యాంకర్ ప్రదీప్… తెలుగులో సుమ తరువాత టాప్ రేటెడ్ యాంకర్… అఫ్‌కోర్స్, సుమ రేంజ్ ఎవరూ అందుకోలేనిది… సున్నితమైన స్పాంటేనియస్ జోకులతో ప్రోగ్రామ్ రన్ చేయగలడు… ఏ కోణం నుంచి చూసినా ఓ గుడ్ యాంకర్ తను… కానీ తను చేసే ఏ ప్రోగ్రామూ ఎందుకు క్లిక్ కావడం లేదు..? బార్క్ రేటింగులను చూస్తుంటే హఠాత్తుగా మౌజ్ ఓచోట ఆగిపోయి, ఈ ప్రశ్న ఎదుట నిలిచింది… సూపర్ క్వీన్ అని ఓ షో చేస్తున్నాడు కదా… దాని రేటింగు రీసెంటుగా మరీ 2.14 స్థాయికి పడిపోయింది… (HYD)… అత్యంత దయనీయమైన రేటింగ్స్ అవి… నిజానికి ఆ ప్రోగ్రాం రూపకల్పనలోనే లోపముంది… వాళ్లేదో భిన్నరంగాల్లో ఘనతలు సాధించినట్టు బిల్డప్పే కరెక్టు కాదు… పైగా జస్ట్, ఓ కిట్టీ పార్టీ టైపు షో అది… దానికి ప్రదీప్ ఏం చేస్తాడు..? ప్రదీప్ తాతల్ని, తోపుల్ని తెచ్చినా చేసేదేమీ ఉండదు…
ప్రదీప్ అప్పుడెప్పుడో పూర్వకాలం నుంచీ యాంకర్‌గా చేస్తున్నాడు… కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా అనేది పాపులర్, హిట్ షో… బాగుండేది… తను ఎక్కువగా అసోసియేట్ అయ్యేది జీతెలుగుతోనే… కానీ ఆ ఒక్క షో మినహా తను జీటీవీకి చేసిన ఏ షో కూడా పెద్దగా క్లిక్ కాలేదు… రీసెంటుగా వచ్చిన వాటిల్లో సూపర్ సీరియల్ చాంపియన్ షిప్, సరిగమ కూడా ఫ్లాప్… మాటీవికి సుమతో కలిసి చేసిన పెళ్లిచూపులు ఓ డిజాస్టర్…
ఇప్పుడు ఈటీవీలో వచ్చే ఢీ డాన్స్ షో కాస్త నయం… అఫ్‌కోర్స్, సుధీర్-రష్మి జంట వెళ్లిపోయాక ఆ షో కూడా పాపులారిటీలో దిగజారిపోయింది… సో, ప్రదీప్ కాస్త బెటర్ షోలు ఎంపిక చేసుకోవచ్చు కదా అంటారా…? ఆ జీటీవీ వాళ్ల రియాలిటీ షోలలో క్రియేటివిటీ ఉండదు, అవేమీ క్లిక్ కావు అంటారా..? నో, నో, షో ఒప్పుకున్నామా..? వెళ్లామా..? చేశామా..? డబ్బులొచ్చాయా..? అంతే…
Ads
మార్కెట్‌లో సేమ్ క్వాలిటీస్ ఉన్న మరో మగ యాంకరుడు లేడు… అది ప్రదీప్‌కు ప్లస్… రవి యాంకరింగులో ప్రతిభావంతుడే కానీ ఎక్కడో బాగా తేడా కొడుతోంది… హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుధీర్ తదితరులు బేసిక్‌గా కమెడియన్లు… వాళ్ల పర్‌ఫామెన్స్ కామెడీ మీద ఫోకస్ అయి ఉంటుంది… సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకరింగ్ బాగానే చేస్తున్నాడు కానీ తన ప్రయారిటీలు వేరు… తను ఫుల్ టైమ్ యాంకర్ కాదు…
వాస్తవానికి ఏ షో అయినా సరే మంచి యాంకర్ అదనపు విలువ అవుతాడే తప్ప, కేవలం యాంకర్ ప్రతిభతో షోలు నడవవు… బేసిక్‌గా కంటెంటులో, ప్లానింగులో దమ్ముండాలి, కొత్తదనం ఉండాలి, ప్రేక్షకుడిని ఆ టైమ్‌కు ఆ షో వద్దకు రప్పించాలి… ఎన్ని ఉదాహరణలు చూశాం ఈమధ్యే… మాస్టర్ చెఫ్‌లో తమన్నా, అనసూయ… ఎవరు మీలో కోటీశ్వరుడులో జూనియర్ ఎన్టీయార్… అసలు ఇవి కాదు, మరో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది… అసలు యాంకర్లకే తాత ఓంకార్… యాంకార్… తనే నిర్మించి, తనే కాన్సంట్రేట్ చేసి, తనే కాన్సెప్టు రూపొందించుకుని, తనే కంటెంట్ రాసుకుని హిట్ చేసుకున్న షోలు ఉన్నయ్… అలాంటి ఓంకార్ నటించే మాయద్వీపం తాజా రేటింగ్స్ అయితే మరీ ఘోరంగా 0.83కు పడిపోయాయి… మరీ తలవంపుల రిజల్ట్… సో, సరుకులో నాణ్యత ఉండాలే తప్ప, యాంకర్లతో పడిపోవడాలు, పెరిగిపోవడాలు ఏమీ ఉండవ్… ఆ కోణంలో ప్రదీప్ షోల రిజల్ట్ కూడా జస్ట్, బ్యాడ్ లక్… నాట్ హిజ్ ఫాల్ట్…!!
Share this Article