Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదుగో ఇక్కడి నుంచి స్టార్టయింది శోభన్‌బాబుకు మహిళా ఫాలోయింగు

May 18, 2024 by M S R

Subramanyam Dogiparthi ………  వీరాభిమన్యు , మనుషులు మారాలి , చెల్లెలి కాపురం సినిమాలలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న శోభన్ బాబు 1971 లో వచ్చిన ఈ తాసిల్దారు గారి అమ్మాయి సినిమాతో ఫీల్డులో పెద్ద హీరోగా పూర్తిగా నిలదొక్కుకున్నాడు . అప్పటికే పెద్ద నటిగా పేరున్న జమున పక్కన ధీటుగా నటించారు . పైగా తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం .

ఈ సినిమాకు ముందు పొట్టి ప్లీడరులో రెండు పాత్రల్లో కనిపించినా , ఈ సినిమాలోని రెండు పాత్రలు ఫుల్ లెంగ్త్ పాత్రలు . ఈ రెండు పాత్రలతో శోభన్ బాబు ప్రేక్షకులలో , ముఖ్యంగా మహిళా ప్రేక్షకులలో , స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు . 1971 శోభన్ బాబుకు లక్కీ ఇయర్ . మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి …

ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వచ్చిన కావిలిపాటి విజయలక్ష్మి నవల విధి విన్యాసాలు ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది . ప్రముఖ దర్శకులు కె యస్ ప్రకాశరావు దర్శకత్వంలో యన్ ఆర్ నంది డైలాగులు వ్రాసారు . తాసిల్దారు గారి అమ్మాయి ఓ బస్ కండక్టర్ని ప్రేమించి పెళ్ళి చేసుకోవటం , ఇగో గొడవలతో విడిపోవటం , చివర్లో కొడుకు ద్వారా కలవటం క్లుప్తంగా కధ .
జమున , శోభన్ బాబులు పోటాపోటీగా నటించారు . చంద్రకళ , నాగభూషణం , రాజబాబు , రావి కొండలరావు , సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు . కె యస్ ప్రకాశరావు కుమారుడు , ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . నీకున్నది నేనని , నాకున్నది నీవని , పాడమన్నావు పాడుతున్నాను , చకచకలాడే నడుము చూడు , అల్లరి చేసే వయసుండాలి ఆశలు రేపే మనసుండాలి , కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం , జాగిరి జాగిరి జాగిరి బావా పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

ఆరు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . శత దినోత్సవం ఫంక్షన్ రాజమండ్రిలో అక్కినేని ముఖ్య అతిధిగా జరిగింది . శోభన్ బాబుకు ఆంధ్రా ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ నుండి ఉత్తమ నటుడు పురస్కారం కూడా లభించింది .

Ads

By the way , ఈ సినిమా నిర్మాతలు సత్యనారాయణ , సూర్యనారాయణలే తర్వాత కాలంలో NTR తో సూపర్ హిట్ అడవిరాముడు సినిమాను తీసింది . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో రెండు సార్లు చూసా . నాకు బాగా నచ్చిన feel good movie . టి విలో కూడా వచ్చింది . సినిమా యూట్యూబులో లేదు . ఎందుకనో !? #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎర్ర రాజకీయాలకు కొరుకుడుపడని కొయ్య… కేరళ కొత్త ముఖ్యమంత్రి…
  • మనోభావాల యూనివర్శిటీ… విభిన్న కోర్సులకు అడ్మిషన్ల నోటిఫికేషన్…
  • బాధితురాలిని బజారుకు లాగడం పక్కా నేరం, అనైతికం…!!
  • ఎటూ మొగ్గు లేదు.., ఎవరికీ వత్తాసు లేదు – సీఎం రేవంత్ పరిణతి…
  • కాసింత నువ్వుల నూనె… ఓ నల్ల రిబ్బన్ ముక్క… కాసిన్ని నల్ల నువ్వులు…
  • ‘‘నా స్టార్‌డమ్ ఎంత అల్పమైందో నాకప్పుడు అర్థమైంది’’
  • ప్రతీక్ యాదవ్..! ములాయం చిన్న కొడుకు కథ కూడా ఓ సినిమా స్క్రిప్టే..!!
  • … ఇప్పుడైతే పోలీసుల మనోభావాలు దెబ్బతినేవేమో…!!
  • బుల్డోజర్ జస్టిస్… మజ్లిస్ నేతకు దెబ్బ… నేరస్తులకు షెల్టరిస్తే ఇల్లే ఉండదు..!
  • ఎంతసేపూ పూరేకలు విచ్చుకోవడంపైనేనా వేటూరి దృష్టి..!?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions