ఒక వార్త చదవబడ్డాను… చివరి వరకూ ఏదేదో రాసుకుంటూ వచ్చాడు సదరు విలేకరి, వోకే… చివరలో హఠాత్తుగా మౌస్ ఆగిపోయింది… ఒకటికిరెండుసార్లు చదవబడింది… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? నాగచైతన్య బాగా ఆశలు పెట్టుకున్న సినిమా తండేల్… దాదాపు వంద కోట్లు పెడుతోందట గీతా ఆర్ట్స్ సంస్థ… పర్లేదు, ఫస్ట్ పోస్టర్ నుంచి టీజర్ దాకా అన్నీ కాస్త పర్లేదనే అనిపించాయి… చిత్రీకరణ చివరి దశలో ఉంది… నాగచైతన్య కష్టపడుతూ ఉన్నాడు… క్రిస్టమస్‌కు రిలీజ్ అన్నారు గానీ, […]
రాజకీయ అల్లర్లకు తోడుగా బంగ్లాలో పెచ్చరిల్లిన మతహింస..!!
అచ్చం మాల్దీవుల్లాగే… ఇండియా ఎంత సాయం చేసినా సరే, ఎంతగా సత్సంబంధాల్ని కోరుకున్నా సరే… మతం కోణంలో బంగ్లాదేశ్ ప్రజలు ఇండియా మీద విద్వేషాన్ని పెంచుకుని, విషాన్ని కక్కుతూనే ఉన్నారు… ఇప్పుడూ అంతే… బంగ్లాదేశ్ విముక్తికి ముందు లక్షలాది మంది ఇండియాకు తరలివచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు… అందులో హిందువులున్నారు, ముస్లింలూ ఉన్నారు… ప్రపంచం అంతా వారిస్తున్నా సరే, అమెరికా వంటి అగ్రదేశం వ్యతిరేకించినా సరే అప్పట్లో ఇందిరాగాంధీ అపరకాళికలా ఉరిమి, బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించింది… అవసరం తీరింది […]
పుట్టిన రోజుకూ ఏడుపు సాంగ్ రాసిచ్చాడు ఆత్రేయ… ఆయనంతే…
ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. “హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. “ అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. “బర్త్ డే సాంగా ? “ అడిగారు ఆత్రేయ … “ఏమంట్లా ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది “ అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … “ పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ […]
సో వాట్…? కలెక్టర్ ఆటవిడుపు ఫోటోలకు ఈనాడు మెయిన్ పేజీ ఇంపార్టెన్సా..?!
ఒక వార్త… అదీ ది గ్రేట్ ఈనాడులో.,. పొలం బాటలో కలెక్టర్ దంపతులు అని శీర్షిక… పొలం బాట అనేది సర్కారీ ప్రోగ్రాం పేరు కాదులెండి… నిత్యం సమీక్షలు, క్షేత్ర పర్యటనలో తీరిక లేకుండా విధులు నిర్వహించే కలెక్టర్ ఆదివారం పూట ఆటవిడుపుగా పొలం బాటపట్టారు… అనేది వార్త సారాంశం… నిజానికి అది ఓ ఫోటో వార్త… అంటే రైటప్‌కు ఎక్కువ, వార్తకు తక్కువ… సదరు కలెక్టర్ మెదక్ జిల్లాకు కలెక్టర్, పేరు రాహుల్ రాజ్… ఆయన […]
అందరూ డబుల్ రోల్ అంటారు గానీ… నిజానికి వాణిశ్రీ ట్రిపుల్ రోల్ ..!!
చూసారా ! తప్పకుండా చూసే ఉంటారు . చూసినా చూడొచ్చు . ఎన్ని సార్లయినా చూడొచ్చు . అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ . వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి . అందరూ ఆమె ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను . పల్లెటూరి అల్లరి చిన్నదిగా – చాదస్తపు గృహిణిగా నటించింది ఒక పాత్ర . తోడికోడలు కొడుకు చనిపోయాక పిచ్చిదానిగా నటించింది ఒక పాత్ర […]
పాపం శమించుగాక… బంగ్లాదేశ్ సరే… మరి మన బంగళాలు పదిలమేనా..?
అచ్చం అప్పట్లో శ్రీలంకలో జరిగినట్టుగానే… ఇప్పుడు బంగ్లాదేశ్… ఒక్కసారి మూకలు అదుపు తప్పితే… కారణాలేవైనా గానీ… అత్యంత పటిష్ఠ భద్రత అని మనం పైకి చెప్పుకునే అన్ని బారికేడ్లు విరిగిపోతాయి… సైన్యం, పోలీసులు చేష్టలు దక్కుతాయి… అధ్యక్షులు, ప్రధానులు చివరకు బతుకుజీవుడా అని పారిపోవాల్సి వస్తుంది… వాళ్ల నివాసభవనాలను మూకలు ప్రతి అంగుళం దోచేస్తారు, తగలేస్తారు, సెల్ఫీలు దిగుతారు… అదొక సామూహిక ఉన్మాద స్థితి… బంగ్లా ఇందిరగా చెప్పబడే షేక్ హసీనా, ఏళ్లకేళ్లుగా పాలిస్తున్న ఓతరహా నియంత […]
అనిరుధ్… చివరకు నువ్వు కూడా… ఆ శ్రీలంక పాటను ఎత్తేశావా..?
మనికె మగే హితే… అని ఆమధ్య, అంటే రెండుమూడేళ్ల క్రితం ఓ శ్రీలంక గాయని పాడిన పాట ఇండియాలోనూ ఓ ఊపు ఊపేసింది… 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్ ఒరిజినల్ వీడియోకు… దాన్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు చేశారు… అవీ హిట్… సరే, ఇప్పుడు ఆ పాట విశేషాలు చెప్పుకోవడం కాదిక్కడ మనం… కానీ… అరె, ఒక థమన్, ఒక డీఎస్పీయే కాదు… మన దేశీయ సంగీత దర్శకుల కన్నెండుకు పడలేదబ్బా […]
సుమను ఆ యాక్టరుడు కిస్సాడు సరే… నడుమ చిన్మయికేం నొప్పి..?!
ఒక వార్త అనుకోకుండా చదవబడ్డాను… అదేమిటంటే…? తంగలాన్ అని ఓ సినిమా వస్తోంది కదా… విక్రమ్ హీరోగా చేసిన సినిమా… ఇప్పుడన్నీ పాన్ ఇండియా అనబడు బహుళ డబ్బింగ్ సినిమాల రిలీజులే కదా… ఇది కూడా అదే పాన్ ఇండియా ముద్ర వేసుకుని, అధిక మార్కెట్ కలిగిన తెలుగులోకి కూడా వచ్చుచుండెను… కొందరు నిర్మాతలు స్ట్రెయిట్ సినిమాలవలె తెలుగులోనూ ప్రమోషన్లు నిర్వహిస్తూ ఉంటారు… అందులో భాగముగానే ప్రిరిలీజ్ ఫంక్షన్ ఒకటి హైదరాబాదు నగరంలోనూ నిర్వహించిరి… మన మిస్టర్ […]
అడ్వెంచర్, ప్రైవసీ కోసం… ‘పారడైజ్’ వెళ్లినా సరే… సమస్యలుంటయ్…
సినిమా పేరు Paradise . చాలా బాగుంది . మళయాళం సినిమా ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో . తమ అయిదవ వెడ్డింగ్ ఏనివర్శరీని జరుపుకునేందుకు ఒక ఇండియన్ జంట శ్రీలంకకు వెళతారు . 2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో నేపధ్యంలో తీయబడిన సినిమా . ఆ జంట శ్రీలంకలో రామాయణం లోని ముఖ్య ఘటనల ప్రదేశాలను సందర్శిస్తారు . వాళ్ళతోపాటు మనకూ చక్కగా చూపించారు . మనకు బాగా నచ్చుతుంది . ఆ తర్వాత శ్రీలంక ప్రకృతి […]
తేడా జస్ట్, ఐదు మిల్లీ సెకన్లు… ఎవరు విజేత..? ఎవరు పరాజితుడు..?
రాత్రి 1.10 ని. లు… స్టేడియం అంతా సందడి… ఉత్కంఠ… పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. జమైకాకు చెందిన Kishane Thompson సింహ గర్జన లాంటిదేదో చేసి వచ్చి తన లైన్లో నిలుచున్నాడు. అమెరికాకు చెందిన Noah Lyles తన అంత ఎత్తు ఎగురుతూ, దుంకుతూ దాదాపు 100 మీ. లు ముందే ఉరికి వచ్చాడు. చాలా అతి అనిపించింది. వీడు ఖచ్చితంగా చివరగా ఉంటాడు అనుకున్నాను. రేస్ మొదలైంది. మైదానం అంతా చెవులు చిల్లులు […]
రేవంత్ మీద కోపమా..? తెలంగాణ కరెంటోళ్లు కావాలనే చేస్తున్నారా..?
పెద్ద పెద్ద పాలన వ్యవహారాలు కాదు… చిన్న చిన్న సేవ వ్యవహారాల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది… ట్రాఫిక్ చాలాన్ల దగ్గర నుంచి అత్యవసర సేవల దాకా..! వందలు, వేల కోట్ల జీతాలిస్తూ ఉద్యోగుల్ని, సిస్టమ్‌ను రన్ చేస్తున్నా సరే, కీలక స్థానాల్లో తిష్ఠ వేసే ఉన్నతాధికారులకు ఈ సేవాలోపాలు పట్టవు… అవి అంతిమంగా ప్రభుత్వం మీద, అనగా పాలక పార్టీని కూడా ప్రభావితం చేస్తుంటాయి… అదేమో రాజకీయ నాయకులకు అర్థం కాదు… ఉదాహరణకు… కరెంటు బిల్లులు… తెలంగాణలో […]
ఆటోఫాగీ..! ఉపవాసం ఆరోగ్యానికి ఎందుకు మంచిదో చెప్పే శాస్త్రీయ పదం..!
దాదాపు అన్ని మతాల్లోనూ దేవుడి పేరిట ఉపవాసం చేస్తారు. అయితే, ఈ ఉపవాసాల వెనుక ఉన్న సైన్స్ ని 2016 వరకు ఎవరూ శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. ఉపవాసం యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యతను గుర్తించడం చాలా ఆలస్యంగా జరిగింది. 2016 ముందు వరకు, ఎందుకూ పనికిరాని ఉపవాసాలు ఎందుకు? దేవుడు లేడు, గీవుడు లేడు. ఛస్ ఉపవాసం ఒక చెత్త, పరమ రోత, ఎందుకూ పనికిరాని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. ఉపవాసం ఒక మూర్ఖత్వం, అది ఒక […]
న్యాయం జీవితకాలం లేటు… మరణించాక ఆరేళ్లకు నిర్దోషిగా తీర్పు…
నిన్న మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లోక్ అదాలత్‌ల ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ, ఎక్కడో మాట్లాడుతూ ప్రజలు కోర్టు వ్యవహారాలతో విసిగిపోయి, సెటిల్మెంట్ కోరుకుంటున్నారని అన్నారు… కరెక్ట్… నిజం, మన న్యాయవ్యవస్థలోని అపెక్స్ కోర్టు దీన్నే సరిదిద్దాల్సి ఉంది… మన న్యాయవ్యవస్థ పనితీరులో లోపాల వెల్లడికి మచ్చుకు ఓ కేసు… నిఖార్సయిన ఉదాహరణ… తెలంగాణ… పాత మెదక్ జిల్లా… దుబ్బాక మండలం, పెద్దగుండవెల్లి గ్రామం… 2013,ఫిబ్రవరిలో గుండెల పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు… నేరారోపణ ఏమిటంటే… కన్నతల్లిని పోచయ్య […]
షీరోగా జయసుధ తొలి సినిమా… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదామె…
జయసుధ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 1975 సెప్టెంబరులో వచ్చిన ఈ లక్ష్మణరేఖ సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటి రెండు సినిమాలు విలన్ గానో , అప్రధాన పాత్రల్లోనో నటించింది . షీరోగా నటించి , గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఇదే . భవిష్యత్తులో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోగలదు అనే సంకేతం ఈ సినిమాలోనే ఇస్తుంది . గ్లామర్ , విషాద పాత్రల్లో కన్నాంబ , సావిత్రి […]
సిట్యుయేషన్‌షిప్… బెంచింగ్… కఫింగ్… హాహాశ్చర్యపోకండి, చదవండి…
మిత్రుడు మంగళంపల్లి శ్రీహరి పోస్టు ఓసారి సావధానంగా చదవండి… అమ్మా కూతురు కల్యాణి సౌజీ స్నేహితుల్లా ఉంటారు… బెంగళూరులో జాబ్ లో జాయిన్ అయ్యాక మూన్నెల్లకి గానీ రావడం కుదరలేదు సౌజీకి… మొదటి వారం రోజూ ఫోన్ మాట్లాడుకున్నా… షిఫ్టులు సరిగా ఉండకపోవడం… ఎక్కువ టైం వర్క్ ఉండడం వల్ల ఫోన్ కూడా కుదరలేదు…. ఇద్దరికీ… ఈ వారం రోజులు అన్నీ చెప్పేసుకోవాలి… కూతురుకిష్టమైనవన్నీ చేసి పెట్టాలి… రాత్రి తిన్నాక ఇద్దరూ రూఫ్ గార్డెన్ లో కూర్చున్నారు… […]
రష్యా, ఇరాన్ కలిసి ఏదో ప్లాన్‌లోనే ఉన్నాయి… ప్రమాదంలో ఇజ్రాయిల్…
ఏదో పెద్దదే జరగబోతున్నది! రష్యాకు చెందిన IL – 76 రవాణా విమానం మాస్కో నుండి టెహ్రాన్ చేరుకుంది! రష్యన్ IL – 76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మెషిన్స్ లేదా ఎక్కువ బరువు కల ఎక్విప్మెంట్ ను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు! తక్కువ పరిథిలో విధ్వంసం సృష్టించగల అణు బాంబు ఉన్న వార్ హెడ్ ను తీసుకొచ్చి ఉండవచ్చు! దానిని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిస్సైల్ తో అనుసంధానం చేయడానికి కావొచ్చు! లేదా MIRV […]
అమ్మతనపు స్పూర్తి..! వయనాడు వార్తల్లో వెంటనే కనెక్టయిన ఓ వార్త…
వయనాడు కొండచరియలు విరిగిపడిన విపత్తు వేళ సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ బాసటగా నిలబడింది… గుడ్ ఊరుఊరంతా కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం నిక్షేపంగా ఉంది… ఆ ఇంటాయన వేరే ఊరికి వెళ్లడం వల్ల బతికిపోయాడు, తిరిగి వచ్చి చూసేసరికి తనవాళ్లెవరూ లేరు, గల్లంతు… బతికిన ఆనందమా, అందరినీ కోల్పోయిన విషాదమా… ఓ వార్త… ఓ స్కూల్ పిల్ల అచ్చం ఇదే విపత్తును సూచిస్తూ వారం క్రితమే తమ స్కూల్ మ్యాగజైన్‌కు ఓ కథ రాసింది… ఇప్పుడు ఆ […]
ప్రపంచంలో జర్నలిస్టు అనేవాడు మారడు.., కడుపు చించుకున్నా వాడంతే…
అరవై నాలుగు కళల్లో చోర కళ ఒకటి అంటే ఏమో అనుకున్నాం. ఇందులో పొట్ట నింపుకోవడానికి చేసేవి (అదే వృత్తిగా బతికేవారు), జల్సాలకు అలవాటుపడి చేతివాటం చూపేవాళ్ళు, సరదాగా చేతి దురద కొద్దీ చేసేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పొతే అంతూ పొంతూ ఉండదు. జనం జీవన శైలి, అలవాట్లు, అభిరుచులు మారుతున్నట్టే దొంగల అవసరాలు కూడా మారుతున్నాయి. కాదేది చోరీకి అనర్హం అన్నట్టు చేతికి అందిన వస్తువుని, కంటికి నదురుగా కనిపించినవి నొక్కేస్తున్నారు. ఇటీవల ఓ […]
కర్కడక వావు… వావు బాలి… ఓ సామూహిక పితృతర్పణాల సందడి…
ఓ మిత్రుడు తన పదిహేను రోజుల నార్త్ స్పిరిట్యుయల్ టూర్ విశేషాలు చెబుతూ… కాశి, ఉజ్జయిని, అయోధ్య, ప్రయాగ, గయ, బృందావనం తదితర ప్లేసుల గురించి వివరిస్తున్నాడు… అయోధ్య, బృందావనం కట్టడాలు భక్తికే గాకుండా ఆ ఆర్కిటెక్చర్, ఆ వాతావరణం పర్యాటకులకు అబ్బురం… మరి కాశి, ప్రయాగ, గయ..? దర్శనాలకే కాదు… నదీస్నానాలకు, అంతకుమించి పితృకర్మలకు ప్రాముఖ్యం… తమ పూర్వీకులకు అక్కడే పిండతర్పణం చేసిరావడానికి భక్తజనం ప్రాధాన్యమిస్తారు… హిందూ మతస్తులకు ఇవి పితృకర్మల కోణంలో ముఖ్య సందర్శనీయ […]
మరక మంచిదే… మురికీ మంచిదే… అనుకోకుంటే ఇక ఉండలేం…
ఒక్క మాటలో చెప్పాలంటే “మరక మంచిదే” అన్నట్లు “మురికి మంచిదే” అనుకోవడం తప్ప మా కాలనీ చేయగలిగింది లేదు. రోజులో అన్ని వేళల్లో, సంవత్సరంలో అన్ని రుతువుల్లో అలా రోడ్లమీద మురుగు నీరు పొంగి ప్రవహించడానికి వీలుగా ప్రణాళిక రచించిన టౌన్ ప్లానింగ్ వారి అమేయ, అమోఘ, అనితరసాధ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భావితరాలకు ఒక పాఠం. నగర నిర్మాణ, నిర్వహణకు ఒక గుణపాఠం. జాతకాలు చెప్పేవారిమీద ఒక ఫేమస్ జోక్ ప్రచారంలో ఉన్నా…అందులో ఎంతో గాంభీర్యం, […]
- « Previous Page
- 1
- …
- 117
- 118
- 119
- 120
- 121
- …
- 452
- Next Page »