ఒక గిరిజన బిడ్డ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదుర్కొని అడ్వొకేట్ అయి, కష్టపడి చదువుకుని ప్రభుత్వ అధికారి అయ్యింది . గతంలో ఒక సన్నాసి గాడిదను పెళ్లి చేసుకుంది, కవలలు పుట్టారు. ఇద్దరూ ఒకే స్థాయి అధికారులు, అభిప్రాయ బేధాలు వచ్చి విడిపోయారు… కవలల బాధ్యతలు సమంగా పంచుకున్నారు.
కుల పెద్దల సమక్షంలో విడిపోయారు, ఆమెకు యాభై లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు. రాసుకున్న ఆధారాలు కూడా ఉన్నాయి , ఈలోగా ఆమెకు మంచి కొలువు వచ్చింది. ఆమె విశాఖలో కొలువులో ఉన్నప్పుడు రాబందుల్లా వెంటాడి వేధించారు. ఈ మధ్యలోనే ఒక మిత్రునికి దగ్గర అయ్యింది, సహజీవనం చేసారు, ఒక బిడ్డను కన్నారు. ..
ఇపుడు ఆ బిడ్డ ఎవరితో కన్నదో ఆమె వ్యక్తిగత ఇష్టం . నేను మరొకరిని పెళ్లి చేసుకున్నాను అంటోంది. ఇక మీకేమి అవసరంరా గాడిదలారా … మీ రాజకీయ దిగజారుడుతనానికి ఒక గిరిజన బిడ్డ పరువు అవసరం వచ్చిందా, ఆంధ్రా రాజకీయం ఇంత నీచంగా వికృతంగా దిగజారి పోయిందా ?
Ads
పితృస్వామిక అహంకారానికి కులం, రాజ్యం, మీడియా కలిస్తే ఎంత వికృతంగా ఉంటదో ఆ గిరిజన బిడ్డ మీద జరుగుతున్న దాడి అవమానం, శీల హననం చెబుతోంది. ఐదారు రోజులుగా ఆమెను రాబందుల్లా పీక్కుతింటున్న పాత్రికేయులు, కుక్కలు… ఇంత జరుగుతున్నా ఏ ఒక్క పార్టీ , మహిళా సంఘం ఆమెకు ఆసరా అవలేదు. అదే ఆమె ఒక అగ్రకుల స్త్రీ అయితే ఇలానే ఉండేదా ?
ఆమె మీద అభాండాలు వేస్తున్న మదన్ అనే సన్నాసి US లో చదువుకున్నాడట. ఆమెను ఇంత కాలం వదిలేసి, ఇప్పుడు నలభై కోట్లు డిమాండ్ చేస్తున్నాడట . ఆమె ఎవరితోనో పడుకుని పిల్లలను కన్నది అని అంటున్నాడట. వాడు మనిషేనా అసలు ..? ఇలాంటి వాణ్ణి ఎన్కౌంటర్ చేయాలి. గిరిజన బ్రతుకుల్లో యే ఒక్కరో ఇద్దరో ఇలా అధికారులు అవుతారు, అలాంటి వాళ్ళను ఇలా బజారుకి ఈడ్చి బ్రతుకు జట్కా బండి నడిపే రాజకీయానికి సిగ్గు ఉండాలి . అవి రాజకీయాలా ?
ఇతరుల బెడ్ రూమ్ ముచ్చట్లు బైటేసి తీర్పులు ఇచ్చే తీర్పరులకు నా నివాళి . ఒక్క దళిత, గిరిజన ఆదివాసీ సంఘం ఖండన ఇవ్వ నందుకు వారికి నా నివాళి .
రాబోయే రోజుల్లో మేము ఫలానా వ్యక్తికి మాత్రమే పుట్టాము అని నిరూపించే DNA రిపోర్ట్ మూర్చ బిళ్ళలుగా తగిలించుకుని తిరగాలి అన్నమాట.
కడుపులో పిండాన్ని చీల్చి శూలాలకు గుచ్చేవాళ్లకు, ఆ గిరిజన మహిళ బిడ్డకు తండ్రి ఎవరు అని అడిగేవాళ్లకు పెద్దగా తేడా లేదు . మహిళా కమీషన్ , ఆంధ్రా సమాజమా మీ చైతన్యాన్ని చూసి జనాలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు … పిటి… By గుఱ్రం సీతారాములు…
Share this Article