నిజానికి సమస్య ఏమిటంటే… రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు… సరే, రాజకీయాల్లో ఉన్నవాళ్లకు అన్నీ తెలియాలని ఏమీ లేదు… కాకపోతే ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని ముందుగా బుర్రకెక్కించుకోవాలి, అదీ సరైన తోవలో… తరువాత దాన్ని రాజకీయ భాషలో ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలుసుకోవాలి…
అదుగో అక్కడే రాహుల్ గాంధీకి వైఫల్యం… తను నిజంగా తెలివైన రాజకీయ నాయకుడే అయితే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఓ జోష్‌కు వచ్చి ఉండేది… అమిత్ షా, మోడీ సక్సెస్‌కు కారణం వాళ్ల తెలివితేటలకన్నా సరైన ప్రతిపక్షం లేకపోవడం…
రాహుల్ అప్పుడే తనకు ఏ పదవులూ వద్దు అంటాడు, వైదొలుగుతాడు, మళ్లీ తనే అన్నీ నిర్వహిస్తూ ఉంటాడు… తన కోటరీయే తనకు అసలు ప్రాబ్లం… మోడీషాలకు ఎదుర్కునే దీటైన వ్యూహాలు రచించే టీం లేదు తనకు… అప్పుడే మోడీని కౌగిలించుకుంటాడు పార్లమెంటులో, అప్పుడే ఏదో మన్మోహన్ ఆర్డినెన్స్‌ను మీడియా ముందు చించేస్తాడు… ఇవన్నీ అపరిపక్వ చేష్టలు… అక్కడి నుంచి ఇంకా ఎదగలేదు తను… దేశమంతా రెండు యాత్రలు చేసినా సరే, ఆ పరిణతి రాలేదు తనకు…
Ads
అసలే కాంగ్రెస్ పార్టీ అంటే యాంటీ-హిందూ అనే ముద్ర పడుతూనే ఉంది బలంగా… తను ఎన్నికల సమయానికి జంధ్యాలు వేసినా, నేనూ బ్రాహ్మణుడినే అని అరిచి కేకలు పెట్టినా, గోత్రాలు చెప్పినా, గుళ్లకు వెళ్లినా, చెల్లెలు ప్రియాంక గంగాస్నానాలు చేసినా జనం నమ్మడం లేదు… నమ్మరు… వాళ్లు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్… సరే, అది వాళ్లిష్టం… కానీ ఎన్నికల వేళ ఆ చేష్టలు జనంలోకి నెగెటివ్‌గా వెళ్తాయి…
నిన్న పార్లమెంటులో శివుడి బొమ్మ చూపించి, త్రిశూలం అహింసకు చిహ్నం అంటాడు… అది రక్షణ కోసం కాదు, తనకు తెలియదేమో, త్రిశూలం లయరూపం… శివుడు లయకారుడు… ఎడమ చేతికి వెనుక ఉంది కాబట్టి అహింస అట… తనకు ఎవరు చెప్పారో గానీ వాళ్ల తెలివికి జోహార్లు… వెనుక వైపు ఉండే త్రిశూలం కుడిచేతికి రావడం ఎంతసేపు, లయలాస్యం ఎంత సేపు..? ఆయుధం ఎప్పుడూ హింసకు రూపమే… రక్షణకు గానీ, దాడికి గానీ…
నేను బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద దాడి చేస్తున్నాను అనుకుంటున్నాడు గానీ, తను అనుకున్నది సరిగ్గా ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాడనే సోయి లేకుండా పోతోంది… ఎస్, వాళ్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ హిందుత్వ ఎజెండా మీద దాడికి దిగారు, అది వాళ్ల పొలిటికల్ వ్యూహం, తప్పులేదు, వాళ్ల ప్రయత్నం వాళ్లిష్టం, ఖర్గే కూడా పార్లమెంటులో ఇదే చేశాడు… కనీసం ఈ మూడున్నరేళ్లయినా నిష్పాక్షికంగా ఉండు అని రాజ్యసభ చైర్మన్‌ను దబాయిస్తున్నాడు…
రాహుల్ కూడా అదే… మరీ నాటుగా… నువ్వు మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు వంగావు, నేను షేక్ హ్యాండ్ ఇస్తుంటే నిటారుగా నిలబడ్డావు అని ఆరోపణ… మేమంతా నీకు తల వంచుతాం, నువ్వు నిటారుగా ఉండు అంటాడు… దానికి బిర్లా సరైన జవాబే చెప్పాడు… మోడీ నాకన్నీ పెద్దవాడు కాళ్లు కూడా మొక్కుతా అన్నాడు, రాహుల్ దగ్గర నో ఆన్సర్… మరెందుకీ ఈ పిచ్చ ప్రవర్తన..? స్పీకర్‌ను కాదు కార్నర్ చేసేది… మోడీ ప్రజావ్యతిరేక విధానాల్ని… ప్రస్తావించి నిలదీయాల్సింది మోడీ వైఫల్యాల్ని… బోలెడు ఉన్నాయి… మోడీ ద్వేహంతో కాదు, జనం కోణంలో సాగాలి వ్యూహరచన… సర్లెండి, అది లేకే కదా..!!
Share this Article