Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాలం మారింది… పేరున్న నటులూ ఓటీటీల్లోకే నేరుగా ఎంట్రీ…

June 10, 2025 by M S R

.

 Ashok Pothraj: #DevikaandDanny 7 ఎపిసోడ్స్ jio hotstar తెలుగులో..,

ఒక అమ్మాయి + ఇంకొకఅబ్బాయి + ఒక ఆత్మ … ఛలో ఇక కథలోకి వెళదాం పదండి.. అదేనండీ జియో హాట్ స్టార్ లోకి వెళ్లి చూద్దాం ఏమౌతుందో అనీ…

Ads

గ్రామీణ నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది. రీతూ వర్మ పల్లెటూరి అమ్మాయిగా క్యారెక్టర్ కి చాలా బాగా సెట్ అయింది అలాగే చాలా అందంగా ఉంది , ఒక టీచర్ కి ప్రాబ్లం వస్తే ఎదిరించే అమ్మాయిలా బాగా యాక్టింగ్ చేసింది.

సూర్య వశిష్ఠ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది , శివ కందుకూరి పల్లెటూరి అబ్బాయిగా బాగా సెట్ అయ్యాడు. సుబ్బరాజు గారు ఈ క్యారెక్టర్ లో కొత్తగా అనిపించాడు, చాలా రోజుల తర్వాత కోవై సరళ గారు ఒక మంచి పాత్రలో కనిపించారు. తను ఇందులో ఉండడం వల్ల ఈ సిరీస్లో ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది.

రీతు వర్మ , సూర్య వశిష్ఠ సీన్స్ క్యూట్ గా బాగున్నాయి.. సుబ్బరాజు లైట్ కామెడీ , శివ కందుకూరి అమాయకత్వం సీన్స్ వర్కవుట్ అయ్యాయి.. ఫ్యామిలీ తో హ్యాపీగా చూడొచ్చు.

మొత్తం మనకు ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి… ఒక్కో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అప్పుడే ఐపోయిందా..? అనే ఫీలింగ్ వస్తుంది.

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చాగంటి సుధాకర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్త వహించారు. ముఖ్యంగా కెమెరా విజువల్స్ హైలెవల్. సంగీతం, ఎడిటింగ్ బాగుంది,పాటలు కూడా బాగానే ఉన్నాయి.

ఇది ఓటిటి కంటెంట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే చాలా ఫేమ్ ఉన్న నటులు థియేటర్స్ ని వదిలి నేరుగా ఓటిటీలోకి రావడం చాలా అరుదు. కొంతమంది డిస్ట్రిబ్యూషన్ వారికి చెంపపెట్టుతో ప్రస్తుత తరుణంలో ఒక మంచి ఉదాహరణ ఈ సినిమా…

ఈ సిరీస్ లో రీతు వర్మ కాస్ట్యూమ్స్ , పల్లెటూరి సెటప్ ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక దర్శకుడు B Kishore గారి విషయానికి వస్తే మొదట షార్ట్ ఫిల్మ్స్ నుండి స్టార్ట్ అయి “శ్రీకారం” సినిమాతో దర్శకుడిగా మారి మంచి విజయం సాధించి ఎన్నో అవార్డులు పొందిన విషయం మన అందరికి విధితమే, తను ఇప్పుడు ఒక కూల్ లైన్ తో ఓటీటీకి వచ్చాడు.

తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని క్లియర్ గా, సాఫీగా ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా చెప్పాడు. లవ్ సీన్స్ అండ్ లాస్ట్ లో ఎమోషన్ సీన్స్ బాగా చూపించాడు. కథని అందులోని పాత్రలతో ఆ అట్మాస్పియర్ లోకి తీసుకువెళ్ళాడు.

ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చాలా కొత్తగా అనిపిస్తుంది కిషోర్ డైరెక్షన్. గుడ్ సిరీస్ క్లీన్ అండ్ క్లియర్ ఫిల్మ్. కిషోర్ కి పల్లెటూరి వాతావరణం ఎంతగా ఇష్టమో తన మొదటి సినిమా నుంచే చక్కని ఫ్రేమ్ లో బంధించి చూపుతున్నాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ అక్రమ భవనాలకూ – జన్వాడ ఫామ్‌హౌజుకూ ఏమిటి లింకులు?!
  • మోదీకి ఇండొనేషియా అపూర్వ స్వాగతం – ఎందుకీ ప్రాధాన్యం అంటే?
  • మనకు తెలిస్తేనే నిజం- తెలియకపోతే అబద్ధం అయిపోదు… పునర్జన్మ!!
  • ఒక దశలో ఒకేచోట 50 వేల మంది లైంగిక కార్మికులు!!
  • Nabha Natesh – విరిగిపడి, తేరుకుని, తిరిగి తెరపై ‘మెరుపు కలల’ వైపు!!
  • BRS దాచిపెట్టే వైఫల్యాల్లో మరొకటి – మేడిగడ్డలాగే ‘కన్నెపల్లి’ కూడా!!
  • STOCK MARKET HUMOUR – Sorry, I haven’t verified the Data
  • ట్రంప్ – రెడ్ కార్డ్..! ఫిఫా పోటీల్లోనూ తనే ‘సుప్రీం రెఫరీ!!
  • TGRPDCL @ రైతు డిస్కమ్ – రేవంత్ రెడ్డి సర్కారు భలే ప్లాన్ !!
  • రొనాల్డో శకం ముగిసింది – ఫుట్‌బాల్ సామ్రాట్ కన్నీటి వీడ్కోలు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions