గుర్తుందా..? ఆమధ్య కొన్నిరోజులపాటు యూట్యూబ్ చానెళ్లు, సైట్లే గాకుండా సోషల్ మీడియా పోస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు సైతం ఓ అంశాన్ని రచ్చ రచ్చ చేశాయి… ఏమిటంటే..? బిగ్‌బాస్ గత సీజన్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంతు, మరో కంటెస్టెంట్ షణ్ముఖ్ ఫుల్లు రెచ్చిపోయి బిహేవ్ చేసి, మొత్తం షో అంతా కంపు చేశారని బోలెడు విమర్శలొచ్చినయ్ కదా… తీరా చూస్తే సిరికి బయట శ్రీహాన్ అనే లవర్… లవర్ ఏమిటి సహజీవనమే అన్నారు… షణ్ముఖ్‌కు కూడా మరో లవర్ దీప్తి ఉన్నారు… త్వరలో వివాహం అని కూడా చెప్పారు… మరి బిగ్‌బాస్ టీమోడు చెప్పగానే అంతగా రెచ్చిపోవాలాా..? ఇవీ అప్పట్లో వార్తలు…
తరువాత ఏమైంది..? బిగ్‌బాస్ షో ఒడిశింది… బయటికొచ్చారు… సిరితో శ్రీహాన్ కట్ చేసుకున్నాడు, షన్నూను దీప్తి కట్ చేసింది… ఆ బిగ్‌బాస్ ప్రేమికులు మాత్రం ఎంచక్కా వైజాగు వెళ్లి ఎంజాయ్ చేయసాగారు… కొన్నిరోజులపాటు ఇవే వార్తలు… షన్నూ పిచ్చోడయ్యాడా..? శ్రీహాన్ పిచ్చోడయ్యాడా..? అసలు సిరి, షన్నూ పాత కథలేమిటి..? దాకా మస్తు తవ్వారు అందరూ… ఇక ఒక దశలో… ఆపండ్రోయ్ అని పాఠకులు జుత్తు పీక్కునేదాకా పోయింది ఈ కథన సునామీ..,
Ads
తీరా ఇప్పుడు ఏమైంది..? ఏమీ కాలేదు… ప్రేక్షకులు, పాఠకులు మాత్రమే పిచ్చోళ్లు అని నిరూపించేశారు… సిరి, శ్రీహాన్ కలిసిపోయారు… సింపుల్… ఈ టీవీ, సినిమా ఇండస్ట్రీలో కలవడం ఎంతసేపు, ఛీఫో అనే బ్రేకప్పులు ఎంతసేపు, తిరిగి కలయికలు ఎంతసేపు..? సబ్ చల్తా… ఎంచక్కా ఇద్దరూ కలిసి యాంకర్ రవికి ఇంటికి జంటగా వెళ్లి పండుగ చేసుకున్నారు… వీళ్లిద్దరికీ నచ్చజెప్పి మళ్లీ కలిపింది రవి, తన భార్య నిత్యా సక్సేనా..? కావచ్చు, మంచిదేలే… సరే, ఇది బాగానే ఉంది గానీ… ఫాఫం, దీప్తి సంగతేమిటి..? ఇంకా ఫాఫం, షన్నూ కథేమిటి..? ఎహె, అదే యాంకర్ రవి దగ్గరకు వెళ్లి, కలిసిపొండి… ఓ పనైపోతుంది…!!
Share this Article