ఒక లేడీ ఫోటో… ఆమె టీ షర్టుపై ఇంగ్లిషులో రాసి ఉంది… యోగాకన్నా సంభోగం బెటర్ అని అర్థం… పోనీ, ఆమె అభిరుచి, ఆసక్తి అదే అయితే ఆచరించనీ, అనుసరించనీ… మధ్యలో యోగాను ఎందుకు లాగడం… చిల్లరతనం కాకపోతే… ఢిల్లీ జేఎన్యూ విద్యార్థుల్లో ఇలాంటి పోకడలు ఎక్కువ గమనిస్తుంటాం… ఆ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయడానికి మనస్కరించడం లేదు…
చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంది… యోగా కూడా బీజేపీ ఎజెండా అని… మోడీ దాన్ని పాపులర్ చేసేసరికి ఇక ఓ సెక్షన్ యోగాను ద్వేషించడం స్టార్ట్ చేసింది… వామపక్ష పత్రికల్లో ఒకాయన ఎడాపెడా రాస్తుంటాడు, పక్కా కాషాయ ద్వేషం… సరే, తన పొలిటికల్ లైన్ తనిష్టం… లెఫ్ట్ అంటేనే యాంటీ మోడీ కదా… యాంటీ హిందూ కదా… ఆ రాతలు ఓ వికృతానందం…
తనేం రాస్తాడంటే..? యోగా బౌద్ధానికి సంబంధించింది… దీన్ని పాపురల్ చేసే యోగాడే ప్రకటించే నైతికత వీళ్లకు ఉందా అని ప్రశ్నిస్తాడు… వోకే, బౌద్ధం నేర్పిన ఆరోగ్య రహస్యమే అయితే అభినందనీయమే కదా… బౌద్ధం పుట్టుక కూడా భారతదేశమే కదా… యోగాను భారతదేశమే పరిచయం చేసింది కదా… దాన్ని హిందూ మత ఆచరణ అని ఎవరూ చెప్పడం లేదు కదా… మరెందుకు ఈ ద్వేషం యోగా మీద…
Ads
యోగా నిర్బంధమేమీ కాదు కదా… ఐచ్ఛికం… అంటే ఇష్టముంటేనే ఆచరించమని చెప్పడం..! ఐనా సరే, మోడీ చెప్పాడు, మనం ద్వేషిద్దాం… ఇదొక్కటే సూత్రం… అక్కడికి యోగా మీద మోడీయో, పతంజలో పేటెంట్స్ ఉన్నాయని చెప్పినట్టు..!! ఏ అంశం తీసుకున్నా సరే యాంటీ మోడీ కళ్లద్దాలతో చూడటం నిజంగా ఓ పర్వర్షన్… మోడీని తిట్టడానికి బోలెడు అంశాలు దొరుకుతాయి… అవి చేతకావు… ఇదుగో ఇవీ వీళ్ల ప్రచారాలు…
మిత్రుడు నాగరాజు మున్నూరు ఫేస్‌బుక్‌లో రాసిన పోస్టు కూడా ఆలోచనాత్మకంగా ఉంది… అదిలా యథాతథంగా…
హిందువులు ఏదైనా పండగ చేసుకున్నా, భారతదేశ సంస్కృతిని గుర్తుచేసే కార్యక్రమాలు చేసినా కేవలం హిందూ మతాన్ని ద్వేషించేవారు, ముసుగు నాస్తికులు ఇలాంటి కోటేషన్లతో తయారైపోతారు.
పై ఫోటో జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటూ ఉంటే, కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ యోగాను హేళన చేశారు. అయితే వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే యోగాలో ఆకలి దప్పులు అవకుండా ఉండే విద్య కూడా ఉంది. ఈ విద్య అర్హుడైన ముముక్షువుకు మాత్రమే నేర్పబడుతుంది. ఆ అర్హత నిర్ణయించేది గురువు మాత్రమే. రిఫరెన్స్ కోసం స్వామీ రామ గారు రాసిన “హిమాలయ పరమ గురువులతో జీవనం” అనే పుస్తకాన్ని చదవండి.
ఎప్పుడైనా ఆలోచించారా మనం ఉదయం టిఫిన్ చేస్తే మధ్యాన్నానికి ఆకలి వేస్తుంది. అలవాటు లేనివాళ్ళు ఒకరోజు ఉపవాసం కూడా చేయలేరు. అటువంటిది హిమాలయాల్లో తపస్సు చేసే యోగులు రోజులు కాదు, వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాల తరబడి తపస్సు ఎలా చేయగలుగుతున్నారు?
స్వామీ రామ గారు ఉత్తరాఖండ్ మొదలు అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాల్లో అనేక యోగులను, ఋషులను కలిసి వారి అనుభవాలను పుస్తకంలో రాశారు. ఉత్తరాఖండ్ ఘర్వాల్ రేంజ్ హిమాలయాల్లో ఒక యోగిని కలవడానికి జన సంచారం లేని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ బాగా వృద్ధుడైన ఒక యోగిని కలిశారు. ఆ యోగి దగ్గర తినడానికి ఆహారం, నీరు వంటివి ఏవి లేవు. చాలా దూరం నుండి వచ్చిన స్వామి రామ కోసం సూర్య భేది విద్య ద్వారా ఒక పాత్రలో రసగుల్లాలు సృష్టించి ఇస్తారు. అప్పుడే ఈ యోగి ఆహార దప్పికలు తీరడానికి యోగులు, ఋషులు ఈ విద్యను ఎలా ఉపయోగిస్తారు అనేది స్వామి రామ గారికి చెబుతారు.
మీకేమైనా అనుమానాలు ఉంటే స్వామి రామ గారి “హిమాయల పరమ గురువులతో జీవనం” పుస్తకాన్ని చదవండి.
Ps: నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఈ పుస్తకం చదివాను. ఇంకా చాలా ఉంది రాయడానికి కాని ఓపిక లేదు, ఇంకా కొన్ని విషయాలు గుర్తుకులేవు.
Share this Article