Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గామి..! ఆసక్తికరంగా హిమాలయ యాత్ర… విజువల్స్, బీజీఎం బాగున్నయ్..!!

March 8, 2024 by M S R

gaami

గామి… ఈమధ్య ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపిన సినిమా… ఎందుకు..? ట్రెయిలర్లు చూస్తేనే భిన్నమైన కథాకథనాలు, విజువల్ వండర్స్ ఛాయలు గోచరించాయి గనుక… రొటీన్ మూస సినిమాల నడుమ ఓ కొత్తదనం, ప్రయోగం కనిపించాయి గనుక… క్రౌడ్ ఫండింగ్ ద్వారా అయిదారేళ్లపాటు పురుటి నొప్పులు పడిన సినిమా గనుక… కారు చౌకగా మంచి స్టాండర్డ్స్ ఔట్ పుట్ తీసుకొచ్చారు గనుక… నిజానికి హీరో విష్వక్సేన్ ఇప్పుడైతే ఈ భిన్నమైన పాత్రను అంగీకరించేవాడో కాదో తెలియదు గానీ ఆరేళ్ల క్రితం […]

మలయాళంలో తీసిన హైదరాబాద్ సినిమా… టెకీల ఓ సరదా ప్రేమకథ…

March 8, 2024 by M S R

preamalu

సరిగ్గా నెల రోజుల క్రితం మలయాళంలో విడుదలైంది ఈ సినిమా… పేరు ప్రేమలు… కొద్ది నెలలుగా మాలీవుడ్ చాలా జోష్ మీద ఉంది తెలుసుగా… ఈ సినిమాకు పెద్ద స్టార్ కేస్టింగ్ లేకపోయినా సరే 85 కోట్లు వసూలు చేసింది… ఓవర్సీస్‌లోనే 35 కోట్లు… మలయాళంలో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 85 కోట్లు అంటే బంపర్ సెన్సేషనల్ హిట్ అన్నట్టు లెక్క..! అన్నట్టు నిర్మాణ వ్యయం ఎంతో తెలుసా..? జస్ట్, 3 కోట్లు..! సరే, దీన్ని తెలుగులోకి […]

ఆడెనమ్మా శివుడు… పాడెనమ్మా భవుడు… ఏమానందము..? భూమీతలమున..!

March 8, 2024 by M S R

tandava

శివ తాండవమట! శివ లాస్యంబట! ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో […]

మళ్లీ కొత్తగా అదే ప్రొసీజర్…? ఆ ఇద్దరికే ఎమ్మెల్సీలుగా మళ్లీ చాన్స్..!

March 8, 2024 by M S R

mlc

కోదండరాం‌ను రేవంత్ కావాలనే బకరా చేశాడనే పిచ్చి విమర్శ ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది… తప్పు… హైకోర్టులో ఉన్న కేసు తీర్పు ఎలా వస్తుందో రేవంత్ ప్రభుత్వ ముఖ్యులకు ఆల్రెడీ ఓ ఐడియా ఉంది… గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే ఆమె కేబినెట్ నిర్ణయాలను తప్పకుండా ఆమోదిస్తుందనే నమ్మకం, అనుభవమూ ఉన్నాయి… సో, కోదండరాంతోపాటు జర్నలిస్టు అమెర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలనే నిర్ణయం తీసుకుని గవర్నర్‌కు పంపించింది ప్రభుత్వం… ఆమె వెంటనే ఆమోదముద్ర […]

ఓహో… వ్యూహం వెబ్‌ సీరీస్ పేరు శపథం చాప్టర్-1 గా మార్చింది అందుకేనా..?!

March 8, 2024 by M S R

rgv

ఏదో పరువు దక్కించుకునే పిచ్చి ప్రయత్నం… రాంగోపాలవర్మ జగన్ అధికార ప్రస్థానం మీద వ్యూహం అనే సినిమా తీశాడు కదా… అది మొదటి ఆటకే నీటిబుడగలాగా ఫట్‌మని పేలిపోయింది కదా… అనేక థియేటర్లలో డెఫిసిట్… సరిగ్గా టికెట్లు తెగక ఆటనే ఎత్తేసిన థియేటర్లూ ఉన్నట్టు వార్తలొచ్చాయి కదా… వర్మ జాబితాలో మరో అతి పెద్ద డిజాస్టర్ చేరింది కదా… తను ఎలాగూ ఎప్పుడూ మునిగే బ్యాచ్, కానీ జగన్ పరువును కూడా నిలువునా ముంచేశాడు కదా… ఎన్నికల […]

ఆ పాత మిత్రుల మోడీ తాజా ఆలింగనాలతో బీజేపీకి వచ్చే ఫాయిదా ఎంత..?!

March 7, 2024 by M S R

modi

ఏపీలో చంద్రబాబు తెలుగుదేశంతో బీజేపీ పొత్తు ఉండబోతున్నదనే వార్తలు వస్తున్నాయి… ఒడిశాలో నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్‌తో బీజేపీ పొత్తు ఖరారైపోయింది… బిహార్‌లో జేడీయూ నితిశ్ మళ్లీ బీజేపీ పంచన ఆల్రెడీ చేరిపోయాడు… కర్నాటకలో దేవెగౌడ జేడీఎస్ కూడా బీజేపీతో చేతులు కలిపింది… కేరళలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులేకాదు, జాతీయ స్థాయిలో ఇంకా బీజేపీలో చాలామంది చేరుతున్నారు… సొంతంగా 370 సీట్ల సాధన, ఎన్డీయే కూటమిగా 400 సీట్లు అనే టార్గెట్ దిశలో బీజేపీ అన్ని శక్తులూ […]

నాడు తొడలు గొట్టి సవాల్ విసిరాడు… ఇప్పుడు ఆ తొడలే విరిగిపోతూ కాళ్లబేరం..!!

March 7, 2024 by M S R

mallareddy

మల్లారెడ్డి… ఈ పేరు తెలియని వాళ్లు లేరు, ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు… పాలమ్మి, పూలమ్మి వేల కోట్లు, ఎంత ఆస్తి ఉందో తనకే తెలియనంత సంపద పోగేసిన పేరు… నిజం చెప్పాలంటే జస్ట్, అలా పాలు అమ్మి, పూలు అమ్మి ఇంత డబ్బు గడించిన కథ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సక్సెస్ స్టోరీ అవుతుందేమో… తన చరిత్ర తవ్వుతూ పోతే ఎన్ని పెంకాసులో, ఎన్ని రత్నాలో సంక్షిప్త వివరణ అసాధ్యం గానీ… విజ్ఞత, పరిణతి, హుందాతనం వంటి […]

వందల హుండీలు పెట్టినా… మేడారం భక్తులు పెద్దగా పట్టించుకోరు… ఇలా..!

March 7, 2024 by M S R

medaram

మనం దక్షిణ కుంభమేళాగా చెప్పుకుంటాం… మహావనం మహాజనంగా కనిపిస్తుంది మూణ్నాలుగు రోజులపాటు… కిలోమీటర్ల పరిధిలో జనం, గుడారాలు, వంటలు, పూజలు, మొక్కులు, స్నానాలు కనిపిస్తాయి… పిల్లాజెల్లా అందరూ తరలివస్తారు… అదొక ఆదివాసీ మహోత్సవం… సమ్మక్క- సారలమ్మలపై వాళ్ల భక్తికి తిరుగులేదు… మెచ్చుకోదగిన విషయం ఏమిటంటే… సోకాల్డ్ సంప్రదాయ ఆగమశాస్త్ర పూజావిధానాలను అక్కడ పూజారులు రానివ్వరు… తమ సొంత అర్చన రీతులను మాత్రమే పాటిస్తారు… విగ్రహాలు, అభిషేకాలు, ఆర్జితపూజలు గట్రా అస్సలు అనుమతించరు… అసలు తమ పూజల్లోకి అన్యులను […]

టి.కృష్ణ కొడుకుగా ఇదీ నా సినిమా అని ఒక్కటి చెప్పగలవా గోపీచంద్..?

March 7, 2024 by M S R

Gopichand

గోపీచంద్… ఒకప్పుడు సెన్సేషనల్ పీపుల్స్ సినిమాలు తీసి మెప్పించిన మంచి దర్శకుడు టి.కృష్ణ కొడుకు… నటనాపరంగా మంచి మెరిట్ ఉంది తనలో… అప్పట్లో విలన్‌గా చేసి కూడా మెప్పించాడు… కానీ చాన్నాళ్లుగా వరుస ఫ్లాపులు… అసలు తన కెరీరే ప్రమాదంలో పడి, ఫీల్డులో ఉంటాడా లేడా అనే సందేహాలు వ్యాపిస్తున్న తరుణంలో కూడా ఏదో ఒక సినిమా చాన్స్ వస్తోంది, మరో ఫ్లాప్ కొడుతున్నాడు… విలేకరులు తన దగ్గర ఓ ఆసక్తికరమైన ప్రశ్నను ముందుపెట్టారు… ‘‘గతంలో కాన్సెప్ట్ […]

లాలూ, రాహుల్, రాజా… మోడీ రియల్ పరివార్… వేరే మిత్రులక్కర్లేదు…

March 7, 2024 by M S R

modi

మోడీ బాటలో ప్రతిపక్షాలు… ఏమిటో! చిన్నప్పటి నుండి మనం బడి పుస్తకాల్లో చదువుకుని…చదువుకుని…భారతదేశం అంటే భిన్నమతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో “భిన్నత్వంలో ఏకత్వం” అంతస్సూత్రంగా ఉన్న దేశం అనుకుంటున్నాం. అసలు భారత దేశం దేశమే కాదని…అదొక ఉప ఖండమని డి ఎం కె నాస్తిక రాజా తేల్చిపారేశాడు. ఒక దేశమంటే ఒకే భాష ఉండాలట. ఒకే సంస్కృతి ఉండాలట. ఆయన లెక్క ప్రకారం బహుశా ప్రస్తుత దేశం 29 ఉప ఖండాలయి ఉండాలి. ఇందులో భాషాభేదాలకు తోడు […]

నరేంద్ర మోడీ, నవీన్ పట్నాయక్… పొత్తుకు చేతులు కలుపుతున్నారు…

March 6, 2024 by M S R

patnaik

ఒడిశా రాజకీయాల్లో మళ్లీ ఓ మార్పు దిశగా పరిణామాలు సంభవిస్తున్నాయి… బీజేపీ, బీజేడీ చేతులు కలిపే సూచనలు, అడుగులు కనిపిస్తున్నాయి… ఒకవైపు బీజేపీ, మరోవైపు బీజేడీ విడివిడిగానే ఈ పొత్తు ఎలా ఉంటే బాగుంటుందో చర్చిస్తున్నాయి… అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఒడిశాలోని 14 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో బీజేడీ పోటీచేస్తాయి… ఇదే రేషియో రివర్స్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలవుతుంది… అంటే ఉజ్జాయింపుగా 47 సీట్లలో బీజేపీ, 100 స్థానాల్లో బీజేడీ […]

Dunki… ఎలాగోలా పాక్ నుంచి బయటపడాలి… కెనడా చేరుకోవాలి…

March 6, 2024 by M S R

dunki

Pardha Saradhi Potluri …. పాకిస్థాన్ గత వారం రోజులుగా అంతర్జాతీయంగా వార్తలలో ఉంటూ వస్తున్నది! అయితే ఆ వార్తలు ఏవీ కూడా అంత మంచివి కావు! నిన్న జరిగిన సంఘటన వలన మరో సారి పాకిస్థాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది! ఒలంపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఒక టీమ్ ను పంపించింది ఇటలీ దేశంకి! ఆ టీమ్ లో పురుషులు మరియు మహిళలు ఉన్నారు! నిన్న వార్మ్ అప్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా […]

జర్నలిస్టులు స్వేచ్ఛ అనుభవించారట… హరీష్‌రావు వింత విమర్శలు…

March 6, 2024 by M S R

రేవంత్

ప్రజా పాలనలో పెన్నులు గన్నులు ఐయ్యాయి… మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేనా… అన్ని ఫ్లోర్ లు స్వేచ్చ గా తిరిగేవారు జర్నలిస్ట్ లు… విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదు సచివాలయంలోకి……. ఈ మాట అన్నది మాజీ మంత్రి, కేసీయార్ కుటుంబసభ్యుడు, బీఆర్ఎస్ ప్రధాన నేత హరీష్ రావు… కొంతమేరకు ఆచితూచి, కాస్త మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడని పేరున్న హరీష్‌ను కూడా ఓరకమైన ఫ్రస్ట్రేషన్ ఆవరిస్తున్నట్టుంది… నిజంగా తన విమర్శ చూసి జర్నలిస్టులందరూ నవ్వుకునేలా ఉంది… పెన్నులు-గన్నులు అనే వ్యాఖ్యను నవ్వుకుని […]

ఎల్లమ్మకు పెట్టుకునుడు… శాకాహార, మాంసాహార పద్ధతులు వేర్వేరు…

March 6, 2024 by M S R

yellamma

ఎల్లమ్మకు పెట్టుకునుడు ~~~~~~~~~~~~~~~~~ జాగరణ ఉన్నవాళ్లు శివరాత్రి ముందు ఇగ మిగిలిన అందరూ ఉగాదికి ముందట ఏదో ఒక మంగళవారం నాడు ఎల్లమ్మకు పెట్టుకుంటరు. పొద్దు నడినెత్తిమీదికెల్లి పడుమటి దిక్కుకు దిగినంక పట్టపగటీలి రెండు ఝాముల ఘడియలల్ల చేసే పండుగ. అప్పటిదాక ఇంటియిల్లాలు నిష్టగ ఒక్క పొద్దుతో చేసే వంతన. దసర ఎల్లమ్మ, సంకురాత్రి ఎల్లమ్మ, మాఘమాసపు ఎల్లమ్మ ఇట్లా ఎల్లమ్మకు పెట్టుకునే పద్ధతులు వేరువేరుగ ఉంటయి. గ్రామదేవతల పూజల్లో శాకాహార, మాంసాహార రెండుంటయి. అమ్మవార్లకు జేసే […]

ఆ అయోధ్య బాలరాముడికి మన తిరుమల వెంకన్న ‘అనుభవ పాఠాలు’…

March 6, 2024 by M S R

ayodhya

అయోధ్య గుడి… బాలరాముడి దర్శనం కోసం భక్తకెరటాలు పోటెత్తుతున్నయ్… యావత్ దేశం నుంచీ ప్రత్యేక రైళ్లే గాకుండా సొంత వాహనాలు, ఇతరత్రా రవాణా మార్గాల్లో జనం వెల్లువెత్తుతున్నారు… ప్రాణప్రతిష్ఠ తరువాత 30-35 రోజుల వ్యవధిలో 65 లక్షల మంది దర్శించుకున్నట్టు అంచనా… అంటే రోజుకు దాదాపు రెండు లక్షలు… అయోధ్య విశ్వసందర్శన క్షేత్రంగా మార్చాలనే ప్రయత్నాలు, ప్రణాళికల నేపథ్యంలో ఈ భక్తుల తాకిడి ఇప్పట్లో ఆగదు… కానీ రోజూ సముద్రాన్ని తలపిస్తున్న ఈ రద్దీని స్ట్రీమ్ లైన్ […]

ఇల్లు చేరగానే… నా కాలి చెప్పు తీసి టపాటపా తలకేసి కొట్టుకున్నాను…

March 6, 2024 by M S R

Aishwarya

* నేను, మా అమ్మ (నటి లక్ష్మి) గొడవపడుతూ ఉన్నామని, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అంతా అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. మేము బాగానే ఉన్నాం! మేం కలిసే ఉన్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారా? * అమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. అందుకు కారణం కూడా ఉంది. ఒకసారి నేను, అమ్మ, మా అమ్మ భర్త (Step Father) కలిసి ఒక […]

అపర కుబేరుడు ముఖేష్ అంబానీకి సమస్యలు లేవని మీరు అనుకుంటున్నారా..?

March 6, 2024 by M S R

chopper

ముఖేష్ అంబానీకి సమస్యలు లేవని మీరు అనుకుంటున్నారా? ముఖేష్‌ భాయ్ 15వ అంతస్తులోని తన పడక గది నుండి లేచి వచ్చి, 17వ అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టి, 19వ అంతస్తులోకి వెళ్లి, అల్పాహారం చేసి, 14వ అంతస్తులోని పర్సనల్ ఆఫీసుకు వెళ్లేందుకు దుస్తులు ధరించి, అవసరమైన ఫైల్స్ తీసుకుని, 16వ అంతస్తులోని నీతాకు శుభాకాంక్షలు చెప్పి… 13వ అంతస్తులో ఉన్న తన పిల్లలకు ‘సీ యు’ అని చెప్పి, 3వ అంతస్తులో దిగి, తన […]

కళ్లు చెమ్మగిల్లజేసే కథ… ప్రధాన కథానాయికగా చెలరేగిపోయిన శారద…

March 6, 2024 by M S R

sarada

Subramanyam Dogiparthi….  ఎంతటి పాషాణ హృదయుడయినా , కర్కశుడయినా సినిమా చూసేటప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . శారదని ఊర్వశి శారదను చేసిన సినిమా . శారద నట విశ్వరూపం 1969 లో గాంధీ శత జయంతి రోజున విడుదలయిన ఈ సినిమాలో . ప్రపంచ సినీ రంగ చరిత్రలో ఒకే కధ ఆధారంగా తీయబడిన నాలుగు భాషల సినిమాలలో నటించిన ఏకైక నటి శారద . మొదట మళయాళం , తర్వాత తెలుగు తమిళం హిందీ భాషలు […]

వాణిశ్రీకి ఇచ్చింది జస్ట్ నాలుగు వేలు… జయలలిత మాత్రం నలభై వేలు తీసుకుంది…

March 6, 2024 by M S R

sukhadukhalu

Bharadwaja Rangavajhala………  2014 లో అనుకుంటా …. ప్రముఖ సినీ దర్శకుడు ఐఎన్ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు అనే వార్త చూశాను. అప్పటికి ఆయన వయసు సుమారు 89 సంవత్సరాలు. ఎవరీ ఐఎన్ మూర్తి అనుకుంటున్నారా … ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సీతారామకళ్యాణం చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా వ్యవహరించారాయన. నిజానికి ఈ సినిమాకు దర్శకత్వం ఎన్టీఆర్ అని టైటిల్ కార్ట్స్ లో పడదు. అయినా అన్నగారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం అదే. అయితే ఎన్టీఆర్ […]

బాలీవుడ్ జేజమ్మగా దీపిక..! గుడ్.. ఆ రాణి పద్మావతికి ఆ పాత్ర ఓ లెక్కా..?

March 6, 2024 by M S R

deepika

అరుంధతి… ఈ సినిమా అనుష్క నటజీవితానికి పెద్ద బ్రేక్… ఆ సినిమా తరువాతే ఆమె పాపులారిటీ, ఇమేజీ బాగా పెరిగిపోయి, తెలుగు అగ్ర హీరోయిన్‌గా నడిచిపోయింది చాన్నాళ్లు… అదేదో పిచ్చి సినిమాకు బరువు పెరిగేదాకా..! ఆ తరువాత ఇక ఆమె కెరీర్ అస్సలు గాడినపడలేదు… పడుతుందనే సూచనలూ లేవు… కొత్త హీరోయిన్లు వచ్చి దున్నేస్తున్నారు… సెకండ్ ఇన్నింగ్స్ జోష్‌లో లేదు… అదుగో ఇదుగో ప్రభాస్ అనే వార్తలు రావడమే తప్ప తను సై అనడు, ఈమె చెంతచేరదు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 178
  • 179
  • 180
  • 181
  • 182
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions