Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమితాబ్..! నెటిజనం ముక్క చీవాట్లతో తప్పనిసరై లెంపలేసుకున్నాడు…

December 30, 2020 by M S R

కోట్ల మంది అమితాబ్ బచ్చన్‌ను ఆరాధిస్తారు… తనకు చిన్న సమస్య వచ్చినా అందరూ తల్లడిల్లిపోతారు… తన క్రేజ్ అలాంటిది… అయినా సరే… తను తప్పు చేస్తే ఏకిపారయడానికి కూడా తన ఫ్యాన్స్ రెడీ… ముక్కచీవాట్లు పెడతారు… తాము ఆరాధించే మనిషి తప్పు చేయకూడదు… అంతే… అవును, అదే జరిగింది… తన ట్విట్టర్ ఫాలోయర్లు, ఫేస్‌బుక్ ఫాలోయర్ల సంఖ్య తెలుసు కదా… ఆ రేంజ్‌కు చేరుకోవడం ఏ సినిమా నటుడికీ ఇండియాలో ఇక చేతకాదు…

amitab

అయితే తను ఈమధ్య ఓ చిన్న తప్పుచేశాడు… ఎవరో తిషా అగర్వాల్ అనే ఔత్సాహిక రచయిత్రి రాసిన నాలుగు కవితా పంక్తులను తను చాయ్ ఆప్ జిందగీ… టీ ఆఫ్ లైఫ్ అంటూ ట్వీట్ చేశాడు… కానీ ఫలానా ఆమె రాసిన కవిత బాగుంది అని ఒక్కమాట రాసి ఉంటే బాగుండేది… ఆ క్రెడిట్స్ ఇవ్వలేదు… ఆమె అది తన కవితే అని అమితాబ్‌కు గుర్తుచేసింది కూడా… ఐనాసరే, ఆమెకు రిప్లయ్ ఎందుకు ఇవ్వాలని అనుకున్నాడో ఏమిటో గానీ పట్టించుకోలేదు ఆయన… ఇక నెటిజనం మొదలుపెట్టారు… ఓసారి ఈ లింకు చదవండి…


క్రెడిట్స్ ఇవ్వలేదు… క్రెడిబులిటీ కోల్పోయాడు… కాపీ బిగ్ క్యాట్ అట…


క్రెడిట్స్ ఇవ్వకుండా ఆమె కవిత వాడుకోవడం అమితాబ్ వంటి సెలబ్రిటీకి తగదని హితవచనాలు పలికారు చాలామంది… ఐనా వినలేదు ఆయన… ఈలోపు మీడియా కూడా నిందించడం స్టార్ట్ చేసింది, చివరకు తన ఫ్యాన్స్ కూడా ఛీకొట్టడం స్టార్టయింది… అదే ట్వీట్‌లో ముక్కచీవాట్లు పెట్టసాగారు కామెంట్ల రూపంలో… అమితాబ్‌కు వాచిపోయింది… తప్పనిసరై ఇక లెంపలేసుకున్నాడు… అక్షరాలా ఆమెకు క్షమాపణలు చెప్పాడు…


T 3765 – "थोड़ा पानी रंज का उबालिये
खूब सारा दूध ख़ुशियों का
*थोड़ी पत्तियां ख़यालों की..*" …more ..

this tweet credit should go to @TishaAgarwal , I was not aware of its origin .. someone sent it to me , I thought it to be good and posted ..
apologies ?? pic.twitter.com/6YAOKXdIxe

— Amitabh Bachchan (@SrBachchan) December 27, 2020


‘‘అబ్బే, నాకు నువ్వు రాశావని తెలియదమ్మా, ఎవరో ఫార్వర్డ్ చేశారు, బాగుంది కదాని నేను వాడుకున్నాను, అంతే’’ అని ఓ వివరణ కూడా ఇచ్చాడు… ‘‘అయ్యో, ఎంత మాట సార్, మీ ట్వీట్‌లో నా కవిత కనిపించడమే ఓ వరం… జీవితాంతం గుర్తుండిపోయే సందర్భం ఇది..’’ అంటూ సదరు రచయిత్రి కూడా సంబరపడిపోయింది…

నిజానికి అమితాబ్ ఎక్కడ ఇరుకునపడిపోయాడు అంటే… కొందరు నెటిజన్లు ఓ పాత సంగతిని గుర్తుచేశారు… ‘‘ఏమయ్యా సారూ… మీ ఫాదర్ డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ రాతల్లో కొంత పార్టును అనుమతి లేకుండా కాపీ కొట్టాడని కుమార్ విశ్వాస్ అనే కవికి 2017లో లీగల్ నోటీసులు పంపించావు కదా నువ్వే… మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏమిటి..? కాపీ ఎవరు చేసినా కాపీయే కాదా..?’’ ఇదీ తనపై వచ్చిన బోలెడు కామెంట్ల సారాంశం… ఇది బాగానే తగిలినట్టుంది… దాంతో ‘‘అమ్మా, సారీ, అపాలజీస్’’ అంటూ ఇంకో ట్వీట్ కొట్టేసి, ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు… ఈ పని నాలుగు రోజులు ముందే చేసి ఉంటే బాగుండేది కదా బాబాయ్…

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • టీవీ హీరో సుధీర్…! సీమంతాలూ చేసుకుంటాడు, పిల్లల్నీ కంటాడు..!!
  • మాలావత్ పూర్ణ, వారణాసి మానస… దేత్తడి హారిక ఏరకంగా బెటర్ ఎంపిక..?!
  • ఓహ్… ఏదో అనుకుంటిమి… ఈయన 24 క్యారెట్ల బంగారం ఏమీ కాదన్నమాట…
  • ఏది రీతి..? ఏది రోత..? ఈనాడు రాతలకు సాక్షి ఫస్ట్ పేజీలో బ్యానర్‌ తిట్టిపోతలు..!!
  • భయంసా..! పుండు మీద మందు మరిస్తే… రాచపుండుగా మారింది..!!
  • ఔను, నిజమే… ఈ డిస్కో డాన్సర్ ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైటే…!
  • హీరో వెంకటేష్ పెద్ద బిడ్డ…! ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుందట…!
  • ఇక అందరినీ బాలయ్య ఆవహించేస్తున్నాడు… చూశావా సంచయితా..?
  • మరో కార్తీకదీపం..! కథ కాదు, చేదు నిజం… టీవీ కథను మించిన ట్విస్టులు…
  • వుమెన్స్ డే..? ఓ నిజ స్ఫూర్తి కథనం ఇదుగో… ‘‘అంతిమ మిత్రురాలు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now