Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఖండ తాండవం… బాలయ్య సినిమాలో పహల్‌గాం బాపతు సీన్…

June 10, 2025 by M S R

.

అమాయకుల ప్రాణాలు తీస్తావా… అని భీకరంగా గర్జిస్తుంటాడు ఓతరహా అఘోరి వేషంలో ఉన్న బాలయ్య… మెడపై ఐదారుగురి దేహాలు.., వాళ్ల చేతుల్లో స్టెన్ గన్నులు… చుట్టూ మంచు… ఆ ఆగంతకుల మొహాలకు అడ్డంగా ముసుగులు…

అది చూడగానే గుర్తొచ్చేది… పహల్‌గాంలో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషాదం… నెల రోజులుగా ప్రపంచమంతా చర్చిస్తోంది ఈ ఘాతుకం గురించే కదా… అనంతరం పాకిస్థాన్‌తో ఘర్షణ తదితర పరిణామాలూ తెలిసినవే కదా…

Ads

అచ్చంగా ఆ దుర్ఘటనను పోలిన ఏదో సీన్ క్రియేట్ చేసినట్టున్నారు రాబోయే అఖండ-2 ( తాండవం ) సినిమాలో… ఏదో వేదం, శరభం, యుద్ధం అని స్పష్టాస్పష్టంగా ఓ డైలాగ్ కూడా వినిపిస్తోంది… తమన్ బీజీఎం మోతలో ఆ డైలాగ్స్ సరిగ్గా వినిపించవు, అదొక ట్రాజెడీ…

నిన్న ఓ టీజర్ రిలీజ్ చేశారు కదా… దాన్ని బట్టి సినిమా నాణ్యత చెప్పలేం గానీ, సినిమా పోకడ ఏమిటో తెలుస్తుంది…

సరే, అసలే బాలయ్య, అందులోనూ బోయపాటి… తోడుగా బాక్సులు బద్దలయ్యే తమన్ బీజీఎం… సో, అఖండను మించిన బీభత్సమే అన్నమాట… అటు అఘోరీలా ఉండదు ఆహార్యం, అఘోరీ గాకుండానూ ఉండదు…

అందులోనూ ఇంకాస్త విచిత్రంగా తెల్లగడ్డం, నల్లమీసం… మెడలో తెల్లటి స్పటిక లింగంతో రుద్రాక్షమాలలు… నంది బొమ్మ పొదిగిన త్రిశూలం… అది మెడ చుట్టూ తిరుగుతూ, బాలయ్య ముందుకు నడుస్తుంటే… ఆ ఆగంతకులను కత్తిరిస్తూ పోతుంది… తెలుగు సినిమాకు బాగా అలవాటైన వేడి నెత్తురు అలా ధారలుగా బాలయ్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది… ఆ దుష్టుల రక్తం అన్నమాట…

నా శివుడి అనుమతి లేనిది ఆ యముడే కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా… వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ శాంపిల్‌కు ఒకటీరెండు వదిలారు…

అఖండ విజయం తరువాత ఇక పెద్దగా ఫార్మాట్ మారదు… సీక్వెల్ కూడా అదే తరహాలో ఉంటుందనేది సుస్పష్టం… కాకపోతే అఖండలో హైలైట్ డైలాగులు… బోత్ ఆర్ నాట్ సేమ్ వంటి డైలాగులు పదునుగా ఉండి, అవీ బాలయ్య మార్క్ ఉచ్ఛారణతో బాగా పేలాయి… బీజీఎం కూడా హైలైటే… సో, రాబోయే సీక్వెల్‌లో కూడా బీభత్సమైన ఫైట్లు, నెత్తురు తప్పదు… ఫిక్సయిపొండి… ఆపరేషన్ అఖండ..!!

నో ఫిజిక్స్, నో లాజిక్స్… అసలే బాలయ్య… ఆపై బోయపాటి… ఇక తాండవమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions