ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే… మా పిల్లలు బతుకమ్మ ఆట చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదు, దాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు … చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు . ఇంటికి వెళ్లేటప్పుడు టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని […]
ఉత్తదే సోది కథ… పైగా ఇంగ్లిష్ కాపీ… ఐతేనేం, లోకేష్ ఎఫెక్టివ్‌గా తమిళీకరించాడు…
అది ఏ పండుగ గానీ… అసలు పండుగలతో సంబంధం లేని రిలీజు గానీ… మార్కెట్లోకి బాలయ్య సినిమా వస్తుందంటే, దానికి పోటీగా రావాలంటే ఏ చిరంజీవో, లేక ఇంకెవరో స్టార్ హీరో సినిమాయో ఐఉండాలి… లేకపోతే బాలయ్య బాపతు మాస్ పోటీని తట్టుకోవడం కష్టం… అలాంటిది అసలు తెలుగు ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేని హీరో విజయ్ సినిమా లియో ఏకంగా బాలయ్య సినిమాకు దీటుగా దసరా పోటీకి వచ్చిందంటే ఆశ్చర్యమే… పైగా బాలయ్య సినిమాకన్నా ఎక్కువ […]
భగవంత్ కేసరిలో ఆదానీని విలన్‌గా ఎందుకు టార్గెట్ చేసినట్టు బాలయ్యా…
ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఒకటి… ఆదానీ విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చి, దేశంలోని పవర్ జనరేటింగ్ యూనిట్లకు తప్పుడు లెక్కలతో ఎక్కువ ధరలకు అంటగట్టి వేల కోట్లు అక్రమంగా దండుకున్నాడని సారాంశం… రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణల్ని చేశాడు… బాలకృష్ణ తాజా సినిమా నేలకొండ భగవంత్ కేసరి చూస్తుంటే ఆదానీ గుర్తొచ్చాడు… ఈ సినిమా నిర్మాతలకు ఆదానీ మీద ఇదేం వ్యతిరేకత అనీ అనపించింది ఒకింత… ఎందుకంటే..? ఆదానీ అనగానే గుర్తొచ్చేది మోడీకి, బీజేపీకి […]
బాలయ్య మార్క్ దంచుడులోనూ మెరిసిన శ్రీలీల… కాజల్ శుద్ధ దండుగ పాత్ర…
బాలయ్య సినిమా అంటే… సారీ, తెలుగు స్టార్ సినిమా హీరో అంటేనే… దంచుడు సినిమాలు కదా… దంచుడు అంటే ఏదో వింత ఆయుధం చేతబట్టి రౌడీలను దంచుడు మాత్రమే కాదు… ఆ దంచుడు అంటే నరుకుడు… నెత్తురు పారి, థియేటర్ కమురు కంపు వాసన రావల్సిందే… ముందే చెప్పాను కదా, నాట్ వోన్లీ బాలయ్య… కాకపోతే బాలయ్య ఇందులో అగ్రగణ్యుడు… అదేదో చిరంజీవి సినిమాలో నాటు కొట్టుడు, వీర కొట్టుడు, దంచి కొట్టుడు అనే ఓ బూతు […]
హాస్పిటల్ కూల్చి 500 మందిని బలిగొన్న ఆ దారుణం ఎవరి పని..?!
గాజా లోని అల్ అహ్లి హాస్పిటల్ మీద IDF దాడి చేసిందా? వివరాలలోకి వెళితే కాదు అనే సమాధానం వస్తుంది! ఇస్లామిక్ టెర్రర్ ఔట్ ఫిట్స్ ఎప్పుడూ చేసే పనినే ఇప్పుడూ చేస్తున్నాయి! ****************** 1.గాజాలో హమాస్ స్థావరాలు సాధారణ ప్రజలు నివసించే ఇళ్ల కింద బేస్మెంట్స్… అవి నిర్మించి అందులో ఉండి రక్షణ తీసుకుంటారు. 2.దాడి చేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ నుండి బయటికి వచ్చి దాడి చేసి వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లిపోతారు. 3.స్కూళ్ళు, హాస్పిటల్స్ కింద […]
K C P D … పరమ నికృష్టమైన బూతు బాలయ్య సినిమాతో మళ్లీ పాపులర్…
K C P D… పరమ నికృష్టమైన బూతుల్ని పరిచయం చేయడంలో తెలుగు సినిమా నెంబర్ వన్… ఎవరో పిచ్చి ఫ్యాన్స్ కేకలు వేసి, చప్పట్లు కొట్టి, తెర మీదకు రంగు కాగితాల పేలికల్ని విసిరేస్తే చాలు… వాళ్ల కోసం ఏ తిక్క పనినైనా చేస్తారు మన హీరోలు… అదొక పైత్యం, ప్రజలందరినీ కాదు, ఫ్యాన్స్ మెచ్చితే చాలు… దానికోసమే రొటీన్ ఇమేజీ బిల్డప్పులు, మాస్ మసాలా వెగటు యాక్షన్లు, బూతు పాటలు, కోతి గెంతులు, పంచ్ […]
మన్మథ పూలరథం కనిపిస్తే దానిమీద ఎక్కాడు… అలా కూర్చున్నాడో లేదో…
Srivahi Vahana Sevas: తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు? ఒక ఉత్సవంలో వెంకన్న అందమయిన అవస్థను, అంతకంటే అందమయిన తడబాటును దర్శించి…కీర్తనలో బంధించాడు అన్నమయ్య. పల్లవి:- అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని వెదకి వెదకి తిరువీధులందు దేవుడు చరణం-1 అల సూర్యవీధి నేగీ నాదిత్యుని తేరిమీద కలికికమలానందకరుడుగాన తలపోసి అదియును దవ్వు […]
నట సౌందర్యం… ద్వీప..! ఇదీ వుమెన్ ఓరియంటెడ్ సినిమా అంటే…!
ఆమె ఒక ఒంటరి ద్వీపం … భారతీయ మహిళల్లో దాదాపు 75 శాతం మంది ఏదో ఒక రూపంలో వ్యవసాయానికి తమ తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. కానీ అందులో ఎంతమంది పేరిట భూమి ఉందనేది ఒక ప్రశ్న. దేశంలో నాలుగు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే, అందులో రెండు కోట్ల మంది మహిళలే. వారిలో ఎంతమందికి సొంత ఇల్లు ఉందనేది మరో ప్రశ్న. శ్రామికులు అనే పదానికి ఉండే పర్యాయ పదాల్లో మహిళలు అనే […]
ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ …. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… 3
ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ ………………………………………….. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… స్టోరీ – 3 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… కవిత్వంలాంటి విజువల్స్, వెన్నాడే […]
ఓహో, పవన్ కల్యాణ్ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి అందుకని రద్దయ్యిందా..?
ఈ కథనానికి వాడిన ఫోటో గుర్తుందా..? రేణుదేశాయ్ పవన్ కల్యాణ్ నుంచి విడిపోయాక తెలుగు రాష్ట్రాలను, హైదరాబాద్‌ను వదిలేసి వెళ్లిపోయింది… కొన్నాళ్లకు ఒకాయనతో ఎంగేజ్మెంట్ జరిగింది… ఆ వ్యక్తి ఫోటో కనిపించకుండా కొన్ని ఫోటోలను షేర్ చేసింది… ఎందుకలా అంటే..? పవన్ ఫ్యాన్స్ నుంచి ప్రమాదాన్ని ఊహిస్తున్నానని ఏదో చెప్పినట్టు గుర్తు… తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు… కానీ ఇప్పుడు ఆమే బయటపెట్టింది… ఆ ఎంగేజ్మెంట్, ఆ పెళ్లి ప్రతిపాదన రద్దయిపోయినట్టు…! ఎందుకమ్మా అనడగండి… ఏవేవో […]
తిరువీధుల మెరసీ దేవదేవుడు – గరిమల మించిన సింగారములతోడను –
From Every Nook and Corner: పల్లవి:- నానా దిక్కుల నరులెల్లా వానలలోననె వత్తురు కదలి చరణం-1 సతులు, సుతులు, పరిసరులు, బాంధవులు హితులు గొలువగా నిందరును శత సహస్ర యోజన వాసులు సు వ్రతముల తోడనె వత్తురు కదలి చరణం-2 ముడుపులు, జాళెలు, మొగి తలమూటలు కడలేని ధనము కాంతలును కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని చెలగుచు వత్తురు కదలి చరణం-3 మగుట వర్ధనులు, మండలేశ్వరులు జగదేకపతులు చతురులును తగు వేంకటపతి దరుశింపగ బహు […]
ఇజ్రాయిల్‌తో గోక్కుంటున్న పుతిన్… మొస్సాద్‌కు టార్గెట్ అయినట్టే…!!
పుతిన్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహూ కి ఫోన్ చేశాడు. అక్టోబర్ 7 న హమాస్ దాడి చేస్తే 10 రోజుల తరువాత ఫోన్ చేసాడు పుతిన్! ఫోన్ చేసి ఏం మాట్లాడాడు? ’’వీలున్నంత త్వరగా హమాస్ తో సంధి కుదుర్చుకోవడానికి నా వంతు సహాయం చేస్తాను. మీరు గాజా ముట్టడిని ఇంతటితో ఆపేయండి, గాజాలో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు! గాజాకి నీరు, విద్యుత్, నిత్యావసరాలని ఇవ్వండి!’’ ********************* ఇజ్రాయెల్ మీద హమాస్ దాడిచేసిన […]
ఆలు లేదు, చూలు లేదు… ముఖ్యమంత్రి కుర్చీలో పెద్దలు జానారెడ్డి గారు…
ఈరోజు రెండు వార్తలు ఇంట్రస్టింగుగా అనిపించాయి… వాటిని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం, కాంగ్రెస్‌కు ఓటేయాలని అనుకున్నవాళ్లు కూడా మానేస్తారేమో… వీళ్లకన్నా ఆ కేసీయారే నయం, ఆయనకే వోటేద్దాం అనుకుంటారేమో… వార్త ఏమిటంటే..? ఎక్కడో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… నాకూ సీఎం చాన్స్ వస్తుంది, వెంటనే నా కొడుకు రాజీనామా చేస్తాడు, నేను ఉపఎన్నికల్లో పోటీచేస్తాను అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు… నిజానికి కొన్నేళ్లుగా జానారెడ్డి ఏది మాట్లాడినా సరే, అది కేసీయార్‌కు పరోక్షంగా అనుకూలించేలా […]
ఈ బారాత్… పెళ్లి పెటాకుల బారాత్, గుడ్‌బై బారాత్, విడాకుల బారాత్…
అదేదో పాత సినిమా… పెళ్లికి అందరినీ పిలిచి, వాళ్ల సమక్షంలో ఎలా ఒక్కటయ్యామో… అదేరకంగా విడాకులకు కూడా అందరినీ పిలిచి, అందరికీ చెప్పి, అందరి సాక్షిగా విడిపోదాం అని హీరోయిన్ వాదించి, ఒప్పించి, ఫంక్షన్ పెడుతుంది… ఇంట్రస్టింగు పాయింట్… పొద్దున్నే ఈనాడులో ఓ వార్త చదివాక అదే గుర్తొచ్చింది… ఆ వార్త ఏమిటంటే..? జార్ఖండ్, రాంచీలో ప్రేమ్ గుప్తా అనే ఓ తండ్రి… గత ఏడాది ఏప్రిల్‌లో తన బిడ్డ సాక్షి గుప్తాకు ఉన్నంతలో బాగా ఖర్చు […]
ఈ యుద్ధం విషమిస్తే ఏకంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం కూడా…
ప్లీజ్ సమయం ఇవ్వండి! అమెరికన్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్! మొన్న సాయంత్రం రియాద్ కి చేరుకున్న ఆంటోనీ బ్లింకెన్ సౌదీ ప్రిన్స్ తో సమావేశమవ్వడానికి! సాయంత్రం 6 గంటలకి సౌదీ ప్రిన్స్ తో అపాయింట్మెంట్ ఉంది. ఒకవైపు బ్లింకెన్ సౌదీ ప్రిన్స్ నుండి పిలుపు వస్తుందని ఎదురు చూడడం, ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరగడం, రాత్రి అయిపోవడం, ఆ రోజు ఇక ప్రిన్స్ ఎవరినీ కలవరు అని బ్లింకెన్ కి చెప్పడం జరిగిపోయింది! మరుసటి […]
జాతీయ ఫిలిమ్ అవార్డు ఇచ్చే కిక్కే వేరప్పా… ఎన్ని విమర్శలున్నా సరే…
వంద పుకార్లు ఉండనివ్వండి. అక్కడక్కడా కాంట్రవర్సీలు జరగనివ్వండి. లాబీయింగ్ అనే ఆరోపణ వినిపించనివ్వండి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గవు. వాటి స్థాయి, స్థానం 69 ఏళ్లుగా పదిలంగానే ఉంది. భారతదేశంలో సినిమా కళాకారుడికి ఎన్ని అవార్డులైనా రానీ, కానీ జాతీయ అవార్డు ఇచ్చే కిక్ మరే అవార్డుకూ సాటి రాదు. జాతీయ అవార్డు రావడం అంటే ఒక గౌరవం, దేశవ్యాప్త గుర్తింపు, ప్రతిభ కలిగిన వ్యక్తి అనే పేరు.. ఇవన్నిటి మేళవింపు. ఆ […]
ప్రియాంక, శోభాశెట్టీ, మీ కోపం సరైందే… భోలేకు బరాబర్ ఇచ్చి పడేశారు…
నిజంగానే గత సీజన్‌లాగే ఈ సీజన్ బిగ్‌బాస్ కూడా పరమ పేలవంగా సాగుతోంది… దాని సవాలక్ష కారణాలుండచ్చుగాక, కానీ ఈరోజు మాత్రం ఒకటి నచ్చింది… అది సింగర్ భోలే షావలికి లేడీ కంటెస్టెంట్లు శోభాశెట్టి, ప్రియాంకలు ఇచ్చి పడేసిన తీరు… చాలామంది శోభాశెట్టిని, ప్రియాంకను విమర్శిస్తూ ఏదేదో రాసిపడేస్తున్నారు గానీ… వాళ్లు రియాక్టయిన తీరు కరెక్టు, అవసరం కూడా… నామినేషన్ల సందర్భంలో ఎవరో ఎవరినో నామినేట్ చేస్తారు, కొన్ని హీట్ సంభాషణలు దొర్లుతాయి, కామన్, బిగ్‌బాస్‌కు కావల్సింది […]
చంద్రబాబు కేసుల్లాగే… రామోజీరావుకూ అష్టదిగ్బంధనం… అదే జగన్ ప్లాన్…
ఆంధ్రజ్యోతి, ఈనాడు పట్టించుకోలేదేమో గానీ… ఓ వెబ్సైట్లో ఆసక్తికరమైన పాయింట్ ఒకటి కనిపించింది… అదే, రామోజీరావు, శైలజా కిరణ్ మీద ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ జారీ చేసింది కదా… ఒక వ్యక్తిని రామోజీరావు తుపాకీతో బెదిరించి సంతకాలు చేయించుకున్నాడని..! ఆ వెబ్ విలేఖరి విశ్లేషణ ఏమిటంటే… ‘‘అసలు ఈ కేసులో ఏపీకి ఎక్కడైనా లింక్ ఉందా ? మార్గదర్శి హెడ్ క్వార్టర్ హైదరాబాద్, గన్ పెట్టి బెదిరించారని చెప్పిన ప్లేస్ హైదరాబాద్, సంతకాలు పెట్టింది హైదరాబాద్… మొత్తం […]
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరుకుచ్చ సిగ్గువడీ…
తిరుమలలో దాదాపు 1400 సంవత్సరాల కిందట జరిగిన బ్రహ్మోత్సవాల గురించి చారిత్రిక ఆధారాలున్నాయి. అంతకు ముందు కూడా జరిగే ఉంటాయి. శాసనాల్లాంటి ఆధారాలు దొరికి ఉండకపోవచ్చు. శిలాశాసనాలు, రాగి రేకులు, తాళపత్రాలు, కాగితం పుస్తకాలు, ఫోటోలు, వీడియో ఆధారాలుంటే తప్ప మనకు చరిత్ర కాదు. ఇప్పుడయితే గూగుల్‌లో లేనిది ఉన్నట్లు కానే కాదు. బ్రహ్మోత్సవాలకు కదిలే వీడియోల్లాంటి, కదలని చిత్రాల్లాంటి, పలికే ప్రత్యక్షప్రసార వ్యాఖ్యానంలాంటి అన్నమయ్య కీర్తనలున్నాయి. ఆ పదచిత్రాలను ముందు పెట్టుకుని చూస్తే మనకు ఇప్పుడు కనిపించే […]
సన్నన్నంలో మెరిగెలు… పంటి కింద రాళ్లు… అనంత శ్రీరామ్ పదాలు…
తెలంగాణ జానపదానికీ, యాసకు, ఆటకు, కంటెంటుకు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిరాకీ… ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు… ఐతే తెలంగాణతనాన్ని అరువు తెచ్చుకునే ప్రయాసలో కొందరు పిల్లిమొగ్గలేస్తున్నారు… సన్నబియ్యం అన్నంలో ఉడకని మెరిగల్లా పంటికింద కలుక్కుమంటున్నాయి… భగవంత్ కేసరి రేపోమాపో రిలీజ్ కాబోతోంది కదా… బాలకృష్ణ హీరో… శ్రీలీల తన బిడ్డ పాత్ర… ఇద్దరికీ ఓ పాట… రాసిన అనంత శ్రీరామ్, పాడిన ఎస్పీ చరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నటించిన బాలకృష్ణ, శ్రీలీల, సంగీతం కూర్చిన థమన్… […]
- « Previous Page
- 1
- …
- 198
- 199
- 200
- 201
- 202
- …
- 481
- Next Page »