ఆంధ్రా మీడియాకు తెలంగాణ భాష, సంస్కృతి, పండుగలు, చివరకు తిండి మీద కూడా చిన్నచూపే, వివక్షే… పదే పదే దాన్ని గురించి చెప్పుకునే పనిలేదు… కోట్లసార్లు చెప్పుకున్నదే, బాధపడిందే, తిరగబడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నదే… అలాంటి ఆంధ్రా మీడియాకు కోట్లాది ఆదివాసీ మూలవాసుల మీద ప్రేమ ఎందుకుంటుంది..? వాళ్ల మనోభావాల్ని ఎందుకు గౌరవిస్తుంది..? సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం దగ్గర నుంచీ సమ్మక్క తిరిగి వనప్రవేశం చేసేవరకు… వనం జనం అవుతుంది… అది మన కుంభమేళా… అధికారిక లెక్కల ప్రకారమే […]
తనపై సినీ డైలాగ్ ప్రేమికుల సద్భావనను తనే ‘మడతపెట్టి’… ఒక పతనం…
త్రివిక్రమ్ మడతపెట్టిన కుర్చీ! ఏనాడో పెద్దాయన పింగళి కంబళి-గింబళి; వీరతాళ్లు; దుషట చతుషటయము అంటే మాటల మాంత్రికుడు అని మహత్తరమైన బిరుదు ప్రదానం చేసి ఆ మాయాబజార్ వీధుల్లోనే తిరుగుతూ…ఆయన్నే స్మరించుకుంటూ ఉండేవాళ్లం. తరువాత జంధ్యాల మాటలతో సినిమా తెర నవ్వి నవ్వి కొంతకాలం నోరు సొట్టలు పోయింది. తరువాత సినిమాలో హాస్యం ఎడారి అయిపోయింది. తెలుగుతనం ఎండమావి అయిపోయింది. హీరో తొడ కొడితే వెయ్యి మైళ్ల వేగంతో వెనక్కు వెళ్లే రైళ్ల దృశ్యాలతో అపహాస్యం రాజ్యమేలే […]
PR Teams..! మనకు తెలియకుండా మనల్ని కండిషనింగ్ చేసిపారేస్తుంటయ్…
Nallamothu Sridhar Rao “మహిళలూ మీరు సిగిరెట్ తాగితే మగవాళ్లతో సమానంగా స్వేచ్ఛ పొందినట్లే” – ఒక యాడ్ మనుషుల్ని ఎంత కండిషనింగ్ చేస్తుందంటే – ఇది 1911లో జరిగిన ఓ సంఘటన. Lucky Strike అనే ఓ సిగిరెట్ కంపెనీ తన సేల్స్ పెంచుకోవాలని ప్రపంచంలోనే మొట్టమొదటి ఓ PR వ్యక్తిని సంప్రదించింది. మహిళలకు సిగిరెట్స్ అలవాటు చేస్తే.. పరోక్షంగా అమ్మకాలు పెరుగుతాయన్న ఐడియా అతనికి వచ్చింది. అప్పటిదాకా సిగిరెట్ తాగడం అంటే తప్పుడు అలవాటుగా […]
పగలైతే దొరవేరా… ఇదీ మల్లీశ్వరిలా క్లాసిక్… వాణిశ్రీ ఇందులో షీరో…
Subramanyam Dogiparthi…. మల్లీశ్వరి సినిమాలాగా మరో క్లాసిక్… 1969 ఉగాదికి విడుదలయింది ఈ బంగారు పంజరం సినిమా . ఇదే బీ యన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా . ఈ సినిమా గురించి చెప్పాలంటే ముగ్గురి గొప్పతనం గురించి చెప్పాలి . మొదటి వారు బి యన్ రెడ్డి , రెండవవారు ఈ సినిమాకు షీరో ( Shero ) అయిన వాణిశ్రీ , మూడవవారు దేవులపల్లి వారు . ఆయన్ని అందరూ భావ […]
నిజంగా అది ప్రమాదమేనా..? లాస్య నందిత మరణంపై రీజనబుల్ డౌట్స్..!
లాస్య నందిత… చిన్న వయస్సులోనే ఓ మహిళా ఎమ్మెల్యే ఓఆర్ఆర్ మీద జరిగిన కారు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం… అందరినీ బాధపెట్టిన ప్రమాదం… తండ్రి సాయన్న మరణిస్తే అధికారిక అంత్యక్రియలు జరిపించలేదు కేసీయార్, కానీ ప్రస్తుత సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా సరే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం మెచ్చుకోదగిన నిర్ణయం… సరే, ఆ వివాదాన్ని కాసేపు పక్కన పెడితే… అసలు అది ప్రమాదమేనా..? నిజానికి ఆ కారు ప్రమాదానంతరం ఉన్న స్థితి చూశాక ప్రమాదమే […]
మోడీ ఫాసిస్ట్..! ఈ మాట అన్నది ఎవరో ఊహించగలరా..? కేంద్రం సీరియస్..!
‘‘బీజేపీ హిందూ జాతీయవాద భావజాలం, మతపరమైన మైనారిటీలపై హింసను ప్రయోగించడం, అసమ్మతిని అణచివేయడం వంటి కారణాల వల్ల కొందరు నిపుణులు ఫాసిస్టు విధానాలను మోదీ అమలు చేస్తున్నారని ఆరోపిస్తుంటారు…’’ …. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? సీతారాం ఏచూరి కాదు, అసదుద్దీన్ ఒవైసీ కాదు, సీపీఐ రాజా కాదు, అసలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఆప్ కేజ్రీవాల్ కానే కాదు… ఓ యంత్రం… ఆర్టిఫిషియల్ మంత్రం నేర్చుకున్న యంత్రం… అదే గూగుల్ జెమిని… అదే […]
Mind blowing marriages… ఈ పెళ్లిళ్లు అట్టహాసాలు, వైభోగాలు, ఆడంబరాలు…
(By రమణ కొంటికర్ల…) marriages are made in heaven.. ఎవరెవరికి పెళ్లితో బంధాన్ని ముడి వేయాలో పైనున్న ఆ భగవంతుడే రాసి పెడతాడు.. స్వర్గంలోనే అవి నిర్ణయించబడతాయనేది స్థూలంగా ఈ నానుడి సారాంశం. స్వర్గంలో నిర్ణయించబడే పెళ్లిళ్లను.. ఆ స్వర్గాన్నే తలదన్నేలాంటి ప్రాంతాల్లో చేసుకోవడం సంపన్నుల్లో నడుస్తున్న ట్రెండ్. పెళ్లంటే పందిళ్లు.. సందెళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్లు అని త్రిశూలం అనే సినిమా కోసం ఆత్రేయ […]
ఇద్దరు కమెడియన్లు… రెండు సినిమాలు… ఎందుకు ఆకట్టుకోలేకపోయాయ్…
రెండు సినిమాలు… హీరోలుగా అదృష్టం పరీక్షించుకోవాలని వచ్చిన ఇద్దరు కమెడియన్లు… ఒకటి అభినవ్ గోమఠం నటించిన ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ మూవీ… రెండు చెముడు హర్ష అలియాస్ వైవా హర్ష నటించిన ‘సుందరం మాస్టార్’ మూవీ… ఇద్దరూ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్లే… డైలాగ్ డెలివరీ గానీ, పాత్రలోకి ఒదిగిపోవడం గానీ వాళ్లకు కొత్తగా నేర్పాల్సిన పని లేదు… కాకపోతే వాళ్లు బేసిక్‌గా కమెడియన్లుగా పాపులర్ అయినవాళ్లు… వెంటనే హీరోలుగా యాక్సెప్ట్ చేయడం కష్టం… అది […]
sammakka..! ఇదీ శక్తి ఆరాధనే… ఆదివాసీ సంస్కృతే అది… ప్రణమిల్లుదాం…
Gurram Seetaramulu…. నమ్మకం విశ్వాసం మీద నిలబడ్డ ఏ విలువ అయినా అది ఉన్నతమైనదే. మూలవాసుల విశ్వాసాల మీద నీ ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు. కోట్ల మంది తిరుగాడిన సమ్మక్క గద్దె వందల ఏళ్ళుగా ఏ హంగు ఆర్భాటం లేకుండా కనీసం గుడి, మండపం, తలుపు, తాళం లేని పరంపర అది. ఇన్నేళ్ళుగా తమ నిజదర్శనాన్ని దర్పాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ధూప దీప నైవేద్యాల గోల లేదు. పులిహోర వడ దద్దోజన చక్కర పొంగలి […]
Iam not a Malala… ఓ కశ్మీరీ లేడీ జర్నలిస్ట్ వ్యాఖ్యలు వైరల్…
‘‘నేను మలాలా యూసఫ్ జాయ్ ని కాదు. నేను నా దేశంలో స్వేచ్ఛగా మరియు సురక్షితంగా ఉన్నాను. భారత్ లో భాగమైన నా స్వస్థలం కాశ్మీర్. నేను నా మాతృభూమిని వదిలి పారిపోయి, ఆమెలాగా మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదు. మలాలా యూసఫ్ జాయ్ అణచివేతకు గురైన నా దేశాన్ని, నా పురోగమిస్తున్న మాతృభూమిని కించపరచడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. టూల్ కిట్ ముఠాలు, విదేశీ మీడియా సభ్యులందరూ కశ్మీర్‌ను సందర్శించడానికి ఇష్టపడకుండా, అక్కడ అణచివేత […]
కుక్క బతుకు..! కొన్నిసార్లు నీచమైన పదం కానేకాదు… అది లగ్జరీ…
స్టార్ హోటల్లో కుక్క పుట్టినరోజు వేడుకలు “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”- శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు […]
వెళ్లిపోయాడు ఈ చార్లెస్ శోభరాజ్ తాత, కాదు ముత్తాత… ఫ్రాడ్ పదానికే ఐకన్..!
85 సంవత్సరాల వయస్సులో ధనిరాం మిట్టల్ చనిపోయాడు… ఏడాదిగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించాడని అంత్యక్రియల అనంతరం కొడుకు పోలీసులకు చెప్పాడు… సో వాట్ అంటారా..? ఏవరో కోన్ కిస్కా అంటారా..? నో… ప్రపంచం విస్తుపోయే రేంజ్ దొంగ… మన ఇండియనే… (మనం మొన్నటి ఫిబ్రవరిలోనే తన గురించి ఓ ప్రత్యేక కథనం ముచ్చటించుకున్నాం… అది మరోసారి…, సదరు బుర్రకు నివాళ్లు అర్పిస్తూ…) అరవై నాల్గు కళల్లో చోరకళ కూడా ఒకటి అని తెలిసినా.. దాన్నొప్పుకునే […]
దేవుళ్లు అంటే బ్రహ్మలోకం నుంచి దిగివస్తారా..? ఇదెక్కడి సూత్రీకరణ స్వామీ..!
ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క గద్దె మీద కొలువు తీరింది… భక్తకోటి ప్రణమిల్తుతోంది… మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మారుమోగిపోతోంది… మన కుంభమేళాకు ప్రసిద్ధిపొందిన ఈ జాతర ఆదివాసీలకు పవిత్రం… సంప్రదాయిక హిందూ భక్తులకు తిరుపతి, కాశి, చార్ ధామ్ వంటివి ఎలాగో ఆదివాసీ సమాజానికి మేడారం అలాగే… కాకపోతే వాళ్లకు రూపాల్లేవు.,. కొబ్బరికాయ, బంగారంగా భావించే బెల్లం మాత్రమే కానుకలు… అక్కడే పుట్టువెంట్రుకలు, మొక్కులు గట్రా… ఒకప్పుడు ఆదివాసీల జాతర, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు… రెండేళ్లకోసారి […]
జస్ట్, టీన్స్ దాటిన ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన ‘చిత్రం’ కేసు…
అమన్… ఉజ్జయిని… 2020లో ఆమె పరిచయమైంది… ఇప్పటి కాలం వేరు కదా… మన సినిమాలు, మన టీవీలు పిల్లల్ని వేగంగా ప్రేమలు అనే ట్రాప్‌లోకి నెట్టేస్తూ ఉంటాయి కదా.,. వీళ్లూ అంతే… చిన్న వయస్సే… మెచ్యూర్డ్ లవ్ కాదు, అంటే పరిణత ప్రేమ కాదు, అప్పట్లో తేజ తీసిన చిత్రం బాపతు ప్రేమ… కాదు, ఓ ఆకర్షణ… ఓ మాయ… మనం పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఆమె… అచ్చు సినిమాల్లోలాగే… అమ్మో, మనం పెద్దగయ్యాక చేసుకుందాం, […]
ఆరకంగా ఈనాడు రామోజీరావు తను అరెస్టు గాకుండా కాపాడుకున్నాడు…
Nancharaiah Merugumala…… నారీమన్ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం! …………………………………. ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70 ఏళ్లకు పైగా న్యాయవాద […]
ప్రపంచం అబ్బురపడేలా ప్రివెడ్డింగ్… కానీ ప్చ్… మ్యాచ్ మిస్ మ్యాచ్…
పెళ్లికి కాదు మహాప్రభో… 3 రోజులపాటు జరిపే ప్రివెడ్డింగ్ ఫంక్షన్‌కే అతిరథ మహారథులు వస్తున్నారట… అదేనండీ, కుబేరుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ప్రోగ్రామ్… ఇక పెళ్లి ఏ రేంజులో ఉండబోతోందో ఊహించుకోవాల్సిందే… అన్నట్టు, ప్రపంచ ముఖ్యులు ఎవరొస్తున్నారంటే..? కొందరు గ్లోబల్ రిచ్ పర్సనాలిటీల జాబితా ఇది… Meta CEO Mark Zuckerberg Morgan Stanley CEO Ted Pick Microsoft founder Bill Gates Disney CEO Bob Iger BlackRock CEO […]
మా నాన్నే నాకు గొప్ప అమ్మ..! మాతృత్వమే కాదు, పితృత్వమూ తక్కువ కాదు..!
Prabhakar Jaini….. ”గంగాధరం ! నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు !” ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు పాదులు చేస్తున్న గంగాధరం అదిరిపడ్డాడు. “దేనికి ?” అడిగాడు అయాను ఏమో ! నాకేం తెలుసు ?” అంటూ వెళ్లిపోయింది ఆయా. చేతులకు ఉన్న మట్టిని గబగబా.. కడిగేసుకుని, తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు. వడి వడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెడుతున్నాడు.. అతని మనసులో […]
కుర్చీలు మడతపెట్టి, కండోమ్స్ దాకా వచ్చింది వైరం… రేపేమిటో..!!
బూతులు, మహిళా నేతలపై వెగటు విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, వెకిలి వెక్కిరింపుల నుంచి చివరకు కుర్చీ మడతపెట్టి తిట్టుకునేదాకా దిగజారింది ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కొట్లాట… సోషల్ మీడియాలో జరిగే యుద్ధానికి ఆకాశమే హద్దు… దానికి మర్యాదలు మన్నూమశానాలు జాన్తానై… మొన్న ఎక్కడో లోకేష్ ఓ కుర్చీని మడతపెట్టి చూపిస్తున్న ఫోటో కనిపించింది… తనకు ఆ కుర్చీ మడతపెట్టడం అనే పదాల్ని ఎందుకు వాడతారో తెలుసా అసలు..? తెలిసీ ఆ వెకిలి ప్రదర్శనకు దిగాడా…? ఇక […]
సరిహద్దుల పహారాకే కాదు… దాడులకూ అదానీ మిలిటరీ డ్రోన్లు…
Pardha Saradhi Potluri …… అదానీ డిఫెన్స్ – ADANI DEFENCE! అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ఇండియా లిమిటెడ్ (Adani-Ellbit Advanced Systems India Ltd.) ******************* 2018 లో ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారత దేశం లో అదానీ డిఫెన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ 49% – 51% తో ప్రారంభించింది హైదరాబాద్ లో! Elbit Advanced Systems అనేది డిఫెన్స్ రంగానికి చెందిన సంస్థ! ఎల్బీట్ సిస్టమ్స్ ఎయిర్ […]
దాదా సాహెబ్ ఫాల్కే బతికి ఉన్నా… ఈ అవార్డులను చూసి నవ్వుకునేవాడు…
ముందుగా ఒక వార్త… ‘‘ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్) – 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది.. బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి.. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయనతార […]
- « Previous Page
- 1
- …
- 129
- 130
- 131
- 132
- 133
- …
- 456
- Next Page »