ఎర్రజెండా మరింత ఎరుపు మెరుపును సంతరించుకుని ఎగరాలని ఆకాంక్షించే సగటు అభిమాని ఆవేదన ఇది, ఆగ్రహం ఇది, ఆందోళన ఇది… నిజంగానే స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రాతిపదికల్లో ఆలోచించినా సరే లెఫ్ట్ నిర్ణయానికి సమర్థన సరిగ్గా కనిపించదు… 1) బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ సహా అన్ని బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలనేది జాతీయ స్థాయిలో వినిపిస్తున్న నినాదం, వాదం… మరి సాగర్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్లాలి..? 2) ఏపీలో మొన్నటికిమొన్న జనసేనతో భంగపడ్డాయి… తెలంగాణలో ఓ స్థిరమైన లైన్ లేదు, ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్‌కు ఎందుకు జైకొట్టాలి, కొడితే ఫాయిదా ఏమిటి..? బెంగాల్‌లో ప్రాంతీయ పార్టీ తృణమూల్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు, తెలంగాణలో దానికి విరుద్ధపయనం ఏమిటి..? పోనీ, టీఆర్ఎస్ యాంటీ-బీజేపీ లైన్ మీద స్థిరంగా ఉండగలదా..? 3) స్థానికంగా లెఫ్ట్ నుంచి నోముల బయటికి వెళ్లడాన్ని ఇవే పార్టీలు నిందించాయి… మరిప్పుడు ఎందుకు ఆత్మీయంగా హత్తుకోవాల్సి వస్తోంది..? ఇంకా బోలెడు ప్రశ్నలు… వేటికీ లెఫ్ట్ పార్టీల వద్ద జవాబుల్లేవు… తమ కేడర్‌లోనే బోలెడు సందేహాలు ప్రబలుతున్నా సమర్థనల్లేవు… నిష్ఠురంగా ఉన్నా సరే, ఈ ప్రశ్నలు అనేక నిజ సమర్థనల్ని కోరుకుంటున్నయ్…
Share this Article