Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్య బచాయించాడు… విశాల్, మోహన్‌లాల్ అడ్డంగా ఆరిపోయారు…

April 23, 2022 by M S R

టీవీ ప్రేక్షకులే చాలా విజ్ఞులు… ఏది చూడాలో, ఏది లైట్ తీసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు… థియేటర్లలో విడుదల తరువాత నానా సైట్లలో నానా చెత్తా… అనగా వసూళ్ల మీద ఏవేవో రాయించుకుంటారు… పెయిడ్ స్టోరీస్… గ్రాస్ ఎంతో, నెట్ ఎంతో, చివరకు వదిలిన చమురు ఎంతో, ఇంటికి వెళ్లాక ఏడ్చిన కన్నీళ్ల బరువెంతో ఎవరూ రాయరు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..?

మౌత్ పబ్లిసిటీ ఎంతో ముఖ్యం… థియేటర్ ప్రేక్షకులు వేరు, టీవీ ప్రేక్షకులు వేరు…. (రీచ్ బాగా తక్కువగా ఉండే ఓటీటీ వ్యూస్‌ను ప్రస్తుతకాలంలో పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు… అది వేరే సెక్షన్ ఆడియెన్స్… పైగా ఆ వ్యూస్‌కు సరైన లెక్కేమీ ఉండదు… థర్డ్ పార్టీ క్రోడీకరణ కూడా ఉండదు…) ఆల్‌రెడీ సినిమా గురించిన జనరల్ ఒపీనియన్ క్రియేట్ అయ్యాకే టీవీలో ప్రీమియర్ వేస్తారు… అప్పటికే అడ్డగోలు రేట్లకు కొన్న చానెల్‌ది రిస్క్… ఉదాహరణ కావాలా..?

బాలయ్య అఖండ… నిజానికి ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా… సాధారణ సినీప్రేమికుల కోణంలో ఓ చెత్తా… కానీ బాలయ్య డిఫరెంట్ లుక్కు, ఆ  డైలాగులు, ప్రత్యేకించి బీజీఎం… థియేటర్‌లో చూస్తేనే ఆ మజా… ఆ థ్రిల్… టీవీలో చూస్తే దాన్ని ఎంజాయ్ చేయలేరు… పైగా అప్పటికే థియేటర్లలో హిట్… బ్రహ్మాండంగా వసూళ్లు… జగన్ మార్క్ టికెట్ల రేట్ల రాజకీయాన్ని అధిగమించి నిలిచింది… కానీ టీవీల్లోకి వచ్చేసరికి అప్పటికే చల్లబడింది… (అఫ్‌కోర్స్, కొన్ని థియేటర్లలో ఇంకా నడుస్తున్నదని టాక్…)

టీవీల్లో ప్రీమియర్ ప్రసారం చేస్తే దక్కిన రేటింగ్స్ ఓ మోస్తరు… సూపర్, బంపర్, డూపర్ అని చెప్పలేం… స్టార్‌మా టీవీలో పదోతారీఖు సాయంత్రం వేశారు… హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ కేటగిరీలో 10.48 టీఆర్పీలు… పర్లేదు, ఆ సినిమా టాక్‌తో ఆమాత్రం రేటింగ్స్ వచ్చాయి… (స్థూలంగా 13 టీఆర్పీలు వచ్చినట్టున్నయ్…) అయితే అదే సమయంలో… జీతెలుగులో సామాన్యుడు అనే సినిమా ప్రసారమైంది…

అప్పటికే దానికి ఫ్లాప్ టాక్ వచ్చింది… విశాల్ హీరో… నిజంగానే ఓ కొత్తదనం లేదు, ఓ థ్రిల్ లేవు… ఏదో ఓ సాదాసీదా సినిమా… ప్రపంచంలోని హీరోలందరూ మారినా సరే విశాల్ మారడు… అదోరకం… ఫలితం..? థియేటర్లలో భారీ దెబ్బ… ఆ దెబ్బ ప్రకంపనలే టీవీలో కూడా… మరీ దారుణంగా 1.83… ఈ టీఆర్పీలు టీవీ భాషలో చెప్పాలంటే మోస్ట్ డిజాస్టర్… వర్మ-నాగ్ ఆఫీసర్, మోహన్‌బాబు సన్నాఫ్ ఇండియా ఎట్సెట్రా కేటగిరీ అన్నమాట… దాన్ని కొనుగోలు చేసిన జీతెలుగు యాజమాన్యం కంట రక్తకన్నీరు… సినిమాను అంచనా వేయకపోవడంతో ‘వాచిపోయింది’…

నిజానికి ఈ రెండు సినిమాల గురించి కాదు చెప్పాల్సింది… మరక్కర్… పాన్ ఇండియా సినిమా… మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ చిత్రం… ఓ దశలో ఫుల్లు బజ్ క్రియేటైంది… తీరా చూస్తే థియేటర్లలో ఢమాల్… మరీ ఘోరం ఏమిటంటే… 15వ తేదీన శుక్రవారం స్టార్‌మా మూవీస్‌లో వేశారు…

వాస్తవం చెప్పాలంటే… అది మోహన్‌లాల్‌ను అవమానించడమే… మెయిన్ చానెల్‌లో ప్రసారం చేయలేదు, పైగా శుక్రవారం… మా మూవీస్ సినిమాల రీచ్ ఎంత అసలు..? ఇంత దారుణంగా ఉంటుందని అనుకుంటే, మరీ ఎవడూ చూడని మూవీస్ చానెల్‌లో ప్రసారం చేసి చేతులు దులుపుకునే పక్షంలో… మరి దాన్ని ఎందుకు కొన్నట్టు..? ఎంత దారుణం అంటే..? మరీ 1.25 టీఆర్పీలు… అది పరమ చెత్తన్నర ప్రోగ్రాములకన్నా హీనంగా ఉన్న రిజల్ట్…

అరె, వాళ్లదేం పోయింది..? అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారు… ఎవడు చూస్తేనేం, చూడకపోతేనేం అంటారా…? కాదు… రాబోయే సినిమాల మీద దాని ప్రభావం తీవ్రంగా, దారుణంగా, నెగెటివ్‌గా ఉంటుంది… ఐనా ఏముందిలే… మలయాళ సినిమాకు కాస్త ఖర్చుతో తెలుగు డబ్బింగ్… వస్తే నాలుగు రాళ్లు, లేకపోతే పోయేదేముంది అంటారా…? అవును, అది కరెక్టు… కాకపోతే ఇకపై రాబోయే మోహన్‌లాల్ సినిమా శాటిలైట్ హక్కుల అమ్మకాల మీద ఘోరమైన ప్రభావం ఉంటుంది… ఎస్, అఫ్‌కోర్స్, విశాల్ మీద కూడా..!!

 

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ముందు నటనలో బేసిక్స్ నేర్చుకొండి బాబులూ… తరువాత వాయిద్దురు గానీ…
  • మిస్టర్ రానా… ఇదేం పరేషాన్‌ర భయ్… ఇది తెలంగాణ బ్రాండ్ మూవీయా..?
  • ఉత్సవాల్లో నమస్తే హిందు… తెలుగు ప్రాంతీయ పత్రికలు వంద రెట్లు బెటర్..!!
  • ఆక్రందనలింకా ఆగనేలేదు… అప్పుడే పొలిటికల్ గద్దలు నోళ్లు విప్పినయ్…
  • మొత్తానికి ఆదిపురుష్ ప్రభాస్ సేఫ్… భారీ బేరాలతో నిర్మాతలు గట్టెక్కేశారు…
  • కృత్రిమ మేధ… ప్రయోగపరీక్షలో ఆ డ్రోన్ ఆపరేటర్‌నే హతం చేసింది…
  • రాసలీల వేళ- రాయబారమేల…. ఈ పాటలో ‘లక్స్ పాప’ కిక్కేముందని…
  • నీ పదములే చాలు రామా… ఈ పాట గాయకురాలి గురించి తెలుసా మీకు..?
  • ఫాఫం రామానాయుడు… అసలు ఈ దగ్గుబాటి వారసులకు ఏమైంది హఠాత్తుగా..?
  • తెలంగాణ వస్తుందని ఎవరు చెప్పినా… ఎకసక్కేలతో వెక్కిరింపులు సాగేవి…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions