‘‘కొన్ని పాత స్మృతుల తేయాకులు వేసి,
ఆ కాసిన్ని నీళ్లలో ఆనందపు పాలు పోసి…
నవ్వుల పంచదార కూడా కాస్త కలపండి
Ads
కొద్దిసేపు ఆ కలల్ని అలాగే మరిగించండి…
వడబోసి, సౌకర్యపు కప్పులో పోసుకుంటే
ఒక్కొక్క చుక్కా మధురమైన జీవితేనీరు…’’
…… మరీ గూగుల్ అనువాదంలాగా గాకుండా… మక్కీకిమక్కీ గాకుండా… పాత చాయ్ పత్తా వేసి మళ్లీ మళ్లీ మరిగించిన టీలాగా గాకుండా… కాస్త బాగానే ఉంది కదా… అసలే మనకు ద్రావిడత్వం ఎక్కువ… అంటే హిందీ ఎక్కువగా ఆతా నహీఁ
బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు కూడా ఇది బాగానే నచ్చింది… ఎవరో ఎక్కడో పోస్టు చేసిన నాలుగు వాక్యాల్ని కాపీ చేసుకుని, దానికి మరింతగా తన భావాల్ని కలిపి… ఓ కవిత పూర్తి చేసి… ఈ లైఫ్ టీ గురించి… చాయ్ తాగుతున్న ఫోటో యాడ్ చేసి ట్వీట్ చేశాడు…
T 3761 – थोड़ा पानी रंज का उबालिये
खूब सारा दूध ख़ुशियों का
*थोड़ी पत्तियां ख़यालों की..*थोड़े गम को कूटकर बारीक,
हँसी की चीनी मिला दीजिये..
*उबलने दीजिये ख़्वाबों को*
*कुछ देर तक..!*यह ज़िंदगी की चाय है जनाब..
इसे तसल्ली के कप में छानकर
*घूंट घूंट कर मज़ा लीजिये…!!*☕? pic.twitter.com/qwGbczzcLp— Amitabh Bachchan (@SrBachchan) December 23, 2020
సరే, రాసుకుంటే రాసుకున్నాడు… కానీ అంత పెద్ద మనిషి… ఒరిజినల్ కవి లేదా కవయిత్రికి క్రెడిట్స్ ఇవ్వాలి కదా… మరీ తెలుగు అగ్ర దర్శకుల్లా… కాపీ కొట్టినా కాలరెగరేసుకునే టైపులో… తన సొంత కవితే అన్నట్టుగా ఫోజు పెట్టేస్తే ఎలా..? ఆయన ట్వీట్లను ఫాలో అయ్యే కోట్లాది మందిలో ఆ పోస్టు ఒరిజినల్ రచయిత్రి కూడా ఉంది…
అంత పెద్ద అమితాబ్ తన కవితను తీసుకుని, పొడిగించి, తన వాల్ మీద షేర్ చేసుకున్నందుకు ఆనందించింది… తరువాత చిరాకనిపించింది… ఈయనకు ఇదేం కక్కుర్తి, ఈయన పోస్టులన్నీ ఇలాంటి కాపీ బాపతేనా అని సందేహించింది… నేరుగా అమితాబ్‌కే క్వశ్చన్ వేసింది… క్రెడిట్స్ ఇవ్వకపోతివి, నవ్వాలా, ఏడవాలా చెప్పు అనడిగింది…
నిజమే కదా… న్యాయమే కదా… ఈ క్వశ్చన్ చూసి, చాలా సైట్లు… ఏమిటోయ్ అమితాబూ, ఇదేనా పద్ధతి, ఇదేనా మర్యాద..? ఈ చాయ్ అస్సలు బాగాలేదోయ్ అంటూ సరదాగా ఆడుకున్నాయి… అంతెందుకు..? తన ట్వీట్ కింద బోలెడు మంది ఇలాంటి కామెంట్లే పెట్టారు… అంతటి అమితాబుడూ కిక్కుమనలేదు… ఈ చాయ్‌లో చాయ్‌పత్తా ఎక్కువై, పాలు-చక్కెర తక్కువై… అది ఇంకో ద్రావకంగా మారినట్టు… ఏదో రాయబోతే ఇంకేదో అయిపోయి… సైలెంట్ అయిపోయాడు… అంగీకరించలేడు… అలాగని ఉల్టా దబాయించలేడు… అదీ కథ… మరి ఈ కాపీ చేయకపోతే ఏం బోయింది నీకు అమితాబూ..? కాపీ క్యాట్…!!
Share this Article