Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం, ఆ కన్నడ సౌమ్యారావు ప్లేసుకు యాంకరిణి అనసూయ స్పాట్…

October 25, 2023 by M S R

అనసూయ… ఎప్పుడూ ఏదో ఒక సోషల్ మీడియా వివాదాన్ని గోకి, ట్రోలింగుకు గురవుతూ ఉంటుంది… నిజానికి అవేమీ లేకపోతే ఆమెకు తోచదు కూడా… చివరకు ఆంటీ అని ఎవరైనా పిలిచినా తనకు చిరాకు, సైబర్ కేసులు పెట్టేస్తాను, లోపల వేయిస్తాను అంటుంటుంది… అక్కడికి తెలంగాణ సైబర్ పోలీసులకు వేరే పనేమీ లేనట్టు..!

రజాకార్ సినిమా ప్రమోషన్ బాపతు ప్రెస్‌మీట్ కావచ్చు… ఆ వీడియోలో ‘‘నాకే తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో… నా ము- ము- ముప్ఫయ్ ఎనిమిదేళ్లు వచ్చినా నేనుండే చోట ఏం జరిగిందీ అనేది’’ అని చెబుతూ పోతోంది… ఇక్కడ ము- అని ఏదో పదం అనబోయి ఆగిందనేది కాదు… నిజంగానే హైదరాబాదులోనే బతికే లక్షలాది మందికి తెలంగాణ చరిత్ర తెలియదు, తెలుసుకునే ఆసక్తీ ఉండదు, అవసరమూ లేదు… అనసూయ ఆ సినిమాలో నటించింది కాబట్టి అలా చెప్పుకొచ్చింది… అంతే తేడా…

Ads

నిజానికి ఆ సినిమాలో పాత్రకు ఆమె సూట్ కాలేదు… ఆమె మొహం రకరకాల ఉద్వేగాలు ప్రదర్శితమయ్యే ఫ్లెక్సిబుల్ ఫేస్ కాదు… పైగా బతుకమ్మ చుట్టూ పిచ్చి సినిమా గెంతులు వేయించాడు దర్శకుడు… తనతో, తన వెంట గ్రూప్ డాన్సర్లతో… ఆ ప్రోమోయే చిరాకెత్తించింది… సినిమా మీద లెఫ్ట్ కేసులు, మతం పేరిట విద్వేషం రెచ్చగొడుతున్నారంటున్న అధికార పార్టీ నేతల విమర్శలు ఎట్సెట్రా పక్కన పెడితే… అనసూయ గురించి చెప్పుకునే విషయం, కాస్త నవ్వొచ్చేది వేరే ఉంది… ఆ వార్త ఏమిటంటే…

అనసూయ సోషల్ మీడియాలోనే ఓ పోల్ పెట్టిందట… అందులో ఆమె తిరిగి బుల్లితెరకు రావాలని 82 శాతం మంది కోరుకున్నారట… ఆమె ఆ పోల్ పెట్టిందే తన అభిమానులుండే తన ప్లాట్‌ఫామ్ మీద… అంతకుమించిన రిజల్ట్ మరేమొస్తుంది..? వస్తే ఏ షో చేయాలని మరో పోల్ నిర్వహిస్తే జబర్దస్త్ అని చాలామంది చెప్పారట… దీని గురించే ఆలోచిస్తున్నట్టు ఎమోజీలను పోస్ట్ చేసింది అనసూయ… ఆల్రెడీ స్టార్‌మా కోసం ఏదో షో చేయబోతోంది ఆమె…

రష్మిని జబర్దస్త్ నుంచి ఎవరూ కదల్చలేరు… ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలతో ఈటీవీలో పాతుకుపోయింది… గతంలోనే ఓసారి అనసూయ అర్ధంతరంగా జబర్దస్త్ విడిచిపెడితే రష్మి అక్కడికి వచ్చి తిష్ఠ వేసింది… ఇద్దరూ చెరో జబర్దస్త్ షో పంచుకున్నారు తప్ప రష్మిని కదల్చలేకపోయింది… మొన్నామధ్య సినిమాల వేషాలు పెరిగి జబర్దస్త్‌ను వదిలేసింది అనసూయ…

వెళ్లాక ఏవో యూట్యూబు చానెళ్లలో మాట్లాడుతూ ఆ ప్రోగ్రాం రన్ అవుతున్న తీరు మీద ఏవేవో కామెంట్లు కూడా చేసింది… ఆమె ప్లేసులో కన్నడ నటి సౌమ్యారావు వచ్చింది… ఆమె ఏజ్ బార్ కూడా కాదు… పర్లేదు, జడ్జిలు కూడా మారిపోయి ఇంద్రజ, కృష్ణభగవాన్ కుదురుకున్నారు… ఇప్పుడు మళ్లీ ఆమె జబర్దస్త్ షోకు వస్తే సౌమ్యారావుకు ఎసరు పెట్టడమేనా..? ఫాఫం…

ఐనా ఎప్పుడంటే అప్పుడు రావడానికి, పోవడానికి మల్లెమాల కంపెనీ ఏమైనా దొడ్డా… రష్మి అడ్డా… ఐనా వాళ్లు తీసుకోవాలి కదా… పైగా అదే హైపర్ ఆది గ్రిప్ స్పష్టంగా మల్లెమాల ప్రోగ్రాముల మీద ఉంది… మరిక అనసూయ అనుకోగానే వెళ్లి షోలో చేరిపోగలదా..? నిజానికి ఇప్పుడు జబర్దస్త్ షోను ఎవడూ దేకడం లేదనే నిజం ఆమెకు తెలిసినట్టు లేదు…

Ads

గత వారం జబర్దస్త్ రేటింగులు తెలుసా..? ఎక్సట్రా జబర్దస్త్ 2,71, జబర్దస్త్ 2.94 మాత్రమే… జబర్దస్త్ రేటింగులు గత వైభవం… చిల్లర స్కిట్లు, కొత్తదనం లేని స్కిట్లను జనం ఎవడూ చూడటం లేదు… అవేకాదు, ఈటీవీ రియాలిటీ షోలన్నీ నాసిరకంగా మారి, రేటింగులు ఘోరంగా పడిపోయాయి… మరి కొత్తగా అనసూయ వచ్చి ఉద్దరించేది ఏముంటుంది..?

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?
  • చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
  • రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…
  • సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
  • టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
  • నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
  • హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?
  • తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
  • వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…
  • ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions