“రాజమౌళి మగధీర తీసిన వెంటనే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈర్ష్య, అసూయ.. ఇలా అన్ని ఫీలింగ్స్ వచ్చేశాయి. కొన్ని రోజులకు అతను చేసే క్యాల్కులేటెడ్ రిస్క్‌లు మనం కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చాను. అలా నేను కూడా రిస్క్ చేస్తున్నాను” అని ఈమధ్య శాకుంతలం ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఎక్కడో అన్నాడు దర్శకుడు గుణశేఖర్… వాతలు పెట్టుకున్నాను అని తనే చెబుతున్నాడు… అది నిజంగానే తనను కాల్చేసింది శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అనుభవంతో… నిజానికి గుణశేఖర్ పాజిటివ్ […]
గుండెపోటు మరణాలు ఆగడం లేదు… ఇదుగో ఓసారి ఇది చదివి పాటించండి…
హఠాత్తుగా గుండెపోట్లు ఎక్కువైపోయాయి… అనూహ్యంగా మరణాలు సంభవిస్తున్నాయి… గతంలోకన్నా స్ట్రోక్స్ సంఖ్య బాగా పెరిగిందనేది అందరూ అంగీకరిస్తున్న నిజం… ఆరోగ్యంగా కనిపిస్తూ, అంతకుముందు ఏ కాంప్లికేషన్సూ లేనివాళ్లు సైతం కుప్పకూలిపోతున్నారు… జీవనశైలిలో మార్పులు అందరూ సూచించేదే కానీ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు అవసరం… సీరియసో, నాన్ సీరియసో గానీ, ఒకసారి కరోనాను పలకరించినవాళ్లు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి… ఇది అందరి అవగాహన కోసం జగమెరిగిన ప్రజాడాక్టర్ Yanamadala Murali Krishna… మేలుకొలుపు కథనం… ప్రాణాంతకమైన కోవిడ్ పీడ ముగిసిన తర్వాత, […]
అది అన్నమే అన్నాడు కానీ అన్నమో కాదో… టీలాగే ఉంది గానీ అదో కాదో…
“మరలనిదేల రామాయణంబన్నచో నీప్రపంచక మెల్లనెల్ల వేళ దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు తనరుచి బ్రతుకులు తనవిగాన…” అని రామాయణ కల్పవృక్షం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ గొప్పగా సూత్రీకరించారు. రోజూ అదే అన్నమే తింటున్నా… విసుగు పుట్టదు. ఏ పూటకాపూట ఆ అన్నం కోసమే ఎదురు చూస్తాం. హైదరాబాద్ నుండి వెస్ట్ బెంగాల్ సరిహద్దు దగ్గర బాగ్ డోగ్రాకు విమానమెక్కి, బాగ్ డోగ్రా నుండి నాలుగు గంటలు కారులో ప్రయాణించి భూటాన్ సరిహద్దు నగరం ఫుషిలాంగ్ చేరి, రాత్రి అక్కడే […]
మేం చిన్నప్పుడే నకల్ కొట్టేటోళ్లం… పరీక్షల్లో చిట్టీలు కూడా ఓ ఆర్ట్…
తొమ్మిదో తరగతి వరకు చదువుకునే పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి కదా. ఇప్పటి రోజులు బడ్డువి. మా అప్పుడు మేం బహు చదివేవాళ్ళం. ఇప్పటి వాళ్ళ మాదిరిగా కాపీలు కొట్టేవాళ్ల మసలే కాదు అని అంటాం కానీ నిజాయితీగా చెప్పాలంటే మనం కూడా సంప్రదాయ పద్దతుల్లో కాపీలు కొట్టినవాళ్ళమే… లాగు పట్టేను బ్లేడుతో కొద్దిగా కోసి, చిట్టీలు మలిచి దాచేవాళ్ళం. అట్లనే అంగీ కాలర్ మధ్యలో, చెప్పులు కోసి చీటీలు దాచేవాల్లం. అవన్నీ అందరికీ ఎరుకున్న జాగలే.. రేపటి […]
నమస్తే చంద్రబోసన్నా… ఇదొక్కసారి చదువు… తెలుగు నేర్చితే తప్పులేదు బ్రో…
చంద్రబోసన్నా… నమస్తే… నమస్తే అని ఎందుకు అభివాదం చేస్తున్నానంటే… ముందుగా ఓసారి ఇది చదువు భయ్యా… నువ్వు రాసిన నాటునాటు పాటలో సాహిత్యం ఏమీలేదు… కానీ ఆస్కార్ వచ్చింది… దీన్ని సుడి అంటారు… దానికి తెలంగాణ పాట అని ముద్రవేయడానికి విఫలప్రయత్నం చేస్తున్నావు… సరే, నీ ఇష్టం, శ్రోతల ప్రాప్తం… కానీ తెలుగు కాని పదాలను కూడా తెలుగు పదాలు అని చెప్పకు ప్లీజ్… తెలుగు భాష విలపిస్తుంది… ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు షోకు వచ్చి […]
ఈ ఫోటోలో ఉన్నది అతీక్, ములాయం, ఓ కుక్క… ఇక చదవండి అదేమిటో…
దేశమంతా ఆ వీడియో వైరల్… మార్ఫింగుల్లేవు… ఎడిటింగుల్లేవు… కరడుగట్టిన నేరగాడు, ఐఎస్ఐ-లష్కరేతొయిబా ఆప్తమిత్రుడు, గ్యాంగ్‌స్టర్, అరాచకశక్తి అతీక్ కాల్పుల్లో హతమారిపోయాడు… ఏ మీడియా వల్లే తను ఇంకా బతికి ఉన్నానని చెప్పాడో… అదే మీడియా ఎదుట… మీడియా ఫేక్ కార్డులు వేసుకున్న హంతకుల చేతుల్లో పాయింట్ బ్లాంక్ క్లోజ్ రేంజులో కాల్చివేయబడ్డాడు… ఓ క్రైం సినిమా సీన్‌ను పోలిన ఈ సంఘటన మొత్తం మీడియాలో రికార్డయిపోయింది… ఇలాంటి అరాచకశక్తులకు, వీటికి అండగా నిలిచే పార్టీలకు, భక్తితో, భయంతో […]
ఆ ఎలుకల చెవుల్లో కోరికలు చెప్పుకోవాలి… తరువాత గణేషుడికి చేరతాయి…
సాధారణంగా హిందువుల్లో, శివభక్తుల్లో ఓ నమ్మకం ఉంటుంది… శివుడిని ఏమైనా కోరుకునేవాళ్లు తమ కోరికల్ని శివుడి వాహనం నందీశ్వరుడి చెవుల్లో చెప్పాలి అని… తరువాత నందీశ్వరుడు శివుడికి చెప్పి, ఆ కోరికలు నెరవేరేలా చూస్తాడు అని..! అంటే సరైన సమయంలో మన కోరికల్ని నందీశ్వరుడు శివుడికి విన్నవిస్తాడన్నమాట… అప్పుడు మాత్రమే ఫైల్ క్లియరెన్స్ ఉంటుందన్నమాట… సరే, భక్తుల విశ్వాసాలు వాళ్లిష్టం… అన్ని నమ్మకాలకూ హేతుబద్ధత ఉండదు… ఉండాల్సిన పనీ లేదు… అసలు దేవుడి అస్థిత్వమే అతి పెద్ద […]
కథ ఏముంది..? సెకండ్ పార్ట్ సినిమా కోసం ట్రెయిలర్గా ఫస్ట్ పార్ట్..!!
వెట్రిమారన్ సినిమాలు అంటే… అణగారిన వర్గాల గొంతుకలు… వివక్షకు వ్యతిరేక పతాకాలు… సోకాల్డ్ కమర్షియల్, మాస్, ఇమేజీ బిల్డప్పులు కాదు… కథను నమ్ముతాడు… టేకింగులో నేచురాలిటీని నమ్ముతాడు… డిఫరెంట్ క్రియేటర్… కానీ తాజాగా తను దర్శకత్వం వహించిన విడుదలై – పార్ట్ 1 లో మాత్రం కథ లేదు… పార్ట్-2 కథకు ఇంట్రడక్షన్ ఉంది… ఒక్కమాటలో చెప్పాలంటే రాబోయే రెండో భాగానికి ఓ పెద్ద ట్రెయిలర్‌ను థియేటర్లలో రిలీజ్ (విడుదలై) చేశాడు వెట్రిమారన్… తను తమిళంలో లబ్ధిప్రతిష్టుడే… […]
మై గాడ్… మోడీ, కేసీయార్, చంద్రబాబు, రాంచరణ్, జూనియర్… ఏరీ వీళ్లంతా…
టైమ్ వాళ్లు ఏటా ఓ వందమంది ప్రపంచ ప్రముఖులను ఎంపిక చేసి పబ్లిష్ చేస్తుంటారు… ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నవారన్నమాట… అఫ్కోర్స్, ఆస్కార్లాగే దీనికీ లాబీయింగ్, ఖర్చులు ఎట్సెట్రా ఉంటాయేమో… మన దగ్గర స్కోచ్ అవార్డులు అని ఇస్తుంటారు కదా… అలాగే వీటినీ ‘రకరకాల మార్గాల్లో’ సొంతం చేసుకోవచ్చునేమో… లేకపోతే ఏమిటండీ… నాటునాటు పాటతో ప్రపంచ భ్రమణాన్నే ప్రభావితం చేసిన రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, వారిని మించి చంద్రబోస్, కీరవాణి పేర్లు ఈ జాబితాలో లేనేలేవు… ప్రపంచంలోకెల్లా ప్రముఖ […]
మూసీ గుండె చెరువు… బతుకు ఓ డ్రైనేజీ ప్రవాహం… ఓ డంపింగ్ యార్డ్…
Water Ponds to Drain Canals: “అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ” తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత కామాను గుర్తించని లోకం వైద్యుడికి అది విశేషణ పూర్వపదకర్మధారయంగా అనుకుని వైద్యులంటే రోగులకు అప్పిచ్చేవారని అపార్థం చేసుకుంది. వేదాంత దృక్కోణంలో వైద్యులు అప్పు చేయించేవారే అవుతారు కానీ, అప్పిచ్చేవారు కాదు. అయినా మన గొడవ […]
దిల్ రాజుకు వాచిపోయింది… ఇటు సినిమా ఫ్లాప్… అటు నెట్లో వెక్కిరింపులు…
ఇదుగో దీన్నే ‘అతి’ అంటారు… టాలీవుడ్లో ‘అతి’కి చిరునామాగా పేర్కొనే దిల్‌రాజుకు నెట్లో తీవ్రమైన వెక్కిరింత ఎదురవుతోంది… దీని నేపథ్యం ఏమిటంటే..? శాకుంతలం సినిమా రిలీజ్ చేశాడుగా కష్టమ్మీద… ఎన్నోసార్లు వాయిదా పడీ పడీ, ఎట్టకేలకు అడ్డగోలు ఖర్చుతో ఫినిష్ చేసి, ఎలాగోలా రిలీజ్ చేశాం బాబూ అని ఊపిరి పీల్చుకున్నారు నిర్మాణ బాధ్యులు… నిజానికి ఇది గుణశేఖర్ సొంత సినిమా… నిర్మాణ విలువల మీద బాగా రాజీపడినా సరే అడ్డగోలు వ్యయం జరిగిపోయింది… ఆ దశలో […]
న్యాయవ్యవస్థ ఫెయిలైన కేసుల్లోనే… యోగి తుపాకీ ‘‘ఛార్జ్’’ తీసుకుంటోంది…
యండమూరి రాసిన ఒక నవలలో ఓ ఉగ్రవాది మన దేశానికి ఏకంగా ప్రధాని అయిపోతాడు… అప్పట్లో అది చదివి నవ్వుకున్నవాళ్లు ఓసారి అతీఖ్ నేర రాజకీయ చరిత్ర చదివితే బెటర్… యండమూరి కల్పన నిజానికి దగ్గరగానే ఉంది అని అంగీకరిస్తారు… ఎవరు ఈ అతీఖ్ అని నెత్తి గోక్కుంటున్నారా..? అవసరం లేదు… మొన్న యోగీ సర్కారు అసద్ అనేవాణ్ని ఎన్కౌంటర్ చేసింది కదా… సదరు అసద్ తండ్రి… అతీఖ్ మొదట గ్యాంగ్‌స్టర్, తరువాత పొలిటిషియన్‌గా మారాడు… యూపీ […]
ఎయిర్ హోస్టెస్ అంటే సినిమా హీరోయినా..? ఎక్స్పోజింగ్ మెటీరియలా..?
ఓ చిన్న ముచ్చట… ఇండియాలో తిరిగే డొమెస్టిక్ ఎయిర్ లైన్స్‌లో ఏది బెటర్..? ఇదీ ప్రశ్న… చాలామంది విస్తారా బెటర్ అని చెప్పారు… అదెప్పుడూ గతంలో ఎక్కలేదు… అంటే టాటా వాళ్ల ఆ విమానాలు ఎగరడం మొదలయ్యాక అని అర్థం… రీసెంటుగా ముంబై వెళ్లబడ్డాను… ఉన్నది ఒక్క రోజే… ఎండాకాలంలో విజయవాడలో ఉన్నట్టే… ఎండ, చెమట, ఉక్కబోత… ఆ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే… ఇరుకు రోడ్లు, క్రీస్తుపూర్వం నాటి ఇళ్లు… హైదరాబాద్ ఎంత బెటరో కదా […]
మనమెంత దయా హృదయులం… ఎప్పుడైనా వెనక్కి తిరిగి పరీక్షించుకున్నామా..?
కొన్నేళ్లు దాటాక… ఎన్ని కోట్లు సంపాదించాం, ఏయే హోదాలు వెలగబెట్టామనే కాదు… కాస్త ఆత్మతృప్తిని, కాస్త పుణ్యాన్ని సంపాదించి పెట్టే ఏదైనా చిన్న పనిని, ఛారిటీని చేశామా..? ఒక్కసారి వెనక్కి తిరిగి అవలోకిస్తే ఏమైనా కనిపిస్తున్నాయా..? అసలు మనలో పరులకు సాయపడే గుణం ఉందా..? అప్పుడప్పుడూ ఆ మథనం కోసం ఇలాంటి పోస్టులు చదవాలి… ఇది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే… ఈ స్టోరీలో కనిపించే ఉదాహరణ చాలా చిన్నది కావచ్చు… కానీ కనీసం ఆ చిన్న […]
సార్… అరచేతిని అడ్డుపెట్టి కేసీయార్ విశాఖ స్టీల్ ప్లాంటును రక్షించినట్టేనా..?
ఈమధ్య ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా దిగువ స్థాయి ప్రజాప్రతినిధి మొదలుకొని కేటీయార్ దాకా… ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్లకే తెలియని స్థితిలో ఉన్న విషయం గమనిస్తున్నదే… ప్రత్యేకించి విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనడానికి కేసీయార్ ఆసక్తి కనబర్చాడో అప్పటి నుంచి ఇక ఏపీ ప్రభుత్వం మీద తెలంగాణ మంత్రుల విసుర్లు మొదలయ్యాయి… అబద్ధాలు ప్రచారంలోకి తీసుకురావడంలో నాయకులు పోటీపడుతున్నారు… సరే, రాజకీయాల్లో సహజమే అనుకుందాం… అబద్ధాలకు నిజాలు ముసుగులు వేసి, జనం కళ్లకు గంతలు […]
సో వాట్…! అకీరా నందన్ సంగీత దర్శకుడు అయితే తప్పేమిటట..!!
ఓ చిత్రమైన వార్త చదవబడ్డాను… చాలా ఆశ్చర్యపడ్డాను… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? ‘‘పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌ల కొడుకు పేరు అకిరా నందన్… తను హీరో అయిపోయి, తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడని పవన్ ఫ్యాన్స్ ఎన్నో కలలుకన్నారు… మెగా క్యాంపు అంటేనే హీరోల ఉత్పత్తి కేంద్రం… కానీ అకీరా హఠాత్తుగా ఓ షార్ట్ ఫిలిమ్‌కు సంగీత దర్శకత్వం వహించి విస్మయపరిచాడు… తమ హీరో కొడుకును కూడా జూనియర్ పవర్ స్టార్లా చూడాలనుకుంటే, ఓ మ్యూజిక్ డైరెక్టర్ […]
లారెన్స్ సాహసించిన నాన్-కాంచన టైప్ మూవీ… ఉత్త రొటీన్ దంచుడే…
నాకు లారెన్స్ అంటే ముచ్చటేస్తుంది… రాఘవేంద్రుడి మహత్తుతో బ్రెయిన్ కేన్సర్ నుంచి బయటపడ్డాననే భక్తితో తన పేరులో రాఘవ కూడా కలుపుకున్నాడు… ప్రభుదేవాకు దీటైన డాన్సర్… ఎవరెలా పోతేనేం, తనకంటూ ఓ సెక్షన్ ప్రేక్షకులుంటారు… కాంచన టైపు థ్రిల్లర్లు అలా అలా అలవోకగా తీసేసి వదులుతాడు… చూసేవాడు చూస్తాడు… మినిమం గ్యారంటీ సినిమాలు… ఎప్పుడూ ఏదో టీవీ చానెల్లో కాంచనలు కనిపిస్తూనే ఉంటయ్… నిజానికి ఇది కాదు తన మీద అభిమానానికి కారణం… సమాజం మీద కన్సర్న్… […]
స్నో పౌడర్ల దందానూ వదలని ముఖేషుడు… అంబానీ అంటేనే అన్నీ…
Beauty of Business: భారతదేశంలో మొహానికి పూసుకునే పౌడర్లు, స్నోలు, గ్లోలు, వైటెనింగ్ క్రీములు, యాంటీ ఏజింగ్ క్రీములు, ఇతర సౌందర్య సాధనాల మార్కెట్ విలువ ఏటా రెండు లక్షల ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలేనట. రెండు, మూడు రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకన్నా ఇది ఎక్కువే. మింగ మెతుకు లేకపోయినా…మీసాలకు సంపెంగ నూనె పూయాల్సిందే కాబట్టి మరో పదేళ్లలో ఈ ఉత్పత్తుల అమ్మకం విలువ ఏటా అయిదు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదట. ఇది ఆయా ఉత్పత్తులు […]
Shakuntalam … దర్శకుడు గుణశేఖర్ లెక్కల్లో ఎక్కడా ఎక్కాల్లేవు…
లబ్ధిప్రతిష్టులు… రంగమార్తాండ దీసిన కృష్ణవంశీ గానీ, శాకుంతలం తీసిన గుణశేఖర్ గానీ ఔట్ డేటెడ్… రంగమార్తాండతో ప్రూవయిన ఈ సత్యమే శాకుంతలంతోనూ నిరూపితమైంది…. మేం ప్రీమియర్లు వేస్తాం, మౌత్ టాక్‌తో దునియా దున్నేస్తాం అనేవి భ్రమలు… సినిమాలో దమ్ముండాలి… అది లేనప్పుడు, ఎవరెన్ని జాకీలు పెట్టి పైకిలేపినా సినిమా ఆడదు… శాకుంతలం రిలీజు చాన్నాళ్లుగా వాయిదా పడుతుందీ అంటేనే అందులో సరుకు లేదని లెక్క… దాని నాసిరకం ఔట్పుట్ పై బయ్యర్లకు అవగాహన ఉంది కాబట్టే, నిర్మాత […]
అప్పట్లో పరీక్ష రాసుడు అంటేనే పెద్ద పరీక్ష… ఇప్పటి లెక్క సుకూన్ కాదు…
నిన్నటి నుంచి బడిపిలగాండ్లకు పరీక్షలు మొదలయ్యాయి. ప్యాంటు షర్టు వేసుకొని, జేబులో ఒక బాల్ పెన్ పెట్టుకొని, చేతులూపుకుంటూ వెళ్తున్న వీళ్ళను చూస్తుంటే మన రోజులు యాదికొచ్చినై.. పరీక్షల ముందు రోజు ఇంకు పెన్ను కడుక్కొని, పెన్ను పత్తి, గడ్డ, నాలుక శుభ్రంగా కడిగేది. పెన్ను పత్తి సాఫ్ చేసేందుకు నాయిన ఎఫ్ఫార్ డబ్బాలోని భారత్ బ్లేడు లేదా దోస్తుగాడి ఇంట్లోంచి పాత బ్లేడు సగం ముక్క తెచ్చి పత్తి మధ్యలో ఉండే సన్న అతుకు మధ్యలో […]
- « Previous Page
- 1
- …
- 210
- 211
- 212
- 213
- 214
- …
- 447
- Next Page »