ఏమో… విశాఖపట్నం డెక్కన్ క్రానికల్ ఆఫీసు బోర్డును తగులబెట్టి, నిరసన ప్రకటించిన తెలుగుదేశం కేడర్ అనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది… ఇదేకాదు, ఓయూలో, బల్కంపేట గుడి దగ్గర జర్నలిస్టుల మీద తెలంగాణ పోలీసుల దాష్టికం కూడా సేమ్ ఆశ్చర్యం…
ప్రభుత్వాలు మారితే… పోలీసులకు ఇక హఠాత్తుగా అపరిమిత అధికారాలు వస్తుంటాయి… బహుశా అధికారంలో ఉన్నవాళ్లను పరీక్షించడం కోసం చేస్తారేమో అలా…. లేకపోతే వాళ్ల తత్వమే అది కాబట్టి ప్రదర్శిస్తారేమో…
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విషయంలో టీడీపీ కూటమి యూటర్న్ తీసుకుందని డెక్కన్ క్రానికల్ ఏదో స్టోరీ రాసిందట… రాస్తే రాసి ఉండవచ్చు… ఏపీలో దాన్ని చదివేవాళ్లు ఎందరు..? వోకే, రాశారు పో, ఈ తగులబెట్టడాలు, నిరసనలు ఏమిటి అసలు..?
Ads
అక్షరయోధుడు, అనితరసాధ్యుడు, అమరజీవి రామోజీరావు ది గ్రేట్, చరిత్రాత్మక అక్షరాశయాల మేరకు నడిచే ప్రభుత్వమేనా ఇది..? వెంటనే జాప్ తదితర జర్నలిస్టు సంఘాలు ఖండించాయి… కానీ అసలు ఎవరి ప్రోద్బలం మేరకు ఈ నిరసనలు, దాడులు జరిగాయి అనేది కదా అసలు ప్రశ్న…
అప్పుడెప్పుడో హైదరాబాద్ డెక్కన్ క్రానికల్ ఎదుట శ్రీమాన్ పవన్ కల్యాణ్… అవును, ప్రస్తుత ప్రభుత్వంలో కీలకనేత పవన్ కల్యాణ్ అప్పట్లో బైఠాయించిన తీరు గుర్తొచ్చింది… మళ్లీ ఆ రోజులు వచ్చేశాయా..? చంద్రబాబులో పరిణతి మాట పక్కన పెడితే పవన్ కల్యాణ్‌లో పరిణతి సేమ్ అప్పటి స్థాయిలోనే ఉండిపోయిందా..?
వార్త నచ్చకపోతే రిజాయిండర్ ఇవ్వొచ్చు, సేమ్ ప్రయారిటీతో పబ్లిష్ చేయాలని డిమాండ్ చేయొచ్చు, ప్రెస్ కౌన్సిల్‌కు వెళ్లొచ్చు, సరే, అది ఎలాగూ కోరలు లేని నామ్‌కేవాస్తే సంస్థ కాబట్టి నేరుగా మేనేజ్‌మెంట్‌తోనే డీల్ చేయొచ్చు… అవన్నీ కాదని దాడులు ఏమిటి..? చంద్రబాబు ఇమేజీకి తగని చర్యలు ఇవన్నీ… ఇప్పటికే సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ప్రసారాలను ఆపివేయించారనే అపప్రథ ఉండనే ఉంది… ఏమిటీ రెడ్ బుక్ రాజ్యాంగం సార్..?
సరే, తెలంగాణకు వస్తే పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు… అది నిజం… సంయమనం లోపిస్తోంది… ఐతే యాంటీ -కాంగ్రెస్ జర్నలిస్టు సంఘాలు వెంటనే అందుకుని రచ్చ చేస్తున్నాయి… ఐనాసరే, సమర్థించాలి వాటిని… ఎందుకంటే..? పోలీసులపై ప్రభుత్వం అదుపు తప్పితే అందరికీ ప్రమాదమే కాబట్టి…
కానీ బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టుల మీద మాట్లాడే అర్హత ఉందా అసలు..? దయచేసి మాట్లాడకండి సార్… బీఆర్ఎస్ అనుబంధ జర్నలిస్టు సంఘాలు ఎంత నోళ్లు మూసుకుని ఉంటే అంత గౌరవం… అసంఘటిత కార్మికులు, హమాలీలతో జర్నలిస్టులను కూడా జతచేసిన ప్రభుత్వం వాళ్లది… నోళ్లు నొక్కిన సర్కారు వాళ్లది…
సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా సరే, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కాజేసే కుట్ర జేసిన, సీటు కింద ఫైల్ పెట్టేసుకున్న దుర్మార్గపు సర్కారు అది… మీరు కూడా మాట్లాడితే ఎలా సార్..? మీమీద జాలిపడితే వాడసలు జర్నలిస్టే కాడు..!!
Share this Article