మోడీ గారు… తమరు సత్యసంధులు… మరి ఇప్పుడు ఎందుకు చెబున్నారు మాస్టారూ… ఎన్డీఏలోకి చేర్చుకోవాలని కేసీయార్ బతిమిలాడాడా..? కేటీయార్‌ను సీఎంను చేస్తాను, ఆశీర్వదించండి అని ప్రాధేయపడ్డాడా..? అదీ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో… తమరేమో… ఠాట్, ఇదేమైనా రాజరికమా..? యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి అని తిరస్కరించారా..? అబ్బో… తమ పార్టీలో అసలు వారసత్వ ఉదాహరణలే లేనట్టు..!! సరే, నువ్వు అవినీతికి కఠోర వ్యతిరేకివి సరే… మరి కేసీయార్ అవినీతిని కక్కించడానికి నీకు తెలంగాణలో అధికారం ఇచ్చేదాకా ఎందుకు ఆగాలి..? […]
ఆటో డ్రైవర్‌గా వృత్తి… కానీ తను ఓ కార్పొరేట్ గురు… ఓ కాలేజీ డ్రాపవుట్ కథ…
అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్… అంతకుమించి ఆర్థిక పరిస్థితులనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… ఆయన్ను కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా ఏదైనా చకచకా మాట్లాడేయగల అతడి సమర్థత ముందు పైచదువులు కూడా చిన్నబోయాయి. అందుకే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలకూ […]
సాక్షి కదా… ఏదైనా రాసేయగలదు… షెడ్యూల్‌కూ నోటిఫికేషన్‌కూ తేడా లేకుండా…
ముందుగా ఆంధ్రజ్యోతి వాడు రాసినట్టున్నాడు… అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్ అని…! కేంద్ర ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చింది… ఇది ఆనవాయితీయే… రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతను ఉన్నత స్థాయిలో సమీక్షించి వెళ్లాక షెడ్యూల్ జారీ చేస్తుంటారు… సో, ఉజ్జాయింపుగా వాళ్లు ఢిల్లీ తిరిగి వెళ్లాక షెడ్యూల్ ప్రకటన వస్తుందనే భావనతో ఆ తేదీని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది… వాస్తవానికి దగ్గరగా ఉన్న అంచనా అది… గత ఎన్నికలు… అంటే 2018 తెలంగాణ ఎన్నికలకు […]
అది జగన్ వర్సెస్ చంద్రబాబు బురద… కేసీయార్‌కు ఎందుకు పూస్తున్నట్టు..?!
అదేదో సినిమాలో ప్రకాష్‌రాజ్ కోటశ్రీనివాసరావును పట్టుకుని ‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు’ అనడుగుతాడు… ఏబీఎన్, మహాన్యూస్ ఈటీవీ, టీవీ5 చానెళ్లు కూడా చంద్రబాబు అరెస్టు వార్తలపై మొత్తం లాజిక్కులను వదిలిపెట్టేశాయి… ప్చ్ పాపం, నవ్వులపాలు అవుతున్నాం అని తెలిసీ, స్వామిభక్తితో రగిలిపోతున్నయ్… ఊగిపోతున్నయ్… తాజాగా ఓ వార్త చూసి జనమంతా నవ్వుకున్నారు… అదేమిటంటే… చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణలో బీఆర్ఎస్పై పడుతోందని తెలంగాణ ఇంటలిజెన్స్ రహస్యంగా కేసీయార్‌కు నివేదిక ఇచ్చిందట… దాంతో కేసీయార్లో కలవరం మొదలైందట… […]
చిచ్చర పిడుగులట… బుడతలు కాదు చిరుతలట… పసి బుర్రల్లో రాజకీయ కాలుష్యం…
ఈనాడు న్యూస్ వెబ్సైట్లో ఓ వార్త ప్రముఖంగా కనిపించింది… దాని శీర్షిక… రాష్ట్ర పరిస్థితి చూసి సిగ్గుపడాలా, జాలిపడాలా…? నిజానికి ఈ శీర్షిక సరిగ్గా వర్తించేది ఈనాడుకు… తెలుగుదేశం పార్టీకి…! ఇంతకీ ఈ వార్త సారాంశం ఏమిటో తెలుసా..? ఈనాడు భాషలోనే ఓసారి చదువుకుందాం… ‘‘చూడటానికి వాళ్లు బుడతలే… కానీ వాళ్ల ప్రతి పలుకు ఆలోచింపజేసింది… చంద్రబాబు అక్రమ అరెస్టు, తను చేసిన అభివృద్ధి, జగన్ అరాచక పాలనపై నాయకులకు దీటుగా మాట్లాడారు… వాళ్లు ప్రత్యేక ఆకర్షణ […]
ఏం… బతకలేకపోతారా..? ర్యాంకులు, మార్కులే జీవితమా..?
Stress-less: లేపాక్షి వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. 1980-85 నాటి మాట. వెయ్యి మందికి పైగా విద్యార్థులతో దానికదిగా ఒక ప్రపంచంలా ఉండేది మాకు. ఇల్లు, బడి, ఊరిమీద పడి ఆడుకోవడం తప్ప ట్యూషన్లు లేవు. కోచింగుల్లేవు. మార్కుల సమీక్షల్లేవు. ర్యాంకుల ఊసే లేదు. పది దాటితే ఇంటర్. ఇంటర్ దాటితే డిగ్రీ. డిగ్రీ దాటితే పి జి. మెరికల్లాంటివారు మాత్రమే బ్యాంకు, టీచర్ ఉద్యోగాలకు, ఇతర పోటీ పరీక్షలకు తయారయ్యేవారు. మా టీచర్ల తిట్లు, పొగడ్తల్లోనే అనంతమయిన […]
జూదగాళ్ల ముందస్తు తెలివితేటలు… పేకాడేవాళ్ల బుర్రలే బుర్రలు…
Super Smart: ధర్మరాజు జూదవ్యసనం గురించి యుగం మారినా చర్చ జరుగుతూనే ఉంది. సప్త మహా వ్యసనాల్లో జూదం ఒకటి. తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని ద్రౌపది అడిగిన ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. “కులము నీరుజేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ… వినుర వేమ!” అని మన వేమన అందుకే తెగ విసుక్కున్నాడు. రాతి అరుగుల మీద సుద్ద ముక్క, బొగ్గు ముక్కలతో గళ్లు గీసుకుని చింత పిక్కలు, […]
ఓ చిన్న వార్త… ఓ పెద్ద చర్చ… ఒకే ఇంట్లో వీరనాస్తికులు, పరమ ఆస్తికులు…
ఒక చిన్న వార్త… నిజానికి చిన్నదేనా..? స్టాలిన్ కొడుకు ఉదయనిధి సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేసిన సంగతి, దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతీ తెలిసిందే కదా… పార్టీ నాయకులు స్టాలిన్, రాజా తదితరులు ఉదయనిధిని వెనకేసుకొచ్చారు… మెజారిటీ ప్రజల మనోభావాల్ని గాయపరుస్తున్నాడు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఉదయనిధి తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ప్రకటించాడు… నీకు సనాతన ధర్మంపై సదభిప్రాయం లేకపోతే సరి… కానీ ఆ పేరుతో మొత్తం హిందూ మతం పట్ల […]
నో నో… ఇందిర భర్తను గాంధీ దత్తత తీసుకోలేదు… ఆ ఇంటిపేరు ఓ వింత కథ…
Nancharaiah Merugumala…….. ఇందిర, రాజీవ్ లకు ‘గాంధీ’ ఇంటిపేరుగా మారడంతో అసలు గాంధీకే చెడ్డపేరొచ్చింది! ఇంటిపేరు మార్పించిన ‘పాపం’ పండిత నెహ్రూదే! …………………………………………….. జర్నలిస్టు–మేధావి, ‘స్వతంత్ర’ కాంగ్రెస్ నేత నేత ఫిరోజ్ గాంధీతో కూతురు ఇందిరా ప్రియదర్శిని (అప్పటికి 24 ఏళ్లు) పెళ్లి సమయంలో (1942, మార్చి 26న) పండిత జవాహర్ లాల్ నెహ్రూ చేసిన ఒక ‘పాపం’ భారతదేశంలో ‘గాంధీ’ అనే గుజరాతీ వైశ్య ఇంటి పేరుకు చెడు లేదా దుష్ట స్వభావాన్ని ఆపాదించేసింది. గుజరాతీ […]
పంచనేత్రం… అనగా ఫైవ్ ఐస్… అదొక అగ్రరాజ్యాల దుష్టకూటమి…
పార్ధసారధి పోట్లూరి …. ఉగ్రవాదం-వెస్టర్న్ కల్చర్! ఉగ్రవాదుల పేరుతో అమాయకుల హత్యలు చేయడం పశ్చిమ దేశాల కల్చర్! ఒక అమాయక ఆప్గన్ కుటుంబం ప్రాణం ఖరీదు ‘సారీ, రాంగ్ టార్గెట్”తో సరిపెట్టేసే సంస్కృతి! ఒక అమాయక ఇరాకీ పౌరుడి (ఉగ్రవాది కాదు) ప్రాణం ఖరీదు $60 వేల డాలర్లు అంటే డ్రోన్ నుండి ప్రయోగించే మిసైల్. రియల్ టైమ్ టార్గెట్ రూపంలో అమాయకులని తమ డ్రోన్ లేదా జెట్ ఫైటర్ లలో వాడే టార్గెట్ అక్విజిషన్ అండ్ ఫైరింగ్ […]
రాజకీయ ఉపన్యాసం ఓ కళ… మన తెలుగు లీడర్లకు అంత సీన్ లేదు…
Padmakar Daggumati…… ” మంచి ఉపన్యాసం ఒక కళ” … నాలెడ్జ్ అనేది సాపేక్షం. అందులో ఎవరి స్థాయి వారిది. జ్ఞాపకశక్తి కూడా సాపేక్షమే. ఎవరి కెపాసిటీ వారిది. సరే ఇదలా ఉంచుదాం. చక్కటి ఉపన్యాసం ఇవ్వగలగడం ఒక కళ, ఒక నైపుణ్యం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, లేదా ఇతర ప్రధాన బాధ్యులు తాము అనేక సందర్భాలలో మాట్లాడవలసి వస్తుంది. పార్టీ ముఖ్యుల సమావేశంలో మాట్లాడాలి. పార్టీ ఇతర నాయకులతో మాట్లాడాలి. పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. పార్టీ […]
ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన రోజైనా ఆయనకున్న ప్రాధాన్యం పొట్టివాడు, గట్టివాడు అయిన ఈయనకు లేక పోవడం విచారకరం. గాంధీజీ జన్మ దినమే లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినమే కాదు, ఆయన వర్థంతిని కూడా తలచుకునే తీరిక, జ్ఞాపకం కూడా నేటి రాజకీయ నాయకులకు లేకపోవడం బాధాకరం. ఆయన ఇప్పటి రాజకీయాలకు పనికిరారు గనుక, ఈ నాయకులకు వారి విషయం తెలీదు గనుక, ఆయన పేరు చెబితే ఓట్లు రాలవు గనుక… […]
ఇక మనపై మరింత ఉత్తరాది పెత్తనం… దక్షిణ భారతంపై ఇదేం వివక్ష..?!
Injustice: ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజలకోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు. మచ్చుకు తాజాగా పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది […]
ఆలోచించాలే గానీ… మన సొంత భాషలోనే ఎన్నో అందమైన పేర్లు…
ఒక సెలవు రోజు విజయవాడ వీధుల్లో బలాదూర్ గా తిరగడానికి బయలుదేరితే కుంభవృష్టి మొదలయ్యింది. చలికాలంలో కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసే బ్లేజ్ వాడ లో వర్షంలో తిరగడం మంచిదే అనుకుని…అదే విజయవాడకు మహోన్నత జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన తెలుగు సాహితీ వేయి శాఖల కల్పవృక్షం విశ్వనాథ చెప్పిన- “నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత…” నేలకు దిగి స్థిరంగా కురుస్తున్న నల్ల మబ్బులు తెచ్చిన చిరు చీకటిలో…మబ్బుల అంచుల్లో వెలిగే మెరుపుల అందాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతుంటే…అక్కడక్కడా “విడిది […]
ఆడ మగ బ్యాలెన్సింగు కోసం… బీబీ హౌజులోకి మరో ఆడ మనిషి…
తిక్కలోడు బిగ్‌బాస్… గత సీజన్‌లాగే ఈ సీజన్ క్రియేటివ్ టీం బుర్రలు పనిచేస్తున్నట్టు లేవు… అందుకే షో చప్పగా సాగుతోంది… ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు పడ్డా అసలు మ్యాటర్ ఇప్పుడూ వీకే… అందుకే రేటింగ్స్ మళ్లీ ఢమాల్… ఎక్కడ తప్పు జరుగుతున్నదో వెనక్కి తిరిగి చూసుకునే సోయి కూడా లేకుండా పోయింది బిగ్‌బాస్‌కు… గ్లేరింగ్‌గా కనిపించేది ఏమిటంటే..? ఆడ కంటెస్టెంట్లను వరుసగా బయటికి పంపించేయడం… షకీలా ఫస్ట్ ఔట్… తరువాత కిరణ్ రాథోడ్… మొన్న […]
మరో గ్యాంగ్‌స్టర్ కాల్చివేత… అసలు ఏం జరుగుతోంది కెనడాలో…
పార్ధసారధి పోట్లూరి …….. పంజాబ్ కి చెందిన మరో గ్యాంగ్‌స్టర్ కెనడాలో హత్యకి గురయ్యాడు! అది రెండు సిక్కు గ్రూపుల మధ్య ఉన్న వైరం వల్లనే జరిగింది! RAW ని ఇండియన్ మొస్సాద్ గా పిలుస్తున్నారు ఇప్పడు! ఎందుకంత హైప్ వచ్చింది? ఇంగ్లాండ్, పాకిస్థాన్, కెనడా ఇలా ఒక దేశానికి పరిమితం కాలేదు RAW! 2014 కి పూర్వం కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, శ్రీలంకలకే పరిమితం చేశారు పూర్వ పాలకులు. అది కూడా ఇంటిలిజెన్స్ ని […]
ప్చ్… ఫాఫం భక్తకన్నప్ప… దివిలో బాపుకు తెలియనివ్వకండి ఈ వార్తలు…
మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా 150 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న భక్తకన్నప్ప సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించబోతున్నాడనే వార్త పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు… అసలు భక్తకన్నప్ప సినిమాను మంచు కుటుంబం నిర్మిస్తుందనే వార్తతో కలిగిన విభ్రమ ముందు మరే ఇతర ఆశ్చర్యాలూ పెద్దవి కావు… ఎందుకంటే..? 1976లో కృష్ణంరాజు నటించి నిర్మించిన చిత్రం భక్త కన్నప్ప… తెలుగు భక్తి సినిమాల్లో ఇదీ ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది… కృష్ణంరాజును జనసామాన్యంలోకి బాగా తీసుకెళ్లింది కూడా […]
గేట్ల రిపేర్లు చేతకాక… దాన్నలా వదిలేసి, దిగువనే కొత్త ప్రాజెక్టు కడతారట…
నిజంగా ఆశ్చర్యం… ప్రపంచంలోని ఏ ప్రభుత్వమైనా, ఏ సమాజమైనా సరే… ఒక ప్రాజెక్టును సరిగ్గా నిర్వహించలేక అనగా మెయింటెయిన్ చేయలేక, కనీసం గేట్ల రిపేర్లూ చేతకాక… దాన్ని అబాండన్ చేసేసి, దానికి బదులు వేరే కొత్త ప్రాజెక్టు కడుతుందా..? ఇదీ ఆ ఆశ్చర్యానికి కారణం… దీనికి బేస్ ఈనాడులో వచ్చిన ఓ వార్త… ముందుగా ఆ వార్త చూడండి… ఈ వార్తను ఇక్కడ సరిగ్గా చదవడం సాధ్యపడదేమో… ఓసారి సారాంశం చెప్పుకుందాం… ‘‘నిర్మల్-మంచిర్యాల జిల్లాలోని 65 వేల […]
డొల్ల వాదనలు… శుష్క విశ్లేషణలు… ఆర్కే కలం అదుపు తప్పిపోయింది…
మా చంద్రబాబును దుర్మార్గంగా జైలులో వేశారు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బాధ చెప్పనలవి కాదు… అక్షరాలు నానా వంకర్లూ తిరిగిపోతున్నయ్… విశ్లేషణావ్యాసాలు దారితప్పుతున్నయ్… ఏదేదో రాసేస్తున్నాడు… తను కొత్తపలుకు అనే ఎడిటోరియల్ వ్యాసంలో తాజాగా ఏమంటున్నాడంటే… ఆర్కే… అవినాశ్‌రెడ్డికి అరెస్టు నుంచి ఉపశమనం, ఎమ్మెల్సీ కవితక్కకు విచారణ నుంచే రెండు నెలల ఉపశమనం… మరి చంద్రబాబుకు ఎందుకీ జైలు..? …… సిమిలర్ కేసులు కదా ఆర్కే… ఇవేం పోలికలు..? ఆర్కే… చంద్రబాబు స్థాయి వ్యక్తికి కూడా సత్వర న్యాయం […]
రతిక ఔట్… ప్రేక్షకులు తరిమేశారు సరే, నువ్వేమంటావు రాహుల్ సిప్లిగంజ్..?
హఠాత్తుగా నమస్తే తెలంగాణలో వచ్చిన ఓ వార్తా శీర్షిక గుర్తొచ్చింది… నవ్వొచ్చింది… నిజానికి ఆర్టికల్ పర్లేదు, రాసిందాంట్లో తప్పులేమీ లేవు… కానీ ఒక తెలంగాణ అమ్మాయి బిగ్‌బాస్ హౌజులోకి వెళ్తే… అదేమైనా ఘనకార్యమా..? అసలు ఆ షోపైనే బోలెడన్ని విమర్శలున్నయ్… అలాంటిది ఆ షోకు సెలెక్టయితే ఏదో గొప్పదనం సాధించినట్టు ఓ స్టోరీ రాసేశారు… దానికి పెట్టిన హెడింగ్ ‘ఓట్ ఫర్ పటాస్ రతిక’… (గతంలో తెలంగాణ యువతులు ఎవరూ బిగ్‌బాస్ షోలోకి వెళ్లలేదా..?) సరే, ఏదో […]
- « Previous Page
- 1
- …
- 230
- 231
- 232
- 233
- 234
- …
- 451
- Next Page »