అల్లు అరవింద్… తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద తన పట్టు మరింత పెరగబోతోంది… ఇప్పటికే బడా నిర్మాత, పెద్ద ఎగ్జిబిటర్, ఏకైక తెలుగు ఓటీటీ, ఎట్సెట్రా… అన్నింటికీ మించి కొడుకు బన్నీ హీరోగా ఎక్కడికో వెళ్లిపోయాడు… ఇవన్నీ గాకుండా మెగాక్యాంప్‌తో చుట్టరికం… కాదు, కాదు, ఇప్పుడు అల్లుయే పెద్ద క్యాంప్… పవన్, నాగబాబులతో పెద్ద సత్సంబంధాలు లేకపోయినా… చిరంజీవి సొంత బావే… గతంలోలాగా బలమైన ఆర్థికబంధాలు లేకపోయినా హార్ధికబంధాలు పదిలం…
తను నిర్మాత కదా… వ్యాపారి… సైలెంట్ ఆపరేటర్… పెద్దగా ఎక్స్‌పోజ్ కాడు… కానీ అనుకున్నవన్నీ ఆపరేట్ అవుతూనే ఉంటయ్… రెండు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించి ఫిలిమ్ ఇండస్ట్రీకి ఓ బలమైన పిల్లర్… ఇదంతా నాణేనికి ఒకవైపు… పవన్ కల్యాణ్ పేరు వింటేనే జగన్‌కు చిటచిట… తను ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు చేతిలోని ఒక ఆయుధంగా భావిస్తాడు… రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలతోపాటు బలంగా ఆర్గనైజ్ అవుతున్నది కాపు కులం…
అది పవన్ బలంగా చూసుకోవడం జగన్‌కు రాజకీయ అవసరం… సో, పవన్ అన్న చిరంజీవితో సత్సంబంధాలు కొనసాగిస్తాడు… అప్పుడప్పుడూ చిరంజీవికి రాజ్యసభ సీటు అనే ప్రచారాలు అనుకోకుండా గుప్పుమంటాయి… నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని చిరంజీవే చెప్పినా సరే అవి ఆగవు… జగన్ ఇంటికి తనొక్కడే వెళ్లి మధ్యాహ్నభోజనం చేసి వచ్చేంత చనువు ఉంది… సినిమాలకు సంబంధించి తన బంధువు మోహన్‌బాబు కుటుంబాన్ని కూడా జగన్ లైట్ తీసుకుంటాడేమో గానీ చిరంజీవి మాటకు ప్రయారిటీ ఇస్తాడు…
Ads
ఆన్‌లైన్ బుకింగు, టికెట్ల ధరలు వంటి విషయాల్లో జగన్ నిర్ణయాల మీద ఎంత రచ్చ జరిగినా… కులం ప్రమేయం కూడా చర్చల్లోకి వచ్చినా… ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా చిరంజీవి టాకిల్ చేయగలిగాడు… ఒక దశలో మరీ తన స్థాయి నుంచి బాగా దిగిపోయి జగన్‌కు వేడుకుంటున్న సీన్ కూడా సోషల్ మీడియాలో కనిపించింది… ఇంత జరుగుతున్నా, ఎవరెవరో జగన్‌ను కలుస్తున్నా, ఏ దశలోనూ అల్లు అరవింద్ తెర మీదకు రాలేదు… తన ప్లాన్లు తనవి…
ఇప్పుడు ఆన్‌లైన్ బుకింగ్ కంట్రాక్టు అల్లు అరవింద్ చేతిలో పడబోతోంది… నిస్సందేహంగా అది తన గ్రిప్ మరింత పెరగడానికి దోహదపడుతుంది… అల్లు అరవింద్ టికెట్ల విక్రయ కంపెనీ జస్ట్‌టికెట్స్ ఈ కంట్రాక్టులో తక్కువ ధర కోట్ చేసింది… సో, తనకే ఖరారు చేస్తారు… జగన్ కూడా పాజిటివ్‌గా ఉన్నాడు కాబట్టే ఇక మధ్యలో ఎవరూ అల్లు ప్రయత్నాన్ని రప్చర్ చేయడానికి ప్రయత్నించలేదు… ఈ ఆన్‌లైన్ టికెట్ల విక్రయ కంపెనీలో డైరెక్టర్ అల్లు వెంకటేశ్…
మెల్లిగా ఇక తెలంగాణలోకి కూడా దాన్ని ఎక్స్‌టెండ్ చేయించుకోగలిగితే మరింత గ్రిప్… ఎలాగూ చిరంజీవితో కేసీయార్‌కు కూడా సత్సంబంధాలే ఉన్నయ్… ‘‘ఒక్కటి తక్కువైంది పుష్పా’’ అనేది ఈమధ్య భీకరంగా హిట్టయిన పుష్ప సినిమాలో ఓ డైలాగ్… అవును, అరవింద్‌కు కూడా ఒక్కటి తక్కువైంది… ఓ స్టూడియో… ఆల్‌రెడీ ఆ ప్లాన్ కూడా రెడీ అవుతున్నట్టేనా పుష్పా..?! వీలయితే ఓ వినోద చానెల్…!!
Share this Article