Paresh Turlapati….. అబ్సర్వేషన్స్… తెలంగాణా ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు కదా, టీవీల్లో చూసిన తర్వాత దాంట్లో నేను గమనించిన కొన్ని దృశ్యాలు ! * రేవంత్ రెడ్డి సోనియా కుటుంబంలో మంచి మార్కులే సంపాదించుకున్నారు ! * తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా..రాహుల్.. ప్రియాంకలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరేటప్పుడు హడావుడిలో జరిగిన ఒక చిన్న దృశ్యం నన్ను ఆకర్షించింది ! కారులో రాహుల్ ముందు కూర్చుంటే సోనియా.. ప్రియాంక […]
దొర వారి పెద్ద గడీ కంచెలు కూలిపోతున్నయ్… ఇదొక సంకేతం…
తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్… దాని ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ఈరోజు బద్ధలు కొడుతున్నారు… ఒక దొర గడీగా వెలిగిన ఈ అత్యంత విశాలమైన రాజప్రాసాదం కంచెలు పడిపోతుంటే సోషల్ మీడియా నిండా అభినందనలు… గడీ గోడలు కూలుతున్న చప్పుడు… అబ్బే, కూల్చడం దేనికి అని విమర్శలు చేస్తున్నారు… కానీ అది ఒక సంకేతం… జగన్ సీఎం కాగానే కరకట్ట మీది చంద్రబాబు అధికారిక నివాసాన్ని కూల్చడం చంద్రబాబు పట్ల, ఆయన పార్టీ […]
విధివైచిత్రి… వేధించిన ఆ రాజ్యం తుపాకులే ఇప్పుడు సెల్యూట్ కొడుతున్నయ్…
విధి వైపరీత్యం అంటారా..? విధి వైచిత్రి అంటారా..? డెస్టినీ డిసైడ్స్ అంటారా..? టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్ అంటారా..? మన కళ్లెదుటే బోలెడు… నేనంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను అని ప్రచారం చేసుకునే కేసీయార్‌ను యావత్ తెలంగాణ సమాజం ఛీకొట్టి, తను ద్వేషించిన ఆంధ్రులే తన ఉనికిని కాపాడటం ఓ విధివిలాసం… ఓ ఎమ్మెల్సీని కొనడానికి క్యాష్ బ్యాగులు తీసుకుపోయి, దొరికిపోయి, జైలుకుపోయిన రేవంత్‌రెడ్డి నేడు తనే ముఖ్యమంత్రి… కేసు పెట్టి, అంతు చూడాలనుకున్న ఈ […]
వాచికం… నటనలో ఇదీ ప్రధానమే… అందులో సాక్షి రంగారావు మహాదిట్ట…
Bharadwaja Rangavajhala….. సాక్షి రంగారావు… కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు. నాకు ఆయన డైలాగ్ మాడ్యులేషన్ చాలా ఇష్టం … సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం మీద తన […]
పర్లేదు… బలమైన ఎమోషన్స్ పలికించే ఆ పాత నాని మళ్లీ కనిపించాడు…
నాని… నేచురల్ స్టార్ అని పిలిచినా, మరో పేరుతో పిలిచినా… తను సెన్స్ ఉన్న నటుడు… టైమింగ్, మెరిట్ ఉన్న నటుడు… తెలుగు హీరోల్లో చాలా అరుదు… బండ కొట్టుడు మొహాలే తప్ప బలంగా ఉద్వేగాల్ని పలికించే నటులెవరున్నారని… సో, నాని తెలుగు ఇండస్ట్రీకి ఓ అసెట్… కాకపోతే ఎప్పుడైతే స్టార్ ఇమేజీ వచ్చిందో, ఇక తనూ దారితప్పి ఫాల్స్ ఇమేజీ బిల్డప్పుల బాటలోకి వెళ్లిపోయాడేమో అనిపించింది పలుసార్లు… టక్ జగదీష్ సినిమాలో చొక్కా వెనుక దాచిన […]
సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌజ్ పంపిస్తున్న ప్రమాదసంకేతాలు ఏమిటంటే..?
ఒక్క కేసీయార్ చేశాడని ఏమీ లేదు… దేశమంతా జరుగుతున్నదే… ఎమ్మెల్యేలు, ఎంపీల అమ్మకపు సరుకు కావడం ఈ దేశం దౌర్భాగ్యం..! సో, ఫలానా పార్టీ దీనికి అతీతంగా ఉందని ఏమీ చెప్పలేని దురవస్థ…! ఇక కొన్ని విషయాలు చెప్పుకుందాం… మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరీ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కొట్టేస్తే చంద్రబాబు బాగా బాధపడ్డాడు… నేను అంత ఘోరంగా పాలించానా..? ప్రజలకు, రాష్ట్రానికి ఏం నష్టం చేశాను..? అనేది తన ఆవేదన… నిజానికి కేసీయార్ […]
చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
సర్వపిండి సనాతనం ~~~~~~~~~~~~~~~ చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం. ఉల్లి కొత్తిమీర గుమగములతో ఊరిస్తది. ఎక్కువ గట్టిపడిపోదు. చలిగదా, తాపం తక్కువ. చెడగొట్టు ముసుర్లకు చెవ్వోముక్కో అన్నట్టుగుంటంది గద, కారకారంగ రామతులసి ఆకులు వేసిపెట్టిన సర్వపిండి ఇది. నీడకుబతికే వాళ్లం, ఒక్కటితింటే ఒకపూట గాసం సమాప్తం. ~•~•~•~•~ అనుభవసారం ప్రకారం సర్వపిండిలో ప్రాంతీయత మెండు. పుట్టిన ఊర్లర్ల జిలుకరెల్లిపాయేసి,ఇంత పెసరుపప్పు చల్లేటోళ్లు. నేను పెరిగిన ఊర్ల పల్లీలు నువ్వులు దండిగనే పోసేకునే వాళ్లు. ఏ ఊరిపంట ఆవూరితిండికి మూలం […]
రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…
అయ్యో… బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా..? కేటీయార్ ఇక మంత్రి కాదా..? మరి హైదరాబాద్ ఐటీ పరిస్థితేమిటి..? అని ఈ ‘విశ్వనగరం’లో పనిచేసే బోలెడు మంది ఐటీ ఉద్యోగులు కంగారుపడుతున్నారు సోషల్ పోస్టుల్లో… అక్కడికి హఠాత్తుగా ఐటీ ఇండస్ట్రీ స్తంభించిపోతుందేమో అన్నట్టు… ఇదుగో, ఇలాంటోళ్లే చంద్రబాబు ఓడిపోతే… అయ్యో, ఆ ఐటీ పితామహుడు లేకపోతే ఐటీ ఆగిపోదా..? ఐటీ ఉనికికే ప్రమాదం అన్నట్టుగా రందిపడ్డారు… పోనీ, రండిపడ్డట్టు నటించారు… ప్రపంచం ఏమైపోతుంది అన్నట్టుగా విలపించారు… ఈ ఆందోళనలు, కన్నీళ్లు […]
సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
ఆగీ ఆగీ… ఆచితూచి… భలే అవకాశాల్ని కొట్టేసింది సాయిపల్లవి… మూడు… ఆ మూడూ ఆమెకు జాతీయ స్థాయిలో పేరు తెచ్చేవి… పేరు తీసుకొస్తాయో లేదో వేరే సంగతి, తను పాన్ ఇండియా స్టార్ కావాలనే ఎయిమ్‌తో కదులుతోంది… నిజానికి కొన్నేళ్లుగా చూస్తే ఆమెకు మంచి హిట్ లేదు… ఎంచుకున్న పాత్రలు మంచివే… ఆమెను నటిగా ఆవిష్కరించేవే… లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం, గార్గి… ప్చ్, ఇవే కాదు, ఫిదా తరువాత ఆమెకు బలమైన హిట్ పడలేదు… […]
టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
‘ఎప్పటికైనా సీఎంను అవుతా… అన్నా, నువ్వు చెప్పు, సీఎంను అవుతానా ? కాదా ?’ రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నకు ‘కమ్మ పార్టీలో రెడ్డి సీఎం ఎలా సాధ్యం అవుతుంది’ అని నా సమాధానం . అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పి , (టీడీపీ) సియల్పి (కాంగ్రెస్) ఆఫీస్ ల మధ్య దారిలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి నేనూ మాట్లాడుకున్న విషయం ఇది … అప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా కాదు […]
నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
సాక్షిలో వచ్చిన ఓ వార్త పొద్దున్నుంచీ మదిలో గిర్రున తిరుగుతూనే ఉంది… మంచి వార్త… కాకపోతే మెయిన్ ఎడిషన్‌కు తీసుకోక, ఆ వార్త ప్రయారిటీ అర్థం గాక సిటీలో వేశారు… వార్త సారాంశం ఏమిటంటే..? హైదరాబాద్ నగరంలో గత ఏడాది 544 మంది ఆత్మహత్యలు జరిగితే అందులో 433 మగ ఆత్మహత్యలే… అనగా మేల్ సూసైడ్స్… సాధారణంగా సమాజంలో ఓ అభిప్రాయం ఉంది… ఆడవాళ్లే సున్నిత మనస్కులనీ, త్వరగా కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారనీ, మగవాళ్లు మానసికంగా దృఢంగా […]
హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?
ముఖ్యమంత్రి కాబోతున్న రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతికి మస్తు ఇష్టం… తనే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నంత ఆనందం రాధాకృష్ణలో కనిపిస్తోంది… తనలో, తన పత్రికలో, తన టీవీలో… తప్పేమీ లేదు… వోకే… ఎందుకంటే..? . ఒకప్పుడు తన చంద్రబాబుకు నమ్మకమైన ఫాలోయరే కదా రేవంత్… ఇప్పటికీ వోటుకునోటు కేసులో, ఆ నేరఘటనలో ఇద్దరూ సహనిందితులే కదా… పైగా రేవంత్‌రెడ్డి చంద్రబాబును ద్వేషించి, విభేదించి బయటికి రాలేదు… అసలు తన మనిషిగానే కాంగ్రెస్‌లోకి వచ్చాడనే ప్రచారం కూడా ఉన్నదే… […]
తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
తీపి జ్ఞాపకం… తెలుగు తీపులు అనంతపురం- హోళిగలు కర్నూలు- కోవా పూరీ చిత్తూరు- కోవా జాంగ్రీ ఒంగోలు- అల్లూరయ్య మైసూర్ పాక్ తాపేశ్వరం- కాజాలు పెద్దాపురం- పాలకోవా నెల్లూరు- మలై కాజాలు పెనుకొండ- పాకం కర్జికాయలు బందరు- హల్వా బందరు- లడ్లు తణుకు- బెల్లం జిలేబీ గరివిడి- కాజాలు మాడుగుల- హల్వా పెరుమాళ్ పురం- పాకం గారెలు కాకినాడ- కోటయ్య కాజాలు గుంటూరు- మాల్ పూరీ ఆత్రేయపురం- పూతరేకులు ఇవన్నీ స్వీట్ షాపులో అమ్మకం కోసం పెట్టిన డిస్ప్లే […]
వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…
రెడ్ల రాజ్యంలోనే వెలమలు ఎక్కువ… కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి అప్పట్లో చెప్పినట్టు ‘‘పాయింట్ ఫైవ్ జనాభా’’ కావచ్చు గాక… కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 10.92 పర్సెంట్… గత ప్రభుత్వంలో 11 ఇప్పుడు 13 మంది… పాలిటిక్స్ అంటేనే ప్రాంతం, మతం, కులం… కులంలో మళ్లీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ… బీసీలలోనూ మున్నూరు కాపు, ముదిరాజ్, గౌడ, యాదవ… ఇలా చాలా…! ఓసీల్లోనూ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య వేరు… పాలిటిక్స్‌లో చివరి […]
ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…
రెండు డజన్లో, రెండున్నర డజన్లో పార్టీలు కలిపి ఓ కూటమి పెట్టుకున్నయ్… అవన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీలు… మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావద్దు అని కలిసి కొట్లాడబోతున్న పార్టీలు… ఇండియా కూటమి అని ఓ పేరు కూడా పెట్టుకున్నయ్… ఛలో, జంగ్ షురూ అన్నాయి… బీజేపీ అధికారంలోకి రావద్దు సరే, మోడీ మళ్లీ ప్రధాని కావద్దు సరే.., మరి ఎవరు ప్రధాని కావాలి..? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల సంఖ్యకన్నా ఇండియా విపక్ష కూటమిలో […]
తెలంగాణ కాబోయే సీఎం ఎవరు..? రేవంత్ మరో అస్సోం సీఎం కాగలడా..?
‘‘ఏమైంది సార్… సీఎం ఎవరో తేల్చలేక సిగపట్లు, అగచాట్లు… రోజుకు పదిసార్లు ఆ కేసీయారే నయం అనుకునేలా చేస్తారు కాంగ్రెసోళ్లు’’ అని ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు… ఒకింత నిజమే… కానీ కాంగ్రెస్‌కు వోటేసినవాళ్లకు తెలియదా..? అది కాంగ్రెస్ అని… ఇదంతా కాంగ్రెస్‌లో సహజమేనని… కేసీయార్‌ను వద్దనుకునే కదా, బీజేపీ కూడా బీఆర్ఎస్ బాపతేనని తెలిసే కదా, కాంగ్రెస్‌ను గెలిపించుకుంది… ఐనా ఇదేమైనా కుటుంబ పార్టీనా..? తాత కాకపోతే తండ్రి, తండ్రి కాదంటే కొడుకు, కొడుకు వద్దంటే […]
కేసీయార్ సైలెంట్ నిష్క్రమణ దేనికి సంకేతం… ఇక కేటీయారే అన్నీ…!!
మూడు వార్తలు… 1) హుందాగా వైదొలగిన కేసీయార్, ట్రెండ్ తెలియగానే రాజీనామా, సామాన్య పౌరుడిలా ట్రాఫిక్‌లో ఆగుతూ ఫామ్ హౌజ్‌కు ప్రయాణం, గన్‌మెన్ కూడా లేకుండానే ఒంటరిగా బయటకు… అని నమస్తే తెలంగాణలో ఓ వార్త… 2) కేసీయార్ సభకు వస్తారా..? సభలో రేవంత్ రెడ్డి మొహం చూస్తారా..? గెలిచిన స్థానానికీ రాజీనామా చేస్తారేమో..? అసలు రాజకీయాల్నే వదిలేస్తారేమో..? అని ఓ డిజిటల్ పత్రిక (దిశ కావచ్చు) లో ఓ వార్త… 3) కేటీయార్ పార్టీ ముఖ్యులతో […]
పాడండి… పాడించండి… పిల్లలకు అదే సాధన, అదే బోధన, అదే వినోదం…
Language by Songs: పల్లవి : వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే… వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విద్యాందేహీ… భగవతి సర్వార్థసాధికే… సత్యార్థచంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే చరణం 1 : ఆపాత మధురము… సంగీతము అంచిత సంగాతము… సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము… అమృత సంపాతము… సుకృత సంపాకము సరిగమస్వరధుని సారవరూధినీ… సామనాదవినోదినీ సకల కళాకళ్యాణి సుహాసినీ… శ్రీ రాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని […]
పరిపూర్ణ ‘రెడ్డిస్వామ్యం’… కష్టాల్లో ‘వెల్కమ్’ గ్రూపు… రెండు రాష్ట్రాలోనూ రెడ్డిక్రసీ…
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సీట్లు 119… ప్రస్తుతం 43 మంది రెడ్లు సభలోకి వెళ్తున్నారు… జస్ట్, 8 శాతం జనాభా ఉన్న రెడ్లు ఏకంగా 37 శాతం ప్రాతినిధ్యం వహించడం అంటే విశేషమే… కాంగ్రెస్ కూటమి గెలిచిన 65 మందిలో 26 మంది రెడ్లు… అంటే దాదాపు 40 శాతం… అక్షరాలా నలభై శాతం… బీఆర్ఎస్ గెలిచిన 39 మందిలో 14 మంది రెడ్లు… అంటే 36 శాతం… అంతెందుకు..? బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో […]
ఓడిన వేళనే చూడాలి… నాయకమన్యుల లీలావిలాపాలు… జంపింగ్ జపాంగులు…
వివిధ పార్టీల తరఫున 2018లో గెలిచి… ప్రలోభాలతో బీఆర్ఎస్ గూటికి చేరిన దాదాపు 11 /12 మందిలో ఇద్దరు మినహా అందరూ ఓడిపోయారు… ఇదొక విశ్లేషణ… ఎస్, వోటర్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు… అప్పట్లో బీజేపీ మా నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అంటూ కేసీయార్ దేశమంతా సీడీలు పంచి, గాయిగత్తర లేపటానికి ప్రయత్నించిన సంగతి తెలుసు కదా… సదరు నలుగురు ఎమ్మెల్యేలూ ఓడిపోయారు… ఇది మరో విశ్లేషణ… వోటర్లను తక్కువ అంచనా వేయకూడదు… ఎవరివి […]
- « Previous Page
- 1
- …
- 183
- 184
- 185
- 186
- 187
- …
- 482
- Next Page »