అసలు వర్మ తప్పేముంది..? అది ఎప్పుడో కుళ్లిపోయి దుర్గంధం వ్యాప్తిచేస్తున్న బుర్ర… మొత్తం తెలుగు సమాజానికి ఆ స్పష్టత ఉంది… కానీ తనకు పెద్ద పీట వేసి, పిలిచి, దండలేసి, కీలక ప్రసంగానికి ఆహ్వానించిన సదరు నాగార్జున యూనివర్శిటీ పెద్దలను అనాలి… ఐనా వాళ్లనూ అనాల్సిన పని లేదేమో… తమ బుర్రలు వర్మకన్నా దిగువ స్థాయిలోనేననీ, వాటికీ క్షయ వ్యాధి సోకినట్టేననీ వాళ్లే నిరూపించుకున్నారు… నిజానికి వర్మను ఎవరూ ఛీత్కరించి ఉమ్మేయనక్కర్లేదు… నాగార్జున యూనివర్శిటీ పెద్దలు ఏ […]
ఇమ్రాన్‌కు నూకలు చెల్లినట్టే అనిపిస్తోంది… అమెరికా, పాక్ ఆర్మీ రుసరుసలు…
పార్ధసారధి పోట్లూరి ……… పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ ! పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి ,పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు … కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వంలో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ […]
తను ఎందుకిలా అయిపోయాడు..? సన్యాసాశ్రమానికి ఇది ఆధునిక రూపాంతరమా..?!
‘‘ఈమధ్యే… కాదు, నిజానికి మొన్ననే… నా భార్యతో మాట్లాడుతున్నాను… తన సోదరుడి గురించి… తను సన్యాసిగా మారిపోయాడు… ఆఫీసుకు వెళ్లడం మానేశాడు… భౌతిక ప్రపంచంతో అసలు సంబంధమే లేనట్టు మాట్లాడుతున్నాడు… తన పాత సంబంధ బాంధవ్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు… అసలు తను తనేనా..? తరచి పరిశీలిస్తే నాకు బాగా ఆశ్చర్యమేస్తోంది… బొంబాయిలోని ప్రతి ప్రముఖ బార్ సందర్శించేవాడిని తనతో కలిసి… యుక్త వయస్సులోనే కాదు, ఈ బార్ల సందర్శన అనే పుణ్యకార్యం మొన్నమొన్నటివరకూ నడిచింది… అఫ్ కోర్స్, […]
అసలు కంటెస్టెంట్ల పోటీయే స్టార్ట్ కాలేదు… పరుగున బాలయ్య వచ్చేశాడు…
రెండుమూడు పాపులర్ సైట్లలో కూడా కనిపించింది… బాలయ్యను అల్లు అరవింద్ తెగవాడేసుకుంటున్నాడు, ఇండియన్ ఐడల్ ఫినాలే కూడా షూట్ చేసిపారేశారు, బాలయ్య బాగానే టైమ్ ఇచ్చాడు అని..! ఇక్కడ బాలయ్య పిచ్చోడు కాదు, అరవింద్ పిచ్చోడు కాదు… బాలయ్య ఇప్పుడు ఆహాకు అస్థాన ఆర్టిస్టు… అన్‌స్టాపబుల్ షో ద్వారా ఒక భిన్నమైన పాపులారిటీని సంపాదించాడు… తనలోని భిన్నమైన బాలయ్యను ఆవిష్కరించుకున్నాడు… మరోవైపు అరవింద్ ఓటీటీ బాగా పాపులరైపోయింది… ఐననూ… అసలు కంటెస్టెంట్ల నడుమ పోటీయే స్టార్ట్ కాలేదు, […]
సాయిపల్లవి… ఆ రెండు సినిమాల మాటేంటో గానీ… మణిరత్నం సినిమానే వద్దంది…
ఈ పిల్లకు ఏమైనా తిక్కా..? ఈ వ్యాఖ్య సాయిపల్లవిని ఉద్దేశించి చాలామంది అభిప్రాయం… హఠాత్తుగా ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..? రెండు రోజులుగా ఓ న్యూస్ దాదాపు అన్ని సైట్లలోనూ కనిపిస్తోంది… తమిళ మీడియా, తమిళ సోషల్ మీడియాలో ఎక్కువగా రావాలి, కానీ రాలేదు… తెలుగు మీడియా, సోషల్ మీడియా అప్పుడప్పుడూ గాలి పోగేసి ఏదో వండుతూ ఉంటుంది… నాలుగు రోజులకే హర్రె, ఇదంతా తప్పట అని కూడా అదే రాస్తుంది… సాయిపల్లవి రెండు ప్రిస్టేజియస్ ప్రాజెక్టులను వదులుకున్నదనేది […]
వీ6 వెలుగుపై నిషేధంతో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒరిగే ఫాయిదా ఏముంది..?!
వెలుగు పత్రిక, వీ6 చానెల్ పై బీఆర్ఎస్ బ్యాన్ పెట్టింది… జరగాల్సినంత చర్చ జరగడం లేదు… ఎవరో కొందరు జర్నలిస్టులు ఆందోళన వెలిబుచ్చారు… పత్రిక స్వేచ్ఛ, భావప్రకటన అనే పదాలు చాలా విస్తృతమైనవి… బీఆర్ఎస్ అనే పార్టీ ఓ చిన్న దినపత్రిక, ఓ పాపులర్ చానెల్‌పై నిషేధం పెడితే ఆ రెండు పదాల చట్రంలో ఒకటీరెండు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తీకరించడం విశేషమే… ఎందుకంటే… అది ఆ మీడియా హౌజు సమస్య… అదే పోరాడాలి… సాక్షిని మూసేయించాలని […]
ఏడుసార్లు ఆస్కార్ తలుపు తట్టి… నామినేషన్ దశకూ చేరలేక భంగపడి…
ఆస్కార్ దుకాణంలో అన్నీ ఎక్కువ రేట్లే ఉంటాయి… డబ్బు ఉండగానే సరిపోదు, దుకాణదారుడిని మెప్పిస్తే తప్ప కొనుక్కోలేం… ఆస్కార్ అంగడిలో ఏదైనా సరుకు కొనుక్కోవడం ఓ ఆర్ట్… అందుకే మనవాళ్లు చాలామంది భంగపడ్డారు… రాజమౌళి తెలివైన కొనుగోలుదారు, కొనడంలో సక్సెసయ్యాడు… దేశమంతా డప్పుమోతలు ఆకాశాన్నంటాయి… గతంలో బాలీవుడ్ నుంచి ఆస్కార్ ప్రయత్నాలు కొన్ని సీరియస్‌గానే జరిగాయి, కానీ ఎవరికీ ఏమీ రాలేదు… స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంబంధించి రెండు అవార్డులొచ్చినయ్… అదేమో బ్రిటిష్ కంపెనీ నిర్మించిన […]
ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు… అసలు లాబీయింగు లేకపోతే ఎవరికీ ఆ అవార్డులు రావు…
పార్ధసారధి పోట్లూరి ……… రంగ ప్రవేశం – ఆరం గేట్రం ! నేనేమీ భారతీయ నృత్య రీతుల గురుంచి ఇక్కడ చెప్పబోవడం లేదు! అంచేత ఖంగారు పడకండి ! విషయం ఏమిటంటే ఒకప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం వరకు వివిధ నృత్య రీతులకి వాటికి తగ్గ పేర్లు ఉండేవి. ఇక్కడ పేర్లు అంటే విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకునే సందర్భంలో జరిగే వేడుకలో విద్యార్ధులు తాము ఉత్తీర్ణులం అయ్యామని ఘనంగా చెప్పుకునే వారు కదా ? […]
చిరంజీవి ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రభాస్… సాలార్‌లో కేజీఎఫ్ యశ్ కూడా…
చిరంజీవికి తోడుగా ఏదో సినిమాలో సల్మాన్ ఖాన్… మరో సినిమాలో రవితేజ… ఇంకో సినిమాలో కొడుకు రాంచరణ్… అంతటి చిరంజీవికి ఇంకొకరి తోడు కావాలా..? కావాలి… ఇప్పుడు అదే ఓ ట్రెండ్,,. ఐటమ్ సాంగ్‌లాగే ఇదీ ఓ అదనపు ఆకర్షణ అన్నమాట… అయితే అది అన్నిసార్లూ ఫలిస్తుందని ఎవరూ చెప్పలేరు… కాకపోతే ఆ ట్రెండ్‌ను ప్రభాస్ కూడా పట్టుకున్నాడు… నిజానికి ప్రభాస్ సినిమాలో అసలు మరో హీరో ఫిట్టవుతాడా..? తనకే స్క్రీన్ స్పేస్ సరిపోదు… కానీ తప్పదు… […]
ఈ సీన్లు గుర్తున్నాయా..? చుక్కల లెక్కలు, రేడియో పాటలు, ఎడతెగని కబుర్లు…!!
మీకు గుర్తున్నాయా..? చిన్నప్పుడు పైకప్పుల మీద నీళ్లు జల్లుకుని, కప్పు కాస్త చల్లబడ్డాక, మంచాలు వేసి, పరుపులు పరిచి, చుక్కలు లెక్కెట్టుకుంటూ పడుకున్న రాత్రులు గుర్తున్నాయా..? ఈరోజు ఫ్యాన్లు, ఏసీలు ఇవ్వలేని గాఢ నిద్రను ఆ పైకప్పుల మీద పరిచిన చాపలు ఇచ్చేవి… అవి చీకటి రాత్రులు గానీ, వెన్నెల రాత్రులు గానీ ముచ్చట్లలో గంటలకుగంటలు అలా దొర్లిపోయేవి… యాదికి ఉందా..? ఈ అనుభవాలు లేని జీవితాలు శుద్ధ దండుగే కదా… మామ్మలు, తాతలు, మేనత్తలు, మేనమామలు, […]
తక్కువ తింటూ… చలికి వణుకుతూ… బ్రిటన్‌లో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం…
పార్ధసారధి పోట్లూరి ……….. బ్రిటన్ ద్రవ్యోల్బణం 17.1% శాతానికి చేరుకుంది :: కాంటర్ రీసర్చ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ! ఈ రీసర్చ్ [Kantar Research & Project Management ] అనేది బ్రిటన్ కేంద్రంగా సేవలు అందించే సంస్థ ! మానవ వనరులు మరియు వివిధ అంశాల మీద పరిశోధన చేసి సాక్ష్యాధారాలతో సహా తన రిపోర్ట్ ఇచ్చే సంస్థ ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో తన సేవలని అందిస్తుంది ! కంటర్ బ్రిటన్ దేశవ్యాప్తంగా […]
చొంగనాయుడు..! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… తిట్టేకొద్దీ ప్రేక్షకులు పెరిగారు..!!
ఒరేయ్, ఆ వెబ్ సీరీస్ జోలికి వెళ్లొద్దురా… వెంకటేశ్ తన ఇజ్జత్ మొత్తం పోగొట్టుకున్నాడు, దిమాక్ లేదు, రానాకు ముందు నుంచే లేదు… మొత్తం బూతులు, వెగటు సీన్లు… ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్ధసంభోగ సినిమా అనుకో… అశ్లీలానికి వెంకీ మామ, అసభ్యతకు రానా పట్టం కట్టారు……. ఇలా అందరమూ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నాం కదా… సన్నీ లియోన్, మియా మల్కోవాలను కూడా పెట్టుకోకపోయావా అని కడిగేస్తున్నాం కదా… హహహ… ఇప్పుడు ఆ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… […]
రాజమౌళి పిచ్చోడేమీ కాదు… పది కోణాల్లో ‘ఫలాలు’ అందుకోబోతున్నాడు…
అసలు ఆస్కార్ అవార్డుకున్న పవిత్రత ఏమిటి..? గొప్పదనం ఏమిటి..? అమెరికాలో ఏది కావాలన్నా కొనుక్కోవడమే కదా… స్కోచ్ అవార్డులు ఎలాగో, ఇవీ అలాగే… కాకపోతే దీనికి కోట్ల ఖర్చు, పెద్ద ఎఫర్ట్ కావాలి… మన జాతీయ అవార్డులు, మన పద్మ పురస్కారాలు కూడా లాబీయింగుకు పూచేవే కదా… అసలు రాజమౌళి ఏం సాధించినట్టు..? నాలుగు రోజులు పోతే అందరూ మరిచిపోతారు… కొన్ని వేల మంది ఆ అవార్డులు పొంది ఉంటారు ఇప్పటికి… సో వాట్… ఆ ఆస్కార్‌ను […]
డీజే అంటేనే మరణమృదంగం… పెళ్లి వేడుకల్లో ఈ చావులేంట్రా నాయనా..?!
DJ Deaths: “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః” సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు. అదే జరుగుతోంది లోకంలో. డి జె దెబ్బకు ఆగిన వరుడి గుండె బీహార్‌లో ఒక పెళ్లి పందిరి. రంగు రంగుల విద్యుద్దీపాలు. పూల అలంకరణతో పెళ్లి పందిరి కళకళలాడుతోంది. పెళ్లి కొడుకు […]
సిలికాన్ బ్యాంక్ వ్యాలీ ట్రెయిలర్ మాత్రమే… అసలు కథ ఇంకా ముందుంది…
ఆదానీ గ్రూపుకి అప్పులు ఇవ్వడానికి బాంకులు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఆదానీ గ్రూపు పట్ల విశ్వాసం చూపిస్తూ వస్తున్నారు ఇంకా ! ఆదానీ గ్రూపు షేర్ల ధరలు తగ్గడం గ్రూపు పని తీరు మీద ఆధారపడి జరగలేదు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది నిజమే అనుకుని భయంతో అమ్ముకున్నారు చాలామంది…. కానీ ఆదానీ గ్రూపు దివాళా తీయలేదే ? అదే ఒక అమెరికన్ కమర్షియల్ బాంక్ దివాళా తీయడం, అందులోనూ కష్టాలలో ఉన్నాం, భారీ పెట్టుబడులు […]
ఆదానీ సరే.., సిలికాన్ వ్యాలీ బ్యాంకుపై హిండెన్‌బర్గ్ మౌనం దేనికి సంకేతం..?!
పార్ధసారధి పోట్లూరి ……… సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday, March 10, 2023… అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara], కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బాంక్ ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు […]
కరోనా చావలేదు… ఓ విధ్వంసాన్ని మిగిల్చింది… గుండెపోట్లు ఆ ప్రతాపమే…
అనేక మంది చనిపోతే అది ఒక సంఖ్య, మన వారు ఏ ఒక్కరు చనిపోయినా అది విషాదం… సమాజంలో మనం చూసే పోకడ ఇది. తన దాకా రానప్పుడు ‘తాను’లు కొందరు, పెద్దమనుషుల వేషం వేసుకొని, ఆ విషయంలో తమకు తగిన అవగాహన – జ్ఞానం లేకున్నప్పటికీ ఉత్తుత్తి భరోసాలు ఇస్తూ పోతుంటారు. మరణాల గురించి గతంలో లేని ప్రచారం ఇప్పుడు వుంది తప్ప, నిజంగా గుండె జబ్బుల మరణాలు పెరగలేదు అనే భ్రమ వల్ల… తగిన […]
కలలు అరువు తెచ్చుకునే ఓ మహిళ… రెండు ఆస్కార్ అవార్డులు కొట్టింది…
‘‘నేను అరువు తెచ్చుకున్న కలలో బతుకుతుంటాను… ఢిల్లీలోని ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబం మాది… బయట ప్రపంచానికి మాది అందమైన, ఆనందమైన కుటుంబం… కానీ మూసిన మా ఇంటి తలుపుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు… ఓ పెద్ద ఇంట్లో మా కుటుంబానికి ఉన్నది ఒక గది… కారణం సింపుల్… ప్రాపర్టీ మీద అన్నదమ్ముల తగాదాలు… మా అమ్మ మాటల్ని అణిచేశారు… తిట్టారు దారుణంగా… తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది… ఒక దశలో ఆమెను సజీవంగా కాల్చేయడానికి సిద్ధపడ్డారు […]
The Elephant Whisperers… ఐదేళ్ల షూటింగులో ఆ ఏనుగు పిల్లలు చుట్టాలయ్యాయి…
ఇది మన సినిమా… షార్ట్ ఫిలిమ్ కమ్ డాక్యుమెంటరీ కావచ్చుగాక… సౌత్ ఇండియా క్రియేటర్స్ కృషి… ఐదేళ్ల శ్రమ… మనిషికీ జంతువుకూ నడుమ ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్లముందు ఉంచిన ఫిలిమ్… ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ఇద్దరూ మహిళలు… ఆస్కార్ అవార్డు అందుకుంటున్న దృశ్యం అబ్బురంగా తోచింది… కడుపు నిండినట్టుగా ఉంది… వాళ్లు నిజంగా ప్రశంసలకు, చప్పట్లకు అర్హులు… డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్నచూపును పక్కకు తోసేసి, […]
చుక్కల ఇంట్లో రుచి అధ్వాన్నం.. బయట హోటల్లో ఆత్మారాముడి ఆనందం…
Taste less ‘Star’s: “మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు; మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి” అన్నాడు పతంజలి. “There is no free meal in this world” ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న అర్థంలో ఇంగ్లీషులో ప్రఖ్యాత నానుడి. “అన్నమయితేనేమిరా? సున్నమయితేనేమిరా? పాడు పొట్టకు అన్నమే వేద్దామురా!” అని కొంటె సామెత ఉండనే ఉంది. అధ్వ అంటే దారి; అన్నం- తిండి. రెండు మాటలు సవర్ణదీర్ఘ సంధితో కలిస్తే “అధ్వాన్నం”. అంటే […]
- « Previous Page
- 1
- …
- 220
- 221
- 222
- 223
- 224
- …
- 448
- Next Page »