Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…

May 2, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. అందరికీ అచ్చొచ్చిన సినిమా 1992 లో వెలంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14 న విడుదలయిన ఈ సూపర్ హిట్ సినిమా అల్లరి మొగుడు . దర్శకుడు రాఘవేంద్రరావుకు నిర్మాతగా సక్సెస్ అందుకున్న మొదటి సినిమా . ఐరన్ లెగ్ అని బద్నాం అయిన రమ్యకృష్ణకు హిట్ సినిమా . మోహన్ బాబుకి కూడా . 30 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడింది . మా నరసరావుపేటలో కూడా వంద రోజుల పోస్టర్ పడింది .

మూడు భాషల్లో రీమేక్ అయింది . తమిళంలో రజనీకాంత్ , మీనా , రోజా లీడ్ రోల్సులో నటించారు . కన్నడంలో రవిచంద్రన్ , రమ్యకృష్ణ , రోజా నటించారు . హిందీలో గోవిందా , టబూ , కరిష్మాకపూర్ నటించారు . అన్ని భాషల్లోనూ బాగానే ఆడింది . కధను నేసిన రచయితను , స్క్రీన్ ప్లీని బిర్రుగా తయారు చేసుకున్న రాఘవేంద్రరావుని అభినందించాలి .

Ads

1+2 కధ . లేట్ 1980s కు ముందు దర్శకులు రాతి గుండె కలవారు . ఇద్దరు హీరోయిన్లలో ఒకరిని చివర్లో లేపేసేవారు . తర్వాత తర్వాత వాళ్ళ గుండె మృదువు కావటం మొదలయింది . ఇద్దర్నీ సర్దుకొమ్మని ముగిస్తున్నారు . ఈ సినిమాలో కూడా ముగింపులో ఇద్దరు హీరోయిన్లు సర్దుకుంటారు .

కధ ఏంటంటే : ఓ చిన్న ఊళ్ళో ఓ గాలికి తిరిగే కుర్రాడు ఓ అమ్మాయికి లైనేయటానికి సంగీతం మాస్టారి దగ్గర శిష్యుడిగా చేరి ఆ అమ్మాయి ప్రేమను పొందుతాడు . తాకట్టులో ఉన్న ఇంటిని విడిపించుకోవటానికి నగరానికి వచ్చి బ్రహ్మానందానికి మిత్రుడు అవుతాడు .

సూర్య రికార్డింగ్ కంపెనీ అధినేత సత్యనారాయణ కుమార్తె రమ్యకృష్ణ సహాయంతో మిత్రులు ఇద్దరూ ఉద్యోగం సంపాదిస్తారు . కంపెనీని అభివృద్ధి చేస్తారు . సత్యనారాయణ రమ్యకృష్ణని ఇచ్చి పెళ్లి చేస్తాడు . గుండె ఆపరేషనుకు అమెరికా వెళతారు .

ఈలోపు గోదావరిలో చనిపోయింది అనుకున్న మీనా బతికి రావటం , రెండు కాపురాలు పెట్టడం , ఇద్దరు భార్యల మధ్య సర్కస్ చేయటం , విలన్లు ఇద్దరు భార్యల స్టోరీ బయటకు వచ్చేలా పరిస్థితి క్రియేట్ చేయటం , విలన్లను పోలీసులకు అప్పచెప్పి గర్భవతులు అయిన ఇద్దరినీ ఏలుకోవటానికి సిధ్ధం కావటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమా సూపర్ హిట్ కావటంలో కీరవాణి సంగీత దర్శకత్వం , సిరివెన్నెల , భువనచంద్ర , కీరవాణిల పాటల సాహిత్యం , బాలసుబ్రమణ్యం , చిత్రల శ్రావ్యమైన గాత్రం ప్రధాన పాత్రని పోషించాయి . ముఖ్యంగా సిరివెన్నెల వ్రాసిన నా పాట పంచామృతం . నగేష్ , మోహన్ బాబులు అద్భుతంగా నటించారు . అలాగే ఆయనే వ్రాసిన ముద్దిమ్మంది చామంతి మనసిమ్మంది ఓ పూబంతి పాట చిత్రీకరణ 1+2 మీద చాలా బాగుంటుంది .

రేపల్లె మళ్ళీ మురళి విన్నది పాట మోహన్ బాబు , మీనాల డ్యూయెట్ గ్రూప్ డాన్స్ బాగుంటుంది .వాళ్ళిద్దరి మీదే మరో డ్యూయెట్ నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ కూడా బాగా తీసారు .‌ భువనచంద్ర వ్రాసిన అబ్బా నను గన్న అమ్మ బాబు గుర్తొచ్చాడోయబ్బా డ్యూయెట్ మోహన్ బాబు , రమ్యకృష్ణల మీద బాగుంటుంది .

అన్నమయ్య విరచిత అదిగో అల్లదిగో శ్రీహరి వాసము కీర్తనను బాలసుబ్రమణ్యం చాలా శ్రావ్యంగా పాడారు .
మోహన్ బాబు కామెడీ , ఏక్షన్ , రొమాంటిక్ హీరోగా చాలా బాగా నటించిన సినిమా . ఇద్దరు భామలు గ్లామర్ స్పేసుని ఫిల్ చేసారు . ఇతర ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం , సత్యనారాయణ , జె వి సోమయాజులు , అన్నపూర్ణమ్మ , రామిరెడ్డి , కాస్ట్యూమ్స్ కృష్ణ , సుత్తి వేలు , నగేష్  తదితరులు నటించారు .

1975 లో మోహన్ బాబు జోడీగా సినీ రంగ ప్రవేశం చేసిన అన్నపూర్ణమ్మ ఈ సినిమాలో అతనికే తల్లిగా జీవించింది . ఈ సినిమాకు సీక్వెల్ గా 2015 లో మామ మంచు , అల్లుడు కంచు సినిమా వచ్చింది . ఈ 1+2 తో పాటు నరేష్ నటించారు .

తలకోన , తిరుపతి , వైజాగ్ , హైదరాబాదుల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తరచుగా ఏదో చానల్లో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో ఉంది . It’s an action , hilarious , romantic entertainer . తప్పక చూడండి .



Priyadarshini Krishna …. అసలైన గ్లామర్ కోషంట్ తో నింపి కుర్రకారును నిద్రపోనీయకుండా చేసిన పాట… ఆ రోజుల్లోనే గ్లామర్ కి, ఆరోగ్యానికి యోగాలు, ఎక్సర్సైజ్ లు ఎంత అవసరమో అని పాట పెట్టి మరీ ప్రచారం చేసిన మా గురువు గారు యోగా డే అని ప్రచారం చేసిన ప్రధాని కంటే గొప్పోరు… బంచికి భం భం చెయ్యి బాగా … వంటికి యోగా మంచిదేగా అంటూ రమ్య కృష్ణ యోగ పాఠాలు ఎంత అందంగా చెప్పిందో కుర్ర ప్రేక్షకులని అడగాలి…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అందరికీ అచ్చొచ్చింది… ఐరన్‌ లెగ్స్ కాస్తా గోల్డెన్ అయిపోయాయి…
  • ఓ రష్యన్ మహిళ వీసా పొడిగింపు… రూల్స్‌పై ఇంట్రస్టింగ్ జడ్జిమెంట్…
  • ఓ కామ ప్రకోపి… ఆ మొగుడి సూసైడ్… కానీ ఆ పిల్లల గతి..? చిక్కు ప్రశ్న..!!
  • ఒకే ఒక్కడు… టెన్త్ పాసయ్యాడు… టీచర్లు దీపావళి జరుపుకున్నారు…
  • సారీ… శారీ..! ఉర్ఫీ జావేద్ చీర కట్టింది… పాపం, ఆ చీరకే సిగ్గేసింది…
  • అక్కడ భయం… ఇక్కడ సాహసం… యాక్సిస్ ప్రదీప్ గుప్త రిస్కీ వెంచర్…
  • వీరప్పన్ ఫోటోలకూ ఫోరెన్సిక్ పరీక్షలు… చివరకు తేలిందేమిటంటే…!
  • అమ్మా, నీకు వందనం… నీ పేగు ప్రేమకు అభివందనం…
  • ప్రతిసారీ వైభవ్ గెలిపించలేడు… ఆటతీరులోనూ అస్థిరత్వం…
  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions