మానేపల్లి గుడి దగ్గర భంగపాటు, మనోవికలం, అసంతృప్తి తరువాత చటుక్కున స్ఫురించింది… అరె, విష్ణువుకన్నా శివుడు భక్తసులభుడు కదా, దగ్గరలో ఏమైనా శివాలయం ఉందాని ఆలోచిస్తుంటే, ఆమధ్య ఓ బంధువు చెప్పిన స్వర్ణ శివలింగం, స్ఫటిక లింగం ఉన్న గుడి గుర్తొచ్చింది… ఎస్, ఛలో వెళ్దాం… పదండి… మానేపల్లి గుడి దగ్గర నుంచి 18 కిలోమీటర్లు చూపిస్తోంది… భువనగిరి నుంచి చిట్యాల రోడ్డులో నాగిరెడ్డిపల్లి గ్రామంలో… రోడ్డు పొడవునా రియల్ ఎస్టేట్ వెంచర్లే… కొద్దిదూరం సింగిల్ రోడ్డు […]
మెగా కంపౌండ్ కాదా…? అల్లు కంపౌండ్ వేరు- కొణిదెల కంపౌండ్ వేరా..?!
మెగా కుటుంబానికి దూరంగా అల్లు ఫ్యామిలీ..? మెగా కుటుంబానికి అల్లు ఫ్యామిలీ క్రమంగా దూరమవుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి… ఈ ఎన్నికల్లో YCP అభ్యర్థి ఇంటి కెళ్లి బన్ని మద్దతివ్వడం, ఆ తర్వాత నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేయడం తెలిసిందే… తాజాగా, సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో అల్లు అర్జున్ ను అన్ ఫాలో కొట్టారు… వీటికి తోడు జన సేనాని ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ హాజరు కాలేదు… అసలు ఆహ్వానం అందిందో..? లేదో..? తెలియదు.. […]
సీఎం రేవంత్ రెడ్డికి ఓ సూచన… ఈ దిశగా ఓ మంచి ఆలోచన చేయొచ్చు…
కొన్ని విషయాల్లో ప్రభుత్వం డిఫరెంటుగా థింక్ చేయాలి… పరిస్థితులను బట్టి, వినవచ్చే డిమాండ్లను బట్టి… నష్టమేమీ లేనప్పుడు డిఫరెంట్ నిర్ణయాలు తీసుకోవాలి… తప్పులేదు… నిజానికి అలా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తే ఆహ్వానించాలి కూడా… రేవంత్ రెడ్డి వేలాది మంది గ్రూపు-1 ఆశావహుల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో చూాడాలి… ముందుగా రెండు మూడు రోజులుగా టెలిగ్రాం, వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఓ మెసేజ్ చదవండి… సీఎం గారూ.. 1:100 ప్లీజ్ —————- […]
ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన రాజకీయ హుందాతనం అంటే ఇదే..!!
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పింది ఇదే… ఎన్నికల్లో పోటీ అంటే యుద్ధం కాదు, ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులే గానీ శత్రువులు కాదు, ప్రజాసేవకుడు అంటే అహంభావం లేకుండా ఓ హుందాతనం కనబరచాలి… రాజకీయ మర్యాదల్ని పాటించాలి… రేవంత్ రెడ్డిని తన ప్రమాణ స్వీకారానికి పిలవని చంద్రబాబులో అది కనిపించలేదు… ఈ మాటంటే కొందరికి నచ్చలేదు… మోడీ ప్రమాణ స్వీకారానికి మల్లిఖార్జున ఖర్గే వెళ్లాడు… గతంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారానికి వసుంధర రాజే వెళ్లింది… […]
మోడీ హత్తుకున్నాడు ఆ ఇద్దరినీ… ఏదో ఇస్తున్నాడు మెగా సంకేతం..!!
సోషల్ మీడియాలో ఒకటే చర్చ… మోడీ మామూలుగా వచ్చి పోడు కదా… ఏదైనా కాస్త చర్చను అంటించి వెళ్తాడు… ఇక మీడియా, సోషల్ మీడియా వదలవు… రకరకాల క్రియేటివ్ ఊహాగానాలు… పైగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రపంచంలో ఎవరికీ అర్థం కారు… ఇంకేం..? బోలెడు ప్రచారాలు ఆల్రెడీ స్టార్టయ్యాయి… ఇంతకీ జరిగింది ఏమిటి..? చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి మోడీని రమ్మన్నాడు… సరే, పాత కక్షలు ఎన్నున్నా… ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ప్రబలంగా ఉన్నా… ఎవరు […]
ఇది బీజేపీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ కాదు… మోడీ వర్సెస్ ఆర్ఎస్ఎస్…!!
కాషాయం క్యాంపులో చాలామందికి తెలుసు… ఆర్ఎస్ఎస్కు బీజేపీకి పడటం లేదని… దూరం బాగా పెరిగిపోయిందని… మొన్నటి ఎన్నికల్లో అనేకచోట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం వర్క్ చేయకుండా తటస్థంగా ఉండిపోయిందని… ఆ కారణం చేతే మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల బీజేపీకి నెెగెటివ్ ఫలితాలు వచ్చాయని… మోడీ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు తన స్థాయికి తగినట్టు లేక, తనలోని ఫ్రస్ట్రేషన్ లెవల్స్‌ను బయటపెట్టాయని… ఆర్ఎస్ఎస్ చీఫ్ కొంతకాలంగా మర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు… బీజేపీ వెళ్తున్న పంథా, […]
కత్రినా కడుపు… కెమెరామెన్ ఎడ్డిమొహాలు వేసిన భలే సందర్భం…
అసలే పాపరాజీ… అంటే సినిమా తారలు, సెలబ్రిటీల వెంట పడి, వేటాడుతూ, పర్సనల్ ఫోటోలు తీస్తూ, టాబ్లాయిడ్లకు, మీడియాకు అమ్మి సొమ్ము చేసుకునే కెమెరాతనం… ఈ క్రూరమైన వేటకు అప్పట్లో యువత కలలరాణి డయానా మరణించిన సంగతి తెలుసు కదా… ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా వీలైనంతవరకూ ఈ కెమెరామెన్ లెన్సులకు పట్టుబడకుండా, కళ్లుగప్పి తప్పించుకుంటుంటారు సెలబ్రిటీలు… దీనికితోడు ఇక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది… చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివోడూ ఫోటోగ్రాఫరే, జర్నలిస్టే… దీనికితోడు […]
రేవంత్‌ను పిలవకపోవడం చంద్రబాబు అమర్యాద… సరైన ధోరణి కాదు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో ప్రమాణస్వీకారానికి (4.0 అట) ఆహ్వానించలేదు… ఎందుకు..? బీజేపీ అతిరథ మహారథుల్ని పిలిచారు… సరే, ఎన్డీయే ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సంయుక్త ప్రభుత్వాలే కాబట్టి… బీజేపీ ముఖ్యుల్ని పిలిచారు, వాళ్లు వస్తారు… సమంజసమే, మర్యాదే… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా పిలిచారట… అవీ ఎన్డీయే ప్రభుత్వాలే కాబట్టి పెద్ద విశేషమేమీ లేదు… కానీ ఇరుగు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎందుకు పిలవలేదు… అంటే, తమిళనాడు, తెలంగాణ, […]
మృగరాజు ప్రమాణోత్సవానికి పులి వచ్చిందనుకున్నాం… కాదా, పిల్లేనా..?!
ప్రమాణస్వీకారోత్సవంలో పులి కాదది పిల్లి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి…పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్ లో తాగుతూ ఉంటాయి. గద్ద- పాము తీరిగ్గా కూర్చుని చదరంగం ఆడుకుంటూ ఉంటాయి. పిల్లి- ఎలుక తీరుబడిగా పిట్టకథలు చెప్పుకుంటూ ఉంటాయి. పులి- జింక పక్కపక్కన కూర్చుని ఒకే సండే మ్యాగజైన్లో పదకేళి పూరిస్తూ ఉంటాయి. సింహం- […]
కనుక ఎవరికీ విద్య నేర్పని గురువు ఆనక దెయ్యమై పోవున్…
గురు శిష్య పరంపర …. పూర్వం అనగా శ్రీరాముడి తాత గారైన రఘుమహారాజు రాజ్యం చేస్తున్న కాలంలో జరిగిన కథ ఇది. పరతంతు మహర్షి గురుకులంలో సందడి సందడిగా ఉంది. గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని వెళ్తున్న కుర్రాళ్లందరూ సెండాఫ్ విషస్ చెప్పుకుంటూ .. గురువుగారికి గురుదక్షిణ చెల్లిస్తూ … గుర్రాల నెక్కి తమ తమ ఊళ్లవైపుగా బయల్దేరి వెళ్తున్నారు. గురువుగారు కూడా శిష్యులకు చివరగా చెప్పాల్సిన విషయాలు చెప్తూ … వాళ్లిచ్చే గురుదక్షిణలు స్వీకరిస్తూ … బిజీబిజీగా […]
జో బైడెన్ కొడుక్కి శిక్ష… కోర్టు తీర్పు తరువాత బైడెన్ వ్యాఖ్య ఇంట్రస్టింగ్…
ఒక కేసు… అదీ అమెరికాలో… అదీ ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు మీద కేసు… ఆ మొత్తం వార్తలో బాగా ఆకర్షించిన వాక్యం… నిజానికి చాలా కదిలించిన వాక్యం… ‘కోర్టు తీర్పును నేను అంగీకరిస్తున్నాను, నా కొడుకు శిక్ష విషయంలో క్షమాభిక్ష కోరాలని కూడా అనుకోవడం లేదు…’ … ఈ మాట అన్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్… సరే, కేసు గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే… గన్ లైసెన్స్ కోసం బైడెన్ కొడుకు అధికారులకు తప్పుడు […]
మాకన్నీ తెలుసు అనే పైవాళ్ల అహం… మరీ కిందకు పడేస్తుంది…
నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తం లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగం లో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తం లో అత్యధికం గా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”. 2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ […]
దానీ జిమ్మ దియ్య … ఈ పల్లవితో గుట్టల కొద్దీ ఆ చీరెల అమ్మకాలు…
చెంగావి రంగు చీరె కట్టుకున్న చిన్నది, దానీ జిమ్మ దియ్య అందమంతా చీరెలోనె ఉన్నది … తెలుగు నాట కుర్రకారును ఉర్రూతలూగించిన పాట . దసరా బుల్లోడులో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ పాటలాగే ఇదీ సూపర్ హిట్టయింది . అసలే ఆ చీరె కట్టింది వాణిశ్రీ, ఆపై సూపర్ హిట్ పాట… పక్కన అక్కినేని, ఇంకేం, మోత మోగిపోయింది… ఆ గోల్డ్ స్పాట్ రంగు ఆడవారికి అప్పట్లో ఎంత ఇష్టం అయిపోయిందంటే ఆ రంగు చీరె […]
పవిత్ర జయరాం @ విలన్ తిలోత్తమ పాత్రకు భలే దొరికింది ఈమె..!!
పదే పదే మన వార్తలు పవిత్ర అనే పవిత్రమైన పదం వద్దకే వస్తున్నాయి… తప్పడం లేదు… మరి అంత పవిత్రమైన పదం… ఒక సీనియర్ నరేష్ సహజీవని పవిత్ర… తాజాగా దర్శన్ అనే కన్నడ హీరోతోపాటు అరెస్టయిన హీరోయిన్ పేరు పవిత్ర గౌడ… అంతకుముందు పవిత్రా జయరాం… అదేనండీ త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్ర పోషించింది కదా ఆమే… సరే, ఈ పవిత్రకాండలో తాజాగా చెప్పుకునేదేమిటీ అంటే…. పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది, ఆమె ప్రియుడు, […]
బయటి నుంచీ నమస్కరించ మనస్కరించక శీఘ్రంగా తిరుగుపయనం..!!
జనం తండోపతండాలుగా వెళ్తున్నారు… పెద్ద పెద్ద టూరిస్ట్ సర్వీసులు, వందల కార్లు, జనం, రద్దీ, యాదాద్రిని మించిపోతోంది రద్దీ… అసలు ఏముంది సార్ ఈ గుడిలో… అని సీరియస్ ప్రశ్న వేశాడు ఓ మిత్రుడు… తరువాత కాస్త సెర్చ్ చేస్తే… అది మానేపల్లి కుటుంబం కట్టించుకున్న ఓ ప్రైవేటు గుడి అని తెలిసింది… గతంలో ఓసారి ఇదే మానేపల్లి జువెల్లర్స్ షాపుకు వెళ్లి జస్ట్, కొద్ది నిమిషాల్లోనే వాపస్ వచ్చిన ఉదంతం గుర్తొచ్చింది… ఇది ఓసారి యాదికి […]
కన్నడనాట మరో ‘పవిత్ర’… హీరో, హీరోయిన్ అరెస్టు, మర్డర్ కేసు…
దర్శన్ … ఓ కన్నడ హీరో… చాలా సీనియర్… 47 ఏళ్లు చిన్న మొల్లేమీ కాదు, అనగా చిన్న పిల్లాడేమీ కాదు అని… సినిమా ఫ్యామిలీయే… తండ్రి తూగుదీప శ్రీనివాస్ కూడా నటుడే… దర్శన్ సోదరుడు దినకర్ నటుడు, దర్శకుడు, నిర్మాత… దర్శన్ కూడా డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కమ్ హీరో… ఛాలెంజింగ్ స్టార్ అంటారట ఆయన్ని… 2003లో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ధర్మస్థల వెళ్లి విజయలక్ష్మి అనే స్టూడెంట్ను పెళ్లి చేసుకున్నాడు… ఇదీ ఆయన నేపథ్యం… ఇదే […]
ఇదొక ఆధ్యాత్మిక తమాషా… ‘పీఠం’పై ఉన్నవారే ఆప్తులు ‘పీఠాధిపతులకు’…
‘పీఠం’ మీద ఎవరుంటే వారికి మద్దతుగా రంగులు మార్చుకునేవారే అసలైన ‘పీఠాధిపతులు’… ఓ మిత్రుడి వ్యాఖ్య ఇది… విశాఖలో శారదాపీఠం పేరిట స్వరూపానంద స్వామి ఆశ్రమం, సారీ, పీఠం ఉంది కదా… సదరు స్వరూపాందుడు హఠాత్తుగా తన రాజకీయ విధేయతను మార్చేయడంపై కామెంట్ ఇది… ఇదేకాదు, నిన్నటి నుంచీ సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లు స్వామి వారి ద్వంద్వ నీతిని, రంగులు మార్చిన వైనాన్ని ఏకిపడేస్తున్నయ్… కొత్తవలసలో జగన్ పుణ్యమాని ఈ స్వామి 15 కోట్ల విలువైన […]
స్త్రీలోలుడు… పార్టీ ఆఫీసులే అడ్డాలు… సరే, మహిళా కమిషన్ ఏం చేయాలి..?!
కొన్ని దిక్కుమాలిన వార్తలు హఠాత్తుగా కనిపిస్తుంటాయి… చిల్లర, బజారు స్థాయి, బురదజల్లే ఫేక్ వార్తలు… మీడియాకు అవే కదా కావల్సింది, కళ్లు మూసుకుని, ఆనంద పరవశంతో అచ్చేస్తుంటాయి… ఆహా, ఓ బకరా దొరికిండురా ఈరోజుకు అన్నట్టు పండుగ చేసుకుంటాయి… ఇదీ అలాంటిదే అన్నట్టుగా ఉంది… బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ… ఈయనది యూపీ… చాన్నాళ్లుగా బీజేపీ ఐటీ సెల్ వ్యవహారాలు చూస్తున్నాడు… తన ట్వీట్లు, తన వ్యాఖ్యలు గట్రా అచ్చంగా వాట్సప్ యూనివర్శిటీ వార్తల్లాగే […]
మోడీ ‘అతి జాగ్రత్త’… మిత్రపక్షాలైనా సరే, కీలక శాఖలకు నో…
మంత్రుల పోర్ట్‌ఫోలియోలకు సంబంధించి మోడీ పెద్ద కసరత్తేమీ చేయలేదు, ప్రయోగాలకూ పోలేదు… పేరుకు ఎవరు మంత్రయినా ప్రధాని కార్యాలయం నిశితంగా ఆయా మంత్రుల కార్యకలాపాలు, నిర్ణయాలు, ఫైళ్లను గమనిస్తూ ఉంటుంది… ఇతర నిఘాలూ ఉంటాయి… ఒకందుకు మంచిదే, గత పదేళ్లలో కుంభకోణాల మచ్చల్లేకుండా జాగ్రత్తపడటానికి దోహదపడింది… సరే, పొలిటికల్ ఆరోపణలు ఎప్పుడూ ఉంటాయి… దాదాపు 12 మంది పాత మంత్రులవి పాత పోర్ట్ఫోలియోలే… నిర్మలా సీతారామన్‌కు మళ్లీ ఆర్తికశాఖ, నిజానికి ఆమె ఓ ఫెయిల్యూర్ మినిస్టర్ అని […]
రామోజీరావు ఆ కోణంలో మొదటివాడు కాదు… చాలామంది ఉన్నారు అలా…
‘‘అతనికి శ్మశానమే దేవాలయం : వారాంతంలో అక్కడే నివాసం : ముందే స్మారక చిహ్నం నిర్మాణం . అలా గుర్తుండి పోయిన జర్నలిజం తొలి నాళ్ళ వార్త… నాకు స్మశానమే దేవాలయం , మనిషి ఆలయానికి వెళ్ళవచ్చు , వెళ్లకపోవచ్చు కానీ అంతిమంగా శ్మశానానికి రావలసిందే అందుకే నాకు శ్మశానం అంటే ఇష్టం…’’ 41 సంవత్సరాల క్రితం బి ఆర్ లక్ష్మయ్య చెప్పిన మాటలు ఇవి . అప్పుడు నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న […]
- « Previous Page
- 1
- …
- 141
- 142
- 143
- 144
- 145
- …
- 451
- Next Page »