ప్రశ్న కూడా అంతే…

సైంటిస్టులు దాన్ని ఫంగీ అనేశారు… కానీ ఆ వర్గీకరణే శుద్ధ తప్పు అనేవాళ్లు కోకొల్లలు… మీకు తెలుసో తెలియదో గానీ, ప్రపంచంలో కనిపించే జీవజాతులు అయిదు రకాలు… అవి… 1) వృక్షాలు 2) జంతువులు 3) ఫంగి 4) మొనెరా 5) ప్రొటొక్టిస్టా…. వృక్షాలు మనకు తెలుసు, జంతువులు తెలుసు… ఈ ఫంగీ కూడా తెలుసు… మరి మొనెరా, ప్రొటొక్టిస్టా..? సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి ఈ చార్ట్ చూడండి… ఇంకా ఆ సైన్స్‌లోకి వద్దు ఇక్కడ…

living things

మరి మన పుట్టగొడుగుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి..? ఎందుకంటే..? మళ్లీ ఏ కరోనాయో మీదపడదని చెప్పలేం కాబట్టి, పాత కరోనా కష్టాలు చూశాం కాబట్టి, డ్రగ్- హాస్పిటల్ మాఫియా మనల్ని దోపిడీ చేస్తుంది కాబట్టి… మనిషి వైరస్‌తో పోరాడాలంటే బలమైన ఇమ్యూనిటీ కావాలి కాబట్టి… ప్రధానంగా విటమిన్ డి, బీ12 వంటివి అత్యవసరం కాబట్టి…

ఈ కాలంలో నగరాల్లో ఉన్నవాళ్లు విటమిన్ డీ కావాలంటే రోజూ అరగంటో గంటో ఎండలో గడపడం సాధ్యమేనా..? ఆ టాబ్లెట్లు మహా ఖరీదు, ఆల్రెడీ డబుల్ చేసేశారు రేట్లు… మటన్, చికెన్, ప్రధానంగా గుడ్లు తినేవాళ్లకు అవి దొరుకుతాయి… కానీ శాకాహార కులాల మాటేమిటి..? పుట్టగొడుగులు..!

కానీ వాటినీ మాంసాహారంగా భావించి కొందరు దూరం పెడతారు… నిజానికి అది మాంసం కాదు, అదొక జీవజాతి, అంతే… అత్యధిక డీ విటమిన్ లభించే సోర్స్ అది… కేలరీలు తక్కువ, కార్బొహైడ్రేట్స్ తక్కువ, ఫ్యాట్ నిల్…, సెలీనియం, ఫాస్పరస్, ఫోలేట్ పుష్కలం…

అన్నింటికీ మించి యాంటాక్సిడెంట్స్… విటమిన్ సి కూడా… స్ట్రెస్ తగ్గిస్తుంది, కేన్సర్ ఫైటర్, గుండె జబ్బులకు దాదాపు ఓ ఔషధం… దాని న్యూట్రిషనల్ విలువ అపారం… అవి చెబుతూ పోతే ఇక్కడ ఒడవదు… సో, ఇమ్యూనిటీ బూస్టర్ అది… మరి మాంసాహారం అంటారు కదా, ఎలా..?

mushroom

నిజానికి దీనికి పత్రహరితం లేదు, సొంతంగా ఫుడ్ తయారు చేసుకోదు.., కుళ్లిన శరీరాల మీద, కుప్పల మీద పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు లేవు అని దీన్ని ఫంగీ కుటుంబంలో చేర్చారు…

కానీ పెద్ద పెద్ద చెట్ల మీద బదనికల సంగతి తెలుసు కదా… అవీ పరాన్నజీవులే, పత్రహరితం ఉండదు, మరి అవి వృక్షజాతిలో ఎలా చేరాయి..? అసలు పుట్టగొడుగులకు జంతుజాలానికి ప్రధాన లక్షణమైన మొబిలిటీయే లేదు కదా, అంటే చలనశీలతే లేదు కదా… మరి మాంసాహారం అని ఎలా అంటారు..?

కేవలం జీవాణువులను గాలిలోకి వెదజల్లి సంతానవ్యాప్తి చేసుకుంటయ్ పుట్టగొడుగులు… సో, నిక్షేపంగా అందరూ తీసుకోవచ్చు… అసలు మాంసమే కాదు అని యావత్ జీవ శాస్త్రజ్జులు చెబుతున్నప్పుడు, ఇంకా మాంసం అని దూరం పెట్టడం దేనికి..? అఫ్‌కోర్స్, మళ్లీ ఇక్కడ కులాచారం, వ్యక్తిగత ఇష్టం, నమ్మకమే ముఖ్యం!

ఇవీ చేపల్లాంటి న్యూట్రిషనల్ ఫుడ్డే… ఐతే ఎక్కువగా వినియోగం వద్దు… పైగా ఏది పడితే అది తింటే విషం… కొన్ని వేల రకాలుంటయ్, అందులో కొన్ని మాత్రమే తినబుల్… (ఐనా ఇప్పుడు హైజినిక్ కండిషన్స్‌లో తినబుల్ రకాల్నే పెంచుతున్నారు)…

సరిగ్గా వండాలే గానీ మటన్‌తో సమానం… (చాలామంది సులువుగా అర్థం చేసుకోలేరని… పుట్టగొడుగుల వర్గీకరణలోని సంక్లిష్టత, వివాదాల గురించి… దాని న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి… ఎక్కువ వివరంగా చెప్పడం లేదు ఇక్కడ…)


సరదాగా ఓ ప్రశ్న… మాంసాహారులు (ఇందులోనూ రకరకాలు), ప్యూర్ శాకాహారులు… ఇవి గాకుండా కేవలం గుడ్లు తప్ప ఇక ఏ మాంసమూ ముట్టని అండాహారులు… కొందరు కంప్లీట్ వీగన్, అంటే డెయిరీ ఉత్పత్తులు కూడా తీసుకోరు… పర్ సపోజ్, ఓ సుబ్బారావు మాంసం తినడు, డెయిరీ వోకే, గుడ్లు తింటాడు, పుట్టగొడుగులు అంటే మహాప్రీతి… తనను ఏ ‘ఆహారి’గా వర్గీకరించాలి..!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆగని పతనం – ప్రపంచ మార్కెట్లలో మరింత సంక్షోభం రాబోతోందా?
  • టెస్లా ఆటోపైలట్ టీమ్‌లో తొలి ఇంజనీర్… ఈ తమిళియన్!
  • ఇక్కడే ఉండిపోయి తప్పు చేశానేమో అనిపించేది అప్పుడప్పుడూ..!!
  • మూడుసార్లు పిచ్చాసుపత్రికి పంపించారు! కట్ చేస్తే… ఓ అద్భుతం !!
  • రావణ తాండవం! రెహమాన్ అందిస్తున్న ఓ సర్‌‘ప్రైజ్ సాంగ్ !!
  • నమ్మకాన్ని బ్రేక్ చేసిన వైసీపీ… ఇది ఎవరికి చెంపపెట్టు ?
  • ప్చ్, వ్యవస్థలో ఎవరూ శుద్దపూసలు కారు- ఈయన అతీతుడేమీ కాదు !!
  • ఇన్నేళ్లకు దొరికింది సరైన పాత్ర..! భేష్, రెచ్చిపోయింది ఈ వరంగల్ పోరి !!
  • నిరాశ ! గాయపడిన ప్రతి బాధితుడి ప్రతి చర్యా న్యాయమైపోదు!!
  • ఒక బొద్దింక నిజాలు మాట్లాడుతోంది… మరో రెండు నోరువిప్పాల్సి ఉంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions