తండ్రి డీఆర్డీవోలో డాక్టర్ కమ్ సైంటిస్ట్, తల్లి కూడా న్యూరో కెమిస్ట్రీలో డాక్టర్… తను కూడా డాక్టరీ చదివింది… సీబీఎస్ఈ మ్యాథ్స్ టాపర్ ఓ సంవత్సరం… 2017 మిస్ వరల్డ్ pageant విజేత… స్వరాష్ట్రం హర్యానా… పేరు మానుషీ చిల్లర్… ఆ నేపథ్యం నుంచి మోడలింగ్, యాక్టింగ్ వృత్తిని ఎంచుకుంది… మోడలింగు వరకూ వోకే, కానీ యాక్టింగ్‌కు కేవలం అందం సరిపోదు కదా… 2022లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్లో సంయోగిత పాత్ర ద్వారా వెండితెరపైకి ప్రవేశించింది… ఏమో, […]
ఆ స్వీట్ బోర్డులతో కడుపు నిండింది… అగ్ని నిష్క్రమణ మంట చల్లారింది…
ఆసుపత్రిలో “అగ్ని నిష్క్రమణ” దారిలో తెలుగు రుచి మొన్న ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ హిందూపురంలో భోంచేసి…అనంతపురం బయలుదేరాను. పని ముగించుకుని పక్షులు గూళ్లకు చేరే వేళ హిందూపురం తిరుగుముఖం పట్టాను. ఎప్పుడో ఒంటి గంటప్పుడు ఎంగిలిపడ్డాను. కడుపులో ఆత్మారాముడు అనంతరూపమున వింతలు చేస్తున్నాడు. కారులో పెన్ డ్రైవ్ లో పెట్టుకున్న పాటల్లో- “మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగుమోము కాంచుటె తొలినోము కడగంటి చూపైన కడుపావనం” వినిపిస్తుండగా జాతీయరహదారి ఎడమవైపు […]
రాహుల్ ‘రామ కూతల’ వెనుక రాతలెవరివో గానీ… నవ్వులపాలు..!!
ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి… ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ […]
ఫీల్ గుడ్ మూవీ… బీపీ ఉన్నవాళ్లు చూస్తే ఓ పది పాయింట్లు తగ్గడం ఖాయం…
Subramanyam Dogiparthi…. ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR – వాణిశ్రీల మొదటి జంట సినిమా . ఈ ఇద్దరి జంట తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది . NTR తో సక్సెసులు ఉన్నా , అంతగా పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , బంగారు బాబు , సెక్రటరీ వగైరా సినిమాలలో వాణిశ్రీకి కన్నాంబ , సావిత్రిలంత […]
వావ్… ఆ ట్రెండీ కుమారీ ఆంటీ తెలుగు సినిమా పాటలోకి కూడా ఎక్కేసింది…
దర్శకుడు కుమారస్వామి (అక్షర) అభిరుచి కలిగినోడు… కొత్తతరం దర్శకుడు… మన సినిమాల పాత వెగటుతనాన్ని అంటనీయకుండా కొత్త బాటల సాహస పథికుడు… తను తీసిన సినిమా షరతులు వర్తిస్తాయి త్వరలో రిలీజ్ కాబోతోంది. అందులో ఒక పాట గురించి మనం ఆమధ్య ముచ్చటించుకున్నాం… అది పన్నెండు గుంజాల పాట… తెలంగాణలో పెళ్లి తంతును చిత్రీకరించిన పాట… ఆ పాటను ప్రముఖ తెలంగాణ కథకుడు పెద్దింటి అశోక్‌కుమార్‌తో రాయించుకున్న దర్శకుడు ఈసారి పాట గోరటి వెంకన్నతో రాయించుకున్నాడు… ఇదేమో […]
యుద్ధంలో మరణానంతరమూ సంతానం… ఉక్రెయిన్ జవాన్ల ఉద్వేగపర్వం…
పుతిన్ ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించాడు… నాటో సహకారంతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది… ఈజీ అనుకున్న ఆక్రమణ కాస్తా రష్యన్లకు అసాధ్యం అయిపోతోంది… ఇదింకా కొనసాగుతూనే ఉంది… ఈ యుద్దంలో ఫ్రంట్ లైన్లో 2022 నవంబరులో మరణించిన ఓ జవాను పేరు విటాలీ… తను యుద్ద ప్రారంభానికి కొన్నాళ్ల ముందే ఆర్మీలో జాయినయ్యాడు… ఆయన భార్య పేరు నటాలియా… భర్త మరణించినప్పుడు ఆమె 13 వారాల గర్భిణి… కానీ అది నిలవలేదు… ఆమె ఏం చేసింది..? భద్రపరిచిన భర్త […]
అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ మూవీ ‘ఆరిజిన్’ ఈరోజే విడుదల…
Nancharaiah Merugumala…. అంబేడ్కర్ కనిపించే హాలీవుడ్ సినిమా ‘ఆరిజిన్’ ఈరోజే అమెరికాలో విడుదలవుతోంది! అన్ని వివక్షలకూ కులమే మూలమని చెప్పిన అమెరికా రచయిత్రి ఈసబెల్ విల్కిర్సన్ గ్రంథం ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ ఈ చిత్రానికి ఆధారం …………………………………….. ఇండియాలో కుల వివక్ష, అమెరికాలో జాతిపరమైన వర్ణ వివక్ష, జర్మనీలో యూదుల అణచివేతకు సంబంధం ఉందని నిరూపించే అమెరికన్ జర్నలిస్టు, రచయిత ఈసబెల్ విల్కిర్సన్ రాసిన ‘కాస్ట్: ద ఆరిజిన్స్ ఆఫ్ అవర్ డిస్కంటెంట్స్’ […]
నేవీ మాజీ ఉద్యోగులకు ఖతార్ క్షమాభిక్ష… అనూహ్యం, అసాధారణం…
పోట్లూరి పార్థసారథి… భారత్ కి సంబంధించి ఇది గొప్ప దౌత్య విజయం! ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేశారని మరణ శిక్ష పడిన 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగులను విడుదల చేసింది ఖతార్ దేశం! 8 మంది నావీ ఉద్యోగులలో 7 గురు ఇప్పటికే భారత కి తిరిగి వచ్చేశారు. అయితే 8 మంది భారత నావీ ఉద్యోగుల విడుదల విషయం అనేది అంత సులభమైన పని కాదు! అందులోనూ మరణ శిక్ష […]
సీతక్క పీఏ ఎవరికైనా మాటసాయం చేశాడా..? తనే దందా నడిపిస్తున్నాడా..?
Balaraju Kayethi …. ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేని గుణాలు.. రాజకీయ నాయకుల మీద కోపాలు.. రాజకీయ దురుద్ధేశ్యాలు.. పీఏల మీద రుద్దడం.. రాద్దాంతాలు చేయడం.. మూడు నాలుగు రోజులుగా మంత్రి సీతక్క పీఏ సుజిత్ రెడ్డి మీద చాలా ఛానెళ్లు, వార్తా పత్రికలు కథనాలు రాస్తున్నాయి.. తప్పులేదు.. ఎవరి డ్యూటి వారు చేయాల్సిందే.. ఇసుక అక్రమ రవాణా.. గురించి ఒక్కసారి చర్చిద్దాం.. ఇసుక దందా జరగనిది ఏ ప్రభుత్వంలో.. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతో అంతో […]
ఈ రక్తపైత్యం ఎవరిదైనా సరే ఖండిద్దాం… ఇక చాలు, ఇప్పటికే చాలా ఓవర్…
Subramanyam Dogiparthi… ఎక్కడికి పోతుంది వీరాభిమానం !? వెర్రి తలలు వేస్తున్న పిచ్చి అభిమానం . నాయకులు , పార్టీల అధినేతలు ప్రజల సేవకులు . Servant Leaders . అలాంటిది వ్యక్తి పూజలో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి . పాలాభిషేకాలు … పాలాభిషేకాలు చేయని పార్టీ దేశంలో ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం matured democracy కి చాలా ప్రమాదం . నాయకుడు మరణిస్తే , ఆ నాయకుడి కుటుంబ సభ్యులు ఎవరూ చనిపోరు . […]
మళ్లీ బుల్లితెరపై కార్తీకదీపం… ఇంకెన్ని విన్యాసాలో, మరెన్ని వికారాలో…
అనుకుంటున్నదే… కార్తీకదీపం సీరియల్‌ను చివరలో నానా బీభత్సం చేసి, కథను నానా మలుపులూ తిప్పి, ప్రధాన పాత్రధారుల్ని చంపేసి, కొత్త జనరేషన్ కథ కొనసాగింపు పేరిట ప్రేక్షకుల్ని, కార్తీకదీపం సీరియల్ ప్రేమికుల్ని నానా హింస పెట్టాడు ఆ దర్శకుడెవరో గానీ… తరువాత ఇక తమకే చిరాకెత్తి, ప్రేక్షకుల తిరస్కారం ఎక్కువైపోయి, రేటింగుల్లో దిగజారిపోయి, ఇక కుదరదు అనుకునే స్థితిలో అర్థంతరంగానే కార్తీకదీపం సీరియల్ కథకు ముగింపు పలికాడు అప్పట్లో సదరు దర్శకరత్నం… ఒక సీరియల్ ఎలా ఉండి, […]
రంగుల్లో తీయలేదు కాబట్టే ఆ సినిమా అంత బాగా వచ్చిందేమో..!
Bharadwaja Rangavajhala…. బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. అంతులేని కథ సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది. తెలుగులో అతని మొదటి చిత్రం అదే. అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. నలుపు తెలుపు చిత్రాల ఛాయాగ్రహణంలో అత్యుత్తమంగా చేసిన వారికి బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ, రంగుల్లో అద్భుతమైన కెమేరా […]
కుమారీ ఆంటీ గాలి తీసేసిన సీరియల్ నటి… బిగ్‌బాస్ ఫేమ్ కీర్తి…
అబ్బో, అబ్బో… ఎంత పాపులారిటీ… టీవీ షోలు, ఇంటర్వ్యూలు, యూబ్యూబ్ వీడియోలు… మస్తు సంపాదన… కుమారీ ఆంటీ కథ అంతా తెలిసిందే కదా… ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇస్తే, అవి కాస్తా వైరల్ అయిపోయి, రష్ పెరిగిపోయి, ట్రాఫిక్ నాన్సెన్స్ పెరిగిపోయి, పోలీసులు తన స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ మూసేయడం, సీఎం జోక్యం చేసుకుని, పోనీ వదిలేయాలంటూ ఆదేశించడం అందరికీ తెలిసిందే కదా… ఈ దెబ్బకు ఫుడ్ స్టాల్ పూర్తిగా మూతపడాల్సింది పోయి, రేవంత్ పుణ్యమాని ఇంకా […]
సాయి ధరమ్ తేజకు గాంజా నోటీసులు… సెన్సార్‌ను అలర్ట్ చేస్తే సరిపోయేది…
ఒక వార్త… గాంజా శంకర్ అనే సినిమాకు సంబంధించి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మరికొందరికి నోటీసులు జారీ చేసింది… కారణం ఏమిటంటే..? సినిమా టైటిల్ సరికాదు, ఫస్ట్ హై పేరిట రిలీజ్ చేసిన ట్రెయిలర్ కూడా యువతను పెడదోవ పట్టించేలా ఉంది, కొన్ని సీన్లు సరైన దిశలో లేవు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను నియంత్రించే సెక్షన్ల ప్రకారం ఇలా పెడదోవ పట్టించే ప్రసారాలూ సరికావు,.. సో, టైటిల్ మార్చండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.,.. ఇదీ […]
ఊకో ఊకో ఉండవల్లీ… పదేళ్లుగా పాడీ పాడీ అరిగిన ఆ పాత పాట వదిలెయ్…
Nancharaiah Merugumala… ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సాంగంత హిట్ ఎప్పుడవుతుందో! –––––––––––––––––––––––––––––––––––––––––––––––– ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్ సభల మొత్తం డోర్లు అన్నీ మూసి వేయించేసి […]
సెల్ఫీల ప్రకోప యుగం ఇది… ‘స్మార్ట్ ఫోనోగ్రాఫర్ల’ ట్రెండ్ ఇది…
సెల్ఫీ పిచ్చి… సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీచి, స్వీదృ అని పెట్టి ఉంటే స్వీచి వీచుల వీధుల్లో నిత్యం స్వైర విహారం చేసేవారికి ఎలా ఉన్నా భాషా ప్రేమికులకు మరింత ముద్దొచ్చేది. అందం మాటకు అర్థం చెప్పడం కష్టం. మనం తప్ప ప్రపంచంలో మిగతా అందరూ అందవిహీనంగా ఉన్నారనుకోవడం ఒక భావన. మనం తప్ప ప్రపంచంలో […]
‘మాట తప్పని గాంధీ సగం మాట తప్పాడు.., అందుకే సగం సొమ్మే ఇస్తున్నా..’
Chegondi Chandrashekar…. మొన్న అనుకోకుండా అటు వెళ్ళినపుడు, బుక్ ఫెయిర్ వేదిక మీద విక్రమ్ సంపత్ స్పీచ్ విన్నాను. ఆయన రాసిన పుస్తకం my name is gauhar jaan ని తెలుగులో కూడా తెచ్చారు. దాని ఆవిష్కరణ సభ. నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు. ఆయన షార్ట్ స్పీచ్ ద్వారా కొంచెం తెలిసింది. మన దేశంలో మొట్టమొదటిగా గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఆమెదే. అప్పట్లోనే ఆమె ఒక్క కచేరికి 3000 […]
2 రోజుల బాలింత… ఒడిలో ఆ పసిగుడ్డుతోనే 250 కిలోమీటర్ల ప్రయాణం…
Padmakar Daggumati…. ఒక గొప్ప విజయగాథ. టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. శ్రీపతి.. చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు.. శ్రీపతికి చెల్లెలు తమ్ముడు ఉన్నారు. పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నవర్ పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా పోడు వ్యవసాయం. […]
ఉండమ్మా బొట్టు పెడతా… అప్పట్లో మహిళల్ని విశేషంగా ఏడ్పించింది…
Subramanyam Dogiparthi…. మహిళలకు నచ్చిన సినిమా . మహిళలు మెచ్చిన సినిమా . బాగా ఆడింది . మంచి పేరు కూడా వచ్చింది . గొప్ప మహిళా సెంటిమెంట్ పిక్చర్ . ఉమ్మడి కుటుంబం , పండంటి కాపురం వంటి చాలా సినిమాలకు భిన్నంగా కుటుంబం కోసం , లక్ష్మీ దేవిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపటానికి ఆత్మాహుతి చేసుకునే కధ . జమున బాగా నటించింది . సినిమా ఆఖరిలో లక్ష్మీ దేవి పాత్రలో ఉన్న […]
‘ఆర్టిఫిషియల్ బాలు సాంగ్స్’… అనుచితమా..? సముచితమా..? అగౌరవమా..?
ఒక వార్త… గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కీడాకోలా అనే సినిమా నిర్మాతకు నోటీసులు పంపించాడు… ఎందుకయ్యా అంటే..? తండ్రి గొంతును కృత్రిమ మేధస్సుతో (Artificial Intelligence) ఒక పాటకు వాడుకున్నందుకు..! గుడ్… సరైన చర్య అనిపించింది స్థూలంగా చదవగానే… కానీ అదే వార్తలో చివరలో ఓ ట్విస్టు నచ్చలేదు… తండ్రి గొంతును ఈ కొత్త టెక్నాలజీతో వాడుకున్నందుకు కాదట, తన నోటీసులు ఎందుకంటే, తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా వాడుకున్నందుకట… అక్కడ […]
- « Previous Page
- 1
- …
- 160
- 161
- 162
- 163
- 164
- …
- 483
- Next Page »