రెజీనా కసాండ్రా… మెరిట్ ఉన్న నటే గానీ కావల్సినంతగా పాపులర్ కాలేకపోయింది ఇండస్ట్రీలో… అందగత్తే… సాయిధరమ్‌తేజ… ఈ మెగా క్యాంపు హీరో కేరక్టర్ ఇతర హీరోలకు కాస్త భిన్నం అంటుంటారు… తనకూ ఓ పెద్ద హిట్ దక్కాల్సి ఉంది… వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్నాళ్లుగా బోలెడు వార్తలు… వస్తూనే ఉన్నాయి… అబ్బే, అదేమీ లేదోయ్ అని నిజానికి వీళ్లు ఖండించాలి… కానీ ఇంకా లేదు… ఎహె, రాసుకునేవాళ్లు రాసుకోనీలే అనుకుని ఉంటారేమో… లేదా భలే పట్టేశారే వీళ్లు […]
బీభత్సమైన కవరేజీ… కంటెంటు కాదు, ఆ 29 ఫోటోల పబ్లిషింగ్…
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… 29 మంది నక్సలైట్లు మరణించిన చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ వార్త… దండకారణ్యం మీద నక్సలైట్ల పట్టు సడలడానికి కారణాలు సహా, దాదాపు 80 వేల బలగాలతో సాగుతున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ వివరాల్ని ఏకరువు పెట్టింది ఆ వార్త… బాగానే ఉంది… సరే, ఆ కథనం జోలికి మనం పోవడం లేదు ఇక్కడ… కానీ ఆ వార్తకు 29 మంది మృతుల ఫోటోలు చిన్న చిన్నగా యాడ్ చేశారు… బ్లాక్ అండ్ వైట్ అయినా […]
ఐరనీ… తండ్రి తెలంగాణ పోరాట వీరుడు… భర్త గ్యాంగ్‌స్టర్ కమ్ పొలిటిషియన్…
ఉత్తరప్రదేశం దాకా వెళ్లిన మన పొలిటిషయన్స్ కొత్తేమీ కాదు… జయప్రద పేరు ఉదాహరణకు ఉండనే ఉందిగా… కానీ శ్రీకళారెడ్డి అనే పేరు, ఆమె బయోడేటా కాస్త ఆసక్తికరంగా ఉంది… ప్రస్తుతం ఆమె జాన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తోంది… నిజానికి ఆమె ఆమధ్య బీజేపీలో చేరింది… హుజూర్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా తెలంగాణలోనే పోటీచేస్తుందని అందరూ అనుకున్నారు… ఆమెది తెలంగాణే… తండ్రి జితేందర్‌రెడ్డి, తను నల్గొండ డీసీసీబీ అధ్యక్షుడిగా చేశాడు, హుజూర్‌నగర్ నుంచి గతంలో ఇండిపెండెంటుగా […]
జ్ఞానం మరీ ఎక్కువైతే…? ఈ కథలోని వశిష్ట నారాయణ్ అవుతారు..!!
మనిషికి జ్ఞానం ఎక్కువైనా ప్రమాదమే… మన బుర్ర హరాయించుకోలేదు… కొలాప్స్ అయిపోయి, మనిషి పిచ్చోడైపోతాడు… నిజం… ఇక్కడ లక్ష పుస్తకాలు చదివిన, 80 వేల పుస్తకాలు చదివిన, కంప్యూటర్ నేనే కనిపెట్టిన, సెల్ ఫోన్ నా సృష్టే అని సొల్లే జ్ఞానుల గురించి కాదు… నిజంగానే అపరిమిత జ్ఞానాన్ని పొందిన వారి గురించి… బీహార్… బసంతపూర్ జిల్లా… ఎవరికీ తెలియని ఓ మారుమూల పల్లె… 1942లో పుట్టాడు… తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్… పేరు వశిష్ట నారాయణ్… […]
ఆహార నియమాల్లో ఇదొక పైత్యం… చివరకు కొడుకునే పోగొట్టుకున్నాడు…
ఎవరో ఏదో చెబుతారు.,. అన్నం, రొట్టెలు మానేసి కొబ్బరినూనె తాగండి అని… ఆ విధానమేంటో సరిగ్గా అర్థంగాక, అర్థమైనంతవరకు అడ్డదిడ్డంగా ఆచరించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కేసులు చూశాం… ఇంకొకరు జస్ట్, మిలెట్స్ ఓన్లీ అంటాడు… మరొకరు కీటో డైట్ అంటాడు… ఒకాయన రోజుకు 16 గంటల ఉపవాసాన్ని మించింది లేదు అంటాడు… ఒబెసిటీ, బీపీ, సుగర్, థైరాయిడ్ వంటి నానా రకాల సమస్యలకు నానా రకాల పరిష్కారాల్ని యూట్యూబ్, సోషల్ మీడియా చెప్పేస్తుంది… అవి పరిస్థితులను […]
నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు… నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…
నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి… నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్… ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి […]
ప్రజాస్వామ్యం వద్దు, రాజరికమే కావాలి… ఓ హిందూ దేశంగా ఉందాం…
ఇండియాను హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అది సాధ్యమేనా..? ప్రజలు ఆమోదిస్తారా..? ఇవన్నీ చర్చల్లో ఉండే ప్రశ్నలు… జవాబులు కష్టం… కానీ నేపాల్‌లో మాత్రం ఈ దిశలో ప్రజలే ఉద్యమిస్తున్నారు… ఇది ఆసక్తికరమైన పరిణామం… కానీ ఇండియన్ మీడియా ఈ వార్తలకు ఏమీ ప్రయారిటీ ఇవ్వడం లేదు… మొన్న ఖాట్మండులో భారీ ప్రదర్శన జరిగింది… వేలాది మంది మార్చ్ నిర్వహించారు… ఒక దశలో ఈ ఆందోళనలు ప్రధాని కార్యాలయ ముట్టడి ప్రయత్నాలతో అదుపు తప్పే పరిస్థితి […]
అబూజ్‌మఢ్ ఓ మావో రిపబ్లిక్… తరతరాల ఓ ధిక్కార పోరాట చరిత్ర…
అబూజ్ మడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 29 మంది మావోయిస్టుల మృతి.. ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తూ మీడియా అంతటా కనిపిస్తున్న వార్త ఇది. దట్టమైన ఈ అటవీ క్షేత్రం ఇప్పుడు నిత్య సమర క్షేత్రం… కురుక్షేత్రం… కాల్పులు, పేలుళ్లు కొత్త కాదు… కానీ ఈసారి నక్సలైట్ల వైపు జరిగిన నష్టం అపారం… కేవలం నెల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 54 మంది చనిపోతే… మూణ్నెల్ల కాలంలో 80 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ […]
కేసీయార్ ఇజ్జత్‌కు మరక… ఆ భాష మార్చుకోవాలని ఈసీ చురక…
నిరోధ్‌లు, పాపడాలు అమ్ముకుని బతకాలంటూ సలహాలిస్తున్నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు అని చెబుతూ, కుక్కల కొడుకులు అనే పదం వాడాడు… నీటి సామర్థ్యం గురించి తెలియని లత్కోరులే ఈ పరిస్థితికి కారణం అన్నాడు… చవట, దద్దమ్మల పాలన వల్లే ఈ దుస్థితి… బోనస్ గనుక ఇవ్వకపోతే మీ గొంతుల్ని కోసేస్తం, చంపేస్తం… ఇదీ శ్రీమాన్ కేసీయార్ సారు గారి భాష… పైగా నిన్న ఎక్కడో మాట్లాడుతూ లిల్లీపుట్ గాళ్ల ప్రభుత్వం, లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషేమిటి..? […]
సమస్య లేకపోవడమూ ఓ సమస్యే… భార్య అర్థమైతే అదొక విడ్డూరమే…
ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన పని ఏమిటి..? ‘మహిళల్ని అర్థం చేసుకోవడం, అందులోనూ భార్యల్ని అర్థం చేసుకోవడం…’ ఈ కాన్సెప్టుతో కొన్ని లక్షల జోకులు, కార్టూన్లు, మీమ్స్, కథలు గట్రా వచ్చి ఉంటాయి కదా… అందులో ఒకటి ఇదుగో ఈ కార్టూన్ కూడా… జస్ట్, ఓ ఉదాహరణ కోసం… బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ కాకా… ఫుట్‌బాల్ ప్లేయర్లలో చాలా అందగాడిగానే పేరు… లుక్స్ మాత్రమే కాదండోయ్… అటాకింగ్ మిడ్ ఫీల్డర్… వేగానికీ, చురుకుదనానికీ, డ్రిబ్లింగ్ సామర్థ్యానికీ మంచి పేరు… […]
ఇది టీ20… నత్తరికం నడవదు… బంతి కనిపిస్తే బాదుడే మరి…
Prasen Bellamkonda…… బౌలర్లకు నివాళి…. నిన్న SRH vs RCB మాచ్ లో రెండు జట్లు నలభై ఓవర్లలో 549 పరుగులు చేయడం కళ్ళారా చూసిన నాకు ఒకసారి రింగులు రింగుల్లో వెనక్కి వెళితే పొట్ట ‘చెక్కా’లయ్యే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆఫ్ అండ్ మిడిల్ స్టిక్ మీది బాల్ ను ఆఫ్ సైడ్ మాత్రమే ఆడాలనుకునే మూఢత్వం విరివిగా ఉన్న రోజులవి. మరి ఇప్పుడేమో వైడ్ అవుటాఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ను ఫైన్ లెగ్ […]
సమాజమే అడ్డుపడి… ఆ మరణశిక్ష నుంచి అతన్ని తప్పించింది…
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.. మదర్ థెరీస్సా చెప్పిన ఈ ప్రోవర్బ్ ఎంత పాప్యులరో తెలిసిందే. అయితే, ఒక వ్యక్తి.. ఒక కుటుంబం ఒంటరైనప్పుడు థెరీస్సా మాటల స్పిరిట్ తో కనుక సమాజం పనిచేస్తే… మన కంటికి కనిపించని దైవత్వాన్ని మించిన మానవత్వాన్ని ఆవిష్కరించొచ్చు. కనిపించని దైవత్వం కన్నా.. కనిపించే మానవత్వమే మిన్న అనిపించొచ్చు. అదిగో అలా చేశారు కనుకే.. ఆ కేరళ సమాజపు స్టోరీ ఓసారి చెప్పుకోవాలి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను.. మృగజాతికెవ్వడు […]
ఒక వైరల్ ఫెయిల్యూర్ స్టోరీ… 12 ప్రయత్నాల సివిల్ సర్వీస్ పరీక్ష…
యూపీఎస్సీ 2003 రిజల్ట్స్ వచ్చాయి… ర్యాంకులు కొట్టి, సివిల్ సర్వీసులో చేరబోతున్నవారి మొహాల్లో, ఆ కుటుంబాల్లో ఆనందం… ఇంటర్వ్యూల దశ దాటలేని దురదృష్టవంతుల్లో మళ్లీ నిరాశ… ఫస్ట్ ర్యాంకర్ నుంచి బోలెడన్ని ర్యాంకుల దాకా… మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడన్ని సక్సెస్ స్టోరీలు… అర్హులే అభినందనలకు… మరి ఒకటీ అరా మార్కులతో విఫలమైన వాళ్ల ఫెయిల్యూర్ స్టోరీలు ఎవరు చెప్పాలి… అవి కదా అసలు అందరికీ తెలియాల్సినవి… ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలిస్తే కదా లక్షల మందికి […]
మళ్లీ వార్తల్లోకి దేవయాని..! కాంబోడియాకు పంపించేసినా ఊరుకోదు..!!
దేవయాని ఖోబ్రగడె… పేరు గుర్తుందా..? చాన్నాళ్లయింది కదా ఆమె వార్తల తెర మీదకు రాక… ఎస్, మళ్లీ వచ్చేసింది… ఈసారి డిఫరెంటుగా… ఆమె ప్రస్తుతం కాంబోడియా ఇండియన్ ఎంబసీలో రాయబారిగా పనిచేస్తోంది కదా… అక్కడి నూతన సంవత్సరం రోజున ఆ దేశప్రజల ఖ్మేర్ సంస్కృతికి సంబంధించిన అప్సర వేషధారణ చేసి, ఆ దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పింది… ఆ ఫోటో షూట్‌ను ఇండియన్ ఎంబసీయే అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది… స్థూలంగా చూస్తే వోకే… బాగుంది… ఆమె […]
సన్నజాజి పడక… మంచె కాడ పడక… చల్లగాలి పడక…
Sai Vamshi…. తమిళ వాళ్ల నేటివిటీ.. తెలుగు వాళ్ల క్రియేటివిటీ …. అతను ఊరికి పెద్ద. ప్రేమించింది ఒకర్ని, పెళ్లి చేసుకుంది మరొకర్ని. తప్పలేదు. ఊరిని ఒకటిగా నిలపడానికి అదొక్కటే దారి! భార్య పల్లెటూరి అమాయకురాలు. చదువు లేదు. కానీ బోలెడంత సంస్కారం ఉంది. భర్తపై ఎనలేని ప్రేమ ఉంది. ఆ ప్రేమను అందుకోడానికి ఆమెను పడకటింటికి పిలిచాడు. దగ్గరగా కూర్చోబెట్టుకొని పాట పాడమన్నాడు. గీత రచయితలకు ఇలాంటి సందర్భాలు అరుదుగా దొరుకుతాయి. ఆ క్షణాన ఆ […]
పిబరే రామరసం-5 …. రామానుబంధాలు …
ఎన్ని యుగాలైనా లోకంలో అన్నాదమ్ముల అనుబంధమంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఆదర్శం. ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్యాద్వేషాలతో కొట్టుకుని చచ్చే ఈ రోజుల్లో తమ్ముళ్లకు రాముడిపై ఉన్న ప్రేమాభిమానాల గురించి; తమ్ముళ్లపై రాముడికి ఉన్న అపారమైన అనురాగం గురించి తెలుసుకుని తీరాలి. దశరథుడి భార్యలు- కౌసల్య కుమారుడు రాముడు; కైకేయి కుమారుడు భరతుడు; సుమిత్ర కుమారులు లక్ష్మణ శత్రుఘ్నులు. కులగురువు వసిష్ఠుడి దగ్గర సకల శాస్త్ర, అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. విశ్వామిత్రుడు యాగరక్షణార్థం […]
పిబరే రామరసం-4 … ఎదురులేని రామ బాణం…
పద్యం:- “చరణాగ్రమున నీ భుజాదర్పమణచిన ధూర్జటి విలు తుంచివైచె వాలపాశమ్మున నిన్ను కట్టిన వాలిని ఒకమ్మున కులవైచె అని నిన్ను పురుగొన్న అర్జును బలిగొన్న పరశురాముని యాజి భంగపరిచె కలిమియైయొక్కటి పదునాల్గువేవుల బారిసమరె అట్టి మహా ధనుర్ధరునకున్ యెగ్గాచరించి, హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయద, నిర్ఘాత, సంఘాత, బాణ ఘాత శాత హతులుగాక బదుకగలరె?” భావం:- ఓ రావణాసురా! నువ్ కైలాసాన్ని పెకలించబోయినప్పుడు శివుడు కాలిని అదిమి పట్టి నీ గర్వాన్ని అణచాడే…ఆ శివుడి విల్లును రాముడు […]
పిబరే రామరసం-3 … మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం…
. మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం, భారతం, భగవద్గీతలను చెప్పడం ఇప్పుడొక ఫ్యాషన్. అలా చెబుతున్నవారికి ఈ ఇతిహాసాలు, పురాణాలు ఒక ఉపాధిగా అయినా పనికివస్తున్నందుకు సంతోషించాలి. ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా పదానికి చాలా లోతయిన అర్థం ఉంది. దేన్నయినా మేనేజ్ చేయడం అన్నప్పుడు నెగటివ్ మీనింగ్ కూడా ఉంది. ఆ మేనేజ్ క్రియా విశేషణమయినప్పుడు మేనేజ్మెంట్ అన్న భావార్థక పదం పుడుతుంది. మేనేజ్మెంట్ కు తెలుగు మాట నిర్వహణ. నిర్వాకం వెలగబెట్టినట్లు వెటకారమయ్యింది కానీ- మేనేజ్ […]
పిబరే రామరసం- 2 …. నిరీక్షణ రామాయణం…
• ఎంతకాలమయినా సంతానం కలుగక దశరథుడు ఎంతగానో నిరీక్షించాడు. • సకల గుణ సంపన్నుడు ఎవరయినా ఉంటే – అతడి చరితను కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు. • అవతారపురుషుడి కావ్యం ఎవరిచేత రాయించాలా అని నారదుడు ఎంతగా నిరీక్షించాడో! • అవతారపురుషుడికి నామకరణం చేయడానికి వసిష్ఠుడు నిరీక్షించాడు. • రాముడి చేత రాక్షస సంహారం చేయించడానికి, తన తపో బలాన్ని మొత్తం రామ లక్ష్మణులకు ధారపోయడానికి విశ్వామిత్రుడు నిరీక్షించాడు. • బండరాయిగా పడి […]
పిబరే రామరసం- 1 … మన బతుకంతా రామమయం…
ఒక దేశానికి, ఒక జాతికి తనకంటూ సొంతమయిన అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. భాషా సంస్కృతులుంటాయి. నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలకు కట్టుకున్న గుడిగోపురాలుంటాయి. ఆ గుడి గోపురాల్లో కొలుచుకునే దైవాలుంటాయి. ఆ దైవాల ఆవిర్భావ ఘట్టాలు, లీలలను తెలిపే పురాణాలుంటాయి. ఆ పురాణాల్లో ఏ కాలానికయినా నిలిచి వెలిగే ఆదర్శాలుంటాయి. ఆ ఆదర్శాల అద్దంలో మనల్ను మనం చూసుకుంటూ నడవాల్సిన విలువలుంటాయి. ఆ విలువలను తెలుసుకుంటే జ్ఞానం. […]
- « Previous Page
- 1
- …
- 164
- 165
- 166
- 167
- 168
- …
- 450
- Next Page »