Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆఫ్టరాల్ న్యూటన్… యాపిల్ ఎలా పడుతుందో కనిపెట్టాడు… కానీ ఈ మనిషి…

December 1, 2022 by M S R

నిజానికి చిట్‌చాట్‌కైనా సరే… ఒక రాఘవేంద్రరావు, ఒక దగ్గుబాటి సురేష్, ఒక కోదండరాంరెడ్డి, ఒక అల్లు అరవింద్… వీళ్లు దొరికితే ప్రతి ఒక్కరిదీ విడివిడిగా దున్నేయాలి… ఒక్కచోట కలిపితే మిర్చి బజ్జి, కడక్ జిలేబీ, రగడా సమోసా, చికెన్ కబాబ్ కలిపి ఖైమా చేసినట్టు ఉంటుంది… ఏ టేస్టూ సపరేటుగా తెలియదు… అసలు ఆ కలయికే కుదరదు…

నో, నో, బాలయ్యకు అవేమీ చెప్పొద్దు… అదంతా గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారం… 90 ఏళ్ల తెలుగు సినిమా సందర్భంగా ఆహా స్పెషల్ అంటాడు… 100 ఏళ్ల ఎన్టీయార్ జీవితం అంటాడు… కలగాపులగం, కలగూరగంప చేసేశాడు ఈసారి ఆహా ఎపిసోడ్‌ను… గంట సేపుండే ఎపిసోడ్‌లో ఆ స్టాల్ వార్ట్స్‌తో ఎన్ని రహస్యాలు, ఎన్ని ఆసక్తికర ముచ్చట్లు చెప్పించగలడు..? నిజానికి రాఘవేంద్రరావు ఒక్కడితోనే ఎపిసోడ్-1, 2, 3 లాగించొచ్చు… కానీ ఆ నలుగురినీ కలిపి వాళ్ల టైమ్‌ను వేస్ట్ చేశాడు బాలయ్య…

కొందరికి సిగ్గూశరం ఉండవు… ముడ్డి కిందకు 80 ఏళ్లు వచ్చాయి రాఘవేంద్రరావుకు… సినిమాల్లో తను ప్రవేశపెట్టిన పిచ్చి వేషాల్ని ఇప్పటికీ సమర్థించుకునే తీరు వెగటుగా ఉంటుంది… జనం నన్ను మెచ్చుకుంటున్నారు అనే భ్రమల్లో బతుకుతున్నాడు… రాఘవేంద్రరావు, బీఏ అంటే బొడ్డు మీద యాపిల్ అని పూర్తిపేరు అని అల్లు అరవింద్ కూడా శ్లేషతో కొట్టాడు… పర్‌ఫెక్ట్ సెటైర్… అఫ్‌కోర్స్, తనూ అలాంటి ఎదవ సీన్లు చేయించుకున్నవాడే…

ఈ ప్రస్తావన వచ్చినప్పుడు ఎనభయ్యేళ్ల ముసలితనంలో కాస్త సోయితో మాట్లాడాలి కదా… ఆ న్యూటన్ యాపిల్ పడినప్పుడు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు… నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను అని శరం లేని మాటలు మాట్లాడాడు… నిజానికి అల్లు అరవింద్, సురేష్‌బాబు మీడియాకు దొరకరు… గతంలో చిన్న మాట కూడా మాట్లాడేవాడు కాదుగానీ రాఘవేంద్రరావు ఇప్పుడు మాట్లాడుతున్నాడు… ఇదుగో ఇలాంటి వెకిలి భాషే… పిచ్చి బాలయ్యకు తోచలేదేమో… 90 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా అనే కాన్సెప్టుతోనే ఓ సీజన్ మొత్తం నడిపించాలి… ఇలా నలుగురినీ కలిపి బాదడంకన్నా ఒక్కొక్కరినీ డిటెయిల్‌గా టాకిల్ చేయాలి… అప్పుడు నిజంగా అన్‌స్టాపబుల్ బాగుండేది…

ntr

100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీయార్ అనే కాన్సెప్టు కూడా విడిగా చేయాల్సిన అంశం… తన చరమాంకంలో ఇదే బాలయ్య, ఆయన బావయ్య తదితరులు ఆయనకు చేసిన ద్రోహం గట్రా ఎలా ఉన్నా… తన నటనా వారసుడిగా, తనపై రెండు విఫల బయోపిక్కులు నిర్మించినవాడిగా తను సాధికారంగా రెండు మూడు ఎపిసోడ్లు చేయొచ్చు… చూసేవాళ్లున్నారు… ఐనా నలుగురు ప్రముఖ దర్శకనిర్మాతలను పిలిచి, ఇటు ఎన్టీయార్‌కు గాకుండా చేశాడు ఈసారి ఎపిసోడ్‌ను… అటు వాళ్లకూ సరైన స్పేస్ ఇవ్వలేదు…

ఈ విషయంలో నిజానికి తప్పుపట్టాల్సింది బాలయ్యను కాదు… తన మేరకు తను బాగా చేస్తున్నాడు… కొత్త బాలయ్యను చూస్తున్నాం… కానీ ఎపిసోడ్లను ప్లాన్ చేయడంలో ఆహా క్రియేటివ్ టీం దారుణంగా ఫెయిలవుతోంది… ఆహా ఓటీటీలో సక్సెస్ అయిన షోలలో ఒకటి ఇండియన్ ఐడల్… రెండు అన్‌స్టాపబుల్… మాటీవీలో బిగ్‌బాస్‌ను ఘోరంగా భ్రష్టుపట్టించినట్టుగా… ఈ అన్‌స్టాపబుల్‌ షో మీద ఏమైనా కుట్ర సాగుతోందా అరవిందూ…!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions